Toofaan Boycott Trends On Twitter: Check Details Here - Sakshi
Sakshi News home page

Boycott Toofaan: ఈ సినిమాను చూడొద్దంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు, ఎందుకంటే..

Published Sat, Jul 10 2021 11:20 AM | Last Updated on Sat, Jul 10 2021 3:52 PM

Boycott Toofaan Trends In Twitter Over Interfaith Romance Between Farhan And Mrunal - Sakshi

Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్‌ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ ఫర్హాన్‌ అక్తర్‌, మ్రునాల్‌ థాకూర్‌ జోడిగా నటించిన ‘తూఫాన్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. 

తూఫాన్‌ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్‌ క్యారెక్టర్‌. ప్రియురాలు మ్రునాల్‌ ప్రోత్సాహంతో బాక్సింగ్‌ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్‌ క్యారెక్టర్‌ పేరు అజిజ్‌ అలీ. మ్రునాల్‌ పాత్ర పేరు డాక్టర్‌ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్‌ తూఫాన్‌కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్‌ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్‌ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం.

ఇదిలా ఉంటే ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్‌’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్‌. రాకేశ్‌ ఓంప్రకాశ్‌ మెహ్రా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్‌ రావెల్‌, ఫర్హాన్‌కు కోచ్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం.. జులై 16న అమెజాన్‌ ప్రైమ్‌లో ‘తూఫాన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement