Farhan Akhtar
-
Ola Electric IPO: పేటీఎం బాస్ షేర్లు విక్రయించడం లేదా?
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు వస్తుండటంలో మార్కెట్లో అందరి దృష్టి దీనిమీదే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రీటైల్ సబ్స్క్రిప్షన్లు ఆగస్టు 2 నుంచి 6వ తేదీ వరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో షేర్ ధరను రూ.72 - 76గా కంపెనీ నిర్ణయించింది.కాగా ఓలా ఎలక్ట్రిక్‌లో గణనీయమైన సంఖ్యలో షేర్లున్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, బాలివుడ్ డైరెక్టర్ జోయా అక్తర్, ఆమె సోదరుడు బాలివుడ్ నటుడు సోదరుడు ఫర్హాన్ అక్తర్ రానున్న ఐపీఓలో తమ షేర్లను విక్రయించకుండా అంటిపెట్టుకోనున్నారు. మనీకంట్రోల్ కథనం ప్రకారం.. వీరు ఆఫర్ ప్రైస్ బ్యాండ్ రూ. 72-76 షేరు ఎగువ ముగింపులో 26 శాతం లాభాల వద్ద ఉన్నారు.విజయ్ శేఖర్ శర్మ, అక్తర్ ద్వయం పెట్టుబడి తేదీ 2021 డిసెంబర్ 21గా నమోదైంది. అప్పటి నుంచి బెంచ్‌మార్క్ నిఫ్టీ 48.32 శాతం పెరిగింది. శర్మ తన పెట్టుబడి సంస్థ వీఎస్ఎస్ ఇన్వెస్ట్‌కో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏడు సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్లను రూ.7.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడవి ప్రైస్ బ్యాండ్ దిగువన రూ. 8.96 కోట్లు, ప్రైస్ బ్యాండ్ ఎగువన రూ. 9.46 కోట్లుగా ఉన్నాయి.జోయా అక్తర్ సింగిల్ సిరీస్ సి ప్రిఫరెన్స్ షేర్‌ను రూ. 1.07 కోట్లకు కొనుగోలు చేయగా, ఫర్హాన్ 2 షేర్లను రూ. 2.14 కోట్లకు కొనుగోలు చేశారు. ఫర్హాన్‌తో కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు రితేష్ సిధ్వానీ కూడా ఓలా ఎలక్ట్రిక్ సిరీస్ సి రౌండ్లో రెండు షేర్లను కొనుగోలు చేశారు. ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి తర్వాత, శర్మ ఓలా ఎలక్ట్రిక్‌లో 12.45 లక్షలు, జోయా అక్తర్ 1.78 లక్షలు, ఫర్హాన్ అక్తర్ 3.56 లక్షలు, రితేష్ సిధ్వానీ 3.56 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. -
సినిమా అంటే నేనొక్కడినే కాదు: ఫర్హాన్ అక్తర్
హిందీలో ‘దిల్ చాహ్తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్‌లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్.కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్. ‘‘నేను దర్శకుడిగా సెట్స్‌లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్‌కి టైమ్ కుదరలేదు. ‘డాన్ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్ అన్నీ కరెక్ట్‌గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్ రెండు సినిమాలు ‘డాన్ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్ అక్తర్. -
డాన్‌తో లవ్‌లో పడ్డ కియరా అద్వానీ!
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. Welcome to the Don universe @advani_kiara #Don3@RanveerOfficial @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies @chouhanmanoj82 #Olly pic.twitter.com/T5xGupgHiF — Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2024 -
డాన్ ప్రేయసి
డాన్‌తో లవ్‌లో పడ్డారు హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో రూపొందనున్న తాజా సినిమా ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ సినిమాను దర్శక–నిర్మాత – నటుడు–రైటర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘కొత్త శకం మొదలైంది. ‘డాన్’ యూనివర్స్‌లోకి కియారాకు స్వాగతం’’ అని ‘డాన్ 3’ మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో కియారాకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయట. ‘‘ఐకానిక్ ‘డాన్ 3’ ఫ్రాంచైజీలో భాగం కావడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు కియారా అద్వానీ. -
ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?
యాక్షన్ మాత్రమే కాదు.. కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్.. డైరెక్షన్ బ్యాక్ సీట్లో ఉంటుంది. అందుకే డైరెక్షన్‌కి గ్యాప్ ఇచ్చి, యాక్షన్‌కి మాత్రం నో గ్యాప్ అంటారు. అలా కొందరు హీరోలు డైరెక్షన్ సీట్‌కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అంటున్నారు. కొందరు స్టార్స్ ఇటు కెమెరా వెనకాల డైరెక్షన్ చేస్తూ అటు కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఆరేళ్లకు... కెరీర్లో 50వ సినిమా అంటే ఏ ఆర్టిస్టుకైనా ప్రత్యేకమే. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన 50వ సినిమాని చాలా స్పెషల్ అనుకున్నారు. అందుకే తన హాఫ్ సెంచరీ సినిమాలో తానే నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హీరోగా దాదాపు 30 సినిమాల్లో నటించిన తర్వాత ‘పా. పాండి’ (2017) చిత్రం కోసం తొలిసారి దనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. దీంతో 2019లో దర్శకుడుగా ధనుష్ మరో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది జూలైలో తన దర్శకత్వంలోని రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఇలా దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇక నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, ఎస్జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శర కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. ఏడేళ్ల తర్వాత... యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకూ అంతే క్రేజ్ ఉంది. ‘ష్..! (1993)’, ‘ఓం (1995)’, ‘ఉపేంద్ర (1999)’ వంటి సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు ఉపేంద్ర. కన్నడంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదపై, ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే 2015లో వచ్చిన ‘ఉప్పి 2’ తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర గ్యాప్ తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత 2022లో ‘యూఐ’ సినిమా వర్క్స్‌ను మొదలు పెట్టారు ఉపేంద్ర. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉపేంద్ర అండ్ టీమ్ పేర్కొంది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పదేళ్లకు... కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన సుదీప్ దర్శకుడిగా ఆరు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ ఆరూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం. తమిళ ‘ఆటోగ్రాఫ్’ని కన్నడంలో ‘మై ఆటోగ్రాఫ్’ (2006)గా రీమేక్ చేసి, నటించారు సుదీప్. అలాగే దర్శకుడిగా తెలుగు హిట్ ఫిల్మ్ ‘మిర్చి (2013)’ కన్నడ రీమేక్ ‘మాణిక్య (2014)’లో టైటిల్ రోల్ చేసి, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సుదీప్. ఈ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత అంటే... 2024లో సుదీప్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కేకే’ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘దేవుడు క్షమిస్తాడు.. నేను కాదు...!’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా ఇప్పటివరకూ రీమేక్ చిత్రాలే చేసిన సుదీప్.. ఈ ఏడవ సినిమాని స్ట్రయిట్ కథతో తీయనున్నారా లేక రీమేకా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పుష్కర కాలం తర్వాత... ‘దిల్ చాహ్ తా హై’ (2001) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు ఫర్హాన్ అక్తర్. ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన పేరు సంపాదించారు. అయితే 2011లో వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రం తర్వాత నటుడిగా కాస్త బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. పదేళ్ల తర్వాత 2021 ఆగస్టులో ‘జి లే జరా’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో తన డైరెక్షన్లోనే ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు ఫర్హాన్. అయితే ఈ సినిమాలో ఆయన నటించడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇలా ఫర్హాన్ దర్శకత్వంలోని మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పుష్కరకాలం అంటే పన్నెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ‘డాన్ 3’ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇలా కొంత విరామం తర్వాత దర్శకులుగా మెగాఫోన్ పట్టిన స్టార్స్ ఇంకొందరు ఉన్నారు. -
ఆమె గర్భవతిలా కనిపిస్తోంది.. బాలీవుడ్ జంటపై నెటిజన్ల కామెంట్లు
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్, శిబాని దండేకర్‌ను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్ట్‌లను చూస్తే అర్థమవుతుంది. తాజాగా వీరిద్దరూ దిగిన ఫొటోను షిబాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షిబాని మెరుస్తున్న ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఫర్హాన్‌ను కౌగిలించుకుని ఉంది. ఫర్హాన్ వైట్ అండ్ వైట్ జాకెట్లో సింపుల్ కూల్‌గా ఉన్నాడు. అయితే ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఫొటోలో షిబానికి కొంచెం బేబీ బంప్ ఉన్నట్లు గమనించారు నెటిజన్లు. దీంతో ఆమె తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని భావిస్తున్నారు ఇంటర్నెట్ యూజర్లు. 'కంగ్రాచ్యులేషన్స్ టు ది లిటిల్ వన్' అని ఒక ఇన్‌స్టా యూజర్ రాయగా, మరొకరు 'మీరు గర్భవతి ఆ?' అని కామెంట్ పెట్టారు. ఇంకొకరు 'ఆమె గర్భవతిలా కనిపిస్తోంది' అని రాశారు. ఇదిలా ఉంటే ఇదే పోస్ట్‌లో షిబానీ మోచేతిపై టాటూను కూడా గమనించారు నెటిజన్లు. ఆ టాటూలో వారి వివాహం జరిగిన తేది ఫిబ్రవరి 21, 2022 అని అర్థం వచ్చేలా రోమన్ అంకెల్లో ఉంది. View this post on Instagram A post shared by Shibani Dandekar-Akhtar (@shibanidandekar) -
నటుడి ప్రేమ పెళ్లి, హృతిక్ రోషన్ డ్యాన్స్ హైలైట్ (ఫొటోలు)
-
బాలీవుడ్ నటుడి రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్, సింగర్, గాయని శిబానీ దండేకర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం నిశ్చయిందుకుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వచ్చే నెల 21న వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిబానీ దండేకర్ చేతిపై టాటూ వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో ప్రత్యేకమంటూ దానికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కాగా మూడేళ్లుగా రిలేషన్లో ఉన్న శిబానీ ప్రియుడు ఫర్హాన్ పేరును తన మెడపై పచ్చబొట్టు వేయించుకున్న విషయం తెలిసిందే! ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవత్సరంలో అధునా బబానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పదహారేళ్లు కలిసి మెలిసి ఉన్న ఈ దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. -
ప్రేయసితో బాలీవుడ్ నటుడి రెండో పెళ్లి?
బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మార్చిలో షాదీ జరుపుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో కేవలం కుటుంబసభ్యులు, తక్కువమంది సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరుపుకోనున్నట్లు సమాచారం. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో లేదా పూల గార్డెన్లో ఈ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట! కాగా ఫర్హాన్ అక్తర్ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్నాడు. వీరికి షక్య, అకీరా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదహారేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇక ఫర్హాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన చిత్రం 'తుఫాన్'. ప్రస్తుతం ఆయన 'జీలే జరా' మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్‌తో పాటు 'జిందగీనా మిలేగీ దొబారా' యూనిట్ హృతిక్ రోషన్, అభయ్ డియోల్ కూడా సినిమాలో తళుక్కున మెరవనున్నట్లు గాసిప్ చక్కర్లు కొడుతోంది. -
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్) అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!) -
బాయ్‌ఫ్రెండ్ పేరును మెడపై టాటూ వేసుకున్న నటి
నటి, గాయని శిబానీ దండేకర్ కొత్త టాటూ వేయించుకున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఫర్హాన్ అక్తర్ పేరును ఆమె మెడమీద పచ్చబొట్టు వేసుకున్నారు. ఈ విషయాన్ని శిబానీనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మెడపైన ఉన్న ఫర్హాన్ అక్తర్ అని ఉన్న టాటూ చిత్రాన్ని పంచుకున్నారు. ముందుగా దీనిని టూటూ ఆర్టిస్ట్ కే షేర్ చేయగా అనంతరం శిబానీ రీపోస్టు చేశారు. ఈ ఫోటోలో ఆమె ముఖం పూర్తిగా కనిపించపోయిన మెడపై పచ్చబొట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిబానీ, పర్హాన్ గత మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక! ఆందోళనలో ఫ్యాన్స్.. అయితే తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ దాచేందుకు ప్రయత్నించలేదు ఈ జంట. కొన్నేళ్ల క్రితమే తామ బంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి శిబానీ దండేకర్, ఫర్హాన్ అక్తర్ తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమకు చెందిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. కాగా గత ఫిబ్రవరిలో షీబానీ, ఫర్హాన్ ప్రేమ ప్రయాణానికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఫర్హాన్.. శిబానీని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఇటీవల వీరి పెళ్లి ప్రస్తావన రాగా.. వివాహం గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని, ఎప్పుడూ ఈ టాపిక్ మాట్లాడుకోలేదని నటి పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చెబుతామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక సినిమా విషయానికొస్తే రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఫర్హాన్ నటించిన తుఫాన్ చిత్రం జూలై 16న ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో విడుదల అయింది. చదవండి: టాలీవుడ్లోకి మరో వారసురాలు.. హీరోయిన్గా మేధ శ్రీకాంత్! View this post on Instagram A post shared by Farhan Akhtar (@faroutakhtar) -
తెలుగులో నటించాలని ఉంది, కానీ..: ఫర్హాన్ అక్తర్
బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్‌కు తెలుగు నటించాలని ఉందని, కానీ తనకు ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఆయన నటించిన తాజా చిత్రం తుఫాన్ ఈ నెల 16న ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫర్హాన్ ఓ జాతీయ మీడియాతో ఆన్లైన్లో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలో ఫర్హాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. టాలీవుడ్ పరిశ్రమపై ఆయన ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ఫర్హాన్ ‘నాకు తెలుగు సినిమా నటించాలని చాలా ఆసక్తిగా ఉంది. కాని ఆఫర్స్ రావడం లేదు. నా దగ్గరకు ఒక మంచి పాత్ర వస్తే తెలుగులో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి’ అంటూ ఫర్హాన్ టాలీవుడ్‌ను కొనియాడాడు. అయితే తుఫాన్ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘తుఫాన్ కథ నాకు బాగా నచ్చింది. గతంలో నేను నటించిన బయోపిక్ భాగ్ మిల్కా భాగ్ మూవీ నుంచి డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మంచి సన్నిహితుడయ్యాడు. అయితే రాకేష్ తన దగ్గర మరో స్పోర్ట్స్ డ్రామా ఉందని నాతో చెప్పడంతో చాలా ఎక్జయిట్ అయ్యాను. ఈ మూవీ స్క్రిప్ట్ వివరించి, బాక్సార్ అజీజ్ అలీ రోల్ గురించి చెప్పగానే వెంటనే సినిమా ఓకే చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా యాంకర్ తన డైరెక్షన్లో వచ్చే తదుపరి చిత్రం ఎంటని ప్రశ్నించగా.. ప్రస్తుతం తన దగ్గర మంచి కథ ఉందని, ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని ఇప్పటికే ప్లాన్ చేశానన్నాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేసినట్లు చెప్పాడు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పై తీసుకొస్తానని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు ఫర్హాన్ పేర్కొన్నాడు. -
ట్విటర్ ట్రెండ్: ఈ సినిమాను అస్సలు చూడకండి!
Boycott Toofaan మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాకు సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మ్రునాల్ థాకూర్ జోడిగా నటించిన ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ లో చూడొద్దంటూ రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం.. ఇంకా నడుస్తూనే వస్తోంది. తూఫాన్ కథలో భాగంగా ఫర్హాన్‌ది ఒక గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. ప్రియురాలు మ్రునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా. ఈ పేర్లే అభ్యంతరాలకు కారణం అయ్యాయి. బాయ్‌కాట్ తూఫాన్కు బలం ఇచ్చాయి. ఇది సంప్రదాయానికి విరుద్ధం, మతాంతర కథలను ప్రోత్సహించకూడదని కొందరు వాదిస్తున్నారు. అయితే గతంలో సీఏఏకి వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గొన్నాడు. దీంతో రివెంజ్ తీర్చుకునేందుకు టైం వచ్చిందని మరికొందరు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో చేతులు కలపడం విశేషం. Trending in India 🇮🇳 Say Loudly #BoycottToofaan 📢@beingarun28 pic.twitter.com/XfSxne5sy1 — Keshav Pandey (@KeshavPandeyWB) July 10, 2021 Remember this 👇#BoycottToofaan pic.twitter.com/32ZKNvpDtz — कुंवर अजयप्रताप सिंह 🇮🇳 (@iSengarAjayy) July 10, 2021 ఇదిలా ఉంటే ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత.. మరోసారి ‘తూఫాన్’ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు ఫర్హాన్. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. షెడ్యూల్ ప్రకారం.. జులై 16న అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది. It took about two years to bring the boxer persona to life. This wouldn't have been possible without the belief & support of this amazing team. Watch my boxing journey here.https://t.co/T5ccRHIlYu@excelmovies @PrimeVideoIN — Farhan Akhtar (@FarOutAkhtar) July 9, 2021 -
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి: ఫర్హాన్ అక్తర్ భావోద్యేగం
పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్(91) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు మహమ్మారితో పోరాడిన ఆయన ఇటీవల కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా సంబంధిత సమస్యలతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు ఆయన మృతివకి సంతాపం ప్రకటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. కాగా ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాగ్ మిల్కా బాగ్’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లీడ్‌రోల్‌ల పోషించిన అక్తర్ అచ్చం ఆయనలా అనుసరించి ఈ పాత్రలో జీవించాడు. 2013లో వచ్చిన ఈ చిత్రం బి-టౌన్‌కు బాక్‌బ్లస్టర్ హిట్‌ను అందించింది. ఈ సందర్భంగా ఈ మూవీ సమయంలో మిల్కా సింగ్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫర్హాన్ ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. అతడు ట్వీట్ చేస్తూ ‘మీరు లేరని వార్తను నేను ఇంకా నమ్మలేక పోతున్న. లోలోపల ఏదో అవుతోంది. నా మనసు ఇంకేదో చెబుతుంది. మీరు భౌతికంగా మాకు దూరమయ్యారు. కానీ నిజం ఏంటంటే మీరేప్పుడూ మా మధ్యే ఉంటారు. ఓ ఐడియా, కలలకు మీరోక ప్రతినిధి. ప్రతి ఒక్కరిని ప్రేమించే పెద్ద మనసున్న గొప్ప వ్యక్తి మీరు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఓ తండ్రిగా, స్నేహితుడిగా మీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు. మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మీరు మా హీరో. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను సార్’ అంటూ ఫర్హాన్ రాసుకొచ్చాడు. కాగా ఫర్హాన్‌తో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, ప్రియాంక చొప్రా తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు మృతికి సంతాపం తెలుపుతున్నారు. ❤️🙏🏽 pic.twitter.com/Ti2I457epP — Farhan Akhtar (@FarOutAkhtar) June 19, 2021 -
‘ఇది నీ విజయం.. నీకు మాత్రమే సొంతం అర్జున్’
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ అండగా నిలిచాడు. ఆట పట్ల అర్జున్‌కు అమిత శ్రద్ధ ఉందని, అతడి ఉత్సుకతను హత్య చేయవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నెపోటిజం పేరిట తనను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. కాగా సచిన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ అర్జున్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బంధుప్రీతి కారణంగానే అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన విధానానికి, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఫర్హాన్ అక్తర్.. ‘‘అర్జున్ టెండుల్కర్ గురించి ఒక విషయం చెప్పదలచుకున్నాను. మేమిద్దరం ఒకే జిమ్‌లో తరచుగా కలుస్తూ ఉంటాం. ఫిట్నెస్ సాధించేందుకు అతడు ఎంతో కఠినంగా శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. కానీ వాటన్నింటినీ నెపోటిజం అనే ఒకే ఒక్క మాటతో నీరుగార్చడం సరికాదు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. అతడి ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి. సరికొత్త ప్రయాణానికి ముందే తనపై విమర్శల భారం మోపకండి’’ అని ట్విటర్ వేదికగా అర్జున్‌కు మద్దతు ప్రకటించాడు. ఇక సచిన్ కుమార్తె, అర్జున్ అక్క సారా టెండుల్కర్ సైతం.. ‘‘ఈ విజయాన్ని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఇది నీ విజయం’’ అంటూ తమ్ముడికి అండగా నిలిచారు. కాగా ప్రతిభ ఆధారంగానే అర్జున్ను తాము ఎంపిక చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ హెచ్‌కోచ్ మహేల జయవర్దనే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ మ్యాచ్‌లో అర్జున్ టెండుల్కర్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం సహా, మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచాడు. చదవండి: అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత లక్కీగా అర్జున్ బౌలర్ అయ్యాడు.. లేదంటే! -
బాయ్‌కాట్ మీర్జాపూర్2 .. ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
ముంబై: ప్రముఖ వెబ్ సరీస్ మీర్జాపూర్ సీక్వెల్ బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. నిన్న (బుధవారం) మీర్జాపూర్ 2ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ట్విటర్ యూజర్లు ట్రైలర్ విడుదలకు ముందు నుంచే మీర్జాపూర్ 2ను బాయ్‌కాట్ చేయాలంటూ #BoycottMirzapur2 అనే పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న ఫజల్ అలీ, సహా నిర్మాత ఫర్హాన్ అక్తర్‌లు. గతేడాది వీరు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతునిచ్చారు. వారి తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ‘తమ దేశానికి విధేయత చూపని నటుల సినిమాలు కానీ వెబ్ సిరీస్‌లు కానీ మాకోద్దు #BoycottMirzapur2’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. (చదవండి: మీర్జాపూర్ 2 ట్రైలర్ విడుదల) No more movies or web series of people who are not loyal to their country #BoycottMirzapur2 pic.twitter.com/OwowUApZsn — ISHWARI K (@ISHWARIK2) October 7, 2020 మరోవైపు మిర్జాపూర్ సీజన్2 కోసం ఎంతో ఆస్తక్తిగా ఎదురు చుస్తున్నామంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ‘మీర్జాపూర్ 2 ట్రైలర్ ఆశాజనకంగా ఉంది’ ఈ సిరీస్ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న.. ట్రైలర్ చూస్తుంటే ఉత్సాకంగా ఉంది. మొదటి సిజన్ తరహాలోనే సిక్వేల్ కూడా సూపర్ హిట్ అవుతుంది’ అంటూ అభిమాను ట్వీట్ చేస్తున్నారు. అంతా బాగుంటే వచ్చే నెలలో ప్రుముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమోజాన్ ప్రైంలో మీర్జాపూర్ విడుదల కావాల్సీంది. అయితే ఈ వివాదాల మధ్య మరి మీర్జాపూర్2 విడుదల అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
అంతరిక్షానికి ప్రయాణం
అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం కాబోతున్నారు ఫర్హాన్ అక్తర్. వ్యోమగామిగా మారి అంతరిక్షాన్ని చుట్టేయాలనుకుంటున్నారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కెమెరామేన్ మహేష్ మతై ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. త్వరలోనే రష్యాలో ఈ సినిమా షూటింగ్ ని ఆరంభించనున్నారని సమాచారం. ఈ బయోపిక్ లో రాకేష్ శర్మ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే వార్తల్లో ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సుశాంత్ సింగ్, విక్కీ కౌశల్ పేర్లు గతంలో తెర మీదకు వచ్చాయి. చివరికి ఫర్హాన్ అక్తర్ ఈ పాత్రలో నటించనున్నారు. -
‘రిషి కపూర్ చివరి చిత్రం పూర్తిచేస్తాం’
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ లేరనే వార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న ఆయన అభిమానులకు నిర్మాతలు రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు కాస్త స్వాంతన కలిగించే వార్త తెలిపారు. షూటింగ్ తుది దశలో ఉన్న రిషి కపూర్ చివరి చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’ మిగిలిన షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని రిషి కపూర్‌కు అంకితమివ్వాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. రిషి కపూర్‌ను చివరిసారిగా తెరపై చూసే అవకాశం అందరికీ లభించనుంది. ‘మరో రెండు రోజులు షూటింగ్లో పాల్గొంటే ఈ చిత్రం పూర్తయ్యేదని కాని అప్పటికే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతగా కలచివేసింది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా పూర్తి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఆయన లేకుండా ‘శర్మాజీ నమ్కీన్’ ఎలా పూర్తి చేస్తారో తెలుసుకోవాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే’అని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. రిషి కపూర్, జూహీ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హితేష్ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: వైరలవుతున్న రిషి కపూర్ వీడియో నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరోసారి పెళ్లికి రెడీ అయిన హీరో!
‘భాగ్ మిల్కా భాగ్’తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. తాజాగా మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఫర్హాన్.. నటి షీబాని దండేకర్‌తో ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్లో వదంతులు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో వీరద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో ప్రేయాణం గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఫర్హాన్, షిబానీలు 2020లో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారని.. ఫర్హాన్ తాజా చిత్రం ‘తుఫాన్’ విడుదల అనంతరం పెళ్లి చేసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ పెళ్లి తేదీ ఖరారు కాలేదు గానీ.. పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. త్వరలోనే తమ బంధాన్ని బహిర్గతం చేయబోతున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఫర్హాన్.. షీబానీతో కలిసి ఉన్న ఫొటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వీరిద్దరూ ఉంగరాలు ధరించి చేతులు పట్టుకొని ఉన్న ఫొటోలను కూడా ట్వటర్లో షేర్ చేశారు. అయితే వారి నిశ్చితార్థం విషయంపై స్పష్టతనివ్వనప్పటికీ..వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఫర్హాన్ అక్తర్‌కు 16 ఏళ్ల కిందట హేర్ స్టైలిస్ట్ ఆదునా బబానీతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2016లో విడాకులు తీసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. View this post on Instagram There's something so real about holding hands, a kind of complex simplicity, saying so much by doing so little. ~ unknown — 📷 @shibanidandekar A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Mar 3, 2019 at 4:42am PST -
బాక్సింగ్‌కు రెడీ అవుతున్న హీరో
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. జెర్సీ ధరించి బాక్సింగ్ రింగులో నిలుచుని ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు కసిగా చూస్తున్నట్టున్న ఈ పోస్టర్‌కు.. ‘ది రాక్ ఆన్’ అనే క్యాప్షన్‌ను జత చేసి అభిమానులతో పంచుకున్నాడు. అదే విధంగా.. ‘ఎప్పుడైతే జీవితం కష్టంగా మారుతుందో.. అప్పుడే మరింత బలవంతులం అవుతాం. దానికి ఉదాహరణ ‘తుఫాన్’. ఇది 2020 అక్టోబర్2 న మీ ముందుకు రాబోతుంది. మీరు ఈ ‘తుఫాన్’ను తప్పక ఇష్టపడతారని నా నమ్మకం’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చాడు. కాగా తుఫాన్లో బాక్సర్‌గా తన అభిమానులను మెప్పించడానికి ఫర్హాన్ బాగానే శ్రమించాడని... ఇందుకోసం బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న తుఫాన్ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరి కలయికలో స్పోర్ట్స్ డ్రామా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమాలో ఫర్హాన్ రన్నర్‌గా కనిపించాడు. ఇక ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా నటించిన ‘స్కై ఈజ్ పింక్’ సినిమా గత ఏడాది అక్టోబర్ 11 విడుదలై టొరంటో అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాలలో ప్రదర్శించబడింది. View this post on Instagram When life gets harder, you just get stronger. Iss saal #Toofan uthega. Releasing 02/10/2020. Happy to share this exclusive image with you as we dive into the new year. Hope you like it. ❤️ @rakeyshommehra @ritesh_sid @mrunalofficial2016 @vjymaurya @shankarehsaanloy @ozajay @excelmovies @romppictures @zeemusiccompany #PareshRawal #JavedAkhtar #AnjumRajabali #AAFilms A post shared by Farhan Akhtar (@faroutakhtar) on Jan 1, 2020 at 7:30pm PST -
మళ్లీ ఆట మొదలు
దాదాపు ఆరేళ్ల క్రితం వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రంలో రన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు ఫర్హాన్ అక్తర్. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో స్పోర్ట్స్ మూవీ ‘తుఫాన్’ తెరకెక్కుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో ఫర్హాన్ కనిపిస్తారు. అసలు సిసలైన బాక్సర్‌గా ఫిజిక్‌ని మార్చుకోవడానికి ఫర్హాన్ కసరత్తులు చేశారు. ఈ పాత్రకు అనుగుణంగా లుక్ మార్చుకున్నాక, ఆగస్టులో షూటింగ్‌ని మొదలుపెట్టారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో మొదలైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయాలనుకుంటున్నారు. -
నువ్వే అందంగా ఉన్నావు.. కాదు నువ్వే..
సినిమా షూటింగ్‌లతో, బిజినెస్ ఈవెంట్లతో బిజీ బిజీగా ఉండే గ్లోబల్ స్టార్ ప్రియాంకాకు కాస్త విరామం దొరికనట్లుగా ఉంది. ఏ మాత్రం కూడా ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తన మేనకోడలు స్కై కృష్ణాతో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా గడుపుడుతన్న ప్రియాంక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో స్విమ్మింగ్ సూట్లో ప్రియాంక ఇంకా తన మేనకోడలు కృష్ణాలు ముద్దు ముద్దుగా ఉన్నారంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే స్విమ్మింగ్ ఫూల్ ఉన్న వారిద్దరు.. ఎవరు అందంగా ఉన్నారు.. నువ్వే చాలా అందంగా ఉన్నావు కాదు నువ్వే చాలా క్యూట్‌గా ఉన్నావు’ అంటూ వాదించుకుంటున్న ఈ వీడియోకు ప్రియాంక సన్నీహితులు హర్ట్ ఇమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా క్యూబాకు చెందిన అమెరికా నటుడు అనాబెల్లె అకోస్టా ‘ తను చాలా పెద్దది అంటూ కామెంట్ చేయగా సోషలైట్ నటుడైన పారిస్ హిల్టన్ కళ్లలో హర్ట్ ఉండే ఎమోజీని పెట్టాడు. ఇక సినిమాల విషయానికోస్తే ఈ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ దీ స్కై ఇజ్ పింక్’ అక్టోబర్ మొదటి వారంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రియాంక రోగనిరోధక శక్తి లోపంతో జన్మించిన అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించారు. ఇది గురుగాన్కు చెందిన ఐశా చౌదరి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఐశా తన ఆరోగ్యం క్షిణించే వరకు తన కుటుంబంతో కలిసి ఈ వ్యాధిని తగ్గించడానికి 2015 వరకు పోరాటం చేస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంకతోపాటు ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కూడా నటించారు. View this post on Instagram We’re so cute ! @sky.krishna ❤️ #positiveaffirmations #blessednotstressed #girllove 📸 @divya_jyoti A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Oct 16, 2019 at 8:51pm PDT -
ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ ట్రైలర్ నిన్న విడుదలయ్యింది. షోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై.. 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ట్రైలర్‌పై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు చేసిన కామెంట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రైలర్లో ప్రియాంక, ఫర్హాన్ అక్తర్‌లు తమ కుమార్తె అనారోగ్యం గురించి చర్చిస్తూ.. వీలైనంత త్వరలోనే ఓ బ్యాంక్‌ను దోపిడి చేయాలి.. అలాగైతేనే తనకు వైద్యం చేయించగల్గుతాం అని మాట్లాడుకుంటారు. ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘ప్రియాంక బ్యాంక్ దోపిడికి పాల్పడితే.. ఐపీసీ సెక్షన్ 393 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు’ అంటూ ట్విటర్లో ‘స్కై ఈజ్ పింక్’ టీమ్‌ను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌పై ప్రియాంక వెంటనే స్పందిస్తూ.. ‘అరెరే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయాం కదా. అయితే ప్లాన్ బీని అమలు చేద్దాం’ అంటూ రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శించనున్నారు. -
అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్!
ముంబై: మహాత్మాగాంధీ హంతకుడైన నాథురాం గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసిన భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఆదివారం ట్వీట్ చేశారు. గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించిన సాధ్వికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన భోపాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ప్రియమైన భోపాల్ ఓటర్లారా.. మరో గ్యాస్ ట్రాజెడీ నుంచి మీ నగరాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రగ్యాకు నో చెప్పండి. గాడ్సేకు నో చెప్పండి. మహాత్ముడిని గుర్తుచేసుకోండి. ద్వేషాన్ని కాదు ప్రేమను ఎంచుకోండి’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఆరో దఫా ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న భోపాల్‌లో జరిగిన పోలింగ్‌లో నిజానికి రికార్డుస్థాయిలో 65.69శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత తీరిగ్గా ప్రగ్యాకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ఫర్హాన్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పడే ట్వీట్ చేయడం.. చాలా తొందరపడటం అవుతుందని ఓ నెటిజన్ చమత్కరించగా.. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను మార్చుకోండి.. మీ ట్వీట్ పోస్టు అవ్వడానికి పదిరోజుల సమయం తీసుకుంటోందని మరొకరు కామెంట్ చేశారు. భోపాల్‌లో బీజేపీ నుంచి సాధ్వి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్‌సింగ్ పోటీ చేస్తుండటంతో ఇక్కడ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. -
చెప్పకనే చెప్పారు
ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇవే నిజమయ్యాయి. గత నెల 1న(సెప్టెంబర్) షిబానీ సోషల్ మీడియాలో పై ఫొటో షేర్ చేశారు. ఇప్పుడు అదే ఫొటోను మంగళవారం ఫర్హాన్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఓ లవ్ సింబల్ ఉంచారు. అంతే.. వీరిద్దరూ తమ ప్రేమను ఫొటో ద్వారా చెప్పకనే చెప్పేశారని బీ టౌన్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఏడాది షిబానీ పుట్టినరోజుకి(ఆగస్టు 27) తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఆమె ఫొటోతో పాటు మూడు కిస్సింగ్ ఎమోజీలను ఫర్హాన్ అక్తర్ ఉంచిన విషయం గుర్తుండే ఉంటుంది. -
కొబ్బరికాయ కొట్టారు
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. దిష్టి తీసింది మనుషులకు కాదు. కొత్త లొకేషన్‌కి. ఎందుకంటే..‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం కోసం. సోనాలి బోస్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముంబైలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. చిత్రీకరణకు అంతరాయం కలగకుండా లొకేషన్‌కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు ప్రియాంక. ఇటీవల ప్రియాంక, నిక్ జానస్ల నిశ్చితార్థం జరిగింది. నిక్, ప్రియాంకల వివాహం రాజస్తాన్‌లోని జోధాపూర్లో నవంబర్‌లో జరుగనుందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. -
ఐష్‌ను మిస్సయ్యా
హాలీవుడ్ యాక్టర్స్‌తో వెండితెర పంచుకోవాలని చాలా మంది నటీనటులు కలలు కంటుంటారు. కానీ, ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మాత్రం అందాలతార ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో జరిగిన ఓ సంభాషణలో భాగంగా విల్ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఐశ్వర్యారాయ్‌ని కలిసి, ఓ సినిమా గురించి మాట్లాడాను. కానీ, కుదర్లేదు. డ్యాన్స్ సీక్వెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టారు విల్ స్మిత్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్యారాయ్‌కి ఎంత క్రేజ్ ఉందో. ఖతర్ దేశంలో జరిగిన ఓ ఫ్యాషన్ ర్యాంపులో పాల్గొన్న ఐశ్వర్యను చూస్తే ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదనే విషయం తెలుస్తోంది. ఇంకా వ్యక్తిగత విషయాల గురించి విల్‌స్మిత్ మాట్లాడుతూ –‘‘ చిన్నప్పుడు నేను హింసాత్మక వాతావరణంలో పెరిగాను. అందుకే నా పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. ఇటీవల విల్‌స్మిత్ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్, నిర్మాత కరణ్ జోహార్లతో కలిసి సందడి చేసి, ఓ సెల్ఫీ దిగారు విల్‌స్మిత్. ఈ ఫొటోలను రణ్వీర్ షేర్ చేశారు. -
నాలుగు గెటప్స్‌లో...
ప్రియంకా చోప్రా హిందీ సినిమాల్లో కనిపించి సుమారు రెండేళ్లు అయిపోయింది. అయితే ఈ గ్యాప్‌ని మర్చిపోయేంత స్పెషల్‌గా తనతాజా చిత్రం ఉండేలా చూసుకుంటున్నారామె. ఈ సినిమాలో 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ముఖ్య పాత్రల్లో సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కై ఈజ్ పింక్’. ఈ సినిమాలో జరీనా తల్లిగా ప్రియాంక కనిపించనున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పినా మోటివేషనల్ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథనే ఈ చిత్రానికి మూలం. ఇందులో అయేషా పాత్రలో జైరా కనిపిస్తారు. ఈ చిత్రం ఉద్వేగంగాను, స్ఫూర్తినిచ్చే విధంగానూ ఉంటుందట. 30 ఏళ్ల కాలంలో జరిగే కథ కావడంతో వయసులోని వివిధ దశల వారీగా ప్రియాంకా లుక్స్ ఉండనున్నాయట. -
మేకింగ్ ఆఫ్ మూవీ - గోల్డ్
-
రొమాంటిక్ మూడ్‌లో భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్‌కు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే రిలీవ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా హీరోయిన్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మహేష్ తో పాటు కైరా నడిచి వస్తున్న ఈ స్టిల్ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈసినిమాతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో సాంగ్స్ షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ఏప్రిల్ 7న భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని రెండో పాటను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ పాటను ఆలపించిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. -
మహేష్ కోసం పాట పాడిన బాలీవుడ్ హీరో
-
మహేష్ కోసం పాట పాడిన బాలీవుడ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ లో పాటు ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో పాటను ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాటకు ఓ ప్రత్యేక ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను ఓ బాలీవుడ్ దర్శక నటుడు ఆలపించారు. ఐ డోంట్ నో అంటూ సాగే ఈ పాటను ఫర్హాన్ అక్తర్ ఆలపించారు. ఈ విషయాన్ని ఫర్హాన్ స్వయంగా తెలుగులో ప్రకటించటం విశేషం. ఈ పాటను స్పెయిన్‌లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న భరత్ అనే నేను ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫేస్‌బుక్‌ను శాశ్వతంగా డిలీట్ చేశా
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ డేటా బ్రీచ్ దుమారం బాలీవుడ్‌ను తాకిందనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ (44) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఫేస్బుక్ ఖాతాను డిలీట్ చేస్తున్నానంటూ మంగళవారం సోషల్ మీడియా లో వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ పోస్ట్ పెట్టారు. తన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ తన అకౌంట్ పేజ్ ఇంకా ఉనికిలో ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఎందుకు తన ఖాతాను తొలగించిందీ స్పష్టం చేయలేదు. కానీ ఇప్పటికే గ్లోబల్‌గా డిలీట్ ఫేస్బుక్ ఉద్యమం ఉధృతమవుతుండగా ఈ సెగ ఇపుడు బాలీవుడ్‌కు పాకిందనే అంచనాలు మాత్రం భారీగా నెలకొన్నాయి. మరోవైపు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ, ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్విటర్లో స్పందించారు. సింగర్, నటి చెర్‌తోపాటు మరికొందరు కూడా ఇదే బాటలో నిలిచారు. కాగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 50 మిలియన్ల ఫేస్బుక్ వినియోగదారులు డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా దక్కించుకుందున్నవార్త గ్లోబల్‌గా కలకలం రేపింది. దీనిపై అమెరికా ఫెడరల్ యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ విచారణను మొదలుపెట్టింది. Good morning. This is to inform you all that I have permanently deleted my personal Facebook account. However, the verified FarhanAkhtarLive page is still active. — Farhan Akhtar (@FarOutAkhtar) March 27, 2018 Who are you sharing your life with? #regulatefacebook pic.twitter.com/r7B7Ajkt0V — Jim Carrey (@JimCarrey) March 20, 2018 -
డాన్ సీక్వల్కు రెడీ..!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రీమేక్ మూవీ డాన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన డాన్ సినిమాకు రీమేక్ గా 2006లో షారూఖ్ డాన్ తెరకెక్కింది. డాన్ పాత్రలో షారూఖ్ ను చూసిన అభిమానులు ఘనవిజయాన్ని అంధించారు. దీంతో ఐదేళ్ల తరువాత మరోసారి డాన్ పాత్రలో నటించాడు షారూఖ్. డాన్ 2గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. షారూఖ్ లుక్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోసారి డాన్ పాత్రలో నటించనున్నట్టుగా ప్రకటించాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న షారూఖ్ త్వరలో డాన్ 3లో నటించబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు కథ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా నిర్మాత రితేష్ సిద్వానీ తెలిపారు. తొలి రెండు భాగాల్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా.. మూడో భాగానికి మాత్రం దీపికను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. -
వేధింపులంటూ.. ఫిల్మ్ ఇండస్ట్రీని బలి చేయొద్దు!
ముంబయి : లైంగిక వేధింపులు కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఈ పరిస్థితులున్నాయని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ‘కాస్టింగ్ కౌచ్’కు సంబంధించి ఇటీవల హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూడగా.. ఆ వెంటనే బాలీవుడ్ నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు తాగొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి స్వర భాస్కర్ ఆరోపించారు. లైంగిక వేధింపులపై ఫర్హాన్ అక్తర్ స్పందిస్తూ.. ‘కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని బలి చేయడం సరికాదు. అన్ని రంగాల్లో వేధింపులు జరుగుతున్నాయి. బాధిత మహిళలు, యువతులు ఏదో రూపంలో ధైర్యంగా వారికి ఎదురైన విషయంపై బహిర్గం చేసి పోరాటం కొనసాగించాలి. ఈ విషయంలో వారికి పూర్తి మద్ధతు తెలుపుతా. లింగభేదం లేనప్పుడే సమాజం మరింత ముందుకు వెళ్తుంది. మహిళలపై వేధింపులకే పాల్పడేవాళ్లను అంత తేలికగా విడిచిపెట్టొద్దు. నా సినిమాల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తాను. అంతేకానీ పలానా మహిళ బాధితురాలంటూ వ్యత్యాసం చూపనని’ వెల్లడించారు. మహిళలపై వేధింపులు అడ్డుకోవాలంటూ వారికోసం పోరాటం చేసే వ్యక్తులలో ఫర్హాన్ ఒకరు. తన సినిమాల్లో హీరోలకు ఇచ్చేంత పారితోషికమే హీరోయిన్లకు ఇస్తానంటూ గతంలో పలుమార్లు చెప్పి లింగవ్యత్యాసం చూపడాన్ని వ్యతిరేకించాడు దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్. -
హృతిక్-కంగన : అనూహ్య పరిణామాలు
ముంబై : బాలీవుడ్లో హాట్ జంగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్-కంగనల వివాదం ఏడాది కాలంగా నలుగుతున్నా.. తాజాగా మాత్రం మరింత బజారుకెక్కింది. ఇద్దరు నటులు తమ వ్యక్తిగత స్థాయిలను దిగజార్చుకునేలా ప్రవర్తిస్తూ.. ఆరోపణ.. ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరి వివాదం బాలీవుడ్ మొత్తం సమస్యగా తయారైనట్లుంది పరిస్థితి కొందరు హృతిక్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు కంగన చేసింది కరెక్ట్ అంటున్నారు. కంగన-హృతిక్ వివాదంలో రెండు రోజుల కిందట తానెందుకు హృతిక్‌ను సమర్థిస్తున్నానో వివరిస్తూ.. ఫరాన్ అక్తర్ రాసిన లేఖ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఫరాన్ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్లు తాజాగా సోనమ్ కపూర్, కరణ్ జోహార్ ప్రకటించారు. అంతేకాక తమ వ్యక్తిగత మద్దతును హృతిక్‌కు ప్రకటించారు. ఫరాన్ అక్తర్ లేఖకు మద్దతు ప్రకటించిన సోనమ్, కరణ్ జోహార్‌పై కంగన సోదరి రంగోలి చెందెల్ నిప్పులు చెరిగారు. కంగనను ద్వేషించే వాళ్లంతా ఒక కూటమిగా మారారని ఆరోపించారు. కరణ్‌జోహార్, సోనమ్ కపూర్లను విమర్శిస్తూ వరుసల ట్వీట్లు చేశారు. ఏం చూసి మీరు హృతిక్ చేసిందాన్ని సమర్థిస్తున్నారు? అసలు నిజానిజాలు మీకు తెలుసా? ఏ విషయంపై అయినా స్పందించేందుకు నిజానిజాలు తెలుసుకోవాలి? అంటూ రంగోలి చందెల్ దూకుడుగా ట్వీట్లు చేశారు. -
ఇక సినిమా స్టార్ కూడా...
సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోని అందం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాది. ఇప్పటి వరకు టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సానియా మీర్జా ఇక వెండితెరపైనా తన మెరుపులు మెరిపించనున్నారా? ఆ సమయం ఆసన్నమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సానియాకు టాలీవుడ్లో కంటే బాలీవుడ్లోనే ఎంతోమంది స్నేహితులున్నారు. వారి ఫంక్షన్లకు సానియా వెళ్లడం, తన ఫంక్షన్లకు వారిని ఆహ్వానించడం తెలిసిందే. సానియా సినిమా రంగ ప్రవేశం గురించి గతంలో చాలా వార్తలు వినిపించినా, ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ, తాజాగా బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అక్తర్ చేసిన ట్వీట్‌కు సానియా స్పందించిన తీరు చూస్తుంటే బాలీవుడ్ ఎంట్రీకి ఈ బ్యూటీ ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ‘‘సానియా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల మధ్య అనుబంధం నేపథ్యంలో బాలీవుడ్లో ఓ సినిమా త్వరలోనే రాబోతోంది. ఇందులో సానియా, ఆమె తండ్రి కలిసి నటించబోతున్నారు’’ అని పర్హాన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు సానియా ధన్యవాదాలు చెప్పడంతో చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆ సినిమాలో నటించడం లేదంటే సానియా ‘అదేం లేదు’ అని స్పందించేవారు కదా! థ్యాంక్స్ చెప్పడంతో సానియా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఖాయం అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
విడాకులు తీసుకున్న మరో నటుడు
-
విడాకులు తీసుకున్న మరో నటుడు
ముంబై: బాలీవుడ్లో మరో నటుడు భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, ఆయన భార్య సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆధునా భావని 16 ఏళ్ల వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. కోర్టులో వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. గతేడాది భార్య నుంచి విడిపోతున్నట్టు ఫర్హాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. గతేడాది అక్టోబర్‌లో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు ఇచ్చిన ఆరు నెలల గడువు ముగియడంతో ఫర్హాన్, ఆధున ఇద్దరూ సోమవారం కోర్టుకు వచ్చి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఫర్హాన్, ఆధున రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటారు. వారి బాధ్యతలను ఫర్హాన్ చూసుకుంటాడు. -
నటి కోసం గొడవ పడలేదు..ఇదిగో ప్రూఫ్: హీరో
నటి శ్రద్ధా కపూర్ కోసం బాలీవుడ్ హీరోలు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్యరాయ్ కపూర్ గొడవపడ్డారంటూ గతవారం బాలీవుడ్లో రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్‌కు తెరదించుతూ తనదైన స్టైల్లో ఫర్హాన్ అఖ్తర్ తాజాగా వివరణ ఇచ్చాడు. ’వాళ్లు ఏదేదో అంటున్నారు కానీ ఇదిగో మేం ఇలా ఉన్నాం.. రిప్ రూమర్స్’ అంటూ ఆదిత్యరాయ్తో దిగిన ఫొటోను ఫర్హాన్ ట్వీట్ చేశాడు. గత రాత్రి తాము ఆనందంగా గడిపామంటూ చెప్పాడు. మహేశ్ భట్ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో శ్రద్ధా కోసం ఫర్హాన్, ఆదిత్య గొడవ పడ్డారని గతవారం బాలీవుడ్ మీడియా కోడై కూసింది. భట్ కుటుంబ వేడుకలకు 'ఆషికీ-2' స్టార్స్ ఆదిత్య, శ్రద్ధ జంటగా కలిసి హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్ లవర్స్ కలిసి వచ్చి పార్టీలో హల్చల్ చేయడం ఫర్హాన్ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్ ఆన్ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్ కు కోపం తెప్పించిందని, అందుకే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని అప్పట్లో కథనాలు వచ్చాయి. శ్రద్ధ విషయంలో ఇద్దరు హీరోల గొడవ జరిగి.. వైరం కొనసాగుతున్నదని వస్తున్న కథనాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు ఫర్హాన్ తనదైన స్టైల్లో ఈ ట్వీట్‌తో రిప్లై ఇచ్చాడు. And that, as they say, is that.. RIP rumours. #lastnight #chilltimes pic.twitter.com/TlTGYtWYwY — Farhan Akhtar (@FarOutAkhtar) 9 April 2017 -
నటి కోసం కొట్టుకున్న హీరోలు!
ముంబై: బాలీవుడ్లో వివాదాలకు, వదంతులకు కొదువుండదు. కానీ, తాజాగా వెలుగుచూసిన ఓ రూమర్ మాత్రం బాలీవుడ్ సర్కిల్స్‌లో కలకలం రేపుతోంది. అదే బాలీవుడ్ నటులు ఆదిత్య రాయ్ కపూర్, ఫర్హాన్ అఖ్తర్ గొడవకు దిగడం.. అదికూడా నటి శ్రద్ధా కపూర్ కోసమేనట. ఇటీవల మహేశ్ భట్ కుటుంబం పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో అందరూ స్టార్స్ లాగే 'ఆషికీ-2' స్టార్స్ ఆదిత్య, శ్రద్ధ జంటగా హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని, కొంతకాలం వీరు డేటింగ్ చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్ లవర్స్ కలిసి వచ్చి పార్టీలో హల్చల్ చేయడం ఫర్హాన్ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్ ఆన్ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరు ఇప్పటివరకు ఈ కథనాలను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ చేయలేదు. ఈ నేపథ్యంలో శ్రద్ధ, ఆదిత్యతో కలిసి ఈ పార్టీకి రావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్ కు కోపం తెప్పించిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ గొడవ ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి ఫర్హాన్ ఇంటి వద్ద శ్రద్ధ కనిపించింది. గొడవ నేపథ్యంలో ఫర్హాన్‌కు నచ్చజెప్పేందుకు, ఇద్దరి నటుల మధ్య రాజీ కుదిర్చేందుకే మంగళవారం రాత్రి ఫర్హాన్ ఇంటికి శ్రద్ధ వచ్చిందని ఆ వర్గాలు చెప్పాయి. -
ఫ్యామిలీ బ్లడ్
బ్లడ్ రిలేషన్ ఉంటే కానీ బాలీవుడ్లో వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, రైటర్లు, కొరియోగ్రాఫర్లు, కెమేరామేన్లు.. లిస్ట్ నెవర్ ఎండింగ్. బాలీవుడ్లో తెర మీద, తెర వెనకా, పక్కనా... అంతా బ్లడ్డే. రక్తం చిందిస్తున్నారనుకోకండి! మరి ఏం చిందిస్తున్నారు? బంధుప్రీతిని చిలకరిస్తున్నారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. బంధువులుంటే మాత్రమే గొప్పవారు కాదు. కానీ అవకాశం మాత్రం ‘రిలేటీవ్’లీ ఈజీ.. అక్తర్–ఆజ్మి... ఆల్ ఆర్ టాలెంట్ సుమీ ప్రముఖ హిందీ రచయిత జావేద్ అక్తర్ తండ్రి జాన్ నిసార్ గేయ రచయిత. జావేద్ మొదటి భార్య హనీ ఇరానీ కూడా రైటరే. జావేద్–హనీల తనయుడే దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. ఫర్హాన్ సోదరి జోయా అక్తర్ కూడా దర్శకురాలే. ఇదిలా ఉంటే.. జావేద్ మొదటి భార్య హనీ ఇరానీకి ఓ సోదరి ఉన్నారు. పేరు మేనకా ఇరానీ. ఈ మేనకా కూతురే ప్రముఖ నృత్య దర్శకురాలు–దర్శకురాలు ఫరాఖాన్. ఫరా సోదరుడు సాజిద్‌ఖాన్ కూడా దర్శక–నటుడే. ఇక, జావేద్ అక్తర్ రెండో వివాహం చేసుకున్న ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మిదీ సినిమా నేపథ్యమే. షబానా తండ్రి కైఫ్ ఆజ్మి పాటల రచయిత. తల్లి షౌకత్ కైఫ్ నటి. షబానా మేనకోడళ్ళు టబు, సయామీ ఖేర్‌లు కూడా ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బచ్చన్ అండ్... ఎలాంటి రికమండేషన్లు లేకుండా కష్టపడి, పైకొచ్చిన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అడుగుపెట్టారు. తండ్రీ కొడుకులు అమితాబ్, అభిషేక్... ఇద్దరూ వెండితెరపై తమకు జోడీగా నటించిన హీరోయిన్లు జయా బాధురి, ఐశ్వర్యా రాయ్‌లను పెళ్లాడారు. అమితాబ్ సోదరుడు అజితాబ్ నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. ఈయన కుమార్తె నైనా బచ్చన్‌ను యంగ్ హీరో కునాల్కపూర్ పెళ్లి చేసుకున్నారు. అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్‌ను కపూర్ కుటుంబంలోకి కోడలిగా పంపారు. అమితాబ్ అల్లుడు నిఖిల్ నందా ఎవరో కాదు... ప్రముఖ నటుడు రాజ్‌కపూర్ మనవడే. భట్... బంచ్ ఆఫ్ టాలెంట్ బాలీవుడ్ దర్శకుల అడ్డా ఏదంటే... భట్ ఫ్యామిలీ అనే చెప్పాలి. దర్శకుడు నానాభాయ్తో బాలీవుడ్లో భట్ ఫ్యామిలీ పురుడు పోసుకుంది. ఓ 50 చిత్రాలు తీసిన నానాభాయ్ భట్‌కు ఎనిమిది మంది పిల్లలు. వాళ్లు, వాళ్ల పిల్లలూ పుట్టగొడుగుల్లా హిందీలో పాగా వేశారు. నానాభాయ్ కుమారుల్లో రాబిన్ రచయితగా, ముఖేశ్‌భట్ నిర్మాతగా, మహేశ్‌భట్ దర్శకుడిగా స్థిరపడ్డారు. ఈ ఫ్యామిలీ మూడోతరంలో ముఖేశ్ కుమారుడు విశేష్భట్ ‘మర్డర్–3’కి దర్శకత్వం వహించారు. ఇక, మహేశ్‌భట్ మొదటి భార్య కుమార్తె పూజా భట్ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు శాఖల్లో ప్రతిభ చూపారు. మహేశ్‌భట్ రెండో భార్య కుమార్తె ఆలియా భట్ ప్రజెంట్ స్టార్ హీరోయిన్. యువదర్శకుడు మోహిత్ సూరి నానాభాయ్కు మనవడు. అంటే... కూతురి కొడుకు. ముఖేశ్, మహేశ్‌లకు మేనల్లుడు. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి కూడా మహేశ్‌భట్‌కు మేనల్లుడి వరుస. ఇంకా ఈ ఫ్యామిలీలో నటీనటులు, దర్శకులు బోల్డంత మంది ఉన్నారు. యస్... జోహార్ చోప్రా యశ్‌చోప్రా... భారతీయ చిత్రసీమకు పరిచయం అక్కర్లేని పేరు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్థాపించి, దర్శక–నిర్మాతగా హిట్ సినిమాలు తీశారు. ఆయన అన్నయ్య బల్దేవ్ చోప్రా కూడా దర్శక–నిర్మాతే. యశ్‌చోప్రా సోదరుల్లో ధరమ్‌రాజ్ చోప్రా సినిమాటో గ్రాఫర్ కాగా, రాజ్చోప్రా డిస్ట్రిబ్యూటర్. బల్దేవ్ చోప్రా తనయుడు రవిచోప్రా ఫేమస్ టీవీ సీరియల్ ‘మహాభారత్’కు దర్శక–నిర్మాత. యశ్‌చోప్రా కుమారుల్లో పెద్దోడు ఆదిత్యా చోప్రా దర్శక–నిర్మాతగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నోడు ఉదయ్‌చోప్రా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. నటి, వ్యాఖ్యాత సిమి గరేవాల్.. ఆదిత్యాచోప్రా చిన్నమ్మ కూతురు. ఇవన్నీ పక్కన పెడితే... ‘నెపోటిజమ్’ పేరుతో కంగనా రనౌత్ వేలెత్తి చూపుతోన్న కరణ్ జోహార్ ఎవరో తెలుసా? యశ్‌చోప్రా మేనల్లుడు. కరణ్ తల్లి హీరూ జోహార్ ఎవరో కాదు... యశ్‌చోప్రా సొంత చెల్లెలు. కరణ్ తండ్రి యశ్ జోహార్ కూడా నిర్మాతే. ఆయన ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించారు. కపూర్స్... క్యా టాలెంట్! హిందీ సినిమాలనూ, కపూర్ కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. కపూర్ ఫ్యామిలీకి పృధ్వీరాజ్ కపూర్ ఆద్యుడు. మూకీ చిత్రాల యుగం నుంచి ఆయన హీరోగా నటించారు. ఆయన తనయులు రాజ్‌కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్... ముగ్గురూ హీరోలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఓ వెలుగు వెలిగారు. కపూర్ ఫ్యామిలీ మూడోతరంలో రాజ్‌కపూర్ కుమారులు రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్... తండ్రిలా నటన, దర్శ కత్వం, నిర్మాణం మూడింటిలోనూ ప్రతిభ చూపారు. షమ్మీ కపూర్ తనయుడు అదిత్యారాజ్ కపూర్ నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేశారు. శశికపూర్ కుమారుల్లో పెద్దోడు కునాల్ కపూర్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా, చిన్నోడు కరణ్ కపూర్ మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. నాలుగో తరంలో రణధీర్ కుమార్తెలు కరీష్మా, కరీనాలు బోల్డంత పేరు తెచ్చుకున్నారు. రిషి కపూర్ తనయుడు రణబీర్ కపూర్ స్టార్ హీరోగా దూసుకెళుతున్నారు. ఇంకా.. పైన చెప్పిన ఫ్యామిలీలతో పాటు డియోల్ (ధర్మేంద్ర) ఫ్యామిలీ వంటివి మరికొన్ని ఉన్నాయి. ప్రముఖ íహీరోలు సంజయ్‌దత్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్, హీరోయిన్లు సోనమ్ కపూర్, సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్... ఇలా సినీ నేపథ్యం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. -
భాగ్ అఖ్తర్ భాగ్
మిల్కా సింగ్ బయోపిక్ చేసిన హీరో ఫర్హాన్ అఖ్తర్. హీరో అవక ముందు ఇతని పెన్ను పరిగెత్తేది. భాగ్ మిల్కా భాగ్ తర్వాత కెరియర్ పరిగెడుతోంది. మరి పరిగెత్తేటప్పుడు పడకుండా ఉంటారా?పడకుండా ఉండము. పడి లేచి పరిగెత్తినవాడే ఫర్హాన్ అఖ్తర్. భాగ్ అఖ్తర్ భాగ్. ♦ రచయిత జావేద్ అఖ్తర్ కుమారుడు. ∙నృత్య దర్శకురాలు ఫర్హా ఖాన్ ఇతనికి పిన్ని కూతురు. ∙‘జిందగీ నా మిలేగీ దుబారా’ దర్శకురాలు జోయా ఇతడి సోదరి. ♦ తండ్రిలానే తనూ విడాకులు తీసుకున్నాడు. ♦ ‘భాగ్ మిల్కా భాగ్’తో ఎనలేని కీర్తి. ♦ నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్లో సమున్నత స్థానం. నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. ‘నేను సూపర్‌మేన్’ అన్నాడు ఒక పిల్లవాడు. ‘నేను స్పైడర్‌మేన్’ అన్నాడు ఇంకో పిల్లవాడు. ‘నేను బేట్‌మేన్’ అన్నాడు మరో పిల్లవాడు. నాలుగో పిల్లవాడికి ఈ మేన్ల మేనియా లేదు. అతడికి తెలిసిన అతడు ఇష్టపడే సూపర్‌మేన్ ఒక్కడే– అమితాబ్ బచ్చన్. ‘నేను అమితాబ్‌బచ్చన్’ అన్నాడు ధీమాగా. కాని మొదటి పిల్లవాడికి కోపం వచ్చింది. ‘నో.. నేనే అమితాబ్ బచ్చన్. నువ్వు సూపర్‌మేన్ వేషం వెయ్యి’ అన్నాడు. ‘నో.. నేనే అమితాబ్ బచ్చన్’ ‘కుదరదు’ ‘ఏం?’ ‘ఏం అంటే ఆయన మా నాన్న కాబట్టి. మా నాన్న వేషం వేసే హక్కు నాకే ఉంది’ నాలుగో పిల్లవాడు నీరసంగా అంగీకరించాడు. ఎందుకంటే మొదటి పిల్లవాడి పేరు అభిషేక్ బచ్చన్. నాలుగో పిల్లవాడి పేరు ఫర్హాన్ అఖ్తర్. చిన్నప్పటి ఆట అది. కానీ ఆటలో అమితాబ్ బచ్చన్ కాలేని ఫర్హాన్ పెద్దయ్యాక అదే అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేశాడు ‘లక్ష్య’ సినిమా కోసం. పెద్ద సక్సెస్ ఇది. కానీ దీని స్క్రిప్ట్ మాత్రం అంత సులువుగా లేదు. జావేద్ అఖ్తర్ స్క్రిప్ట్స్ బాగా రాస్తాడు. అయితే తన పిల్లవాళ్ల బాల్యపు స్క్రిప్ట్‌ను అతడు అంత బాగా రాయలేకపోయాడు. గట్టిగా చెప్పాలంటే ఆ స్క్రిప్ట్‌ను డిస్ట్రబ్ చేశాడు. గందరగోళం పాలు చేశాడు. జావేద్ అఖ్తర్ భార్య పేరు హనీ ఇరానీ. ఈమె బాలనటి. టీనేజ్‌లో కూడా సినిమాల్లో నటించింది. హేమమాలిని డబుల్ యాక్షన్ చేసిన ‘సీతా ఔర్ గీతా’లో ఈమె చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమాకు సలీమ్–జావేద్ రచయితలు. జావేద్‌కు అలా హనీ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వాళ్లు 1972లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి జావేద్ పెద్ద స్టార్ రైటర్ కాలేదు. ‘జంజీర్’, ‘షోలే’, ‘దీవార్’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయ్యాయి. సలీమ్ జావేద్‌లు ఆ రోజుల్లోనే సూపర్స్టార్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అంటే ఒక్కో సినిమాకి లక్ష రూపాయలు తీసుకునేవారు. ఈలోపు హనీ ఇరానీ– జావేద్‌లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి జోయా. రెండో సంతానం ఫర్హాన్ అఖ్తర్. కాని ఈలోపు జావేద్ అఖ్తర్ ఎక్స్పోజర్ పెరిగింది. గొప్పగొప్పవాళ్లు అతడికి పరిచయమవుతున్నారు. అతనంటే కూడా క్రేజ్ ఏర్పడింది. అలా షబానా ఆజ్మీ అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆమె పుట్టిల్లు హైదరాబాద్ కనుక అతడు మన హైదరాబాద్‌కు అల్లుడయ్యాడు. బాగుంది కాని హనీ ఇరానీ ముక్కచెక్కలైపోయింది. జావేద్ చర్యను జీర్ణించుకోలేకపోయింది. ఆస్తి అంతస్తు డబ్బు ఉన్న భర్త... కాని అతణ్ణి వదిలేసి ఇద్దరు పిల్లలతో విడిపోయింది. లేదా అతడే ఆమెను వదిలి షబానాతో వెళ్లిపోయాడు. ఫర్హాన్ ఆరేడేళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మొదలైన గొడవ అతడికి పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల శాశ్వత యెడబాటుతో ముగిసింది. జావేద్– హనీలు లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఫర్హాన్ ఇప్పుడు ఒంటరి. అక్క జోయా తప్ప అతడికి ప్రపంచంలో మరెవ్వరూ లేరు. ఈ మొత్తం వ్యవహారంతో డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఫర్హాన్ అల్లరి పిల్లవాడైపోయాడు. తండ్రిని మిస్సవుతున్న విషాదం నుంచి బయట పడటానికి హైపర్ యాక్టివ్ అయిపోయేవాడు. గెంతేవాడు. పడేవాడు. పరిగెత్తేవాడు. వారంలో రెండుమూడుసార్లు గాయాలపాలై డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాల్సి వచ్చేది. స్కూల్లో పిల్లలతో తాను రోజూ హెలికాప్టర్లో వస్తానని తనను స్కూల్ రూఫ్ మీద దింపి హెలికాప్టర్ వెళ్లిపోతుందని అబద్ధాలు నమ్మకం కలిగేలా చెప్తే మిగిలిన పిల్లలు వాళ్ల తల్లిదండ్రులని హెలికాప్టర్లో దించమని గొడవ చేస్తే ఆ తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఫర్హాన్ మీద కంప్లయింట్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు స్కూలు ఎప్పుడు నచ్చకపోయినా ఉన్నట్టుండి స్పృహ తప్పినట్టుగా పడిపోయి ఇల్లు చేరుకునేవాడు. చదువు సరిగా రాలేదు. డిగ్రీ అయ్యాక తల్లి లా చేయమని చేరిస్తే అటెండెన్స్ లేదని వాళ్లు బయటకు గెంటేశారు. ఫర్హాన్ తన జీవితంలో బుద్ధిగా కూచుని చేసిన పని ఒకటే ఒకటి. అది సినిమాలు చూడటం. అతడికి అత్యంత ప్రాణప్రదమైన సినిమా – ‘రేజింగ్ బుల్’. అతడికి బాగా నచ్చిన హీరో రాబర్ట్ డి నీరో. ‘డై హార్డ్’ సినిమాని 25 సార్లు కనీసం చూశాడు. ‘షోలే’ అంటే పిచ్చి. అమితాబ్‌బచ్చన్ అంటే వెర్రి. బహుశా తాను డైరెక్టర్ని అవుతానేమో అనుకునేవాడు. కాని అయ్యేది ఎలా? 2001లో ‘దిల్ చాహ్తా హై’ విడుదలైంది. డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. అప్పటికి హిందీ సినిమా రంగంలో ‘బేటి నం.1’, ‘బీవీ నంబర్ 1’, ‘అనారీ నం.1’లాంటి సినిమాలు వస్తున్నాయి. యశ్‌రాజ్ వాళ్లు ‘మొహబ్బతే’ లాంటి బరువైన సినిమాలు తీస్తున్నారు. ఈ ధోరణిని సమూలంగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఫర్హాన్ అఖ్తర్. ముంబై మెట్రో యువత ఉద్వేగాలను, వారి ప్రేమలను, ఆశలను, గందరగోళాలను సినిమాటిక్‌గా కాకుండా నమ్మశక్యంగా తీస్తే బాగుంటుందని భావించాడు. అతడు ఏ స్క్రిప్ట్ రైటర్ దగ్గరా పని చేయలేదు. సినిమాలకు అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. అతడికి ఉన్న అనుభవమల్లా ఒక క్రియేటివ్ ఏజెన్సీలో కొన్ని యాడ్స్‌కు డాక్యుమెంటరీలకు పని చేయడమే. కాని ఇంతకాలంలో చేసిన సినీ శోధన మీద అతడికి నమ్మకం ఉంది. అందుకే తన ఫ్రెండ్స్ జీవితంలో, తన జీవితంలో ఉన్న కొన్ని ఉదంతాలను తీసుకుని ‘దిల్ చాహ్తా హై’ స్క్రిప్ట్ రాశాడు. ఆకాష్, సమీర్, సిద్ధార్థ అనే ముగ్గురు కుర్రవాళ్ల కథ అది. ఆకాష్ తన జీవితం పట్ల నాన్ సీరియస్‌గా ఉంటాడు. సమీర్‌కు ప్రతీదీ గందరగోళం, అయోమయమే. సిద్దార్థ మెచ్యూర్డ్ కుర్రవాడే కాని అతడి ప్రేమ అతడి కంటే వయసులో చాలా పెద్దదైన స్త్రీ వైపు మళ్లుతుంది. ఈ అనుభవాల నుంచి ఎలా ఎదిగారన్నదే కథ. దీనికి ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. కొత్త దర్శకుడికి ఎవరు దొరుకుతారు? అందుకే తన చిన్ననాటి స్నేహితుడు రితేష్ సిద్వాని తానే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చాడు. ఇక యాక్టర్స్... హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ అనుకున్నాడు. ఇద్దరూ ఫర్హాన్ గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. డేట్స్ ఇవ్వలేదు. ఫర్హాన్‌కు ఏం చేయాలో తోచలేదు. ఆమిర్‌ఖాన్ గుర్తుకు వచ్చాడు. ప్రయత్నిద్దాం వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుని ట్రై చేశాడు. ఆమిర్ ఖాన్ ఎంత తెలివైనవాడంటే తన దగ్గరకు వచ్చింది సామాన్యమైన స్క్రిప్ట్ కాదని చిటికెలో కనిపెట్టేశాడు. అందుకే వెంటనే లీడ్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాడు. మిగిలిన రెండు పాత్రలకు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా ఎంపికయ్యారు. ‘దిల్ చాహ్తాహై’ విడుదలైంది. అప్పటి వరకూ ఉన్న సినిమా ధోరణుల్ని తిరగ రాసింది. హిందీ సినిమాలకు వెళ్లి రామ్‌గోపాల్ వర్మ ఒకరకమైన మార్పు తెస్తే ఫర్హాన్ అఖ్తర్ తన ‘దిల్ చాహ్ తాహై’తో మరో రకమైన మార్పు తెచ్చాడు. రియలిస్టిక్‌గా కనిపించే పాత్రలతో కమర్షియల్ సినిమా తీయొచ్చని నిరూపించాడు. సినిమాకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. అంతవరకూ ఫర్హాన్ అఖ్తర్ జావేద్ అఖ్తర్ కొడుకు. ఈ సినిమా నుంచి జావేద్ అఖ్తర్ ఫర్హాన్ అఖ్తర్ వాళ్ల నాన్న. సాధించడం అంటే అదీ. ఆ తర్వాత ఫర్హాన్ అఖ్తర్ కార్గిల్ వార్ నేపథ్యంతో హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలుగా ‘లక్ష్య’ సినిమా తీశాడు. ఆ తర్వాత తన తండ్రి రాసిన ‘డాన్’ సినిమాను ఈ కాలానికి తగినట్టుగా రాసి షారూక్ ఖాన్‌తో రీమేక్ చేశాడు. అయితే ఈ సమయంలోనే ఫర్హాన్‌కు ఒక బంగారం లాంటి అవకాశం మిస్ అయ్యింది. ‘రంగ్ దే బసంతీ’లో ముఖ్యపాత్ర ధరించమని దర్శకుడు రాకేష్ మెహ్రా అతణ్ణి అడిగాడు. అప్పటికి ఫర్హాన్ అఖ్తర్ దృష్టి దర్శకత్వం మీదే ఉంది. తను నటుణ్ణో కాదో తేల్చుకోలేకపోయాడు. అంతే కాదు ‘రంగ్ దే బసంతీ’ స్క్రిప్ట్‌ను సరిగ్గా జడ్జ్ చేయలేకపోయాడు. ఆ సినిమా విడుదలైంది. కనీ వినీ ఎరగని పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాతో నటుడిగా లాంచ్ అయి ఉంటే ఓవర్ నైట్‌లో ఫర్హాన్ స్టార్ అయి ఉండేవాడు. కాని మెట్లు మెల్లగానే ఎక్కాలని అతడికి రాసి పెట్టి ఉంది. ‘రాక్ ఆన్’ (2008) ఫర్హాన్ అఖ్తర్ మొదటగా నటించిన సినిమా. ఆ సినిమాలో ఒక ర్యాక్ బ్యాండ్‌లో లీడ్ సింగర్‌గా నటించాడు ఫర్హాన్. పాటలు కూడా పాడాడు. ఆ తర్వాత ‘కార్తిక్ కాలింగ్ కార్తిక్’, ‘లక్ బై చాన్స్’ సినిమాల్లో నటించాడు. కాని అతణ్ణి పెద్ద స్టార్‌ని చేసే అవకాశం, అతడిలోని నటుణ్ణి లోకానికి చూపే అవకాశం అతడి అక్క జోయానే ఇచ్చింది. దర్శకురాలిగా ఆమె తన తొలి ప్రయత్నం ‘జిందగీ నా మిలేగీ దుబారా’లో ఫర్హాన్ అఖ్తర్‌కు మంచి పాత్ర ఇచ్చింది. అందులో అతడు పోషించింది కూడా నిజ జీవితాన్ని పోలిన పాత్రనే. తండ్రి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోగా ఆ తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే కొడుకు పాత్ర పర్హాన్ది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ ఎంత పెద్ద హిట్ అంటే 55 కోట్లతో తీస్తే 150 కోట్లు వసూలు చేసింది. నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కావడంతో అతడి పంట పండింది. కానీ అంత కంటే పెద్ద పంట ‘భాగ్ మిల్కా భాగ్’ రూపంలో అతడికి దక్కింది. ‘ఫ్లయింగ్ సిక్’గా ఖ్యాతి పొందిన మిల్కా సింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రాకేష్ మెహ్రా సినిమా తీయాలనుకున్నాడు. ఆ పాత్రకు అడిగితే ఎవరైనా చేయడానికి ఎగిరి గంతేస్తారు. కానీ రాకేష్ ఫర్హాన్‌ను ఎంచుకున్నాడు. ఫర్హాన్ ఆ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడు. ఇది మామూలు పాత్ర కాదు. పరిగెత్తే పాత్ర. పరిగెత్తి అందరి కంటే ముందు రావాల్సిన పాత్ర. దాని కోసం దేహ దారుఢ్యం కావాలి. పరిగెత్తడాన్ని ప్రాక్టీసు చేయాలి. గుండె గొంతులో కొట్లాడేలా ఉరకలెత్తాలి. ఫర్హాన్ అవన్నీ చేయడానికి సిద్ధ్దపడ్డాడు. ఈ సినిమా చూడటానికి ఒకరోజు షూటింగ్ స్పాట్‌కు వచ్చిన మిల్కా సింగ్ మొదట అపనమ్మకంగా ఫర్హాన్ వైపు చూశాడు. కానీ ట్రాక్ మీద అతడు పరిగెత్తడాన్ని చూసి ముప్ఫై ఏళ్ల క్రితం తాను పరిగెత్తినట్టుగానే భావించాడు. ‘జీతే రహో’(బతుకుతూ ఉండు) అని ఆశీర్వదించాడు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు జీత్ తే రహో (గెలుస్తూ ఉండు) అని ప్రోత్సహించారు. భాగ్ మిల్కా భాగ్ ఫర్హాన్ అఖ్తర్లోని ఒక గొప్ప నటుణ్ణి చూపించింది. ఇప్పుడు ఫర్హాన్ పరిపూర్ణమైన నటుడు. నిరూపించుకున్న దర్శకుడు. ఇంకేం కావాలి? కానీ స్క్రిప్ట్ అంత సులభంగా లేదు. తండ్రి లాంటి కథే పునరావృత్తమైంది. తాను సూపర్‌స్టార్ కాక మునుపే ఫర్హాన్ ‘అధూనా’ అనే హెయిర్ స్టయిలిస్ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముంబైలో సెలూన్స్ ఉన్నాయి. ఆమె కూడా ఇతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు. కాని బహుశా ఫర్హాన్ అభిరుచులు, ఎదుగుదల, బిజీ, పేరు, కీర్తి వారిలో ఒక దూరాన్ని తీసుకొచ్చింది. గత సంవత్సరం అంటే 2016లో వాళ్లు విడిపోయారు. తన తండ్రి నిర్ణయంతో తాను ఎంత సఫర్ అయ్యాడో తెలిసి కూడా ఆ కఠినమైన నిర్ణయానికి తల ఒంచాడు ఫర్హాన్. ఫర్హాన్ ప్రస్తుతం నిర్మాతగా ఎక్కువ చురుగ్గా ఉన్నాడు. నటుడిగా ‘దిల్ ధడక్నే దో’ వంటి సినిమాల్లో ఆచి తూచి పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఒక ప్రయాణం ముగిసి మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది అతడి పని. తండ్రి ఒక స్క్రిప్ట్ రాశాడు. తను ఒక స్క్రిప్ట్ ప్రయత్నించాడు. కానీ విధి రాసిన స్క్రిప్ట్‌లో తన ప్రమేయం లేని పాత్రను పోషిస్తున్నాడు. అతడి కోసం విధి ఏం రిజర్వ్ చేసి పెట్టి ఉందో మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అందాక ‘దిల్ ధడక్ నే దో’. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నాలుగో తరగతి పిల్లలకు ఇదా చెప్పేది!
పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండాలో, ఆ పాఠ్య పుస్తకాలు రాసేవాళ్లు మరింత బాధ్యతగా ఉండాలి. పాఠాలు, వాటిలోని ప్రయోగాలు రాసేటప్పుడు అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. కానీ నాలుగోతరగతి సైన్స్ పుస్తకం రాసిన వాళ్లెవరో గానీ.. ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. సజీవాలు గాలి పీల్చుకుంటాయని చెప్పడానికి వాళ్లు చేయమన్న ప్రయోగం చూస్తే ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది. సజీవాలు బతికుండాలంటే గాలి పీల్చుకోవాలని, గాలి లేకుండా ఏ జీవీ కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకలేదని చెప్పారు. ఈ విషయాన్ని నిరూపించడానికి వాళ్లు ఓ ప్రయోగం చేయాల్సిందిగా చిన్నారులకు సూచించారు. ఆ ప్రయోగం ఇలా ఉంది.. ''రెండు చెక్క పెట్టెలు తీసుకోవాలి. ఒక పెట్టె మూత మీద కన్నాలు చేయాలి. రెండోదానికి కన్నాలు లేకుండా చూసుకోవాలి. రెండు పెట్టెల్లోనూ రెండు పిల్లి పిల్లలను పెట్టాలి. మూతలు వేసేయాలి. కొంతసేపటి తర్వాత ఆ మూతలు తీసి చూస్తే, కన్నాలు లేని పెట్టెలో ఉండే పిల్లిపిల్ల చనిపోయి ఉంటుంది'' అని ఆ పాఠ్య పుస్తకంలో రాశారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ గమనించి, ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటారంటూ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రంలో ఇది ఉందని, పిల్లలకు ఇలాంటి పుస్తకాలు చేరడానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించాడు. నటీనటులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఇలాంటి విషయాలను పదిమంది దృష్టికి తీసుకురావడం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటోంది. ఇంతకుముందు దర్శకురాలు రేణు దేశాయ్ కూడా పలు విషయాల మీద ఇలాగే స్పందించి తన అభిప్రాయాలు చెప్పారు. This. Is. Just. Unbelievable. From a Class IV textbook on Environmental Studies. Anyone responsible for this reaching the kids desks? pic.twitter.com/NJ2FWkwO0O — Farhan Akhtar (@FarOutAkhtar) 9 February 2017 -
అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు
ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీపై బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాశ్చాత్య దుస్తులు ధరించడం వల్లే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చేసిన రిజ్వీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మహిళలు విదేశీ దుస్తులు ధరించొద్దు. ఎందుకంటే పాశ్చాత్యుల్లా దుస్తులు తొడుక్కున్న మగాళ్లు కీచకులుగా మారి వేధింపులకు పాల్పడుతున్నారు. చొక్కా ధరించిన మగాడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఇంతకన్నా విడ్డూరం ఉండద’ని ట్వీట్ చేశాడు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై స్పందిస్తూ రిజ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాశ్చత్య దుస్తులు ధరించి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు. రిజ్వీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. -
క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ముంబై: బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎట్టకేలకు మౌనం వీడింది. దురదృష్టవశాత్తు, ఇటీవల బీ టౌన్ లో షికార్ చేసిన పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. సహనటుడు, మరో క్రేజీ హీరో ఫర్హాన్ అక్తర్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న విషయాన్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఈ తప్పుడు కథనాలు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొంది. తామూ మనుషులమే అన్న సంగతిని గుర్తించనంతవరకు ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. సినీ నటులుగా ఉన్న తమలాంటి వారిపై గాసిప్స్ చదవడానికి సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇలాంటి కథనాలు తన తండ్రిని, ఆంటీని, తన సహనటుడిని జోడించడం సరికాదని వ్యాఖ్యానించినట్టుగా "బొంబాయి టైమ్స్ ' రిపోర్టు చేసింది. శ్రద్ధా, ఫర్హాన్ పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారనీ, ఆ క్రమంలో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని బీ టౌన్ గుప్పుమంది. ఈక్రమంలో వీరిద్దరి వ్యవహారం నచ్చని ఆమె తండ్రి (శక్తి కపూర్) ఫర్హాన్ అపార్ట్మెంట్ నుంచి శ్రద్ధాను బలవంతంగా బయటకి లాకొచ్చిన్నట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా సీనియర్ కపూర్ ఖండించారు. ఇక ఇపుడు నేరుగా శ్రద్ధా కూడా స్పందించడంతో ఈ వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. కాగా బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ఆషిక్ 2 సినిమాలో గాయకురాలి పాత్రలో ఆకట్టుకున్న శ్రద్ధా తాజా చిత్రం 'ఒకే జాను' సినిమా బిగ్ రిలీజ్ కు సిద్ధంమవుతున్న సంగతి తెలిసిందే. -
కుమార్తెకు హీరో బహిరంగ లేఖ
దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, అరాచకాల పట్ల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా నటీనటులు పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. తన కుమార్తెకు జాగ్రత్తలు చెబుతూ ఆమె పేరు ప్రస్తావించకుండా బహిరంగ లేఖ రాశారు. అభద్రత ప్రపంచంలో జీవిస్తున్నాంటూ, మహిళలపై జరుగుతున్న దాడులను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రియమైన కుమార్తెకు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల గురించి ఏలా రాయగలను? తండ్రిగా నిన్ను రక్షించుకోవడం నా బాధ్యత. సమాజంలో జరుగుతున్న దాడుల గురించి మనం కచ్చితంగా చర్చించుకోవాలి. నీవు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా టీమ్‌లోని ఓ లాయర్‌ను కిరాతకంగా చంపారు. ఈ చర్య నన్ను తీవ్రంగా కలచివేసింది. నీకు ఇప్పుడు 16 ఏళ్లు. నా మదిలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలను నీతో పంచుకుంటున్నాను. మనం ఎలాంటి సమాజంలో నివసిస్తున్నాం? ఎలాంటి భయంలేకుండా మహిళలపై లైంగికదాడులు చేస్తున్నారు. ప్రేమించే హక్కును లాక్కుంటున్నారు. మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు. సమాజంలో మార్పు రావాలి. కీచకుల నుంచి ఎదురయ్యే సమస్యలను మనం చర్చించుకోవాలి. ఓ తండ్రిగా చెబుతున్నా.. ఎవరి నుంచైనా ఇబ్బంది కలిగినా, అసభ్యంగా ప్రవర్తించినా మౌనంగా ఉండరాదు. ఇలాంటివి నీకు నచ్చవని ధైర్యంగా చెప్పు. మనం సురక్షితంగా కాని, సమానత్వంలేని ప్రపంచంలో జీవిస్తున్నాం. స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో బతకాలి. సమాజంలో జరుగుతున్న దారుణాలను సినిమాల్లో కూడా చూపిస్తున్నాం. సినిమాల్లో గతంలో విలన్ చేసే చెడు పనులను ఇప్పుడు హీరోలతో చేయిస్తున్నారు. సినిమాల్లో నీకు నచ్చేవి, నచ్చనవి నాతో చర్చిస్తుంటావు. మంచి, చెడు విషయాల గురించి మనం చర్చించుకోవాలి. నీవు బయటకు వెళ్లినపుడు ఓ తండ్రిగా నాకు ఆందోళన ఉంటుంది. నీవు క్షేమంగా ఉండాలని అందరి తండ్రుల మాదిరే నేను ఆలోచిస్తా. నీవు నా స్నేహితురాలు. నువ్వు స్వతంత్రంగా జీవించాలి. నీ కలలను సాకారం చేసుకోవాలి. ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. సౌమ్యంగా, స్వీయ నియంత్రణలో ఉండాలి. ఈ సమాజం ఎలా ఉందో ఎప్పుడూ గుర్తించుకో. నీవు చిన్న పిల్లవని తెలుసు. ఈ దశలో ఏది మంచిదనే విషయంలో గందరగోళం ఉంటుంది. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటా. యువర్స్, డాడ్ -
ఎఫైర్ గురించి అడిగితే.. హీరోయిన్ ఫైర్
ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ తన భార్య ఆధునా భభానితో విడిపోయాక ఆయనపై పలు రూమర్లు వచ్చాయి. ఫర్హాన్ తన సరసన నటించిన హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. 'వాజిర్' కో స్టార్ అదితిరావు హైదరితో డేటింగ్ చేసినట్టు బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత 'రాక్ ఆన్ 2' కోస్టార్ శ్రద్ధా కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఫర్హాన్‌తో అనుబంధం గురించి వచ్చిన వార్తలపై స్పందించని శ్రద్ధా కపూర్ ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పింది. ఈ ప్రశ్న అడిగినందుకు మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యింది. 'ప్రతి ఒక్కరికీ లిమిట్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోరాదు. అందరి మనోభావాలను గౌరవించాలి' అని శ్రద్ధా కపూర్ క్లాస్ పీకింది. -
హీరోను ఎంపిక చేయడం కరెక్టేనా..?
న్యూఢిల్లీ: కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎంపిక వివాదంపై బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా ఎందుకు ఎంపిక చేశారని మిల్కా సింగ్ అనలేదని చెప్పాడు. ఆటగాడికి ఆ ఉన్నత పదవి కట్టబెడితే బాగుండేదని ఫర్హాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) రియో ఒలింపిక్స్ కు గానూ భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా గత శనివారం సల్మాన్ ను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఈ విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు, ఆటగాళ్లు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ కేవలం అభిప్రాయాన్ని వెల్లడించగా వివాదాస్పదమైందని ఫర్హాన్ వివరించాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉండగా, బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయడంపై మాత్రమే మిల్కా తన అసహనాన్ని వ్యక్తం చేశారని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నాడు. మిల్కా సింగ్ జీవిత కథాంశంతో రూపొందిన 'బాగ్ మిల్కా బాగ్' మూవీలో ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మిల్కా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగా ఫర్హాన్ స్పందించాడు. సల్మాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్, మిల్కా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ కారణం చేతనే మిల్కా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం అవుతున్నాయని ఆందోళన చెందాడు. అయితే తాను సల్మాన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, కేవలం గుడ్ విల్ అంబాసిడర్ అంశంపై మాత్రమే స్పందించానని చెప్పాడు. -
16 ఏళ్ల బంధం.. బద్దలైంది!
మరో బాలీవుడ్ ప్రముఖ జంట విడిపోవడానికి సిద్ధమైంది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెంచుకోవాలని ఉమ్మడిగా నిర్ణయించింది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, ఆయన భార్య అధునా అఖ్తర్ తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ దంపతులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారని ఓ మీడియా సంస్థ తెలిపింది. 'మేం, అధునా, ఫర్హాన్ సామరస్యంగా ఉమ్మడి సమ్మతి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు మా పిల్లలే అత్యంత ప్రాధాన్యం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వారిని ఎలాంటి అభూతకల్పనలకు తావు లేకుండా సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. మేం హుందాగా ముందుకుసాగేందుకు వీలుగా మా ప్రైవసీని గౌరవించాలని కోరుతూ ప్రకటన విడుదల చేస్తున్నాం' అని వారు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఈ దంపతుల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నదని, ఆ కారణంతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫర్హాన్ అఖ్తర్ ఇటీవల నిర్వహించిన ప్రజా కార్యక్రమాలు వేటిలోనూ అధునా కనిపించలేదు. ఫర్హాన్ తాజా చిత్రం 'వజీర్' సక్సెస్ మీట్ మొదలు.. డబ్బో రత్నానీ క్యాలెండర్ లాంచ్ వరకు ఏ కార్యక్రమంలో ఆమె కనిపించకపోవడం ఈ జంట మధ్య పెరిగిన దూరాన్ని చాటుతున్నది. 2000 సంవత్సరంలో 'దిల్ చాహ్తా హై' సినిమా ద్వారా దర్శకుడిగా ఫర్హాన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో అధునా ఆయనకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట బాలీవుడ్లోనే మోస్ట్ స్టైలిష్ జంటగా పేరొందింది. -
'పారితోషికం నచ్చితేనే ఓకే చెప్పండి'
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లకు ఓ హీరో బాసటగా నిలుస్తున్నాడు. హీరోలతో పాటు హీరోయిన్లకు సమాన వేతనాలు చెల్లించాలని పేర్కొన్నాడు. సమాన వేతన చట్టం తరహాలో ఏదైనా ఓ విధానం రావాలని కోరుకుంటున్న బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్. 'పార్క్ అవెన్యూ' ప్రాడక్ట్ లాంచ్ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న అక్తర్ కొన్ని విషయాలను ప్రస్తావించాడు. 'బాగ్ మిల్కా బాగ్'తో తనకుంటూ అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. హీరోల స్థాయిలో తమకు పారితోషికాలు అందించాలంటూ హీరోయిన్లు అడగుతున్నారని చెప్పాడు. తాము ఎందులోనూ తక్కువ కాదని, సమాన పారితోషికం ఇవ్వాలని హీరోయిన్లు కోరుకుంటున్నారు.. ఇందుకు తాను మద్దతు ఇస్తానన్నాడు. ఒకవేళ తన సినిమాలలో నటించే హీరోయిన్లు అడిగితే వారికి తగిన పారితోషికం ఇవ్వడం ఇష్టమేనన్నాడు. నిర్మాతలు ఇస్తున్నది తగిన పారితోషికం కాదని వారు భావిస్తే ఆ సినిమాలకు నో చెప్పడం మంచిదంటూ సూచించాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, ఇష్టం ఉన్నవారు తన సలహా ఫాలో అవ్వొచ్చని చెప్పాడు. ఆడ, మగ అనే భేదం లేకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది నైపుణ్యం ఉన్న నటీనటులు ఉన్నారని ఫర్హాన్ చెప్పుకొచ్చాడు. -
వోడ్కా తాగుతూ.. బిగ్ బీతో చెస్ ఆట!
వోడ్కా తాగుతూ.. చెస్ ఆడటం కొత్త పద్ధతి కదా! ఈ కొత్త చదరంగం ఆటను బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి.. చెస్ ఆడుతూ మధ్యమధ్యలో వోడ్కా సిప్ చేయనున్నారు. అయితే ఇది నిజజీవితంలో కాదు. 'వజీర్' అనే సినిమా కోసం. త్వరలో రాబోతున్న ఈ చిత్రంలో ఈ చిత్రమైన చదరంగం ఆట ఉండనుంది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్ సీరియస్‌గా చెస్ ఆడుతూ.. ఎదుటివారి బంటును బలిగొన్న ప్రతిసారి వోడ్కాను గుటుక వేసే సీన్ ఈ సినిమాలో ఉండనుందట. ఈ విషయాన్ని 'వజీర్' చిత్ర యూనిట్ ధ్రువీకరించింది. చెస్ ఆటను సరికొత్తరీతిలో ఆసక్తికరంగా ఈ సనివేశంలో చూపించనున్నాం. ఇందులో అమితాబ్-ఫర్హాన్ చెస్ ఆడుతూ కనిపిస్తారని 'వజీర్' ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధవారం విడుదలైన 'వజీర్' ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ ప్రకారం ఫర్హాన్ భద్రతా దళాల్లో చేరి.. అమితాబ్ సాయంతో విలన్ నీల్ నితిన్ ముఖేష్‌ను ఎదుర్కోవడం ఈ సినిమా కథగా కనిపిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వజీర్' సినిమాలో జాన్ అబ్రహం, అదితిరావ్ హైదరి కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఫర్హాన్ ఏటీఎస్ అధికారిగా, అమితాబ్ వైకల్యమున్నా.. పదునైన మేధస్సు ఉన్న వ్యక్తిగా, అదితిరావు ఫర్హాన్ ప్రేమికురాలిగా కనిపించనున్నారు. -
రణ్‌బీర్ కపూర్‌పై ఎఫ్ఐఆర్
లక్నో: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతోపాటు ఫరాన్ అక్తర్‌పై కూడా కేసు నమోదు చేశారు. 'ఆస్క్ మి బజార్' అనే ఆన్లైన్ షాపింగ్ సైట్ కోసం వినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు ఇచ్చారని, ఉద్దేశ పూర్వకంగా కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మదియాన్ అనే పోలీస్‌స్టేషన్‌లో కేశవ్ నగర్‌కు చెందిన రాజత్ బన్సాల్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, సదరు ఆన్లైన్ షాపింగ్ సైట్ డైరెక్టర్లపై కూడా 420, 406 సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. బన్సాల్ ఆగస్టు 23న 40 అంగుళాల ఎల్ఈడీ టీవీకోసం ఆస్క్ మి బజార్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసి డెబిట్ కార్డుతో రూ.29,999 చెల్లించాడు. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా పది రోజుల్లో తనకు టీవీ డెలివరీ కాలేదని, కాని బిల్లు మాత్రం పంపించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రణబీర్ కపూర్, ఫరాన్ అక్తర్ ప్రకటనలు చూసే ఆ ఆన్ లైన్ షాపింగ్ సైట్‌కు ఆకర్షితుడినయ్యానని వారు తనను మోసం చేశారని చెప్పారు. -
సానియా మీర్జాగా...!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాగా పరిణీతి చోప్రా నటించనున్నారా? ఆ చాన్స్ ఉందని బాలీవుడ్లో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఫర్హాన్ అక్తర్ నటించిన ‘బాగ్ మిల్కా బాగ్’, ప్రియాంకా చోప్రా చేసిన ‘మేరీ కోమ్’ వంటి బయోపిక్స్ విజయం సాధించాక అగ్ర నటుల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ అందరూ ఈ తరహా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకురాలు ఫరాఖాన్ ఇప్పుడు సానియా మీర్జా జీవితాన్ని తెర మీద ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సానియాకి మాత్రం తన జీవితం ఆధారంగా సినిమా వస్తే ఓకేనట. అయితే, టైటిల్ రోల్‌ను పరిణీతి చోప్రా చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. మరి... నిజంగానే సానియా జీవితం వెండితెరకొస్తుందా? ఒకవేళ వస్తే, అందులో సానియాగా ఎవరు నటిస్తారు? తదితర ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. -
వెండితెరపై అరుణిమా జీవితం
అరుణిమా సిన్హా పేరు గుర్తుందా? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ ఆమే! ఈ మాజీ క్రీడాకారిణి గురించి, ఆమె జీవితంలో ఎదురైన విషాదం గురించి, పట్టుదలతో అన్నిటినీ ఎదిరించి శిఖరాగ్రానికి చేరిన ఆమె దీక్ష గురించి పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం మొదలైంది. దర్శక - నటుడు ఫర్హాన్ అఖ్తర్ ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి నిజజీవిత కథా చిత్రానికి తెరపై ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు అరుణిమా సిన్హా జీవితంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన ఈ వారం లక్నో వెళ్లి, అరుణిమను స్వయంగా కలసి, ఈ బయోపిక్ ప్రతిపాదన చేశారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ 2011లో రైలు ప్రయాణంలో దోపిడీ దొంగల్ని ప్రతిఘటించారు. ఆ ఘర్షణలో దొంగలు ఆమెను రైలులో నుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె కాళ్లలో ఒకటి తొలగించాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా ఆమె చేసిన ఎవరెస్ట్ శిఖరారోహణ గురించి ఫర్హాన్ చదివారు. ‘బోర్న్ ఎగైన్ ఆన్ ద మౌంటెన్’ అంటూ అరుణిమపై వచ్చిన పుస్తకం చదివిన ఫర్హాన్ అఖ్తర్ నేరుగా ట్విట్టర్లో నెల రోజుల క్రితం ఆమెను సంప్రదించారు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న అరుణిమ ఇటీవల తిరిగి రాగానే, ఈ వారం ఆమెను ఫర్హాన్ స్వయంగా కలిశారు. అరుణిమ లాంటి వ్యక్తుల జీవితంపై సినిమా తీస్తే అది మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఫర్హాన్ అభిప్రాయం. కాగా, ఈ సినిమాకు తనకు వచ్చే రాయల్టీతో నిరుపేదలు, వికలాంగులకూ ఒక ఉచిత స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలని అరుణిమ భావిస్తున్నారు. లక్నోకు దగ్గరలో ‘పండిట్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ’ పేరిట సంస్థను నెలకొల్పాలనుకుంటున్న ఆమె ఇప్పటికే తనకు వస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్నీ అటు మళ్లిస్తున్నారు. ఫర్హాన్ వెండితెర ద్వారా, అరుణిమ నిజజీవిత ఆచరణ ద్వారా - మార్గాలు వేరైనా, స్ఫూర్తిదాయక ప్రయత్నాలే చేస్తున్నారు కదూ! -
టీవీ షోకి... ప్రియాంక పాట
ప్రియాంకా చోప్రా మంచి నటి మాత్రమే కాదు... మంచి గాయని కూడా. ఆమె రూపొందించిన ‘ఎగ్జోటికా’ ఆల్బమ్ ఆ విషయాన్ని నిరూపించింది. వీలు కుదిరినప్పుడల్లా పాటలు పాడాలని ప్రియాంక అనుకుంటున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘దిల్ ధడక్నే దో’ చిత్రం కోసం ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి ప్రియాంక పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈసారి టీవీ షో కోసం పాడనున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం రూపొందించనున్న మ్యూజికల్ ఆల్బమ్‌కే ఆమె పాడనున్నారు. -
'గుడ్ విల్' రాయబారిగా ఫర్హాన్ అక్తర్
ముంబై: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్... ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం గుడ్ విల్ రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియాకు ఆయనను అంబాసిడర్ గా నియమించారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం చరిత్రలో పురుషుడిని రాయబారిగా నియమించడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్యసమితి ఇటీవల ప్రారంభించిన హి ఫర్ షీ కార్యక్రమం కోసం ఫర్హాన్ అక్తర్ పనిచేయనున్నారు. లింగ సమానత, మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫర్హాన్ అక్తర్ ఇప్పటికే తనంత తానుగా అత్యాచారం, లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. -
ఫవద్తో మళ్లీ నటిస్తా: సోనమ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నటుడు ఫవద్ఖాన్తో మరోసారి నటిస్తానని ‘ఖూబ్సూరత్’ సినిమా విజయపథంలో సాగిపోతున్న ఆనందంలో తేలియాడుతున్న నటి సోనమ్‌కపూర్ తెలిపింది. 1980లో ‘ఖూబ్సూరత్’ పేరిట హృషికేశ్ ముఖర్జీ సినిమా తీయగా దానిని రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఫవద్‌ఖాన్, సోనమ్‌కపూర్ నటించారు. ‘ఫవద్ సరసన వీలైనంత త్వరగా మరోసారి నటిం చాలని ఉంది. మా ఇరువురి నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. మా కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చింది. అందువల్ల త్వరలో మేమిద్దరం కలిసి మరో సినిమాలో నటిస్తాం’అని ఈ రాంఝ్నా సినిమా కథానాయిక చెప్పింది. ‘ఖూబ్సూరత్ సినిమాకి ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఈ స్పందనచూసి నాకే దిగ్భ్రాంతి కలిగింది. ఈ సినిమాని మరిన్ని థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది. ఈ సినిమా కేవలం 900 థియేటర్లలోనే విడుదలైంది. ప్రేక్షకుల స్పందన ఇంతగా ఉంటుందని మేము అనుకోలేదు. అసలు ఊహించలేదు కూడా. ఈ సినిమాని మరో ‘ఐషా’గా భావిస్తున్నారు. ఈ సినిమాచూసి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో అంత గొప్పగా చేశానని నేను అనుకోవడం లేదు’ అని అంది. కాగా ఫరాఖాన్‌తో కలిసి నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ ధనుష్ సరసన నటించిన ‘రాంఝ్నా’ తాజాగా విడుదలైన ఖూబ్సూరత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘నేను నటించడం అదృష్టంగా వారంతా భావిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వారంతా నాకు స్నేహితులుగా మారారు. నాతో నటించడాన్ని వారు అదృష్టంగా భావించినందువల్లనే మా మధ్య స్నేహం కొనసాగుతోంది. వారి గురించి నేనుకూడా అలాగే అనుకుంటాను’ అని సోనమ్ తన మనసులో మాట చెప్పింది. -
స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్‌కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్‌ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్‌ఘోష్, ఆనంద్‌రాయ్, దియామీర్జా, వీర్‌దాస్, షాహిద్‌కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
మరో సవాల్‌కి సిద్ధం!
నటుడిగా తనను సవాల్ చేసే పాత్రలను చేయడానికి అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ వెనకాడరు. అందుకు ఉదాహరణ ‘పా’ చిత్రం. ఓ వింత వ్యాధికి గురయ్యే పన్నెండేళ్ల బాలుడిగా ఆ చిత్రంలో నటించారు బిగ్ బి. తాజాగా మరో సవాల్‌ని స్వీకరించారు. ఈసారి పక్షవాతానికి గురైన వ్యక్తిగా నటించనున్నారు అమితాబ్. బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ హీరో. చెస్ ప్లేయర్ కావాలని, విజేతగా నిలవాలనే ఆకాంక్ష ఉన్న యువకుడి పాత్ర చేయనున్నారు ఫర్హాన్. తనకు గురువు అమితాబ్ అన్నమాట. చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన అమితాబ్ పడక మీదే ఉండి తన శిష్యుడికి చెస్ నేర్పించి, విజేతగా నిలబెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేశారనేదే ఈ చిత్రం ప్రధానాంశం. ఈ కథ వినగానే అమితాబ్ మరో ఆలోచనకు తావు లేకుండా వెంటనే పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. -
నన్ను బకరాను చేశాడు
ఫర్హాన్ అఖ్తర్ మంచి సినిమాలు తీయడమే కాదు ఎన్నో జోకులతో సహనటులను నవ్విస్తుంటాడు. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ షూటింగ్ సందర్భంగా తెలివిగా జోకులు వేస్తూ తనను బకరాను చేశాడ ని ఇందులో హీరోయిన్ విద్యాబాలన్ చెబుతోంది. ‘నవ్వడం నాకిష్టం. ఫర్హాన్ అందరినీ నవ్వించడానికి ఇష్టపడుతాడు. ఇంకేం.. నాలో అతనికి బకరా కనిపించింది. ఫర్హాన్ హాస్యచతురత అద్భుతం. ఎంతో తెలివైనవాడు కూడా. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చూశాను. మా ఇద్దరి కామెడీ నిజజీవితంలోని సంఘటనలకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది’ అని చెప్పింది. ఫర్హాన్ గతంలో తీసిన లక్ బై చాన్స్, జిందగీ నా మిలే దొబారా వంటి సినిమాలు చాలా ఇష్టమని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్‌లోనూ చాలా మంచి హాస్యం ఉంటుందని చెప్పింది. సులువుగా హాస్యాన్ని పండించే హీరోల్లో ఫర్హాన్ ఒకడని, పెద్ద కష్టపడకుండానే నటించినా ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతారంటూ ప్రశంసలు కురిపించింది. అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోవడం అతని ప్రత్యేకతని విద్య చెప్పింది. ‘మా అందరిలో ఏ ఒక్కరి నటన బాగా లేకున్నా సినిమా ఫలితం దారుణంగా ఉండేది. అయితే ఫర్హాన్, నా జోడీ అద్భుతంగా కుదిరింది’ అని చెప్పిన విద్య యూటీవీ సీఈఓ సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌ను 2012లో పెళ్లాడడం తెలిసిందే. వివాహం జరిగిన మూడు నెలలకు షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. వివాహిత అనుభవం కూడా ఈ సినిమాలో పాత్రపై ప్రభావం చూపి ఉండొచ్చని విద్య చెప్పింది. విద్య తొలి కామెడీ సినిమా ఘన్‌చక్కర్ కాగా షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ రెండోది. అయితే ఘన్చక్కర్లో ఎప్పుడూ గడగడా మాట్లాడే గృహిణిగా కనిపిస్తానని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ పాత్ర మాత్రం విభిన్నంగా ఉంటుందని విద్యాబాలన్ వివరించింది. -
'సిక్స్ ప్యాక్ నా పిల్లల్ని ఆకట్టుకోలేదు'
మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం కోసం బాలీవుడ్ నటుడు,దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కఠోరంగా శ్రమించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానులను, ప్రేక్షకులను ఫర్హాన్ ఆకట్టుకున్నారు. అయితే తన పిల్లలను తన సిక్స్ ప్యాక్ బాడీ ఆకట్టుకోలేదని ఆయన తెలిపారు. ఆ చిత్రంలో తాను పెరిగెత్తడమే వాళ్లను ఆనందానికి గురి చేసిందన్నారు. ఇటీవల తన కూతురి స్కూల్ లో జరిగిన రేసింగ్ ఈవెంట్ లో ఫర్హాన్ పాల్గొన్నారు. స్కూల్ రేసింగ్ కార్యక్రమంలో తాను ముందుండి పరిగెత్తడం తన కూతుళ్లు షక్యా, అకిరాలకు చెప్పలేనంత ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా చాలా గర్వంగా ఫీల్ అయ్యారని ఫర్హాన్ తెలిపారు. దర్శకుడు సాకెత్ చౌదరీ రూపొందించిన 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ప్రస్తుతం ఫరాన్ అక్తర్ బిజీగా ఉన్నారు. వైవాహిక బంధాలు, సంబంధాలు నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం అందర్ని ఆకట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఫర్హాన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సరసన విద్యా బాలన్ నటించింది. -
ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్
నటుడు, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ తన జోకులతో సహ నటులను తెగ నవ్విస్తుంటాడు. తనను బకరా చేసి విపరీతంగా నవ్వించేవాడని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చిత్రం విషయంలో తనకీ అనుభవం ఎదురైందని పద్మశ్రీ అవార్డు గ్రహిత విద్యాబాలన్ చెప్పింది. తనకు నవ్వడం అంటే ఇష్టమని, ఫర్హాన్‌కు నవ్వించడం అంటే ఇష్టమని ఆమె తెలిపింది. అతడి సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందని, బాగా తెలివైన వాడని ప్రశంసలు కురిపించింది. 'భాగ్ మిల్కా భాగ్'లో చాలా సీరియస్‌గా రన్నింగ్ మీదే దృష్టి పెట్టిన అక్తర్, విడిగా చూసినప్పుడు మాత్రం భలే సరదాగా ఉంటాడు. ఈ సినిమాలో కూడా కామెడీ బాగుంటుందని, నిజ జీవితంలో కూడా అది అలాగే ఉందని విద్యాబాలన్ చెప్పింది. గతంలో లక్ బై ఛాన్స్, జిందగీ న మిలేగా దుబారా లాంటి చిత్రాలు చూసి తాను ఫర్హాన్ ఫ్యాన్ అయిపోయానని, సాకేత్ చౌధురి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తామిద్దరికీ బాగా సూటయ్యిందని తెలిపింది. ఈ సినిమాలో తామిద్దరిలో ఎవరు సరిగా లేకపోయినా సినిమా ఫెయిలయ్యేదని, కానీ ఇద్దరం జోకులతో బాగా ఎంజాయ్ చేయడంతో సినిమా కూడా బాగా వచ్చిందని వివరించింది. -
ఆ రెండే నా బలం
న్యూఢిల్లీ: ప్రస్తుతం నటనతో బిజీగా ఉన్నా, రచన, దర్శకత్వ విభాగాల్లోనే తనకు పట్టు ఎక్కువని ఫర్హాన్ అఖ్తర్ చెబుతున్నాడు. హీరోగా కనిపించడానికి ముందు మనోడు చాలా సినిమాలకు దర్శకుడు, రచయిత, నిర్మాతగా వ్యవహరించాడు. ‘దిల్ చాహతా హై, లక్ష్య, డాన్ సినిమాలకు పనిచేసేటప్పుడు నటులతో ఎంతో సన్నిహితంగా ఉండేవాణ్ని. దర్శకుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను కాబట్టి నటనను కూడా ప్రయత్నించాలని అనుకున్నాను. మొదటి సినిమా రాకాన్ హిట్ అయింది కాబట్టి మరిన్ని అవకాశాలు వచ్చాయి. నా గురించి వేరే వాళ్లు ఏమనుకుంటారనేది నాకు అనవసరం. పనిని మరింత సమర్థంగా చేయాలన్నది నా పద్ధతి. ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని వివరించాడు. ఫర్హాన్ తాజా చిత్రం షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రచారం కోసం ముంబైలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పైవిషయాలు చెప్పాడు. ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్ హిట్ కావడంతో ఫర్హాన్‌కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి శ్రమకూ గుర్తింపు దక్కిందన్నాడు. ‘ప్రేక్షకులు నా నుంచి ఏదైనా ఆశిస్తే నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. నాకు అది స్ఫూర్తిని కూడా ఇస్తుంది. మల్టీస్టారర్ లేదా సోలో అన్నది కాదు.. కథ బాగుంటే ఎలాంటి వాటిలోనైనా నటిస్తాను’ అని చెప్పాడు. కార్తిక్ కాలింగ్ కార్తిక్, భాగ్ మిల్ఖా భాగ్ మినహా ఫర్హాన్ నటించినవన్నీ మల్టీస్టారర్ సినిమాలే. జోయా అఖ్తర్ తదుపరి సినిమాలోనూ ఈ 40 ఏళ్ల నటుడు రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాతోపాటు కనిపిస్తున్నాడు. సాకేత్ చౌదరి దర్శకత్వం వహించిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ శృంగార వినోదాద్మతక కథలో ఫర్హాన్, విద్యాబాలన్ జోడీగా కనిపిస్తారు. -
ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్..!
గత ఏడాది దీపికా పదుకొనేకి తీపి గుర్తులనే మిగిల్చిందని చెప్పాలి. వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆమె మార్కెట్ బాగా పెరిగింది. వ్యక్తిగతంగా రణవీర్‌సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తూ హ్యాపీగా ఉన్నారామె. ఇక, ఈ ఏడాది కూడా ఈ సొట్టబుగ్గల సుందరిదే హవా అని బాలీవుడ్‌వారు అంటున్నారు. ఆల్ హ్యాపీస్.. నో వర్రీస్ అన్న చందంగా దీపికా జీవితం సాగుతోంది. ఇప్పుడు ఆ ఆనందం రెట్టింపు కాబోతోంది. దానికి కారణం ఆమిర్‌ఖాన్. కథానాయిక అయిన ఈ ఏడేళ్లల్లో ఎంతోమంది స్టార్ హీరోస్ సరసన నటించిన దీపికాకి ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్ సరసన మాత్రం నటించే అవకాశం రాలేదు. ఇటీవల పలువురు బాలీవుడ్ ప్రముఖులకు తను ఇచ్చిన సక్సెస్ పార్టీలో కూడా దీపికా ఈ విషయం గురించే ప్రస్తావించారు. ఇది జరిగి నెల కూడా కాలేదు. ఈలోపు ఆమిర్ సరసన నటించే అవకాశం కొట్టేశారట. ఆమిర్ హీరోగా ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సంయుక్తంగా నిర్మించనున్న ఓ చిత్రంలో దీపికాని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. జూలై లేక ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారని వినికిడి. ప్రస్తుతం ఆమిర్, దీపికాతో సంప్రదింపులు జరుపుతున్నారట. అధికారికంగా సైన్ చేసిన తర్వాత దీపికా ఈ చిత్రం గురించి చెప్పాలనుకుంటున్నారు.