తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి హీరో ఎన్టీఆర్ కూడా తెలుగు రాష్ట్రాలకు భారీ ఆర్థిక సాయం చేశాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం ఎంతగానో కలచివేసిందని, అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజులు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు.. ఎక్కువ ఎవరికంటే..?)
వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి తో 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పాడు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తారక్ భారీ సాయం చేశాడు.
రీసెంట్‌గా ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటక వెళ్లాడు. అక్కడే ప్రముఖ దేవాలయాల్ని హీరో రిషభ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి సందర్శిస్తున్నాడు.
(ఇదీ చదవండి: రెండు సంప్రదాయాల్లో డైరెక్టర్,హీరోయిన్‌ల పెళ్లి)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…— Jr NTR (@tarak9999) September 3, 2024
Comments
Please login to add a commentAdd a comment