![Farhan Akhtar confirms Don 3 and Jee Le Zaraa: I will definitely direct these two films](/styles/webp/s3/article_images/2024/06/22/Farhan%20Akhtar.jpg.webp?itok=dupQckeQ)
హిందీలో ‘దిల్ చాహ్‌తా హై’ (2001), ‘లక్ష్య’ (2004), ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006), ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్ (2011)’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. అయితే దాదాపు మూడేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ లీడ్ రోల్స్‌లో ‘జీ లే జరా’ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు ఫర్హాన్.
కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే రణ్‌వీర్ సింగ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చింది. ఈ సినిమా కూడా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా ఈ విషయాలపై స్పందించారు ఫర్హాన్. ‘‘నేను దర్శకుడిగా సెట్స్‌లోకి వెళ్లక పదేళ్లకు పైనే అయింది. నటుడిగా బిజీగా ఉండటం వల్లే డైరెక్షన్‌కి టైమ్ కుదరలేదు. ‘డాన్ 3’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభమవుతుంది.
అలాగే ‘జీ లే జరా’ కూడా నా దర్శకత్వంలోనే ఉంటుంది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా టైమ్ గడిచింది. సినిమా అంటే నేనొక్కడినే కాదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కాల్షీట్స్ అన్నీ కరెక్ట్‌గా కుదరాలి. నా దర్శకత్వంలో రాబోయే నెక్ట్స్ రెండు సినిమాలు ‘డాన్ 3, జీ లే జరా’నే’’ అన్నారు ఫర్హాన్ అక్తర్.
Comments
Please login to add a commentAdd a comment