16 ఏళ్ల బంధం.. బద్దలైంది! | Farhan Akhtar and Adhuna Akhtar have ended their 16-year marriage | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల బంధం.. బద్దలైంది!

Published Thu, Jan 21 2016 6:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

16 ఏళ్ల బంధం.. బద్దలైంది! - Sakshi

16 ఏళ్ల బంధం.. బద్దలైంది!

మరో బాలీవుడ్ ప్రముఖ జంట విడిపోవడానికి సిద్ధమైంది. 16 ఏళ్ల పెళ్లి బంధాన్ని తెంచుకోవాలని ఉమ్మడిగా నిర్ణయించింది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్, ఆయన భార్య అధునా అఖ్తర్‌ తాము విడిపోతున్నట్టు  ప్రకటించారు. ఉమ్మడి సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ దంపతులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారని ఓ మీడియా సంస్థ తెలిపింది.

'మేం, అధునా, ఫర్హాన్‌ సామరస్యంగా ఉమ్మడి సమ్మతి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు మా పిల్లలే అత్యంత ప్రాధాన్యం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వారిని ఎలాంటి అభూతకల్పనలకు తావు లేకుండా సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. మేం హుందాగా ముందుకుసాగేందుకు వీలుగా మా ప్రైవసీని గౌరవించాలని కోరుతూ ప్రకటన విడుదల చేస్తున్నాం' అని వారు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఈ దంపతుల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నదని, ఆ కారణంతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

 

ఫర్హాన్ అఖ్తర్‌ ఇటీవల నిర్వహించిన ప్రజా కార్యక్రమాలు వేటిలోనూ అధునా కనిపించలేదు. ఫర్హాన్ తాజా చిత్రం 'వజీర్' సక్సెస్‌ మీట్ మొదలు.. డబ్బో రత్నానీ క్యాలెండర్ లాంచ్ వరకు ఏ కార్యక్రమంలో ఆమె కనిపించకపోవడం ఈ జంట మధ్య పెరిగిన దూరాన్ని చాటుతున్నది. 2000 సంవత్సరంలో 'దిల్‌ చాహ్‌తా హై' సినిమా ద్వారా దర్శకుడిగా ఫర్హాన్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో అధునా ఆయనకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమపెళ్లి చేసుకున్న ఈ జంట బాలీవుడ్‌లోనే మోస్ట్ స్టైలిష్‌ జంటగా పేరొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement