Is Farhan Akhtar, Shibani Dandekar To Marry On February 21? Deets Inside - Sakshi
Sakshi News home page

Farhan Akhtar: రెండో పెళ్లికి డేట్ ఫిక్స్ చేసిన న‌టుడు?

Jan 16 2022 5:16 PM | Updated on Jan 16 2022 5:43 PM

Farhan Akhtar, Shibani Dandekar To Marry On February 21 - Sakshi

శిబానీ దండేక‌ర్ చేతిపై టాటూ వేయించుకుంది. ఈ ప‌చ్చ‌బొట్టు త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్పుకొచ్చింది. కాగా  మూడేళ్లుగా రిలేష‌న్‌లో ఉన్న శిబానీ..

బాలీవుడ్ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, సింగ‌ర్‌, గాయ‌ని శిబానీ దండేక‌ర్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కొన్నేళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం నిశ్చ‌యిందుకుంద‌న్న‌ ఊహాగానాలు ఊపందుకున్నాయి. వ‌చ్చే నెల 21న‌ వీళ్లు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ల‌వ్ బ‌ర్డ్స్ పెళ్లి ప‌నులు కూడా మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో శిబానీ దండేక‌ర్ చేతిపై టాటూ వేయించుకుంది. ఈ ప‌చ్చ‌బొట్టు త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మంటూ దానికి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కాగా  మూడేళ్లుగా రిలేష‌న్‌లో ఉన్న శిబానీ ప్రియుడు ఫ‌ర్హాన్‌ పేరును త‌న మెడ‌పై ప‌చ్చ‌బొట్టు వేయించుకున్న విష‌యం తెలిసిందే! ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవ‌త్స‌రంలో అధునా బ‌బానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ‌న్మించారు. ప‌ద‌హారేళ్లు క‌లిసి మెలిసి ఉన్న ఈ దంప‌తుల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు రావ‌డంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement