బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మార్చిలో షాదీ జరుపుకోవడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో కేవలం కుటుంబసభ్యులు, తక్కువమంది సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరుపుకోనున్నట్లు సమాచారం. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో లేదా పూల గార్డెన్‌లో ఈ వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట!
కాగా ఫర్హాన్ అక్తర్ ఇంతకముందే హెయిర్‌స్టైలిస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్నాడు. వీరికి షక్య, అకీరా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదహారేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఇక ఫర్హాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా నటించిన చిత్రం 'తుఫాన్'. ప్రస్తుతం ఆయన 'జీలే జరా' మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్‌తో పాటు 'జిందగీనా మిలేగీ దొబారా' యూనిట్ హృతిక్ రోషన్, అభయ్ డియోల్ కూడా సినిమాలో తళుక్కున మెరవనున్నట్లు గాసిప్ చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment