బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్‌ వివరాలు.. ఎక్కువ ఎవరికంటే..? | Bigg Boss 8 Telugu Contestants Remuneration Details | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్‌ వివరాలు.. ఎక్కువ ఎవరికంటే..?

Sep 3 2024 8:22 AM | Updated on Sep 3 2024 9:24 AM

Bigg Boss 8 Telugu Contestants Remuneration Details

బిగ్ బాస్ 8వ సీజన్ తెలుగు ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశారు. ఈసారి కంటెస్టెంట్స్‌ అందరూ సోషల్‌మీడియాకు దగ్గరగా ఉన్నవారు కావడంతో అందరికీ అంతగా కనెక్ట్‌ కాలేదని చెప్పవచ్చు. అయితే, వారికి బిగ్‌బాస్‌ ఇచ్చే రెమ్యునరేషన్‌ ఎంత ఉంటుందో అని నెటిజన్లు  చర్చించుకుంటున్నారు. కానీ, అధికారికంగా వారి రెమ్యునరేషన్‌ వివరాలను ఎట్టిపరిస్థితిల్లో బిగ్‌బాస్‌ రివీల్‌ చేయడు. సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రకారం హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ రెమ్యునరేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా యాంకర్‌ విష్ణుప్రియ ఎక్కువ మొత్తంలో అందుకోనుంది.


బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లు ఇలా..

  • విష్ణుప్రియ -  వారానికి రూ. 3.70 లక్షలు (యాంకర్ )

  • ఆదిత్య ఓం -  వారానికి రూ.3 లక్షలు (సినీ నటుడు)

  • నిఖిల్ -  వారానికి రూ. 3 లక్షలు (టీవీ నటుడు)

  • యష్మి గౌడ -  వారానికి రూ.2.50 లక్షలు (టీవీ నటి)

  • ప్రేరణ -  వారానికి రూ.2.50 లక్షలు ( టీవీ నటి)

  • శేఖర్ బాషా -  వారానికి రూ.2.30 లక్షలు (ఆర్జే )

  • నైనిక -  వారానికి రూ.2.30 లక్షలు (డ్యాన్సర్ )

  • కిర్రాక్ సీత -  వారానికి రూ.2.20 లక్షలు (సినీ నటి, యూట్యూబర్)

  • అభయ్ నవీన్ -  వారానికి రూ. 2 లక్షలు (సినీ నటుడు)

  • నబీల్ ఆఫ్రిది - వారానికి రూ. 1.70 లక్షలు (యూట్యూబర్ )

  • సోనియా ఆకుల -  వారానికి రూ.1.70లక్షలు (సినీ నటి)

  • పృథ్విరాజ్ -  వారానికి రూ.1.50లక్షలు (టీవీ నటుడు)

  • బెజవాడ బేబక్క -  వారానికి రూ.1.30లక్షలు (యూట్యూబర్ )

  • నాగ మణికంఠ -  వారానికి రూ.1.25 లక్ష (టీవీ నటుడు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement