తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం | Actor Chiranjeevi Donates 50 Lakhs Each Telugu States CM Relief Fund | Sakshi
Sakshi News home page

Chiranjeevi: వరదలతో ఇబ్బందులు.. చిరు తన వంతు సాయం

Published Wed, Sep 4 2024 9:23 AM | Last Updated on Wed, Sep 4 2024 10:07 AM

Actor Chiranjeevi Donates 50 Lakhs Each Telugu States CM Relief Fund

తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఓవైపు సాయం చేస్తుండగా.. మరోవైపు తెలుగు హీరోలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేశ్ బాబుతో పాటు పలు హీరోలు కోట్లాది రూపాయలు సాయం చేయగా.. ఇప్పుడు చిరంజీవి కూడా తనదైన ఉదారత చూపించారు.

ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేశ్ బాబులానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజల కష్టాలు తనని కలిచి వేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)

'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది'

'ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర  పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చిరంజీవి ట్విటర్‌లో రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement