అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు | Farhan Akhtar slams Abu Azmi for his comment on Bengaluru's mass molestation! | Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు

Published Tue, Jan 3 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు

అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు

ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీపై బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాశ్చాత్య దుస్తులు ధరించడం వల్లే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చేసిన రిజ్వీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

‘మహిళలు విదేశీ దుస్తులు ధరించొద్దు. ఎందుకంటే పాశ్చాత్యుల్లా దుస్తులు తొడుక్కున్న మగాళ్లు కీచకులుగా మారి వేధింపులకు పాల్పడుతున్నారు. చొక్కా ధరించిన మగాడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఇంతకన్నా విడ్డూరం ఉండద’ని ట్వీట్ చేశాడు.

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై స్పందిస్తూ రిజ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాశ్చత్య దుస్తులు ధరించి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు. రిజ్వీ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో పలువురు తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement