toofan
-
దానా కదలికలను ట్రాక్ చేసిన ఇస్రో ఉపగ్రహాలు
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది.మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.మోదీ అభినందనలుఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఉపగ్రహాలు దేశానికి చేస్తున్న సేవలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా కొనియాడారు. వాటిని తయారు చేస్తున్న మన శాస్త్రవేత్తలు విపత్తులను ముందుగా గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించి.. దేశ ప్రగతిని కాపాడుతున్నారని ప్రధాని అభినందించారు. -
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: తూర్పు– మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా మారింది. ఇది పారదీప్ (ఒడిశా)కు ఆగ్నేయ దిశగా సుమారు 560 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం 25న తెల్లవారుజాము కల్లా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరి, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు: ప్రస్తుతం రాష్ట్రానికి ఉత్తర, ఈశాన్య దిశల నుండి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా. 6.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 81.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, బుధవారం నాటికి 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 26 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవన సీజన్ నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి 23వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటే సూచనలు సమానంగా ఉన్నాయనీ.. 21 తర్వాత ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ హెడ్ భారతి ఎస్ సబడే తెలిపారు. ఎక్కువగా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి 26 మధ్యలో తీరం దాటేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా పేర్కొన్నారు. కాగా.. వారం క్రితం మన రాష్ట్రంలో బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అరేబియా సముద్రం–దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో అల్పపీడనంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో 23వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 29న ఒకటి, వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడే సూచనలు మొదలైన నేపథ్యంలో సముద్రంలో అలజడి మొదలైందనీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులెవరూ ఆదివారం నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఓవైపు సాయం చేస్తుండగా.. మరోవైపు తెలుగు హీరోలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేశ్ బాబుతో పాటు పలు హీరోలు కోట్లాది రూపాయలు సాయం చేయగా.. ఇప్పుడు చిరంజీవి కూడా తనదైన ఉదారత చూపించారు.ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేశ్ బాబులానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజల కష్టాలు తనని కలిచి వేస్తున్నాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది''ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని చిరంజీవి ట్విటర్లో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్)తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024 -
Fact Check: కాకి లెక్కలతో రోత
సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రాథమిక పంట నష్టం అంచనాలకు, తుది నష్టం లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక అంచనాలను ముంపు విస్తీర్ణం ఆధారంగా అప్పటికప్పుడు రూపొందిస్తారు. ముంపునీరు సకాలంలో దిగిపోతే పంటలకు నష్టం వాటిల్లదు. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులొస్తాయి. ఇది రైతన్నలందరికీ తెలిసినా రోత రాతల రామోజీ మాత్రం పంట నష్టం లెక్కలను ప్రభుత్వం తగ్గించి చూపిస్తోందంటూ బురద చల్లుతున్నారు. నిజంగానే అలా తగ్గించే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉంటే గతంతో పోలిస్తే పెట్టుబడి రాయితీని పెద్ద ఎత్తున ఎందుకు పెంచుతుంది? లబ్దిదారులను వెతికి మరీ ఎందుకిస్తుంది? గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను ఎందుకు చెల్లిస్తుంది? ఇక రామోజీ చెబుతున్నట్లు అన్నదాతకు వాతలు నిజమే కానీ, అది ఇప్పుడైతే కాదు. చంద్రబాబు సర్కారు హయాంలో అన్నది పచ్చి నిజం. అప్పుడు రామోజీ కలం మొద్దుబారిపోవడంతో కదల్లేదు కాబోలు!! ఎలా లెక్కిస్తారో తెలియదా? ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాల స్థాయి, జలాశయాల మట్టం) పరిగణలోకి తీసుకొని కరువు మండలాలను ప్రకటిస్తారు. తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటల వారీగా లెక్కించిన నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తారు. ఆర్బీకే సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం అన్నదాతలకు తోడుగా నిలవడంతో ముంపు నీరు త్వరగా దిగిపోయేలా చేసి పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. పెరిగిన పెట్టుబడి రాయితీ వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు గతంలో హెక్టారుకి రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8,500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా ఇప్పుడు రూ.17 వేలు అందిస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500కి పరిహారం పెరిగింది. మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలకు పెంచి ఇస్తున్నారు. ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువే తాండవించినా రైతులను కనికరించలేదు. హుద్‌హుద్ నుంచి పెతాయి తుపాన్ వరకు ఏటా విరుచుకుపడినా ఏనాడైనా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి నష్ట పరిహారాన్ని ఆ సీజన్ కాదు కదా కనీసం ఆ ఏడాది ముగిసేలోగానైనా ఇచ్చిన దాఖలాలు లేవు. ఐదేళ్ల పాలనలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదే. సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఒక్క అన్నదాతలకే చంద్రబాబు ఎగ్గొట్టారు. ఇక రైతులకే మరో రూ.8,845 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పెట్టారు. వీటిని ఇప్పుడు ఈ ప్రభుత్వమే చెల్లిస్తూ రైతన్నలకు తోడుగా నిలిచింది. విపత్తు ఏదైనా ఆగమేఘాల మీద స్పందిస్తూ నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతుకు సీజన్ చివరిలో పంట నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అణాపైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.45 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది. నిబంధనలు సడలించి కొనుగోలు వర్షాభావంతో 2023 ఖరీఫ్‌లో 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 103 కరువు మండలాలను గుర్తించగా 14.07 లక్షల ఎకరాల్లో 6.96 లక్షల మంది రైతులు పంట నష్ట పోయినట్లు తేలింది. వారికి రూ.847.27 కోట్ల పెట్టుబడి రాయితీని ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు డిసెంబర్లో మిచాంగ్ తుపాన్ వల్ల పంట నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ.442.11 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా త్వరలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తుపాన్ ప్రభావంతో రంగు మారిన, తడిసిన 12.70 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని నిబంధనలు సడలించి మరీ రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
సాయం చేస్తున్నా గిట్టదా?
సాక్షి, అమరావతి: పంట నష్టం అంచనాలతో పనిలేదు.. కరువొచ్చిన మర్నాడే సాయం అంది తీరాలి! తుపాన్ తీవ్రత తగ్గక ముందే పరిహారం ఇచ్చి తీరాలి అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ధోరణి! కరువు రావడం, తుపాన్ వల్ల భారీ వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా ఉన్నాయి రామోజీ రాతలు! విపత్తుల వేళ అప్రమత్తతోపాటు రైతన్నలు నష్ట పోయిన ప్రతీ ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ గింజకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పంట నష్టం లెక్కింపులో జాప్యం లేకుండా, పరిహారం చెల్లించి ఆదుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా తనకు పట్టనట్లుగా యథాప్రకారం బురదలో కూరుకుపోయి దుష్ప్రచారానికి దిగే పెద్ద మనిషిని ఏమనుకోవాలి? ఎలా లెక్కిస్తారో తెలియదా? తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) పరిగణనలోకి తీసుకుంటారు. ఇక తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించిన పంట నష్టపరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తారు. ఆదుకోలేదనడానికి మనసెలా వచ్చింది? ఖరీఫ్ 2023–24లో బెట్ట పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్ సీజన్ ప్రారంభం నుంచి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా 80 శాతం రాయితీపై విత్తనం పంపిణీ చేశారు. 80 శాతం సబ్సిడీతో (రూ.26.46 కోట్ల విలువ) 30,977 క్వింటాళ్ల విత్తనాలను 1.16 లక్షల మంది రైతులకు అందజేశారు. ముందస్తు రబీలో 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. కరువు సాయం కోసమే కేంద్ర బృందాలు ఖరీఫ్ 2023కి సంబంధించి ఏడు జిల్లాలలో 103 కరువు మండలాలను గుర్తించారు. 7.14 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కించి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించారు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ. 534 కోట్ల పెట్టుబడి రాయితీ కోరుతూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కేంద్ర బృందం రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 6.39 లక్షల మంది రైతులు 5.33 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు లెక్క తేల్చి రూ. రూ.784.61 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ 2023లో 21, రబీ 2023 –24లో 17 పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప«థకాన్ని వర్తింప చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఖరీఫ్ 2023 నోటిఫైడ్ పంటలకు సంబంధించి 34.7 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం వర్తింప చేశారు ఈ జాబితాలను కేంద్రంతో పాటు బీమా కంపెనీలకు సైతం పంపించారు. ఉదారంగా ధాన్యం కొనుగోళ్లు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉదారంగా వ్యవహరిస్తూ తేమ శాతం నిబంధనలను సడలించి రంగుమారిన, పాడైపోయిన «6.52 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్ద నుంచే సేకరించారు. గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో సహా గత నాలుగున్నరేళ్లలో విపత్తులతో నష్టపోయిన 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ సొమ్మును అదే పంట కాలం చివరిలో బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. సాయం పెంపు కనపడదా? వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే సంకల్పంతో 2023 నవంబర్ 14 నుంచి పెట్టుబడి రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల వల్ల వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట వేస్తే తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.17 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచగా మామిడి, నిమ్మ జాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500లకు, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలు చొప్పున పెంచి ఇస్తున్నారు. -
చినబాబు చీప్ ట్రిక్స్
సాక్షి, అనకాపల్లి/మునగపాక/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్టుగా ఉంది టీడీపీ నేత నారా లోకేశ్ తీరు. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 7వ తేదీతో మిచాంగ్ తుపాను ప్రభావం పోయింది. అప్పటినుంచి చినుకు జాడలేదు. గడచిన వారం రోజుల్లో పొలాలు అన్నీ తడారిపోయాయి. కల్లాల్లోని వరి పంట కడ దశకు చేరుకుంది. కానీ.. లోకేశ్ పుణ్యమా అని ఇప్పుడు రోడ్డుపై ఉన్నపళంగా నీళ్లొచ్చాయి. అక్కడ పచ్చ చొక్కాలతో కలిసి లోకేశ్ ఫొటోలకు ఎడాపెడా ఫోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుని లేనిపోని హడావుడి చేశారు. ఈ ఫొటోలు ఎల్లో మీడియాకు చేరడంతో ఒక్కసారిగా ఊదరగొట్టేశాయి. ఆ రాతలు చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జిల్లాలో జనం నుంచి ఎక్కడా స్పందన లేకపోవడంతో చినబాబు ఇటువంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా తిమ్మరాజుపేట వద్ద అచ్యుతాపురం–అనకాపల్లి రహదారిపై గుంతలో టీడీపీ కార్యకర్తలతో నీళ్లు పోయించి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన లోకేశ్ అడ్డంగా దొరికిపోయారు. 22 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రోడ్డులో ఎక్కడా చుక్కనీరు లేదు. అలాంటిది రాత్రి 8 గంటల సమయంలో మరో ఐదు నిమిషాల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్న దశలో రోడ్డుపై గుంతలో మాత్రం అప్పుడే పెద్ద వర్షం వచ్చినట్టుగా నీళ్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు నివ్వెరపోయారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లాలని ఇలా చీప్ ట్రిక్స్‌కు పాల్పడడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇదిలా ఉండగా, పాదయాత్రలో భాగంగా లోకేశ్ శనివారం మునగపాక, అనకాపల్లి మండలాల్లో నడిచారు. మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన లోకేశ్ ఈ సందర్భంగా వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మరో మూడు నెలల్లో కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అనంతరం పూడిమడక రోడ్డు జంక్షన్ వద్ద విశాఖపట్నం–విజయవాడ జాతీయ రహదారి దాటుకుని అనకాపల్లి పట్టణంలోకి ప్రవేశించిన లోకేశ్ నెహ్రూచౌక్ మీదుగా గవరపాలెంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యువగళం యాత్ర 3,100 కిలోమీటర్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడినుంచి మునగపాక మండలం తోటాడలో ఏర్పాటుచేసిన బసకు చేరుకున్నారు. -
ఉదారంగా సిఫార్సులు చేయండి
సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి.. రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది. కౌలు రైతులకూ రైతుభరోసా భేష్.. అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి.. మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్సింగ్, డీఏఎఫ్డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది. ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు. -
ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి/పామర్రు/గుడివాడ/కంకిపాడు: మిచాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ–విపత్తుల నిర్వహణ శాఖ) సాయిప్రసాద్ కేంద్ర బృందానికి విన్నవించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో బుధవారం తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ తదితరులతో కలిసి సాయిప్రసాద్ సమావేశమయ్యారు. తుపాను తీవ్రతతో కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందానికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. వీలైనంత మేర ఆదుకోవడానికి సహకరిస్తాం: కేంద్ర బృందం కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన నాలుగు జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ కేంద్ర బృందానికి వివరించారు. శాఖాపరంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.2,641 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.703 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.100 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.86.97 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తంగా మిచాంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని విన్నవించారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లింది. గురువారం కూడా ఈ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతులకు న్యాయం చేస్తాం.. రాష్ట్రంలో పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పామర్రు, కంకిపాడు, గుడివాడల్లో కేంద్ర బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. గుడివాడ మండలం రామనపూడి, వలిపర్తిపాడు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది. అలాగే పామర్రు మండలం నెమ్మలూరు, కొరిమెర్ల తదితర గ్రామాల పరిధిలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ తదితరులతో కలిసి రాజేంద్ర రత్నూ పరిశీలించారు. నెమ్మలూరులో కౌలు రైతు ఆత్మూరి రామ కోటేశ్వరరావు కేంద్ర బృందంతో మాట్లాడుతూ సాగు చేస్తున్న 40 ఎకరాలలోని వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కాలువలు, మురుగు డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఏటా పంట నష్ట పోవాల్సి వస్తోందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు కేంద్రం బృందానికి అర్జీలను సమర్పించారు. మొత్తం 1,270 ఎకరాల సాగులో 1,040 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. జేసీ అపరాజితాసింగ్ స్థానికంగా జరిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, కైలే అనిల్ కుమార్, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేడు దెబ్బతిన్న ధాన్యం పరిశీలన తుపాను దాటికి దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర పౌరసరఫరాల శాఖ సాంకేతిక బృందం గురువారం నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పంట కోసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ధాన్యంలో విరిగిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం నమూనాలను సేకరించనుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సహాయకులను ఎంపిక చేసింది. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఈ క్రమంలో తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని సైతం సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. వర్షాలు తగ్గడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోంది. -
ఉదారంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఇటీవల తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి వారిలో భరోసా నింపాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపానుతో పంట నష్టం, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు.. కొన్ని నిబంధనలు సడలించైనా సరే రైతులకు న్యాయం చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని, ఆర్బీకేల వారీగా కొనుగోళ్లు జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే ఆదేశాలు జారీచేశారు. నష్టపోయిన రైతన్నలకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పంట నష్టపోయిన వారికి వైఎస్సార్ ఉచిత బీమా కింద వారికి పరిహారం అందించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను సమర్థంగా చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్‌పై ఆరా రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ (పంట నష్టం అంచనాలు) ప్రక్రియను ప్రారంభించారా? అని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి మొదలైన ఎన్యూమరేషన్ 18 వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. 19వతేదీ నుంచి 22 వరకు సామాజిక తనిఖీల కోసం జాబితాలను ఆర్బీకేలలో అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఆ తరువాత అభ్యంతరాల స్వీకరణ, సవరణల అనంతరం ఈ నెలాఖరుకు జిల్లా కలెక్టర్లు తుది జాబితాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సంక్రాంతి లోగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
గుండ్లకమ్మ రెండో గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. మిచాంగ్ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు 8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు. డెడ్ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ.. ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు. -
‘గుండ్లకమ్మ’ పాపం గత ప్రభుత్వానిదే
మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసి.. సుందరీకరణ పేరుతో నిధులు బొక్కేయడానికే ప్రాధాన్యత ఇవ్వడమే ప్రస్తుత దుస్థితికి కారణమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద విరిగిపోయిన రెండో గేటును శనివారం పరిశీలించిన ఆయన రిజర్వాయర్ ఎస్ఈ ఆబూదలి, ఈఈ నాగమురళీమోహన్తో మాట్లాడారు. రిజర్వాయర్‌లోని మిగిలిన గేట్ల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014–19 కాలంలో వర్షాలు లేక రిజర్వాయర్‌లో నీరు అతి తక్కువగా ఉండటంతో నాయకులు రిజర్వాయర్‌కు వచ్చిన నిర్వహణ నిధులతో ఉపయోగం లేని పనులు చేసి నిధులను తమ ఖాతాల్లో వేసుకున్నారని విమర్శించారు. రిజర్వాయర్ గేటు గత సంవత్సరం విరిగిపోయినప్పుడు గేట్ల మరమ్మతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.90 లక్షలు మంజూరు చేశారని, ఈ ఏడాది రిజర్వాయర్ గేట్లు పూర్తిగా మరమ్మతు చేయించేందుకు రూ.9 కోట్లు విడుదల చేశారని చెప్పారు. లెగ్మెంట్లు కొట్టుకుపోవడం దురదృష్టకరం మిచాంగ్ తుపాను కారణంగా గుండ్లకమ్మ జలాశయంలోకి నీరు పుష్కలంగా వస్తుండటంతో నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నించారని.. దురదృష్టవశాత్తు 2వ గేటు లెగ్మెంట్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. రిజర్వాయర్‌లో సాగర్ నుంచి ఒక టీఎంసీ నీరు విడుదల చేయించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గేట్ల మరమ్మతులపై సీఎంవో, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే హుటాహుటిన తాడేపల్లి వెళ్లారు. అంతకుముందు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. కాగా.. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మండవ అప్పారావు, ఎంపీపీ వాకా అరుణకోటిరెడ్డి, నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రిజర్వాయర్‌కు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రిజర్వాయర్ నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో మంజూరైన నిధులను నాయకులు తినేశారన్నారు. టీడీపీ హయాంలో ఎన్ని టీఎంసీల నీరు సాగర్ నుంచి గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్రైతుల పక్షపాతి అని, అందుకే రిజర్వాయర్ నిర్వహణకు రూ.9 కోట్లు మంజూరు చేశారన్నారు. టీడీపీ నాయకుల హడావుడి గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు విరిగిందన్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం ఉదయం రిజర్వాయర్ వద్దకు చేరుకుని కొంతసేపు హడావుడి చేశారు. రిజర్వాయర్ నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, టీడీపీ నాయకుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రిజర్వాయర్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు. -
రైతులను ఆదుకుంటాం
కొత్తపేట: మిచాంగ్ తుపాను, భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల–పల్లిపాలెం రోడ్డులో పడిపోయిన వరి పంటను, తడిసిన ధాన్యాన్ని సీఎస్ శనివారం పరిశీలించారు. తుపాను వల్ల నియోజకవర్గంలో వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సీఎస్ జవహర్‌రెడ్డికి వివరించారు. పూజారిపాలెం, చౌదరిపురం ప్రాంతంలో పొలాల ముంపునకు కారణమైన గోరింకల డ్రైన్‌ను సీఎస్‌కు చూపించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలతో పాటు రైతులకు నష్టపరిహారం, పంటల బీమా తదితర విషయాల్లో చేపట్టిన చర్యలను సీఎస్‌కు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో తుపాను నష్టాన్ని చాలా వరకు నివారించినట్లు చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించిందని వివరించారు. పంట తడిసిపోవడం వల్ల ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం, నూకలవ్వడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, మిల్లర్లకు నిబంధనలు సడలించి.. వారికి తోలిన ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలుతో పాటు మిల్లర్ల నుంచి ఎగుమతుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పంట నష్టాల నమోదు అనంతరం సాయం అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ ఎం.ముక్కంటి, ఎంపీపీ మార్గన గంగాధరరావు, జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, తహసీల్దార్ జీడీ కిషోర్‌బాబు, ఎంపీడీఓ ఇ.మహేశ్వరరావు, వ్యవసాయ అధికారి జి.పద్మలత తదితరులు పాల్గొన్నారు -
యథాస్థితికి విద్యుత్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి. ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు. జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు. దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో వాయువేగంతో సాయం
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వలంటీర్ల నుంచి గ్రామ, మండల స్థాయి అధికారులు, కలెక్టర్లు, సీనియర్ అధికారులు, ప్రత్యేక అధికారులు అంతా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కాస్త తెరిపి ఇవ్వడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాను ప్రభావిత 12 జిల్లాల్లో గురువారం రాత్రి నాటికి 428 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిల్లో 26,226 మంది ఆశ్రయం పొందుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 144 పునరావాస కేంద్రాల్లో 8,529 మందికి ఆశ్రయం కల్పించారు. బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888 మంది, కృష్ణా జిల్లాలోని 67 కేంద్రాల్లో 3579 మంది, తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మంది, ప్రకాశం జిల్లాలోని 11 కేంద్రాల్లో 865 మంది, పల్నాడు జిల్లాలోని 14 కేంద్రాల్లో 1,677 మంది, ఏలూరు జిల్లాలోని రెండు కేంద్రాల్లో 151 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 37 కేంద్రాల్లో 910 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని 21 కేంద్రాల్లో 1,887 మంది, తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 248 మంది ఆశ్రయం పొందుతున్నారు. శిబిరాల్లో ఉన్న వారికి భోజనం, మంచినీరు సౌకర్యం కల్పించారు. 74 వేలకుపైగా ఆహార పొట్లాలను బాధితులకు పంపిణీ చేశారు. 2.69 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి వైద్య పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే చికిత్స అందిస్తున్నారు. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా బోర్ల వద్ద జనరేటర్లు, ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరీ సరఫరా చేస్తున్నారు. సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.24.85 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో జిల్లా కలెక్టర్లు బాధితులకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు ప్రభుత్వం అందించే రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయాన్ని పలుచోట్ల పంపిణీ చేయగా, మిగిలిన చోట్ల కూడా అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ విస్తృతంగా చేపట్టారు. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిల్ ఇస్తున్నారు. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న అన్ని చోట్లా వెంటనే పునరుద్ధరించారు. దెబ్బతిన్న రహదారులను తాత్కాలికంగా బాగు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిసూ్తనే ఉన్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి, బాపట్ల జిల్లా బాపట్ల, పొట్టిశ్రీరాములు జిల్లా నెల్లూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, గూడూరులో ఈ బృందాల సభ్యులు అలుపెరగకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ♦ బాపట్ల జిల్లాలో గురువారం ఉదయం నాటికి 596 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దెబ్బతిన్న ఒక్కో గృహానికి రూ.10 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. 700కిపైగా కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. జిల్లాలో లక్షకుపైగా హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఉపాధి కూలీలతో వరి పొలాల్లోని నీటిని బయటకు తరలించే పనులు కొనసాగిస్తున్నారు. తుపాన్ ఉధృతికి పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు వాగు, కప్పలవాగు, కొమ్మమూరు కాలువ, ఆలేరు వాగులకు దాదాపు 20 చోట్ల గండ్లు పడటంతో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,282 మంది ఉపాధి కూలీలతో పంట బోదెల్లో పూడికలు తీయించారు. జేసీబీలతో డ్రెయిన్లలో పూడిక తొలగిస్తున్నారు. గ్రామాల్లో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేపట్టారు. ♦తిరుపతి జిల్లాలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు 17 గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. జిల్లాకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. బాధితులకు నిత్యావసర సరుకులను కిట్ రూపంలో అందజేశారు. ♦వర్షాలు కొద్దిగా తెరిపివ్వడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ♦ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు ధైర్యం చెప్పారు. -
సహాయ, పునరుద్ధరణ చర్యలు వేగవంతం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానువల్ల రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనాలను త్వరగా చేపట్టడంతో పాటు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను అనంతర సహాయ, పునరుద్ధరణ చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి∙ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. తుపాను అనంతరం విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టాల అంచనా తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పంటనష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియను చేపట్టాలని వ్యవసాయ, ఉద్యాన శాఖలతో పాటు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో తుపాను నష్ట పరిశీలనకు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. 1.45 లక్షల హెక్టార్లలో వరి పంటకు దెబ్బ ప్రాథమిక అంచనా ప్రకారం.. 1,45,795 హెక్టార్లలో వరి, 31,498 హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని జవహర్‌రెడ్డి తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తికాగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించడంతో పాటు నూరు శాతం బీమా సౌకర్యం వర్తింపజేస్తామని ఆయన స్పష్టంచేశారు. అలాగే.. తడిసిన, రంగు మారిన ధాన్యం సేకరణకు సంబంధించిన నిబంధనల సడలింపునకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సీఎస్ చెప్పారు. శిబిరాల్లో చేరిన వారికి సాయం.. ♦ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ జి. సాయిప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పునరావాస కేంద్రాల్లో చేరిన వారికి మొత్తం సుమారు రూ.రెండున్నర కోట్ల వరకూ సహాయం అందించినట్లు తెలిపారు. ♦1,01,000 కుటుంబాలకుగాను ఇప్పటికే 65,256 కుటుంబాలకు 25 కిలోలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు వంటి నిత్యావసర సరకులను పంపిణీ చేశామన్నారు. మిగతా కుటుంబాలకు కూడా త్వరగా అందిస్తామన్నారు. ♦ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ 3,292 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగ్గా ఇప్పటికే 3,111 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు. 11 నుంచి పంట నష్టం అంచనా.. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి∙పంట నష్టం అంచనా ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న పంటలన్నిటికీ నూరు శాతం బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పశు సంపద, బోట్లు, వలలు నష్టపోయిన బాధితులకు శుక్రవారం సాయంత్రానికి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిచేసి నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 93.8 కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నాయని వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ చెప్పారు. ఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ 2,816 కిమీ మేర ఆర్ అండ్ బీ రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని సమీప మార్కెట్ యార్డులు, గోదాములకు తరలించి కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. -
సాధారణ స్థితికి విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/కాకినాడ/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తోంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడానికి అవకాశంలేని చోట్ల తాత్కాలిక చర్యలతో విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో గురువారం సాయంత్రానికి రాష్ట్రమంతటా దాదాపు 98 శాతం విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఐ. పృథ్వీతేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. మిచాంగ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పూర్తయిన పునరుద్ధరణ.. ఏపీఎస్పీడీసీఎల్లో 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 17 ఫీడర్లు ప్రభావితం కాగా, ఒకటి రెండు మినహా మిగిలిన అన్ని ఫీడర్లు గురువారం రాత్రికి పునరుద్ధరించారు. నెల్లూరు, తిరుపతి, కడప సర్కిళ్లలో దెబ్బతిన్న మూడు ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, 33/11 కేవీ సబ్స్టేషన్లు 269, 33 కేవీ ఫీడర్లు 145, 33 కేవీ ఫీడర్లు, 32 కేవీ స్తంభాలు 770, 11 కేవీ 2,341 స్తంభాలు, 247 డీటీఆర్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. నెల్లూరు సర్కిల్లో 33/11కేవి సబ్స్టేషన్లు 36 పూర్తిగా చెడిపోగా, పునరుద్ధరించారు. రూ.1,235.45 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 33 కేవి సబ్స్టేషన్లు 150, 33 కేవీ ఫీడర్లు 134, 33 కేవీ పోల్స్ 16, 11కేవీ పోల్స్ 514, 173 డీటీఆర్లు దెబ్బతినగా, అన్నిటినీ సాధారణ స్థితికి తెచ్చారు. డిస్కం మొత్తం మీద రూ.545.98 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు సర్కిళ్లలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 204, 33కేవీ ఫీడర్లు 147, 33 కేవీ స్తంభాలు 115, 11కేవీ పోల్స్ 1,247, డీటీఆర్లు 504 పాడవ్వగా, అన్నిటినీ బాగుచేశారు. రూ.1,995.57 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. -
ఇక నుంచి ఎండలే ఎండలు
-
ఈ సీజన్ లో తొలి తుఫాను... కోస్తాంధ్ర వైపు...
-
Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి
టోక్యో: జపాన్ వాసులు మంచు తుపాను ధాటికి వారం రోజులుగా వణికిపోతున్నారు. సంబంధిత ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వంద మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్‌లో ఈ సీజన్లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది. చదవండి: అమెరికాను ముంచేసిన మంచు -
తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అలర్ట్
-
ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది. తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు. ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు. -
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
తుఫానుగా మారిన విజయ్ దేవరకొండ
రౌడీ ఇమేజ్‌తో ఇప్పటికే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ త్వరలో తుఫాన్‌గా మారి దేశం మొత్తం చుట్టేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు అతని ఫ్యాన్స్. ఈ రౌడీ హీరో ట్విట్టర్లో తన పేరును తుఫాన్ (TOOFAN) గా మార్చుకోవడంతో అతని అభిమానులు హంగామా ఆకాశాన్ని తాకుతోంది. ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరు ట్విట్టర్లో తుఫానుగా మారిపోవడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ తర్వాత తమ అభిమాన హీరో నుంచి మరో క్రేజీ అప్డేట్ రాబోతుందని.. అందుకే తుఫాన్‌గా పేరు మార్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ‘తుఫాన్ ఆనే వాలా హై’ అంటూ రీ ట్వీట్లు, షేరింగులు, పోస్టింగులతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరికొందరు ఇది ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్’ (Soft Drink Kaadu, Idi Toofan) అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏంటీ తుఫాన్? విజయ్ దేవరకొండ తన పేరులో తుఫాన్ ఎందుకు చేర్చారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. లయన్, టైగర్ల క్రాస్‌బ్రీడ్ లైగర్‌గా దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ తుఫానుతో మరో సంచలనానికి రెడీ అయ్యాడు. (అడ్వటోరియల్) -
ట్విటర్ ట్రెండ్: ఈ సినిమాను అస్సలు చూడకండి!
Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం. Trending in India 🇮🇳 Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1 — Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021 Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz — कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021 ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది. It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN — Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021 -
ముంచెత్తిన బురద.. కన్నీళ్లలో ప్రజలు
ప్రకృతి బీభత్సం జపాన్‌తో కంటతడి పెట్టిస్తోంది. రాజధాని టోక్యోలో నివాస ప్రాంతాలను బురద ప్రవాహం తుడిచిపెట్టేసింది. రిసార్ట్ టౌన్ అతామీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురద ప్రవాహం ముంచెత్తడంతో జాడ లేకుండా పోయారు పదుల సంఖ్యలో జనాలు. ఇక తుపాన్.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టోక్యో: జపాన్‌లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. రిసార్ట్ టౌన్ అతామీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి పెద్ద ఎత్తున జారిన బురద ఇళ్లను ముంచెత్తింది. ఎన్నో ఇళ్లు, కార్లు నామరూపాల్లేకుండా పోయాయి. బురద ధాటికి ఇప్పటిదాకా ఇద్దరు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 20 మంది జాడ లేకుండా పోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటుచూసినా రోదనలే కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోయినవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనాకి వచ్చారు. పరిస్థితి చేజారిపోతుండడంతో.. ఆదివారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,000 మందికిపైగా సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. బురదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటిదాకా 19 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. కార్యక్రమాలపై జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. Japan floods: 20 people missing after landslide sweeps through Atami, a coastal city 65 miles southwest of Tokyo. #Shizuokapic.twitter.com/4pFl3Fa1dh — Ian Fraser (@Ian_Fraser) July 3, 2021 ఇక అతామీ పట్టణంలో 130 మంది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలను ఆపడం లేదని అన్నారు. బురద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భీకర తుపాను ‘ఎల్సా’ తుపాను హైతీ దక్షిణ తీర ప్రాంతాన్ని, డొమినికన్ రిపబ్లిక్ దేశాన్ని కుదిపేస్తోంది. పెనుగాలుల ధాటికి చెట్లు నేలకూలుతున్నాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. ఎల్సా తుపాను వల్ల ఇప్పటిదాకా ముగ్గురు మరణించారు. జమైకాలోని మాంటెగో బే నుంచి 175 మైళ్ల దూరంలో సముద్రంలో పుట్టిన ఎల్సా కరీబియన్ దీవులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
మరోసారి పెళ్లికి రెడీ అయిన హీరో!
‘భాగ్ మిల్కా భాగ్’తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. తాజాగా మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఫర్హాన్.. నటి షీబాని దండేకర్‌తో ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్లో వదంతులు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో వీరద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో ప్రేయాణం గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఫర్హాన్, షిబానీలు 2020లో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారని.. ఫర్హాన్ తాజా చిత్రం ‘తుఫాన్’ విడుదల అనంతరం పెళ్లి చేసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ పెళ్లి తేదీ ఖరారు కాలేదు గానీ.. పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. త్వరలోనే తమ బంధాన్ని బహిర్గతం చేయబోతున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఫర్హాన్.. షీబానీతో కలిసి ఉన్న ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వీరిద్దరూ ఉంగరాలు ధరించి చేతులు పట్టుకొని ఉన్న ఫొటోలను కూడా ట్వటర్లో షేర్ చేశారు. అయితే వారి నిశ్చితార్థం విషయంపై స్పష్టతనివ్వనప్పటికీ..వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఫర్హాన్ అక్తర్‌కు 16 ఏళ్ల కిందట హేర్ స్టైలిస్ట్ ఆదునా బబానీతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2016లో విడాకులు తీసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. View this post on Instagram There's something so real about holding hands, a kind of complex simplicity, saying so much by doing so little. ~ unknown — 📷 @shibanidandekar A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Mar 3, 2019 at 4:42am PST -
బాక్సింగ్‌కు రెడీ అవుతున్న హీరో
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. జెర్సీ ధరించి బాక్సింగ్ రింగులో నిలుచుని ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు కసిగా చూస్తున్నట్టున్న ఈ పోస్టర్‌కు.. ‘ది రాక్ ఆన్’ అనే క్యాప్షన్‌ను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. అదే విధంగా.. ‘ఎప్పుడైతే జీవితం కష్టంగా మారుతుందో.. అప్పుడే మరింత బలవంతులం అవుతాం. దానికి ఉదాహరణ ‘తుఫాన్’. ఇది 2020 అక్టోబర్2 న మీ ముందుకు రాబోతుంది. మీరు ఈ ‘తుఫాన్’ను తప్పక ఇష్టపడతారని నా నమ్మకం’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు. కాగా తుఫాన్లో బాక్సర్‌గా తన అభిమానులను మెప్పించడానికి ఫర్హాన్ బాగానే శ్రమించాడని... ఇందుకోసం బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న తుఫాన్ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరి కలయికలో స్పోర్ట్స్ డ్రామా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమాలో ఫర్హాన్ రన్నర్‌గా కనిపించాడు. ఇక ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా నటించిన ‘స్కై ఈజ్ పింక్’ సినిమా గత ఏడాది అక్టోబర్ 11 విడుదలై టొరంటో అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శించబడింది. View this post on Instagram When life gets harder, you just get stronger. Iss saal #Toofan uthega. Releasing 02/10/2020. Happy to share this exclusive image with you as we dive into the new year. Hope you like it. ❤️ @rakeyshommehra @ritesh_sid @mrunalofficial2016 @vjymaurya @shankarehsaanloy @ozajay @excelmovies @romppictures @zeemusiccompany #PareshRawal #JavedAkhtar #AnjumRajabali #AAFilms A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Jan 1, 2020 at 7:30pm PST -
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్‌రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్‌రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు -
తుపాను బాధితులను తక్షణం ఆదుకోవాలి
-
తుపాను బాధితులను తక్షణం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను తక్షణం ఆదుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు జిల్లాల్లో తిత్లీ తుపాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిందని, ప్రాణ నష్టం కూడా సంభవించిందని ఆయన అన్నారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని జగన్ పిలుపు నిచ్చారు. -
రైతన్న వెన్నువిరిచిన.. తుపాను
శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/విజయనగరం గంటస్తంభం: అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క సిక్కోలులోనే 75 శాతం మేర వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలవాలాయి. వేలాది ఎకరాల్లోని అరటి, బొప్పాయి, జీడిమామిడి తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,350 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో వరి నష్టమే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.09 లక్షల హెక్టార్లలో వరి వేయగా.. 1.44 లక్షల హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది. ఈ నష్టం విలువ రూ.875 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరి చేతికందే తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన తుపాను తమను కష్టాల పాల్జేసిందని సిక్కోలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 700 హెక్టార్లలోని అరటి తోటలు నేలకొరిగాయి. వీరఘట్టం, వంగర, రాజాం, జి.సిగడాం, గార మండలాల్లోని అరటి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. 1,640 హెక్టార్లలోని జీడిమామిడి, 13 హెక్టార్లలోని బొప్పాయి, మరో 13 హెక్టార్లలోని కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఒక్క ఉద్దానం పరిసరాల్లోనే మూడు లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.475 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘విజయనగరం’లో రూ.31.30 కోట్ల నష్టం.. విజయనగరం జిల్లావ్యాప్తంగా అరటి, చెరకుతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మొత్తం రూ.31.30 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2,500 హెక్టార్లలో అరటి పంట నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అరటి తోటలు భారీగా నెలకొరిగాయి. అరటికి మంచి డిమాండ్ ఉన్న సమయంలో తోటలు నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పంట.. కొమరాడలో 32.5 హెక్టార్లు, జియ్యమ్మవలసలో 44.8 హెక్టార్లు, మక్కువలో 2 హెక్టార్లు, చీపురుపల్లిలో 24 హెక్టార్లు, గరుగుబిల్లిలో 50 హెక్టార్లలో దెబ్బతింది. ఇక 106.1 హెక్టార్లలోని పత్తి పంట తుడిచి పెట్టుకుపోయింది. సాక్షి, అమరావతి: ‘తిత్లీ’ తుపాను వల్ల ఏడుగురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 5,23,232 ఎకరాల్లోని పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని.. ఇందులో 16 మండలాల్లో దీని తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. మొత్తంగా 1,864 గ్రామాలు దెబ్బతినగా.. 1,021 ఇళ్లకు నష్టం వాటిల్లిందని, 509 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. 589 పశువులు మృతి చెందాయని పేర్కొందిది. ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి రూ.4.80 కోట్లు నష్టం వాటిల్లిందని, పంచాయతీరాజ్ శాఖలో రూ.6.92 కోట్లు నష్టం సంభవించిందని తెలిపింది. మున్సిపల్ శాఖలో రూ.2.81 కోట్లు, ఇరిగేషన్లో రూ.7.20 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో రూ.88.50 లక్షలు, విద్యుత్ శాఖలో రూ.3 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసింది. 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం 3 వేల మందిని శిబిరాలకు తరలించినట్లు వివరించింది. 105 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని.. 3 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మాయదారి తుపాను ముంచేసింది.. నాలుగు ఎకరాల్లో వరి వేశా. తెగుళ్లు అదుపులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో.. ఈ మాయదారి తుపాను వచ్చి నిండా ముంచేసింది. నా పంటను బాగా దెబ్బతీసింది. చేను పచ్చగా కనిపించినా పూర్తిగా గింజకట్టదు. దీంతో సగం దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. – కణితి యోగానంద్, రైతు, కుమ్మరిపేట, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానం కొబ్బరికి ఊపిరి తీసిన తిత్లీ కవిటి: ఉత్తరాంధ్రలో మరో కోనసీమగా పేరొందిన ఉద్దానం తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైంది. శ్రీకాకుళం జిల్లాలో గురువారం తెల్లవారు జామున తీరం దాటిన తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ సుమారు 14 గంటలపాటు వీచిన ప్రచండ గాలులకు లక్షలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులు కొబ్బరి రైతు గుండెలపై నిప్పులకుంపటిగా మారాయి. వాస్తవానికి వాతావరణశాఖ ఈ తుపాను కళింగపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరించింది. ఓ దశలో విజయనగరం వైపు దిశమార్చుకుందనే ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటినీ వమ్ముచేస్తూ పలాస వద్ద తీరం దాటి ఉద్దానాన్ని ఊడ్చుకుపోయింది.గతంలో తుపాన్లు వచ్చిన సమయంలో గాలులు పశ్చిమదిశనుంచి తూర్పువైపుగా వీచేవి.. ఈ సారి అందుకు భిన్నంగా తూర్పువైపు నుంచి పశ్చిమదిశగా గాలులు వీచాయి. దీంతో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి మండలాల్లో భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. 1999లో సంభవించిన సూపర్‌సైక్లోన్ కంటే అధికంగా ఉద్దానం ప్రాంతంలో ఆస్తినష్టం వాటిల్లింది. 11 వేల హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. మరో 25 లక్షల కొబ్బరి చెట్లు మొవ్వు విరిగిపోవడం, మొవ్వు దెబ్బతినడం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొబ్బరి రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరగాల్సి ఉంది. ఏటా నష్టపోతున్న కొబ్బరి రైతు ఉద్దానం కొబ్బరి రైతు ఏటా ఏదో ఒక విధంగా నష్టపోతున్నాడు. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ సందర్భంగా వేలాది కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. భీకర గాలులకు చెట్ల మొవ్వు దెబ్బ తినడం.. ఆ తరువాత చీడపీడలు దాడి చేయడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. కొన్నాళ్లు అవస్థలు పడిన ఉద్దానం రైతు.. ఆ తరువాత కొద్దికొద్దిగా కోలుకుంటుండగా ఇంతలో 2013 అక్టోబర్ 12న వచ్చిన ఫై–లీన్, 2014 అక్టోబర్ 14న వచ్చిన హుద్‌హుద్ తుపానుతో మరోసారి ఆర్థికంగా చితికిపోయాడు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉద్దానం రైతుకు తిత్లీ రూపేణా మరోసారి గట్టిదెబ్బ తగిలింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలకూలాయని, వేలాది చెట్లు పనికిరాకుండాపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ నేలకొరిగిన కొబ్బరిచెట్లు 3 లక్షలకు పైగా ♦ దెబ్బతిన్న కొబ్బరి పంట 11 వేల హెక్టార్లలో ♦ మరో 25 లక్షల చెట్లు భవిష్యత్‌లో పనికిరాకుండా పోయే ప్రమాదం ♦ 1999 సూపర్ సైక్లోన్ కంటే అధికంగా ఆస్తినష్టం పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశాం శ్రీకాకుళం కలెక్టరు ధనంజయరెడ్డి శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి: తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి గురువారం మీడియాకు తెలిపారు. టెక్కలి డివిజన్‌తో పాటు పలుచోట్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తద్వారా తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. అవసరమైన విద్యుత్ స్తంభాలు, ఇతరత్రా పరికరాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వివరించారు. నదుల్లో వరద పోటెత్తే ప్రమాదమున్నందున.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలను కూడా సన్నద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు పనిచేస్తున్నాయని.. గురువారం మూడో బృందాన్ని రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులందర్నీ ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. -
కేంద్రం తరఫున చేయూతనిస్తాం
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను అల్లకల్లోలం నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం చేరుకున్న సీఎం చంద్రబాబు సహాయ చర్యలపై సమీక్ష సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం పాత బస్టాండ్: ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు. అధికారులతో సమావేశమై.. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, సీఎం రెండు రోజుల పాటు జిల్లాలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆయన టెక్కలి డివిజన్లో పర్యటిస్తారని వెల్లడించారు. అంతకుముందుతాత్కాలిక సచివాలయం నుంచి తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం పర్యటన.. ఫీల్డ్‌కు వెళ్లని అధికారులు శ్రీకాకుళం–సాక్షి ప్రతినిధి: తిత్లీ పెను ప్రభావం చూపిస్తుందని ముందే ఊహించిన అధికారులు దాన్ని ఎదుర్కొనేందుకు గత రెండు రోజులుగా సన్నద్ధమయ్యారు. బుధవారం రాత్రంతా టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజామున సహాయక చర్యలు ముమ్మరం చేయాలని భావించారు. అయితే... సీఎం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారనే కబురందడంతో అధికారుల ప్రణాళిక అంతా తారుమారయ్యింది. ఫీల్డ్‌కు వెళ్లకుండా గురువారం అంతా జిల్లా కేంద్రానికే పరిమితం కావాల్సి వచ్చింది. -
అడవి పంది అడ్డురావడంతో..
ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ మండలం అందోలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూపాను వాహనం బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..కొమరం భీం జిల్లా జైనూరు మండలం జంగావ్ గ్రామానికి చెందిన కొంతమంది తూపాను వాహనంలో పెళ్లి శుభకార్యం(వలీమా)నకు మహారాష్ట్రలోని కిన్వట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా అడవిపంది దారికి అడ్డుగా రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. ఈ గందరగోళంలో వాహనం అదుపుతప్పడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ఎనిమిదికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక తుపాన్లే దిక్కు!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల అనంతరం విస్తారంగా కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటే నాగార్జునసాగర్ మాత్రం నీటిలోటుతో అల్లాడుతోంది. మంచి వర్షాలు కురిసిన ప్రస్తుత సీజన్లోనూ సాగర్‌లో 41.42 టీఎంసీల నీటి కొరత ఉంది. ‘నైరుతీ’కాలం ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలు అడుగంటాయి. దీంతో ఇక ఆశలన్నీ నవంబర్‌లో వచ్చే తుపాన్లపైనే ఉన్నాయి. నవంబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, వాటి ద్వారా ప్రాజెక్టుల్లోకి ఆశించిన నీరొస్తుందని భావిస్తున్నామని, లేదంటే మున్ముందు నీళ్ల కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నెలన్నర కిందటే పూర్తి మట్టాలకు చేరుకున్నాయి. 25 రోజుల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. అక్కడి నుంచి నీటి విడుదల కొనసాగడంతో 312.05 టీఎంసీల సామర్థ్యమున్న సాగర్‌లో నిల్వలు 270.62 టీఎంసీలకు చేరాయి. వారం రోజుల నుంచి ప్రవాహాలు క్షీణించాయి. ఆదివారం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి 18 వేల క్యూసెక్కుల మేర ఔట్‌ఫ్లో ఉన్నా, అందులో 11 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడుకు.. మిగతా నీరు కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో దిగువకు చుక్క రావడం లేదు. ఈ నేపథ్యంలో నవంబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ల పైనే సాగర్ పరిస్థితి ఆధారపడి ఉంది. గతంలో తుపాన్ల నీటితోనే.. నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్ల ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. గతంలో తుపాన్ల సమయంలో సాగర్‌లోకి నీరు రావడంతోనే జంట నగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బంది తలెత్తలేదని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఒక్కోమారు నవంబర్ చివర, డిసెంబర్‌లోనూ కృష్ణా బేసిన్లో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని, అవి ఆశించిన మేర కురిస్తే ప్రయోజనకరమని పేర్కొంటున్నారు. -
వాయుగుండంపై అప్రమత్తం!
-
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ల ముప్పు
-
కోలీవుడ్‌కు సూపర్ పోలీస్‌గా రామ్‌చరణ్
టాలీవుడ్ యువ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజకు కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంతకుముందు మావీరన్ చిత్రం ఇక్కడ మంచి ఆదరణ పొందింది. త్వరలో స్ట్రయిట్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.తాజాగా సూపర్ పోలీస్‌గా ఒక పవర్ఫుల్ పాత్రలో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఆయన పెద్ద సాహసమే చేశారు. హిందీలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ హీరోగా నటించిన జంజీర్ చిత్ర రీమేక్‌లో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రమే తెలుగులో తుపాన్ గా విడుదలై కమర్షియల్‌గా హిట్ అయ్యింది. ఇప్పుడు సూపర్ పోలీస్‌గా కోలీవుడ్‌కు రానుంది. ఇందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకచోప్రా రామ్‌చరణ్ తేజకు జంటగా నటించడం ఒక విశేషం అయితే, సంచలన హిందీ నటుడు సంజయ్‌దత్ ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. ఇక ప్రకాశ్‌రాజ్, తనికెళ్లభరణి, శ్రీహరి, మహీగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రల్లో నటించారు. కాకీ షర్టుపై గౌరవంతో పని చేసే నిజాయితీపరుడైన పోలీస్ అధికారి ఇతి వృత్తమే సూపర్‌పోలీస్. తన నిజాయితీ కారణంగా ఐదేళ్లలో 23 సార్లు బదిలీ అయి, చివరికి ముంబైకి చేరిన ఆ పోలీస్ అధికారికి ఒక కలెక్టర్ దారుణ హత్య దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ హత్యకు కారణాలేంటీ? ఆ హంతకులను ఎలా ఎదుర్కొని శిక్షించారన్న పలు ఆసక్తికరమైన అంశాలకు ప్రతిరూపమే సూపర్ పోలీస్ చిత్రం. ఇంతకు ముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాలను కోలీవుడ్‌కు అందించిన స్వాతి, హర్హిణిల భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ రూపొందిస్తున్న తాజా చిత్రం ఇది. సత్య సీతల, అడ్డాల వెంకటరావు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకుడు.ఏఆర్కే.రాజరాజన్ సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఓరియంటెట్ కథతో జనరంజకంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. చిత్రంలో ఐదు ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకోవడం మరో ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. సూపర్ పోలీస్ చిత్రాన్ని ఇదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
వణికిస్తున్న ‘వార్దా’
తెనాలి : వార్దా తుపాను కదలికలు డెల్టా గుండెల్లో భీతిని కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడి దిశ మార్చుకుంటూ వస్తున్న తీవ్ర తుపాను.. కోస్తా తీరానికి వచ్చేటప్పటికి బలహీనపడి వాయుగుండంగా లేదా తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు అందుతున్నాయి. కోస్తా తీరమంతా ఇప్పటికే రేవుల్లో రెండో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు దాదాపుగా తిరిగొచ్చేశారు. తీర గ్రామాల్లో సహాయక చర్యలపై అధికార యంత్రాంగం సన్నాహాల్లో ఉంది. ఈ పరిణామాల్లో జిల్లాలోని రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. పంటలకు కచ్చితంగా నష్టం జరుగుతుందని ముందే స్పష్టమవుతున్న హెచ్చరికలతో అది ఏ మేరకనేది ఎదురుచూడాల్సిన గందరగోళ పరిస్థితి అన్నదాతలది. వరి రైతుల్లో వణుకు... మచిలీపట్నం–నెల్లూరు మధ్య సోమవారం రాత్రి తీరం దాటే తుపాను ప్రభావం 24 గంటలు ముందునుంచే ఉంటుందనేది తెలిసిందే. దీనివల్ల ఆదివారం గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉంది. మరుసటిరోజుకు ఈ ప్రభావం మరింతగా పెరిగి గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు రైతులకు వణుకు తెప్పిస్తున్నాయి. జిల్లాలోని మాగాణి భూముల్లో ప్రధానమైన వరి పైరు ఇప్పుడు కీలక దశలో ఉన్నందునే ఈ ఆందోళనంతా. వర్షాభావం, జలాశయాల్లో నీటి కొరతతో ఖరీఫ్ సీజను ఆలస్యంగా ప్రారంభమైంది. ఫలితంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 4.10 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇందులో అత్యధిక విస్తీర్ణం పశ్చిమ డెల్టా పరిధిలోని తెనాలి డివిజనులోనే ఉంది. అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎకరాకు సగటున 30–32 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఖర్చులు అధికమైనా తిండిగింజలకు ఎంతోకొంత ఆదాయం వస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. ఓదెలపై వరిపైరు... అన్నదాత గుండెల్లో బేజారు.. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. దీంతో యంత్రంతో ఒకేరోజు కోత, నూర్పిడి చేసేసి ధాన్యం తీసుకునేందుకు వీల్లేకపోయింది. ఎక్కువమంది రైతులు కోతలు కోసి వరికుప్పలు వేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరిపైరు కోతలు పూర్తయ్యాయి. ఇందులో 1.25 లక్షల ఎకరాల్లోనే కోత కోసిన పైరును కుప్పలు వేయగలిగినట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు. మిగిలిన 1.25 లక్షల ఎకరాల్లో పైరు ఓదెలపై ఉంది. తగిన సమయం ఓదెలు (పనలు) ఆరకుండా ఇప్పటికిప్పుడు కుప్పలు వేసుకొనే అవకాశం లేదు. భారీ వర్షాలు కురిస్తే కచ్చితంగా ఓదెలపై ఉన్న పైరు దెబ్బతింటుంది. మిగిలిన 1.60 లక్షల ఎకరాల్లో పైరులో సగం అంటే దాదాపు 80 వేల ఎకరాల్లో వరి పైరును నాలుగు రోజుల్లో కోత కోయాల్సి ఉంది. ఏపుగా ఉన్న వరి కంకులతో ఉన్న పైరు ఏమాత్రం వర్షం, గాలుల తాకిడి తగిలినా నేలకు కరుచుకుంటుందని తెలిసిందే. ఈ స్థితిలో తుపాను ప్రభావంతో గాలులు, భారీ వర్షాలు రానుండటం, పంట నష్టం జరిగే ప్రమాదం స్పష్టమవుతోంది. గతేడాది తీవ్రమైన వర్షాభావంతో రైతులు అల్లాడిపోయారు. వరిసాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయి, పంట దిగుబడి కూడా ఎకరాకు 20–22 బస్తాలకు పరిమితమైంది. ఈ ఏడాది ఏదోలా గట్టున పడతామనుకున్న అన్నదాతలకు ముంచుకొస్తున్న తుపాను తీవ్రత దిక్కుతోచకుండా చేస్తోంది. ఓదెలపై ఉన్న పైరు, నాలుగైదు రోజుల్లో కోత కోయాల్సిన చేలపై ఈ ప్రభావం భారీగా ఉంటుందనటంలో సందేహం లేదు. మెట్ట పంటలకూ తప్పని ముప్పు... జిల్లాలో వరి తర్వాత ప్రధానంగా సాగుచేసే పంటల్లో పత్తి, మిర్చి, పసుపు పైర్లు వర్షాలతో దెబ్బతినే ప్రమాదముంది. మిర్చి పైరు మూడో కోతలో ఉంది. మార్కెట్« ధర బాగుంది. క్వింటాలు రూ.12 వేలు పలుకుతోంది. పత్తి పైరు జిల్లాలో సగం విస్తీర్ణంలో చేతికొచ్చింది. మిగిలిన చేలల్లో ఇప్పుడు పత్తి తీయాల్సిన తరుణం. మద్దతు ధర రూ.4050కి మించి మార్కెట్ ధర రూ.4600–5000 వరకు పలుకుతోంది. వర్షాలు కురిస్తే భారీ నష్టం అనివార్యం. అదేరీతిలో భారీ వర్షాలతో పసుపు చేలకు నష్టం వాటిల్లుతుంది. చేలల్లో చేరిన నీటితో పంట దుంపకుళ్లు బారిన పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మిరప రైతులకు తుఫాన్ టెన్షన్
తాడికొండ రూరల్: ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో మిరప కోతలు డిసెంబర్ తొలి వారంలోనే ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కాయలను కోసి కల్లాల్లో ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. తుఫాన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కల్లాల్లో ఆరబోసిన కాయలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తాడికొండ మండలంలోని బండారుపల్లి, గరికపాడు, దామరపల్లి, ఫణిదరం, రావెల, పాములపాడు, పొన్నెకల్లు, బేజాత్పురం, ముక్కామల, ఎల్జీ పూడి పరిసర ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో రైతులు మిరప సాగు చేశారు. నిన్న మొన్నటి వరకు సాగునీరు విడుదల లేక ఇబ్బందులు పడిన రైతులకు నేడు తుఫాన్ టెన్షన్ ఇబ్బంది పెడుతుంది. కల్లాల్లో ఆరబోసిన కాయలను కాపాడుకొనేందుకు టార్ఫాలిన్ పట్టాలతో రాత్రివేళ కాపలా ఉంటున్నారు. -
ముంచుకొస్తున్న ‘వార్దా’
జంగారెడ్డిగూడెం : వార్దా తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవుల ను కలెక్టర్ కాటంనేని భాస్కర్ రద్దుచేశా రు. రెండో శనివారం (10వ తేదీ), ఆది వారం (11వ తేదీ)సెలవులను కలెక్టర్ రద్దుచేసి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడి వాయిగుండంగా ఏర్పడి తుపానుగా మారనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. దీనికి వార్దాగా నామకరణం చే శారు. తుపాను అవకాశాలు బలంగా ఉ న్న నేపథ్యంలో చేపలవేటకు వెళ్లరాదని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం కలెక్టరేట్లో 08812 230050 నంబరుతో కం ట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ని అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో కం ట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఒకవేళ తుపాను ఉధృతమైతే ఎదుర్కొనేం దుకు అవసరమైన సామగ్రి, నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవాలని ముం దస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల్లో ఆందోళన వార్దా తుపాను నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వరి పంట చాలా చోట్ల పనలపైనా, కుప్పలపైనా ఉంది. 90 శాతం వరికోతలు పూర్తవగా మరో 10 శాతం కోతలు కోయాల్సి ఉంది. కోసిన పంట కళ్లాలపై ఉంది. సుమారు 11 వేల హెక్టార్లలో వరి పంట కళ్లాలపైనా, కుప్పలపైనా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 23 వేల హెక్టార్లలో వరి కోతలు జరగాల్సి ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొక్కజొన్న, పప్పు ధా న్యాలు, పత్తి పంటలకూ నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో వర్జీనియా, నాటు పొగాకును సుమారు 20 వేల హెక్టార్లలో రైతులు వేశారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే ఈ పంటలకు నష్టం సంభవిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యానశాఖ పంటలకు కూడా నష్టం సంభవించే అవకాశం ఉంది. గాలులు అధికంగా వీస్తే గెలలపై ఉన్న అరటి, తాత్కాలిక పందిళ్లపై ఉన్న కూరగాయల పంటలకు కూడా నష్టం సంభవించే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తం కండి ఏలూరు (మెట్రో): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల్లో జిల్లాకు తుపాను వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి ఓ ప్రకటనలో సూచించారు. వాతావరణ కేంద్రం సూచనల మేరకు రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ పొలాల్లో వరి కుప్పలను నూర్చుకుని దగ్గరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని లేదా జాగ్రత్త చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు తమ పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసరాలు నిల్వ ఉంచాలి: డీఎస్వో ఏలూరు (మెట్రో): బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను బలపడి పెను తుపానుగా మారనున్న నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డీలర్లు నిత్యావసరాల నిల్వలు ఉంచుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి.శివశంకరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ రిటైల్ డీలర్లు పూర్తిస్థాయిలో నిల్వలు ఉంచుకోవాలని, ప్రతి బంకులో 500 లీటర్ల పెట్రోల్, 2 వేల లీటర్ల డీజిల్ ప్రభుత్వ అవసరాలకు రిజర్వుగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన నరసాపురం డివిజ¯ŒSలోని అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు రెవెన్యూ అధికారుల సూచనలు పాటించాలన్నారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్లు కనీసం వారం రోజులకు సరిపడా గ్యాస్ సిలెండర్ల రీఫిల్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కిరోసి¯ŒS డీలర్లు కూడా నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. -
హార్బర్లో రెండో నంబరు ప్రమాద సూచిక
నిజాంపట్నం : విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారటంతో హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచిక ఎగరవేయడం జరిగిందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని తెలిపారు. -
గోదావరిలో పడిన వాహనం:21 మంది మృతి
-
రాజస్థాన్‌లో ఇసుకతుఫాను
-
బతికి బట్టకట్టేదెలా?
మన్నును నమ్ముకున్న రైతన్నలకే కాదు- మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నలకూ మనుగడ గండంగా మారిపోతోంది. తెల్లని దారపుపోగుల నుంచి వన్నెలవన్నెల వస్త్రాలను సృష్టించే వారి బతుకులు వెలసిపోతున్నాయి. సమాజానికి గుడ్డ సమకూర్చే వారికి కూడు కనాకష్టమయ్యే గడ్డుకాలం దాపురిస్తోంది. వారికి అండగా నిలవాల్సిన చేనేత సహకార సంఘాలు.. చిక్కులు పడ్డ దారపు ఉండను సరి చేయాల్సి వచ్చినట్టు... దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బతికి బట్టకట్టేదెలా? సాక్షి, కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు, మూడు నెలల పాటు సాగిన సమైక్య ఉద్యమం, వరుస తుపాన్లు, భారీ వర్షాలతో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పుండు మీద కారం చల్లినట్టు.. చేనేత వస్త్రాలకు ఇచ్చే 20 శాతం రిబేట్‌ను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. పండుగ సీజన్లో గిరాకీ ఉన్నా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ లేకుండా పోయింది. దీనికి తోడు ఆప్కో కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో సొసైటీల్లో కోట్లాది రూపాయల వస్త్ర ఉత్పత్తులు పేరుకుపోయాయి. అటు సొసైటీలు నష్టాల పాలై, ఇటు చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి నెలకొంది. జిల్లాలో లక్ష మందికి పైగా మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉప్పాడ, బండార్లంక, గొల్లప్రోలు, పుల్లేటికుర్రు, మోరి, కె.జగన్నాథపురం, ద్వారపూడి, విలసవిల్లి తదితర గ్రామాల్లో సుమారు 18,061 గోతిమగ్గాలుండగా, ఒక్కో మగ్గంపై నలుగురు చొప్పున సుమారు 80 వేల మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. మగ్గంపై ఆధారపడే కుటుంబంలో నలుగురు కలిసి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తుంటారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలున్నాయి. వీటికి డీసీసీబీ రూ.12 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇప్పటికే సొసైటీల వద్ద రూ.7.5 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. ముఖ్యంగా అంగర, పులగుర్త, మోరి తదితర సొసైటీల్లో నిల్వలు భారీగా ఉన్నాయి. నెలల తరబడి ఉండిపోవడం వలన ఈ ఉత్పత్తుల నాణ్యత కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అమ్మేదెలాగో అగమ్యగోచరం.. ప్రొడక్షన్ ప్రోగ్రామ్ (పీపీ) కింద ప్రభుత్వం జిల్లాలో ఆప్కోకు తొలి అర్థ సంవత్సరంలో రూ.3.15 కోట్లు మంజూరు చేసింది. ఇటీవలే రెండో అర్థ సంవత్సరానికి సంబంధించి రూ.2.66 కోట్లు విడుదల చేసింది. సొసైటీల వద్ద ఏడున్నర కోట్ల విలువైన ఉత్పత్తులు పేరుకుపోవడంతో పీపీ కింద రూ.ఆరు కోట్లు మంజూరు చేయాలంటూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపగా కేవలం రూ.2.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ మొత్తంతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఎలా కొనుగోలుచేయాలో పాలుపోని స్థితిలో ఆప్కో ఉండగా.. 20 శాతం రిబేట్ రద్దు చేయడంతో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీలు అయోమయంలో పడుతున్నాయి. ఉత్పత్తి అయిన వస్త్రాల్లో మూడో వంతైనా ఆప్కో కొనుగోలు చేస్తే తప్ప కార్మికులకు సొసైటీలు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. పీపీ కింద మంజూరైన రూ.2.66 కోట్లను కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా సొసైటీల నుంచి వస్త్ర నిల్వలు కొనుగోలు చేసే వెసులుబాటునిచ్చారు. ఈ నెలాఖరులోగా రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయనుండగా, మిగిలిన రూ.1.33 కోట్ల విలువైన ఉత్పత్తులను ఫిబ్రవరిలో కొనుగోలు చేస్తారు. మిగిలిన ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక సొసైటీ పాలకవర్గాలు దిక్కులు చూస్తున్నాయి. కనీసం 20 శాతం రిబేట్‌ను పునరుద్ధరిస్తే కొద్దొగొప్పో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోగలుగుతామని చెబుతున్నారు. జిల్లాలో 12 వేల మంది కార్మికుల ఉపాధిపై రిబేట్ రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో 50 సంఘాలకు గాను 47 సంఘాలకు 20 శాతం రిబేటును పొందేందుకు అర్హత ఉంది. రిబేట్ రద్దు వల్ల గత ఏడు నెలలో రూ.75 లక్షలకు పైగా అమ్మకాలు తగ్గిపోవడంతో ఆ మేరకు ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఆప్కో ద్వారా సంఘాలకు రావాల్సిన బకాయిసొమ్ము రూ.10 కోట్లకు పైనే ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు నూలుపై రిబేటు రూపంలో దాదాపు రూ.3.5 కోట్లు విడుదల కావాల్సి ఉంది. సంఘాల మనుగడ కష్టమే.. ప్రస్తుతం సొసైటీల్లో రూ.25 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యే అవకాశముండగా ఆప్కో కనీసం రూ.6 కోట్ల విలువగల వస్త్రాలు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఉత్పత్తిలో మూడో వంతైనా కొనుగోలు చేస్తే తప్ప సంఘాలు మనుగడ సాగించలేవు. రిబేటు లేకపోవడం వల్ల సంఘాల్లో దుస్తులు పేరుకుపోయాయి. కనీసం రిబేటైనా ఇస్తే దుస్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి సాధ్యమవుతుంది. - చింతా వీరభద్రేశ్వరరావు, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కొత్తకోట(రావికమతం), న్యూస్‌లైన్: వరుస తుఫాన్లతో అతలాకుతలమైన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణం రైతుల రుణాలన్నీ రద్దుచేసి కొత్త రుణాలివ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రావు వెంకట జగ్గారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల చెరకు రైతుల సంఘం నాయకుడు మడ్డు రాజిబాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయీ రైతు సదస్సు కొత్తకోటలో జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ నీలం తుఫాన్ పంట నష్టపరిహారం ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. బ్యాంకు రుణాలు పారిశ్రామికవేత్తలు 82 శాతం అధికంగా పొందుతున్నారని, రైతులకు కేవలం 18 శాతం మాత్రమే అందుతున్నాయని తెలిపారు. రైతు ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద రుణాలు చేసి అప్పులపాలై నష్టపోతున్నారన్నారు. ఈ సమస్యలపై 18, 19, 20 తేదీల్లో గుంటూరులో జరిగే కిసాన్ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు గంగా భవానీ, నూకునాయుడు, వారా నూకరాజు, మేకా సత్యనారాయణ, జి. జోగిరాజు తదితరులు పాల్గొన్నారు. -
పత్తిరైతుకు పుట్టెడు కష్టాలు
పర్చూరు, ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, వరుస తుపాన్లు రైతుల వెన్ను విరిచాయి. జిల్లాలోని పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 57 వేల హెక్టార్లలో పత్తిపైరు సాగైంది. ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పైర్లు పీకేయగా..మిగిలినవి ఓ మోస్తరు దిగుబడి ఇస్తున్నాయి. పత్తితీత పనులు కూడా ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. రైతుల ఇళ్లకు పత్తి వచ్చి చేరుతోంది. బయట మార్కెట్లో నాణ్యమైన పత్తికి * 4,400 ధర ఉన్నా..దళారులు, వ్యాపారులు నాణ్యత పేరుతో * 2,500 నుంచి * 3 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అసలే దిగుబడులు తగ్గి ఆందోళనలో ఉన్న రైతులను ఈ పరిణామం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇంత కష్టపడి సాగుచేస్తే హెక్టారుకు 15 క్వింటాళ్లు రావడం గగనమైపోతోంది. వర్షాలకు దెబ్బతిని ఇప్పుడిప్పుడే ఇగురుకాపు వస్తున్న పైర్లు దిగుబడులు ఇస్తాయా లేదా అన్న అనుమానం రైతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం పత్తికి ప్రభుత్వ ధర క్వింటా *4 వేలుగా ప్రకటించింది. నాణ్యమైన పత్తిని ఎలాగూ ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఇదే వర్షాలకు దెబ్బతిన్న పైర్లనైతే కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఒకవేళ కొనుగోలు చేసినా వారికి తోచిన ధరే ఇస్తారు. దీంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించి ఆదుకుంటుందని రైతాంగం ఆశిస్తోంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సీసీఐ నిబంధనలు పక్కనపెట్టి తడిసి కొద్దిగా నాణ్యత దెబ్బతిన్న పత్తిని కూడా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. పత్తిరైతులపై ప్రభుత్వాల చిన్నచూపు... పత్తి దిగుబడిలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా పత్తి ఆధారిత పరిశ్రమలు 40 శాతం తమిళనాడులో ఉన్నాయి. పత్తి రైతులను ఆదుకునే విషయంలో మన ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలకు సరిపోను మిగతా పత్తిని తమిళనాడుకు తరలించాలంటే రవాణా ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో వ్యాపారులు రవాణా ఖర్చులు, మిగతా ఖర్చులు సరిచూసుకొని గిట్టుబాటయ్యే ధరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా మన రాష్ట్ర పత్తిరైతులకు న్యాయమైన ధర లభించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యాపారులకే జై కొడుతున్న సీసీఐ అధికారులు ఏటా రైతాంగాన్ని ఆదుకునే పేరుతో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న అధికారులు రైతుల వద్ద నుంచి మొక్కుబడిగా కొనుగోళ్లు చేస్తూ వ్యాపారులకు దోచిపెడుతున్నారు. రైతాంగాన్ని దగా చేసి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేస్తే సీసీఐ బయ్యర్లకు మిగిలేది తక్కువ.. అదే వ్యాపారులైతే కొద్దొగొప్పో ముట్టచెప్తారు. వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసిన పత్తి సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పనిలేకుండా నేరుగా సీసీఐ లీజుకు తీసుకున్న మిల్లుల వద్దకు చేరుతుంది. అయినప్పటికీ సీసీఐ కేంద్రాలకు వచ్చినట్లుగానే మార్కెటింగ్ శాఖకు సెస్సు, హమాలీల కూలీ ఇవ్వడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ సిబ్బంది కూడా పాలుపంచుకోవడం గమనార్హం.. ఎక్కువ సంఖ్యలో సీసీఐ కేంద్రాలు పెడితేనే రైతులకు మేలు: పత్తి రైతాంగాన్ని ఆదుకోవాలంటే కనీసం పత్తి కొనుగోలు కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలి. పశ్చిమప్రాంతంతో పాటు పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో 10కిపైగా ఏర్పాటు చేస్తే తప్ప ఈ ఏడాది రైతులు కోలుకోరు. గత ఏడాది పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో సీసీఐ కేంద్రాలు 5 మాత్రమే తెరిచారు. అయితే పశ్చిమ ప్రాంతంలో ముందుగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంత రైతాంగం దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోయారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల పుణ్యమా అని చివరిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినా అప్పటికే 80 శాతానికిపైగా పత్తి దళారుల చేతిలోకి వెళ్లింది. -
తీరం దాటిన లెహర్
-
బాబుపై తుఫాను బాధితుల మండిపాటు
-
కాకినాడకు 600కి.మీ దూరంలో తుపాన్
-
ప్రభుత్వ వైపరీత్యం రైతులకు అండగా నిలవని దైన్యం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రభుత్వ వైఖరితో అత్యవసర సాయానికి అర్థమే మారిపోతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ) అందజేతలో మీనమేషాలు లెక్కిస్తోంది. 2010లో సంభవించిన జల్ తుపాను నుంచి నిన్న మొన్న తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ ఎలాంటి సహాయాన్ని అందించలేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు 50 శాతం కంటే ఎక్కువ నష్టం కలిగితే ఆరు నెలల్లోపే ఇన్పుట్ సబ్సిడీ విడుదలయ్యేది. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ హయాంలో ఆ పరిస్థితి లేకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2010లో వచ్చిన జల్ తుపాన్ మొదలుకొని గత నెల 22 నుంచి 27వ తేదీ వరకు తుపాను ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాల వరకు దెబ్బతిన్న పంటలకు రూ.64 కోట్ల పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) విడుదల కావాల్సి ఉంది. దీనికోసం 1.12 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర కారణంగా.. బాధిత రైతులు పరిహారం కోసం జిల్లా కలెక్టర్, జేడీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా బుట్టదాఖలవుతుండటం గమనార్హం. 2011లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారు. దాదాపు 2.50 లక్షల మంది రైతులకు రూ.125 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఇంకా 35వేల మంది రైతులకు రూ.22 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. రైతుల నుంచి బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీ మొత్తం కూడా ఉంది. కొద్దిరోజుల్లో ఖాతాలకు జమ చేస్తారని భావిస్తుండగా ప్రభుత్వం నీలం తుపాను బారిన పడిన జిల్లాలకు ఈ మొత్తాన్ని మళ్లించి ఇక్కడి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. 2012లోను కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. మొదటి విడతలో రూ.197 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. ఇంకా 43,287 మందికి పరిహారం విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వంలో చలనం లేకుండాపోయింది. గత నెల 22 నుంచి 27వ తేదీ వరకు తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు దాదాపు 5వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 4,500 మంది రైతులు నష్టపోయారు. వీరికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.4 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు 17 మండలాల్లో పంటలకు రూ.300 కోట్లు నష్టం జరిగిందని, 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని మొదట ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్యుమరేషన్ తర్వాత 5వేల ఎకరాలకు లోపే పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు. భారీ వర్షాల వల్ల 8000 ఇళ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఇళ్లకు తూతూమంత్రంగా పరిహారం పంపిణీ చేశారు. రోడ్లు భారీగా దెబ్బతిన్నా వాటి మరమ్మతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా పట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో లెహర్
-
రాష్ట్రానికి ‘లెహర్’ ముప్పు
-
రాష్ట్రానికి ‘లెహర్’ ముప్పు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపై ప్రకృతి పగబట్టినట్టుంది! ఒక ముప్పు నుంచి తేరుకోక ముందే మరొకటి ముంచుకొస్తోంది. పై-లీన్, హెలెన్ తుపాన్ల విలయం చాలదన్నట్టు తాజాగా ‘లెహర్’ తుపాను రాష్ట్రంపైకి శరవేగంగా దూసుకొస్తోంది. హెలెన్ తుపాను ఛాయలు ఇంకా కనుమరుగు కాకుండానే మరో ముప్పు ముంచుకువస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో మూడ్రోజుల కిందట ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారింది. ‘లెహర్’ పేరుతో పిలుస్తున్న ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటాక ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా (కోస్తాంధ్ర వైపు) పయనిస్తూ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఈ నెల 28 ఉదయానికల్లా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. లెహర్ ప్రభావం రాష్ట్రంలోని కోస్తాంధ్రపై అధికంగా పడనుంది. ఇప్పటికే అక్టోబర్ రెండో వారంలో సంభవించిన పై-లీన్ దెబ్బకు తీరప్రాంతాలు అల్లాడాయి. ఆ గండం నుంచి ఊపిరి పీల్చుకున్న వారానికే భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చాయి. తర్వాత పక్షం రోజులైనా గడవక ముందే నవంబర్ 19 నుంచి 23 వరకూ హెలెన్ కోస్తాంధ్రను అతలాకుతలం చేసింది. మచిలీపట్నం వద్ద తీరం దాటిన ఈ తుపాను చేతికొచ్చిన పంటను నేలమట్టం చేసింది. పై-లీన్, భారీ వర్షాలు, హెలెన్ దెబ్బకు రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. 30 లక్షల ఎకరాల్లో వరిపంట నీట మునిగింది. 10 లక్షల ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. కొబ్బరి, మామిడి, అరటి తోటలు నేలకూలాయి. ఈ నేపథ్యంలో లెహర్ రూపంలో రైతులపై ప్రకృతి మరోసారి పడగ విప్పుతోంది. లెహర్తో పెను ముప్పే: లెహర్ తుపానుతో పెను ముప్పు ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘లెహర్’ తీరానికి చేరవయ్యే కొద్దీ తీవ్రత పెంచుకుంటుంది. పెను గాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడే ఈ తుపాను ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, హెలెన్ కంటే రెట్టింపు తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు. లెహర్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని ‘స్కైమెట్’ వాతావరణ సంస్థ పేర్కొంది. 40 రోజులు.. 3 తుపాన్లు.. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా నలభై రోజుల్లో 3 తుపాన్లు సంభవించాయి. ఈ మూడూ తీవ్రమైనవే. ఒక సీజనులో ఇంత స్వల్ప వ్యవధిలో మూడు తుపాన్లు రావడం చాలా అరుదు. వాస్తవానికి మే నుంచి మొదలయ్యే రుతుపవనాల సీజన్ నుంచి ఇప్పటిదాకా 4 తుపాన్లు ఏర్పడ్డాయి. ఇందులో మొదటిది ఈ ఏడాది మే 10-17 మధ్య ఏర్పడ్డ ‘మహాసేన్’ తుపాను. ఆ తర్వాత అక్టోబర్ (6-17 మధ్య)లో పై-లీన్ వచ్చింది. అనంతరం ఈనెల (19-23 మధ్య)లో హెలెన్ ముంచెత్తింది. తాజాగా ఇప్పడు లెహర్ తరుముకొస్తోంది. లెహర్’ పేరు మనదే! అండమాన్‌లో ఏర్పడ్డ తాజా తుపానుకు ‘లెహర్’ అని నామకరణం చేశారు. ఈ పేరును సూచించింది మన దేశమే. ‘లెహర్’ అంటే అందమైన పసిపాప అని అర్థం. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో వచ్చిన తొలి తుపాను మహాసేన్ పేరును శ్రీలంక, అక్టోబర్‌లో వచ్చిన పై-లీన్‌కు థాయిలాండ్, హెలెన్‌కు బంగ్లాదేశ్‌లు పేర్లు పెట్టాయి. -
అరేబియా సముద్రంలో వాయుగుండం
-
తుఫాన్‌తో వనుకుతున్న కోన సీమలు
-
తుపాను టెన్షన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఇది శనివారం తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని సముద్రతీర జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తమయ్యూరు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యూరు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమయ్యూరుు. నెలరోజులు కావస్తున్నా చెప్పుకోతగ్గ వర్షాలు కురవలేదు. ఇదిలావుండగా బంగాళాఖాతంలో రెండురోజుల క్రితం చెన్నైకి ఆగ్నేయంలో 550 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమేణా తుపానుగా రూపాంతరం చెందింది. శుక్రవారం నాటికి నాగపట్నం నుంచి ఈశాన్య దిశగా పయనించి 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా పయనించి శనివారం నాటికి నాగపట్నం వద్ద తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో 48 గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నారుు. 45 కిలో మీటర్ల నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు 25 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చెన్నై, ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరిల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనావేసింది. ఈ మేరకు ఆయూ జిల్లాల కలెక్టర్లు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పాఠశాలలు, కాలేజీలు, కల్యాణ మండపాలను వరద బాధితులకు సిద్ధం చేశారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సముద్రతీర గస్తీ దళాలు, పోలీసు స్టేషన్లు, విమాన సిబ్బందికి ఆదేశాలు అందాయి. నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి శుక్రవారం అధికారులతో సమావేశమయ్యూరు. తుపాను పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. బాధితుల సహాయూర్థం 1077 ఫోన్ నంబరును సమకూర్చారు. కారైక్కాల్ జిల్లా కలెక్టర్ ముత్తమ్మ తుపాను పరిస్థితిపై సమీక్షించారు. 1077, 222707 ఫోన్ నంబర్లతో సహాయక కేంద్రాలను ప్రారంభించారు. పుదుచ్చేరీలో 16 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నాగపట్నం ఒకటో నంబరు, కడలూరు, పుదుక్కొట్టై, కారైక్కాల్లలో రెండవ నంబరు తుపాను హెచ్చరికను ఎగురవేశారు. సముద్రతీర జిల్లాల్లోని జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని నిషేధాజ్ఞలు జారీచేశారు. -
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం 1200 మంది మృతి?
మనీలా: ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని శక్తిమంతమైన తుపాను అతలాకుతలం చేసింది. తుపాను బీభత్సానికి 1200 మందికి పైగా మరణించి ఉంటారని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రెడ్‌క్రాస్ సంస్థ అంచనా వేసింది. అయితే ప్రభుత్వం మాత్రం 138 మంది మరణించారని పేర్కొంది. కాగా, 315 కి.మీ వేగంతో ఈ తుపాను ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలోని దీవులపై శుక్రవారం విరుచుకుపడింది. సునామీ తరహాలో మూడు మీటర్ల ఎత్తున ఎగిసిపడిన అలల ధాటికి తీరంలో ఉన్న వేలాది ఇళ్లు నేలమట్టమైపోయాయి. తీరం నుంచి ఒక కిలోమీటర్ వరకూ కూడా తుపాన్ ప్రభావం బలంగా పడింది. అంతా సర్వనాశనం అయిపోయిందని తుపాను తీవ్రతకు తీవ్రంగా నష్టపోయిన లెట్ పట్టణంలో పర్యటించిన మంత్రి మార్ రోక్సస్ ఆవేదన వెలిబుచ్చారు. టకోబాన్ పట్టణంలో తుపాను బీభత్సానికి 100 మందికి పైగా మరణించారని, తీరాన్ని అనుకుని ఉన్న ఎయిర్పోర్ట్ టెర్మినల్ అలల దెబ్బకు కకావికలమైందని అధికారులు తెలిపారు. రోడ్లన్నీ పాడైపోయాయని, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. -
పంట పోయిందని..ప్రాణం తీసుకున్నాడు!
తాండూరు రూరల్/బంట్వారం, న్యూస్‌లైన్: అయ్యో.. ఎంత దా‘రుణం’..? దీపావళి శోభ సంతరించుకోవాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగింది. ఇటీవ లి తుపానుకు కోలుకోని విధంగా పంటనష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో కలత చెందిన ఆ అన్నదాత పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బంట్వారం మండలం ఎన్నారం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి(38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది తనకున్న రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాడు. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాల నిమిత్తం బుచ్చిరెడ్డి దాదాపు రూ. 4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఇటీవలి తుపానుకు పత్తిపంట పూర్తిగా దెబ్బతిన్నది. మొక్కజొన్న పాడైపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో రైతు తీవ్ర కలత చెందాడు. తరచూ కుటుంబీకులు, స్థానికులతో వాపోతూ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కూతుళ్లు స్థానికులకు చెప్పారు. వెంటనే 108 వాహనంలో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి కొద్దిసేపటికే బుచ్చిరెడ్డి ప్రాణం పోయింది. ‘అప్పులే నా మొగుడి ప్రాణాలు తీసుకున్నాయి.. తుపాను రాకుంటే పంట బాగా పండేది.. అప్పులు తీరేవి.., నా భర్త పురుగుమందు తాగకుంటుండే..’ అని మృతుడి భార్య రుక్మిణి రోదించిన తీరు హృదయ విదారకం. బుచ్చిరెడ్డికి కూతుళ్లు కీర్తన(8), దీప (7) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రైతు మృతితో కుటుంబం వీధిన పడిందని గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బుచ్చిరెడ్డి మృతితో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. -
‘వెజిటబుల్ హబ్’కు వర్షం దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: గణనీయమైన కూరగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాలో తూపాన్ భారీ నష్టాన్ని కలిగించింది. జిల్లాలో సుమారు 4 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు దెబ్బతినగా ఇందులో గజ్వేల్ నియోజకవర్గంలోనే వెయ్యి హెక్టార్లలో పంటలు ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం కారణంగా రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. పంటలు భారీగా దెబ్బతినడంతో ఈ ప్రాంతంపై ఆధారపడిన హైదరాబాద్‌తోపాటు రాష్ట్రీయ మార్కెట్లకు భారీగా ఎగుమతులు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరవాసుల అవసరాలకు జిల్లానే ప్రధాన వనరుగా మారింది. ఇక్కడ ఉత్పత్తులు తగ్గితే నగరంలో జనం అల్లాడే పరిస్థితి నెలకొనడంలో అతిశయోక్తి కాదు. గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, కొండాపూర్, పటాన్చెరు, చిన్నకోడూరు, నంగునూరు తదితర మండలాల్లో ప్రతి ఏటా 20 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతున్నాయి. కాగా ఇక్కడి నుంచి హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతోపాటు చెన్నై, తదితర ప్రధాన కేంద్రాలకు కూరగాయలను తీసుకెళ్తారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలను ఎంచుకొని ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీలాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధరను అందిస్తూ రైతుల్లో పోటీతత్వాన్ని పెంచాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను తమ తమ కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం వంటిమామిడిలో తెలంగాణలోనే అతిపెద్దదైన కూరగాయలు, పండ్ల మార్కెట్ యార్డును ప్రారంభించడం కూరగాయల సాగుకు పరిస్థితి మరింత అనుకూలంగా మారింది. భారీగా నష్టం ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం ధాటికి చేలల్లోనే టమాటా, బీర, ఆలుగడ్డ, బీన్స్, ఉల్లిగడ్డ, గోబీ తదితర కూరగాయలు తోటల్లోనే కుళ్లిపోయాయి. 4 వేల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా హెక్టారుకు 40 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతుండగా ఈ లెక్కన నష్టం రూ. 16 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. ఉద్యానవన శాఖ మాత్రం రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. పడిపోయిన ఎగుమతులు కూరగాయల పంటలు దెబ్బతినడం వల్ల ఇక్కడి నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డులో, ప్రైవేట్ కలెక్షన్ సెంటర్లలో సేకరణ గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. ఎగుమతులు పడిపోయిన కారణంగా ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
హ్యూమరం : తుపాను తరువాత
తుపాను వచ్చి పోయింతరువాత అధికారులొచ్చి వాలారు. మునిగి తేలకుండా ఉన్నవాళ్లు, తేలిన తరువాత కూడా మునిగిపోయినవాళ్ల లెక్కలు తీశారు. బతికి చచ్చినవాళ్లు, చస్తూ బతికేవాళ్ల పేర్లు రాసుకున్నారు. ఇళ్లూ వాకిలీ పోయి కిటికీలు మాత్రమే మిగిలినవాళ్లు, కిటికీలతో సహా కొట్టుకుపోయినవాళ్ల జాబితాలు తీశారు. తీరిగ్గా హైదరాబాద్ వెళ్లి నష్టం అంచనాకు కమిటీ వేశారు. స్టార్‌హోటళ్లలో సభ్యులు సమావేశమై అసలు తుపాన్లు ఎందుకొస్తాయనే విషయంపై ఇంకో కమిటీ వేశారు. సముద్రాలు ఉన్నంతకాలం తుపాన్లు వస్తూనే ఉంటాయని, సముద్రాలను లేకుండా చేయడం సాధ్యం కాదు కాబట్టి తీర ప్రాంతాల్లో ప్రజల్నే లేకుండా చేస్తే తుపాను వచ్చినా నష్టమేమీ ఉండదని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ నివేదికపై కొంతమంది నిపుణులు చర్చించి, ప్రజలకు నేరుగా ఏమి చెప్పినా అర్థం కాదని, తమకు మంచి చేయాలని చూసేవారిని శత్రువులుగా పరిగణించడం ప్రజల ప్రాథమిక ధర్మమని వివరించారు. ప్రజలను ఖాళీ చేయించడం సాధ్యం కాదు కాబట్టి పెద్ద తుపానంటూ వస్తే సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా జనాభా కూడా తగ్గిపోతుందని అన్నారు. తుపాను రాకపోతే తుపాను సృష్టించడం కోసం ఒక శాఖను సృష్టించి, దానికి వెయ్యి కోట్లు నిధులిచ్చారు. తుపాను వచ్చినా రాకపోయినా ఆ పేరుతో నిధుల్ని భోంచేయడం ప్రభుత్వాలు పుట్టినప్పటినుండీ ఉన్న ఆచారం కాబట్టి అన్ని తుపాను కమిటీల్లోనూ తమకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు వాదించి ధర్నాకు దిగాయి. అధికారంలో ఉంటే తినడం న్యాయమే కాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తినాలని చూస్తే, స్థూలకాయం వస్తుందని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రకటనలిచ్చింది. ఇదిలా ఉండగా, తినడానికి తిండి లేదని తుపాను బాధితులు అలో లక్ష్మణా అని అరిచారు. లక్ష్మణుడనే తీవ్రవాద నాయకుడు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నాడని అనుమానించిన ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. అదిగో పులి, ఇదిగో లక్ష్మణుడు అని టీవీలవాళ్లు బ్రేకింగ్‌లు ఇచ్చారు. ఇంతలో మళ్లీ తుపానొచ్చింది. జనం వణికి చచ్చారు. పోయినవాళ్లు పోగా మిగిలినవాళ్ల కోసం కమిటీలు దిగి కంప్యూటర్లు, కాలిక్యులేటర్లతో లెక్కలు మొదలెట్టాయి. - జి.ఆర్.మహర్షి మహర్షిజం ఫ్యాక్షన్ సామెత: బాంబునైనా భయభక్తులతో విసరాలి. అమెరికా స్పెషల్:పులిగోరు పతకాన్ని పులికే అమ్మగలదు. కోడి గజగజ వణికేదెప్పుడు? తందూరి చికెన్‌ను చూసినప్పుడు. పీక కోసేటప్పుడు స్వర్గాన్ని గురించి వర్ణించడమే రాజకీయం! ప్రజలు: టౌన్ బస్సెక్కి ఢిల్లీ చూడాలనుకునేవాళ్లు. నాయకులు: ఢిల్లీ చూపిస్తామని వాగ్దానం చేసి గల్లీ దాటకుండా చేసేవాళ్లు. కాంగ్రెస్ నాయకుల ప్రత్యేకత: రాష్ట్రంలో రిహార్సల్స్ చేసి ఢిల్లీలో డైలాగులు మరిచిపోతారు. -
రైతు గుండెలో తుఫాన్
అన్నదాతకు మరో ఆపద వచ్చిపడింది. తుఫాను ప్రభావంతో బుధవారం కురిసిన వర్షం వారి ఆశలను అడియాసలు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. కోతలు పూర్తయి ఆరబెట్టిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. కోత దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పొలాలు నేలకొరిగాయి. వర్షం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో తుపాన్ వర్షం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి చినుకులు ప్రారంభమయ్యాయి. వారం రోజుల నుంచి బోధన్ నియోజకవర్గంలోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలలో వరి కోతలు మొదలయ్యాయి. వరినూర్పిళ్లు ఊపందుకున్నాయి. పొలాలలో ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇవి వర్షానికి తడువకుండా ప్లాస్టిక్ సంచులు కప్పి ఉం చేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ధా న్యం తడిస్తే రంగు మారి ధరపై ప్రభావం చూ పుతుందని రైతులు వాపోతున్నారు. చిన్ననీటి వనరులు, ఎత్తిపోతల పథకాలు, కరెంట్ బోరుబావుల కింద వేలాది ఎకరాలలో వరి సాగైంది. బోధన్ మండలంలోనే సుమారు 20 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో వరి నేలకొరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ఖరీఫ్‌పై పెంచుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. గడిచిన రబీలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షానికి వరి, పొద్దు తిరుగుడు, పత్తి, మిర్చి పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు అపారంగా నష్టాలపాలయ్యారు. అప్పులు తెచ్చి ఖరీఫ్‌లో పంటలు సాగు చేశారు. ఇప్పు డు తుపాన్ వర్షంతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు. కామారెడ్డిలో కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. మక్కలను ఆరబెట్టిన సమయంలో ఒక్క సారిగా వర్షం కురవడంతో నష్టపోవాల్సి వస్తోంది. పట్టణంలోని గాంధీ గంజ్‌లో రైతులు తీసుకువచ్చిన మక్కలు కొట్టుకుపోయి రైతులు ఇబ్బందులపాలయ్యారు. నియోజకవర్గంలో నిమాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు,కామారెడ్డి మండలాల్లో మొక్కజొన్న రైతులు అవస్థలకు గురయ్యారు. చేతికొచ్చిన వరిపంటకు వర్షం మూలంగా దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్త చేశారు. ఈ సారి భారీ వర్షాలు కురిసి పంటలు ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆనంద ంలో ఉండగా, ఒక్కసారిగా తుపాన్ రావడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. బాన్సువాడలో బాన్సువాడ ప్రాంతంలో వేల ఎకరాలలో వరి పంట నేలకొరిగింది. భారీగా నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. బాన్సువాడ, బోర్లం, ఇబ్రాహీంపేట, బీర్కూర్, కొత్తాబాది తదితర గ్రామాలలో వరి పూర్తిగా నేలకొరిగింది. ఈ ప్రాంతంలోని ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల్లో వరి కోతలు ఊపందుకునే సమయంలోనే అకాల వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో విత్తనాలు మొలకెత్తే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డిలో నియోజకవర్గంలో మధ్యాహ్నం నుంచి మోస్తరుగా ప్రారంభమైన వర్షం రాత్రికి భారీగానే కు రిసింది. ఎల్లారెడ్డి మండలంలో కొద్దిగా జల్లులు కురవగా నాగిరెడ్డిపేట మండలంలో సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురిసింది. నిజాంసాగర్‌లో మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షంతో పంటలకు ఆపార నష్టం వాటిల్లింది. గ్రామాల్లో కోత కోసిన వరికుప్పలు, నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు పేర్కొన్నారు. సుమారు ఆరగంటకుపైగా సేపు కుండపోతగా వర్షం కురవడంతో కోతకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ధర్పల్లిలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పంటలు తడిసి ముద్దయ్యాయి. వేల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. వరి గింజలు రాలిపోయే పరిస్థితులు ఉన్నాయయి. డిచ్‌పల్లిలో డిచ్పల్లి మండలంలో పంటలు నేల కొరిగాయి. వడ్లను పొలాలలోనే కుప్పలుగా వేశారు. అవి పూర్తిగా తడిసిపోయాయి.పంట చేతికంద వచ్చే దశలో వర్షం కురవడంతో రైతులు అందోళనకు గురవుతున్నారు. సిరికొండలో మండలంలో వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పూర్తిగా నేలవాలింది. -
మా అంచనాలే కచ్చితం: ఐఎండీ
న్యూఢిల్లీ: పై-లీన్ కారణంగా గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అమెరికా నౌకాదళం, బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేసి హెచ్చరించటంతో.. ఇది విలయం సృష్టిస్తుందన్న భయాందోళనలు చెలరేగాయి. అయితే.. ఈ తుపాను గాలుల వేగం 200 నుంచి 220 కిలోమీటర్ల స్థాయిలో ఉంటుందన్న తమ అంచనాలే కచ్చితమైనవిగా నిరూపణ అయిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. మిగతా ఏజెన్సీల మాదిరిగా ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తమ విధానం కాదని ఐఎండీ డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ ఆదివారం తెలిపారు. పై-లీన్‌ను భారత వాతావరణ శాఖ తక్కువగా అంచనా వేస్తోందని, అది అత్యంత తీవ్రమైన కేటగిరీ - 5లోకి వస్తుందని అమెరికాకు చెం దిన వాతావరణ నిపుణుడు ఎరిక్ హోల్తాస్ వ్యాఖ్యానించాడని, అయి తే, తీవ్రమైన తుపాను కేటగిరికి మాత్రమే చెందుతుందని ప్రకటించామన్నారు. చివరకు తమ అంచనానే నిజమైందని రాథోడ్ తెలిపారు -
అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రధాని
న్యూఢిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. ప్రధాని స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, టెలికం, రోడ్లు సహా పై-లీన్ పంజా దెబ్బకు ఉత్తరాంధ్ర, ఒడిశాలోని తీర ప్రాంతాలలో దెబ్బతిన్న మౌలిక వ్యవస్థలను పునరుద్ధరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు కేంద్ర కేబినెట్ కార్యదర్శి కూడా తాజా పరిస్థితులపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. విపత్తులో ఒడిశాలో 13 మంది, ఆంధ్రాలో ఒకరు మృతి చెందారని తెలిపాయి. రైల్వే, సమాచార వ్యవస్థలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు చెప్పాయి. ఒడిశాలో 7,500 టెలిఫోన్ టవర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 205 టవర్లు దెబ్బతిన్నాయని.. వీటిని 48 గంటల్లోగా పనిచేయించేందుకు బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ అధికారులు రంగంలోకి దిగారు. కేవలం కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లోడ్ సాధారణంగా 10,000 మెగావాట్లు ఉండగా, 9000 మెగావాట్లకు తగ్గిందని, ఒడిశాలో 2,800 మెగావాట్లకు 600 మెగావాట్లుగా ఉన్నట్లు తెలిపింది. -
తుఫాన్ పీడిత ప్రాంతాల్లో బయటపడుతున్న నష్టాలు
-
రాంచీలో ఎడతెరపలేని వర్షాలు
-
ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు
-
ఆలు సాగుకు బ్రేక్
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఆలుగడ్డ సాగుకు వర్షాలు అడ్డంకిగా మారాయి. పక్షం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆలు సాగుకు వాతావరణం అనుకూలించడం లేదు. వచ్చిన విత్తనాలు దెబ్బతింటున్నాయం టూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీ ర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో రైతులు ఆలుగడ్డ పంటను విస్తారంగా సాగు చేస్తుంటారు. నాలుగు దశాబ్దాలుగా ఈ పంటను సంప్రదాయకంగా పండిస్తున్నారు. ఏటా సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఆలు సాగుకు నోచుకోలేక పోయింది. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడమే ఇందుకు కారణం. మరో పక్షం రోజుల వరకు కూడా పంట సాగుకు భూములు అనుకూలించే పరిస్థితి లేదు. ఇప్పటికీ పొలాల్లో అధిక తేమ కన్పిస్తుంది. రేగడి భూముల్లో అయితే మరో 20 రోజుల వరకు కూడా పంటను సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. తుపాన్ ప్రభావం కూడా... పై-లీన్ తుపాన్ ప్రభావం కూడా జహీరాబాద్ ప్రాంతంపై ఉంటే పంట సాగును మరింత ముందుకు పొడిగించుకోక తప్పదని రైతులు భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 15వరకు సగం పంటను సాగు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆలుగడ్డ సాగుకు వాతావరణం అనుకూలంగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సాగు చేసినా దిగుబడులు రాని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ వర్షాలు వీడకపోవడంతో పంటను సాగు చేసుకునే విషయంలో కొంత మంది రైతులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఈ ఏడాది కూరగాయల ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఆలు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా లేనట్లయితే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపే అవకాశం లేక పోలేదంటున్నారు. దెబ్బతింటున్న విత్తనం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని తెచ్చుకుంటున్నారు. కొందరు రైతులు మాత్రం దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం ఆలుగడ్డ విత్తనాన్ని కొనుగోలు చేసుకుని వచ్చిన రైతులకు సంబంధించిన విత్తనం దెబ్బతింటోంది. కోల్డ్ స్టోరేజీల నుంచి తెచ్చిన విత్తనాన్ని పక్షం రోజుల్లోపే సాగు చేసుకోవాలి. లేకపోతే విత్తనం నిల్వ ఉంచిన ప్రాంతంలోనే మొలకెత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. దెబ్బతిన్న విత్తనాన్ని సాగు చేసుకుంటే పంట దిగుబడులు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతటితో వర్షాలు ఆగిపోతే పంటను సాగు చేసుకున్నా కొంత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. లేనట్లయితే నష్టాల పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. మండుతున్న విత్తనం ధర ఆలుగడ్డ విత్తనం ధర మండుతోంది. క్వింటాల్ విత్తనం ధర రూ.2,000 నుంచి రూ.2,400 వరకు పలుకుతోంది. దళారులు విత్తనాన్ని ఆగ్రాలో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. నేరుగా కొనుగోలు చేసుకునే రైతులకు మాత్రం క్వింటాల్ విత్తనం ధర రూ.1,800 అవుతోంది. వాతావరణం పొడిబారితే దళారులు విత్తనం ధరను మరింత పెంచే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేక పోవడంతో రైతులు ఆలుగడ్డ విత్తనాన్ని దళారుల వద్ద కొనుగోలు చేసుకోక తప్పడం లేదు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు రైతులకు అధిక ధరలకు విత్తనాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు -
తుపానుపై జాగ్రత్తలు తీసుకోండి
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. స్థానిక గోల్డెన్జూబ్లీహాల్లో గురువారం తుపానుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను కేంద్రం నుంచి వచ్చే హెచ్చరికలను అనుసరించి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకాధికారులు, , కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉం డాలన్నారు. నిత్యావసర వస్తువులైన బియ్యం,పప్పు, కిరోసిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇసుక బస్తాలు, గోనె సంచులను సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర వైద్యసేవల్లో భాగంగా వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యంతో పాటు తగిన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ విశాఖపట్నానికి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందన్నారు. ఇది తుపానుగా మారి శుక్రవారం అర్ధరాత్రి కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్నగర్వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 11 మండలాల్లోని 25 గ్రామాల్లో 250 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేం దుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు.వివరాల కోసం 0861-2331477, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 2499 లో సంప్రదించాలన్నారు. సమావేశంలో ఏజేసీ పెంచలరెడ్డి, ఏఎస్పీ మూర్తి, డీఆర్వో రామిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ అళగ వర్షిణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'షేర్ ఖాన్' శ్రీహరి ఫోటో గ్యాలరీ
నటుడు శ్రీహరి ఇకలేరన్న వార్తను టాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. శ్రీహరి అంటే ఒక విలన్, కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్... కమేడియన్, కాదు కాదు ఓ రియల్ స్టార్! ఇవన్నీ కాదు ఆయనంటే ఎదో ఒక పాత్ర కాదు; అల్లరి చేసే పిల్లల చెవి మెలేసే మామయ్య, చెల్లెళ్ల వెంటపడే పోకిరుల తోలుతీసే అన్నయ్య. శకునంలా ఎదురొచ్చినట్టు, పొలమారితే గుర్తొచ్చినట్టు...ఎంతో దగ్గరగా.. చనువుగా... కొన్ని సార్లు సొంత మనిషిలా, అంతే దూరంగా... బెరకుగా... మరికొన్ని సార్లు పరాయివాడిలా .... అనిపించి, కనిపించిన శ్రీహరి కేవలం తెర మీద బొమ్మ కాదు, తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర. 1964 ఆగస్టు 15న హైదరాబాద్ లోని బాలానగర్ జన్మించిన శ్రీహరి సుమారు 97 సినిమాల్లో నటించారు. తమిళంలో మా పిళ్లై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించారు. ఫైటర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా చెరగని ముద్ర వేశారు. ఆయన భార్య సినీ డ్యాన్సర్ డిస్కో శాంతి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీహరి చివరి చిత్రం తుఫాన్. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. తన కూతురు అక్షయ ఫౌండేషన్ ద్వారా శ్రీహరి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తతకు తీసుకున్నారు. 49 ఏళ్ల వయసులో కాలేయ సంబంధ వ్యాధితో అకాల మరణం చెందడం చిత్ర పరిశ్రమ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ఆయన మృతికి సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
పంట నష్టపరిహారం అందక రైతుల అవస్థలు
సాక్షి, కొత్తగూడెం: ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి సంభవించినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్పుట్ సబ్సిడీ పథకానికి గ్రహణం పట్టింది. అధికారులు కంటితుడుపుగా పంట నష్టం అంచనా వేసి, ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకుంటున్నారు. ఏళ్ల తరబడి పరిహారం విడుదల కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విసిగి వేసారిన పలువురు సాగుపై ఆసక్తి చూపడం లేదు. నీలం, జల్ తుపాన్లు, ఇటీవల సంభవించిన గోదావరి వరదలే ఇందుకు నిదర్శనం. 2009, 2010 సంవత్సరాల్లో వచ్చిన లైలా, జల్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో ప్రభుత్వం కాకిలెక్కలు వేసి కొండంత నష్టం జరిగితే గోరంత పరిహారం అందించింది. అలాగే 2011లో జిల్లా వ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. దీనికి పరిహారంగా జిల్లాలో మొత్తం 2,96,789 మంది రైతులకు రూ.111.6 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్లైన్లో తప్పులు ఉన్నాయన్న నెపంతో రెండేళ్ల పాటు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని ఇప్పటికీ రూ. 17 కోట్లు పంపిణీ చేయకుండానే వదిలేశారు. 2012 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో పలు మండలాల్లో రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురియడంతో పత్తి చేతికందకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లగా.. పదినెలలైనా నేటికీ పైసా కూడా పరిహారం అందలేదు. నీలం తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలల్లో పర్యటించి ‘ఇంతనష్టం ఎక్కడా జరగలేదు. నీలం తుపాన్ రైతులను నిండా ముంచింది’ అని మొసలి కన్నీరు కార్చారే తప్ప నష్టం అంచనా వేయించడం, రైతులకు పరిహారం ఇప్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. కన్నెత్తి చూడని కేంద్ర బృందం.. నీలం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక దశలో ఇక్కడ నష్టమేమీ వాటిల్లలేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇంత జరిగినా కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కానీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నోరెత్తలేదు. దీంతో మొక్కుబడిగా పరిహారం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొండంత నష్టం జరిగితే గోరంత అంచనాలతో సరిపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా.. కేవలం 10,899.5 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని లెక్కల్లో చూపించారు. ఇందుకు జిల్లాలో మొత్తం 33,515 మంది రైతులకు పరిహారం చెల్లిస్తామని స్వయంగా అధికారులే ప్రకటించినా.. నేటికీ ఏ ఒక్కరికి కూడా పరిహారం అందించలేదు. భద్రాచలం డివిజన్లో ఇటీవల గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మూడుసార్లు వరదలు వచ్చి వేసిన పంటలన్నీ కొట్టుకుపోయాయి. అంతేకాకుండా రైతులు మళ్లీ సాగు చేయడానికి వీలు లేకుండా వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. అయితే 29 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని.. పరిహారం కోసం అధికారులు నివేదికలు పంపినా నేటికి దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పెంచిన ఇన్పుట్ సబ్సిడీ ఏదీ..? కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఇన్పుట్ సబ్సిడీని పెంచినట్లు గొప్పగా ప్రకటన చేసింది. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిర్చి, ఉల్లి, బొప్పాయి, కూరగాయ పంటలకు హెక్టారుకు రూ.10,000, మొక్కజొన్నకు రూ.8,333, జొన్న, సజ్జ, రాగి తదితర పంటలకు రూ.5000 చొప్పున నిర్ణయించారు. అయితే ఈ నష్ట పరిహారాల చెల్లింపులో ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. వంద శాతం పంటనష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పంట నష్టాలను గుర్తించే ప్రభుత్వ శాఖలు అరకొరగా జరిగినట్లు నివేదికలు అందజేస్తున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, విత్తనాలకు అనుకూలంగా నష్ట పరిహారం పెరగలేదు. అయితే జిల్లాలో ఏటా పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లుతున్నా.. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ ఇన్పుట్ సబ్సిడీ రైతులుకు పూర్తి స్థాయిలో అందలేదు. కిరణ్ వచ్చినా కరుణ లేదు.. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కణసాని రవికుమార్ అనే రైతుకు దమ్మపేట మండలం గణేష్‌పాడులో ఐదు ఎకరాల పొలం ఉంది. ఇందులో వరి సాగు చేశాడు. జల్ తుపాన్ కారణంగా సాగు చేసిన పంటంతా కొట్టుకుపోయింది. పంట సాగుకు రూ. 1.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. అలాగే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుపాన్‌తో అదే భూమిలో మొలక దశలో ఉన్న మొక్కజొన్న చేనులో ఇసుక మేటలు వేసింది. నీలం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటపొలాలను చూసేందుకు నవంబర్ 6న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లాకు వచ్చారు. ఆయన రైతులతో మాట్లాడేందుకు రవికుమార్ పొలంలోని ఇసుక మేటలపైనే వేదిక ఏర్పాటు చేశారు అధికారులు. సభ అనంతరం రవికుమార్ పొలాన్ని సీఎం చూశారు. అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటికే రూ. 60 వేలు పెట్టుబడి పెట్టి నాటిన మొక్కజొన్న మొలకొత్తగానే వరద ముంచెత్తింది. ఇలా రెండు సార్లు జల్, నీలం తుపాన్లతో నష్టపోయిన ఈ రైతుకు సీఎం స్వయంగా పరిశీలించినా పరిహారం మాత్రం నీటిమూటే అయింది. పంట సాగుకు అప్పు చేశామని, పరిహారం అందకపోతే వడ్డీలు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని రవికుమార్ ఆవేదన చెందుతున్నాడు. -
సమైక్యాంధ్ర పరిరక్షణకు వినూత్న నిరసనలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మరింతగా బలపడుతూ తుఫాన్‌లా కొనసాగుతోంది. 44వ రోజైన గురువారం ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అన్నివర్గాల ప్రజలు పోరాటంలో మమేకమై వినూత్నంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ప్రజలు ఉద్యమ పిడికిళ్లు మరింత బిగిసేలా ఎన్జీవోలు రెండోరోజు కూడా పల్లెబాట పట్టారు. అన్ని వర్గాలను మరింత చైతన్యం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగాపదవికి రాజీనామా చేయాలంటూ ఎన్జీవో, జేఏసీ నాయకులు పాలకొల్లు ఎమ్మెల్యే బంగా రు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. తణుకు, అత్తిలిలో సమైక్యవాదులు గురువారం ఇచ్చిన బంద్ పిలుపులో రెండుచోట్లా బంద్ విజయవంతమైంది. పెనుగొండ జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపులో భాగంగా మొదటిరోజైన గురువారం బంద్ సంపూర్ణంగా జరిగింది. భీమవరం జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన 72 గంటల బంద్ రెండో రోజూ విజయవంతమైంది. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో రిలే దీక్ష శిబిరం వద్ద న్యాయవాదులు, ఉద్యోగులు మ్యూజికల్ చైర్స్ ఆడారు. ఆకివీడులో ఉద్యోగ సంఘాల సభ్యులు, వ్యాపారులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఆకివీడులో 20 మంది యువకులు విజభనను నిరసిస్తూ రక్తదానం చేశారు. నరసాపురంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయినులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలి పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో రిలే దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు. టి.నరసాపురం ప్రధాన కూడలిలో యువత కోలాటమాడి, రోప్ స్కిప్పింగ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శన, రాస్తారోకో చేశారు. బోసుబొమ్మ సెంటర్లో మానవహారం ఏర్పాటుచేసి, గంగిరెద్దుతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఉంగుటూరులో ఉపాధ్యాయులు జలదీక్ష చేశారు. అనంతరం రోడ్డుపై కబడ్డీ ఆడారు. చేబ్రోలుకు చెందిన దళితులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో సెయింట్ ఆన్స్ విద్యార్థులు, పైబోయిన వెంకట్రామయ్య యూత్ సభ్యులు భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలతో పాటు, విభజన జరిగితే ఉపాధి అవకాశాలు ఎలా దెబ్బతింటాయనే విషయంపై విద్యార్థులు లఘునాటికల ద్వారా చూపిం చారు. రాష్ట్ర విభజన జరిగితే ఆకులు, అలములు తిని బతకాలని తెలియజేస్తూ ఉండిలో అడవి మనుషుల వేషధారణలో ఉపాధ్యాయులు వినూత్న ప్రదర్శన చేశారు. ఇరగవరం, దువ్వ, తూర్పువిప్పర్రులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆచంటలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్షలో పాల్గొన్నారు. మండలంలోని వల్లూరు, ఎ.వేమవరం పెనుమంట్ర మండలం మార్టేరు, పెనుమంట్రలో దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుగొండ దీక్షలో రజకు లు పాల్గొన్నారు. కొవ్వూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జూనియర్ కళాశాల వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షా శిబిరాన్ని ప్రజా గాయకుడు పూడి లక్ష్మణ్ సందర్శించి సమైక్యాంధ్ర పాటల సీడీని అందజేశారు. చాగల్లు మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టారు. గౌరిపల్లి నుంచి ఎస్.ముప్పవరం వరకు యాత్ర నిర్వహించి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లపూడి మండలంలో మలకపల్లి నుంచి తాళ్లపూడి వరకు ఉపాధ్యాయులు, ఏపీఎన్జీవోలు, పాఠశాల విద్యార్థులు పాదయాత్ర చేశారు. డ్వాక్రా మహిళలు రిలే దీక్ష చేపట్టారు. -
రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లో వర్ష బీభత్సం
దేవదుర్గ/రాయచూరు సిటీ/లింగస్గూరు/సేడం, న్యూస్‌లైన్ : వరుణుడు బీభత్సం సృష్టించాడు. తుపాను ప్రభావంతో రాయచూరు, గుల్బర్గా జిల్లాల్లోని రాయచూరు, లింగస్గూరు, దేవదుర్గ తాలూకాలతోపాటు గుల్బర్గా జిల్లా సేడం తాలూకాలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వంకలు వాగులు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలి భారీగా ఆస్తి నష్టం జరిగింది. పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయచూరు తాలూకా యంకరాళ వద్ద వాగు ఉప్పొంగి ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యంకరాళ్లు నుంచి అర్షలిగి వెళ్లె రహదారి కోసుకొని పోవడంతో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దాదాపు వందకు పైబడిన ఇళ్లు కూలి పోయాయి. వర్షబాధిత ప్రాంతాలను రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే తిప్పరాజు, తాలూకా పంచాయితీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, ముక్తియార్లు సందర్శించారు. బాధితులకు పరిహారంతో పాటు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా సేడంలోని నృపతుంగ కాలేజీ రోడ్డు సమీపంలో కాలువలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఊడగి గ్రామానికి చెందిన ఖయ్యూమ్ పాటిల్, మరెప్ప గల్లంతయ్యారు. ఎస్ఐ పరశురామ్ వనంజకర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరో వైపు పట్టణంలోని కోడ్లా క్రాస్, బసవనగర్ తాండా, చోటిగిరణి తాండా, రెహమత్నగర్, ఇందిరానగర్ కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి మురికి నీరు ప్రవేశించి ఆహార ధాన్యాలు, గృహోపకరణ వస్తువులు పాడై పేదల పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కరెంట్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. -
సమైక్య సెగతో ఆగిన ‘తుఫాన్’
సమైక్య సెగతో జిల్లాలో ‘తుఫాన్’ ఆగింది. కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రదర్శనను శుక్రవారం సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సమైక్యవాదుల ఆందోళనతో చిత్ర ప్రదర్శన నిలిపివేయక తప్పలేదు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా చిరంజీవి తన పదవికి రాజీనామా చేసే వరకూ సినిమా ప్రదర్శనకు ఒప్పుకోమని హెచ్చరించారు. అనంతపురం సిటీ/క్రైం : అనంతపురంలో రామ్‌చరణ్ ‘తుఫాన్’ సినిమాను ప్రదర్శిస్తున్న గంగా, గౌరి థియేటర్లపైకి సమైక్యవాదులు రాళ్లు రువ్వారు. చిత్ర ప్రదర్శన నిలిపి వేయాలని తొలుత కోరినా యజమానులు సహకరించకపోవడంతో వారు రాళ్లు రువ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమైక్యవాదులతో చర్చించారు. చివరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయడంతో సమైక్యవాదులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా సమైక్యవాదులు థియేటర్‌పైకి రాళ్లు రువ్విన సమయంలో రామకృష్ణ అనే పాత్రికేయుడు గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్పృహతప్పి కిందపడ్డ అతడిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాళ్లు రువ్విన ఘటనపై థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేయనందున ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని వన్‌టౌన్ ఎస్ఐ జాకీర్ హుసేన్ తెలిపారు. రెండో ఆట నుంచి ప్రదర్శన నిలిపివేత కదిరి : తుఫాన్ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం కదిరిలోని రాధిక థియేటర్ వద్ద ఎస్ఐ తబ్రేజ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు రక్షణ వలయంలో ఉదయం 11.30 గంటలకు మొదటి ఆటను ప్రదర్శించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉద్యోగ జేఏసీ నాయకులు సమైక్యవాదులను వెంటబెట్టుకుని థియేటర్ వద్దకు చేరుకున్నారు. సినిమాను ప్రదర్శించరాదని ఆందోళనకు దిగడంతో జేఏసీ కన్వీనర్ జేవీ రమణ, గౌరవాధ్యక్షుడు ఆత్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జీపు ఎక్కించారు. దీంతో ‘పోలీస్ జులుం నశించాలి... జై సమైక్యాంధ్ర’ అన్న నినాదాలతో సమైక్యవాదులు జీపును అడ్డుకోవడంతో చేసేది లేక పోలీసులు వారిని అక్కడే వదిలేశారు. అనంతరం సమైక్యవాదులు థియేటర్ ముందు ధర్నాకు దిగారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసేవరకు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత థియేటర్ నిర్వాహకులు అక్కడికొచ్చి ‘తుఫాన్’ సినిమా ప్రదర్శనను ఆపేస్తున్నామని చెప్పడంతో సమైక్యవాదులు శాంతించారు. ‘సమైక్య సెగకు తుఫాన్ ఆగిపోయింది’ అంటూ వారు అక్కడినుంచి వెనుదిరిగారు. థియేటర్‌కు తాళం.. పోస్టర్ల దహనం ఉరవకొండ : ఉరవకొండలో తుఫాన్ సినివూ ప్రదర్శనను ఉద్యోగ, ఉపాద్యాయు జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర అంటు నినాదాలు చేస్తూ వెంకటేశ్వర థియేటర్లోకి దూసుకెళ్లారు. జేఏసీ చైర్మన్ శ్రీరావుులు, హనువుప్ప, తిప్పయ్యు ఆధ్వర్యంలో థియేటర్ యుజవూనితో చర్చించి, ప్రదర్శనను నిలిపివేశారు. ప్రేక్షకులను వెనక్కు పంపించారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు థియేటర్ గేటుకు తాళం వేశారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను వైఎస్సార్సీపీ నాయకులు దహనం చేశారు. పార్టీ పట్టణ కన్వీనర్ బసవరాజు, ఉపసర్పంచ్ జిలకర మోహన్ మాట్లాడుతూ చిరంజీవి మొదట సమైక్యాంధ్రకు మద్దతు తెలిపి, పదవికి రాజీనామా చేస్తేనే ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ ప్రదర్శనకు అనుమతిస్తామన్నారు. కార్యక్రవుంలో మేజర్ పంచాయుతీ వార్డు సభ్యలు పెద్దన్న, ఈడిగప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అభిమానులు-సమైక్యవాదుల వాగ్వాదం తాడిపత్రి రూరల్ : తాడిపత్రిలోని సాయితేజ థియేటర్ వద్ద తుఫాన్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని సమైక్యవాదులు, ప్రదర్శించాలని మెగా అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఆందోళ చేస్తున్నా సినిమాను ప్రదర్శించడంతో సమైక్యవాదులు గేటు ఎక్కి థియేటర్లోకి దూసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ లక్ష్మినారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.అయితే ప్రదర్శనను నిలిపేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు థియేటర్ యజమానులతో మాట్లాడి ప్రదర్శనను నిలిపివేయించారు. అయితే మెగా అభిమానులు సినిమాను పూర్తిగా ప్రదర్శించాలని, అంతవరకు బయటకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అభిమానులు- సమైక్యవాదుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీఐ కలగజేసుకున్నారు. సినిమాను మరో 10 నిమిషాలు ప్రదర్శింపజేసి.. అనంతరం నిలిపివేయిస్తామని సర్దిచెప్పడంతో సమైక్యవాదులు శాంతించారు. అనంతరం పోలీసులు ‘తుఫాన్’ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు బోర్డు తగిలించారు. -
తొలిరోజు నిలిచిన ‘తుఫాన్’
న్యూస్‌లైన్ నెట్వర్క్: సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహం కారణంగా కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నటించిన ‘తుఫాన్’ చలన చిత్ర ప్రదర్శనకు అవరోధం ఏర్పడింది. సినిమా విడుదలైన శుక్రవారం గ్రామీణ జిల్లాలోని వివిధ కేంద్రాల్లో ప్రదర్శనకు ఎదురుదెబ్బ తగిలింది. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, యలమంచిలి, అరకు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచే సమైక్య వాదులు థియేటర్ల వద్ద మోహరించారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ సినిమా ప్రదర్శనను అడ్డుకునే ధ్యేయంతో ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని, పదవికి రాజీనామా చేయడం లేదని, అందుకే తాము ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమకు సహరించారని రామ్ చరణ్ అభిమానులను, థియేటర్ల యాజమాన్యాలను కోరారు. దాంతో అభిమానులు థియేటర్ల వెలుపలికి వచ్చేశారు. యజమానులు కూడా సినిమా ప్రదర్శనను నిలిపేశారు. ఒకటి రెండు చోట్ల సిని మాను ఆలస్యంగా ప్రారంభించారు. మొత్తం మీద చాలా చోట్ల శుక్రవారం ప్రదర్శన సాధ్యం కాలేదు. ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదు. అభిమానులపై లాఠీ ఝళిపింపు నర్సీపట్నం రూరల్: తుఫాన్ చిత్రం విడుదల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. చిత్రప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శుక్రవారం పట్టణ సీఐ ప్రసాదరావు సీఆర్పీఎఫ్ బలగాలను శ్రీకన్య సినీ కాంప్లెక్స్ వద్ద మోహరింపజేశారు. ఉదయం 8గంటలకే రామ్‌చరణ్‌తేజ్ అభిమానులు అధిక సంఖ్యలో సినిమా చూసేందుకు తరలివచ్చారు. మూకుమ్మడిగా వారు సినిమా కాంప్లెక్స్ ప్రాంగణంలోకి కు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ చిత్ర ప్రదర్శనను నిలిపివేయడంతో రామ్‌చరణ్ అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. పోలీసులు మధ్యాహ్నం 12గంటల వరకు సినిమాకాంప్లెక్స్ ఆవరణలోనే పహారా కాశారు. ఒకరోజు వాయిదా అనకాపల్లి అర్బన్: తుఫాన్ చిత్రం విడుదల శుక్రవారం నిలిచిపోయింది. ఇక్కడి వెంకటేశ్వ ర, పర్తిసాయి, షిరిడిసాయి థియేటర్లలో ఈ చి త్రాన్ని ప్రదర్శించాల్సి ఉంది. సమైక్యాంధ్ర జే ఏసీ సూచన ప్రకారం చిత్ర ప్రదర్శనను ఒక రో జు వాయిదా వేసుకుంటున్నట్టు నిర్వాహకులు, రామ్ చరణ్ అభిమానులు తెలిపారు. శనివా రం నుంచి యథావిధిగా ప్రదర్శిస్తామన్నా రు. నినాదాలు, బైఠాయింపు పాయకరావుపేట: తుఫాన్ ప్రదర్శనను ఉద్యోగులు, ఉపాధ్యాయుల జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. ఉదయం మోర్నింగ్ షో సమయానికి వీరు ర్యాలీగా చిత్ర మందిర్, సూర్య థియేటర్ల వద్దకు వచ్చి బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకని చిరంజీవి కుమారుడి సినిమా ప్రదర్శనను నిలిపేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులు థియేటర్ల నుంచి వెలుపలికి రావాలని కోరడంతో వారు తలవొగ్గారు. అయితే ఆందోళన తర్వాత మళ్లీ ప్రదర్శన ప్రారంభించారు. రెండు థియేటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల ఆందోళన మాడుగుల: తుఫాన్ సినిమా ప్రదర్శనను మాడుగులలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. స్థానిక కనకరత్న థియేటర్ వద్ద ఆర్టీసీ కార్మికులు, జేఏసీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. సోనియాకు, కెసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను నిలువరించారు. అరకులో నిరసన అరకులో తుఫాన్ ప్రదర్శనను ఎన్జీవో, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు అడ్డుకున్నారు. జ్యోతి మహాల్లో శుక్రవారం ఉదయం ఆటను నిలిపివేశారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, సమైక్యాంధ్ర పోరాటంలో పాల్గొనాలని నినాదాలు చేశారు. వాల్‌పోస్టర్ల దహనం యలమంచిలి/యలమంచిలి రూరల్: తుఫాన్ సినిమా ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పట్టణంలోని తులసీ, సీత చిత్రమందిర్లలో విడుదలైన సినిమాను ఆపడానికి ఆందోళనకారులు ఉదయం 10 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. ఉదయం ఆట ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. వాల్‌పోస్టర్లను చింపేసి తగులబెట్టారు. సమైక్యవాదుల నిరసనలతో సినిమా థియేటర్ యాజమాన్యం ఉదయం ఆట ప్రదర్శనను నిలిపివేసింది. -
‘తుఫాన్’సినిమాకు విభజన సెగ
చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న ఉద్యమకారులు సాక్షి నెట్వర్క్: కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ నటించిన ‘తుఫాన్’ చిత్ర ప్రదర్శనకు విభజన సెగ అంటుకుంది. చిరంజీవి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణలోనూ, సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయలేదంటూ సీమాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో ఆ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. సినిమా పోస్టర్లను దగ్ధం చేశారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లపై దాడిచేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌లోని సినీమాక్స్, శైలజ థియేటర్లలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మార్నింగ్ షో ప్రారంభం కాగానే తెలంగాణవాదులు థియేటర్లోకి దూసుకుపోయారు. వారు తెరకు అడ్డుగా నిలవడంతో ప్రేక్షకులంతా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని శకుంతల థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కొందరు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. రాష్ర్టంలోని పలు జిల్లాలలో సినిమా ప్రదర్శనను నిరసనకారులు అడ్డుకున్నారు. -
తీరం దాటిన తుఫాన్
హైలైట్స్: డైలాగ్స్ డ్రాబ్యాక్స్:కథనం, పాటలు క్యారక్టరైజేషన్స్ 1973 సంవత్సరంలో విడుదలైన ‘జంజీర్’ హిందీ చలన చిత్రసీమలో ఓ ట్రెండ్ సెట్టర్. అమితాబ్‌ను ఎదురులేని సూపర్‌స్టార్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తెరపై ఆవిష్కరింప చేసిన సినిమా అది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమితాబ్‌కు బాలీవుడ్లో ఎదురేలేదన్నది వాస్తవం. ‘జంజీర్’ చిత్రం ఒక్క అమితాబ్కే కాకుండా ఆ చిత్ర రచయితలు సలీం-జావేద్, దర్శకుడు ప్రకాశ్ మెహ్రాలకూ ఎనలేని గుర్తింపు తెచ్చింది. జయబాధురి, ప్రాణ్, అజిత్, బిందు వంటి నటీనటులకు మేలి మలుపుగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన, ఇప్పుడు వస్తున్న ఎన్నో పోలీస్ పాత్రలకు ‘జంజీర్’లో అమితాబ్ పోషించిన విజయ్ పాత్రే స్ఫూర్తి, ప్రేరణ. అలాంటి క్లాసిక్ రీమేక్‌తో మన రామ్‌చరణ్ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు అపూర్వ లాఖియా చేసిన ఈ ప్రయత్నం తెలుగులో ‘తుఫాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలకు ముందే మెరుపులు, ఉరుములతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన తుఫాన్.. రిలీజ్ తర్వాత ఆ వేగాన్ని కొనసాగించిందో లేదో తెలుసుకోవాలంటే... ముందు కథలోకెళ్దాం. ఆటంకాలను అధిగమిస్తూ... అన్యాయాన్ని అణచివేస్తూ... నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి విజయ్ ఖన్నా. ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే పలు ప్రాంతాలకు బదిలీ అయి.. చివరకు ముంబైకి చేరిన విజయ్... అక్కడి ఆయిల్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాడు. ఈ క్రమంలో విజయ్ ఖన్నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నింటిని అధిగమించి ఆయిల్ మాఫియాను ఎలా అణిచేశాడు అనేది ‘తుఫాన్’ చిత్ర కథ. ‘జంజీర్’ రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూడటం సహజం. నటన పరంగా కూడా రామ్‌చరణ్‌ని అమితాబ్‌తో కంపేర్ చేసి చూస్తారు. అసలు ‘జంజీర్’ పేరు చెప్పకుండా ఇదే పాత్రను చరణ్ పోషిస్తే... ఇంత అంచనాలు ఉండేవి కావు. సో... ఆ అంచనాలే అటు సినిమాకు ఇటు చరణ్‌కు ప్రతికూలంగా నిలిచాయి. నిజానికి పాత ‘జంజీర్’లో అమితాబ్ యాక్షన్, ఎమోషన్స్ నభూతో నభవిష్యతి. రామ్‌చరణ్ నుంచి ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ని ఆశించడం సబబే కాదు. ఎందుకంటే, హీరోగా అతని వయసు కేవలం ఐదు సినిమాలు మాత్రమే. అతని స్థాయికి అతను ‘ఓకే’ అనిపించాడనే చెప్పాలి. చరణ్ తెలుగు ఇమేజ్ను దృష్టిలో పెట్టుకోకుండా బాలీవుడ్ ఫ్లేవర్‌లో సినిమా ఉండటం ఓ మైనస్ అయ్యింది. మాలా, విజయ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ కుదరలేదనడంలో సందేహం అక్కర్లేదు. మాలా పాత్రకు ప్రియాంక చోప్రా రాంగ్ ఛాయిస్. వీటన్నింటికి తోడూ పాత్రల మధ్య పొంతన లేకపోవడం.. క్లారిటీ లోపించడం చిత్రం జనరంజకంగా లేకపోవడానికి ప్రధాన కారణమైంది. షేర్ ఖాన్ (శ్రీహరి), తేజ (ప్రకాశ్ రాజ్), జయదేవ్ (తనికెళ్ల భరణి), మోనా(మహీ గిల్) వంటి ఇతర పాత్రలు కూడా జీవం లేకుండా తెరపై కదలాడాయి. అపూర్వ లాఖియా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పేలవంగా ఉన్నాయి. అభిమానులను ఆకట్టుకునేందుకు ఆయన ఎక్కడా ఓ చిన్న ప్రయత్నం కూడా చేసినట్టు కనిపించదు. దర్శకుడిగా అన్ని విభాగాల్లోనూ ఆయన వైఫల్యం కొట్టొచ్చిన ట్టు అనిపించింది. సాంకేతికంగా కూడా పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ చిత్రంలో ఏమైనా చెప్పుకోవాలంటే డైలాగ్స్ గురించి చెప్పుకోవచ్చు. అయితే అన్ని విభాగాల వైఫల్యం కారణంగా సంభాషణలు కూడా మరుగునపడిపోయాయి. 1973లో విడుదలైన ‘జంజీర్’ జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలో పదికాలాలు పదిలంగా ఉండటం ఖాయం. అలాగే... అమితాబ్ నటించిన చిత్రాలను రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న జాబితాలో షోలే, డాన్ (ఫర్వాలేదు) జాబితాలో ‘జంజీర్’ కూడా చేరడం ఖాయం. విడుదలకు ముందు సంచలనాలకు వేదికగా మారుతుందనుకున్న ‘తుఫాన్’ ఎలాంటి ప్రభావం చూపకుండానే తీరం దాటే పరిస్థితి నెలకొని ఉందని సినీ విమర్శకుల అభిప్రాయం. - రాజాబాబు అనుముల -
సీమాంధ్రలో 'తుఫాను'కు అడ్డంకి
హైదరాబాద్ : కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తాజా చిత్రం 'తుఫాన్'కు సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర జిల్లాల్లో చిత్ర ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, ఏలూరు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉదయాన్నే థియేటర్ల వద్దకు చేరుకున్న సమైక్యవాదులు చిత్ర ప్రదర్శనను అడ్డుకుని, పోస్టర్లు చించివేశారు. చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్ల యజమానులు కూడా చిత్రాన్ని ప్రదర్శించేందుకు జంకుతున్నారు. మరోవైపు తుఫాన్ కు సీమాంధ్ర, తెలంగాణల్లో విభిన్న కోణాల్లో ఉద్యమ సెగ తగులుతోంది. తుఫాన్ చిత్రాన్ని సీమాంధ్రలో సమైక్యవాదులు అడ్డుకుంటుంటే , చిరంజీవి సమైక్యవాదంటూ సినిమాను ఆడనివ్వబోమంటు తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు. ఇరుప్రాంతాల నిరసన మధ్య తుఫాన్ ఇవాళ రిలీజ్ అవుతోంది. ఉత్తరాంధ్రలో తుఫాన్ ఆడాలంటే చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జేఏసి డిమాండ్ చేసింది. విజయనగరం పట్టణంలోని మయూరి సెంటర్లో చిరంజీవి తీరును నిరసిస్తూ సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. సినిమా పోస్టర్లు ఫ్లెక్సీలను చించి దహనం చేశారు. రామ్ చరణ్ చిత్రంతోపాటు చిరంజీవి కుటుంబంలోని ప్రతి ఒక్కరి చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ తుఫాన్ సినిమాకు ఉద్యమ సెగ తగిలింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో చిరంజీవి తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహించారు. థియేటర్ వద్ద తుఫాన్ చిత్రం పోస్టర్లను దగ్ధం చేశారు. చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని అందువల్లే రామ్ చరణ్ చిత్రాన్ని అడ్డుకుంటామని అడ్వకేట్ జేఏసి హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో ఇరు ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో పోలీసులు భారీ బందోస్తులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసుల రక్షణలో తుఫాను చిత్రం ప్రదర్శితం కాబోతోంది. -
తుఫాన్ చిత్రానికి ఉద్యమాల సెగ