బాలీవుడ్‌ కొత్త 'డాన్‌'గా రణ్‌వీర్‌ సింగ్‌.. సెప్టెంబరులో స్టార్ట్‌ | Ranveer Singh Has Locked His Shooting Schedule For The Next Two Years For Work On Don 3 And Shaktimaan | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ కొత్త 'డాన్‌'గా రణ్‌వీర్‌ సింగ్‌.. సెప్టెంబరులో స్టార్ట్‌

Published Fri, Feb 16 2024 12:38 AM | Last Updated on Fri, Feb 16 2024 6:05 AM

Ranveer Singh Has Locked His Shooting Schedule For The Next Two Years For Work On Don 3 And Shaktimaan - Sakshi

బాలీవుడ్‌ కొత్త డాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన హిందీ ‘డాన్‌’ ఫ్రాంచైజీ చిత్రాల్లో ముందు 1978లో వచ్చిన ‘డాన్‌’లో అమితాబ్‌ బచ్చన్, ఆ తర్వాత 2006లో వచ్చిన ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’, ‘డాన్‌ 2’లో షారుక్‌ ఖాన్‌ హీరోలుగా నటించారు. అమితాబ్, షారుక్‌ డాన్లుగా మెప్పించారు. ఇప్పుడు కొత్త తరం డాన్‌గా బాలీవుడ్‌ తెరపైకి రణ్‌వీర్‌సింగ్‌ రానున్నారు.

‘డాన్‌ 3’లో రణ్‌వీర్‌ హీరోగా నటిస్తారని, ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’, ‘డాన్‌ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్‌ అక్తర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వెల్లడైంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులోప్రారంభించేలా ఫర్హాన్‌ అక్తర్‌ ప్లాన్స్‌ రెడీ చేస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం అజయ్‌దేవగన్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తున్న ‘సింగమ్‌ ఎగైన్‌’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తన వంతు చిత్రీకరణను పూర్తి చేసుకున్న తర్వాత ‘డాన్‌ 3’ షూటింగ్‌లో పాల్గొంటారట రణ్‌వీర్‌ సింగ్‌. ఈ చిత్రం  కోసం స్పెషల్‌గా మేకోవర్‌ కానున్నారు. ఇక ‘డాన్‌ 3’ తర్వాత  రణ్‌వీర్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘శక్తిమాన్‌’ చిత్రీకరణలో పాల్గొంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement