హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)
'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.
ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం)
Comments
Please login to add a commentAdd a comment