Shaktimaan
-
బాలీవుడ్ కొత్త 'డాన్'గా రణ్వీర్ సింగ్.. సెప్టెంబరులో స్టార్ట్
బాలీవుడ్ కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ మారనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన హిందీ ‘డాన్’ ఫ్రాంచైజీ చిత్రాల్లో ముందు 1978లో వచ్చిన ‘డాన్’లో అమితాబ్ బచ్చన్, ఆ తర్వాత 2006లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’లో షారుక్ ఖాన్ హీరోలుగా నటించారు. అమితాబ్, షారుక్ డాన్లుగా మెప్పించారు. ఇప్పుడు కొత్త తరం డాన్‌గా బాలీవుడ్ తెరపైకి రణ్‌వీర్‌సింగ్ రానున్నారు. ‘డాన్ 3’లో రణ్వీర్ హీరోగా నటిస్తారని, ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’, ‘డాన్ 2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటన వెల్లడైంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులోప్రారంభించేలా ఫర్హాన్ అక్తర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం అజయ్‌దేవగన్ మెయిన్ లీడ్ చేస్తున్న ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో రణ్వీర్ సింగ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తన వంతు చిత్రీకరణను పూర్తి చేసుకున్న తర్వాత ‘డాన్ 3’ షూటింగ్లో పాల్గొంటారట రణ్వీర్ సింగ్. ఈ చిత్రం కోసం స్పెషల్‌గా మేకోవర్ కానున్నారు. ఇక ‘డాన్ 3’ తర్వాత రణ్వీర్ సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారు. -
ప్రస్తుతం బాలీవుడ్ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?
ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ల తర్వాత బాలీవుడ్ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే... బ్రహ్మాస్త్రం ఐదేళ్లుగా సినీ లవర్స్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్‌కు రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్‌రోషన్ , రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల ఆధారంగా...! ట్రయాలజీ ఫిలింస్ తీసేంత స్కోప్ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ దర్శకులు నితీష్ తివారి, రవి ఉడయార్లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్ చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్, హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది. ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్‌కు చెందిన కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్ కపూర్ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త నాగిని వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఛత్రపతి మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే, రవీంద్ర జాదవ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. శక్తిమాన్ ఇక బుల్లితెర, వెండితెర సూపర్ హీరోస్‌లలో శక్తిమాన్‌కు ఆడియన్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ‘శక్తిమాన్’ టైటిల్‌తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, టైటిల్ రోల్లో రణ్వీర్ సింగ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. -
బెడ్ షేర్ అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా ఇటీవలే కపిల్ శర్మ కామెడీ షోను అసభ్యకరమైన షో అని విమర్శించి వార్తల్లోకెక్కాడు. ఇది మరువకముందే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. శారీరక సంబంధాన్ని కోరుకునే అమ్మాయిలు అసలు ఆడవాళ్లే కాదు, సెక్స్ వర్కర్లు అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. 'ఏ అమ్మాయైనా ఒక మగవాడి దగ్గరికి వెళ్లి నీతో బెడ్ షేర్ చేసుకోవాలని ఉంది అని అందంటే ఆమె అసలు ఆడదే కాదు. ఈ సమాజంలో బతికేందుకు అర్హత లేని ఓ వ్యభిచారి. తను పెద్ద బిజినెస్ నడుపుతోందని అర్థం. ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు మాటవరసకు కూడా అలా మాట్లాడరు. కాబట్టి మీరు అలాంటి అమ్మాయిల వలలో చిక్కుకోకండి, వారికి దూరంగా ఉండండి' అంటూ ఆన్లైన్ సెక్స్ రాకెట్ స్కామ్‌లో ఇరుక్కోవద్దని సూచించాడు ముకేశ్. అయితే చాలామంది శక్తిమాన్ మాటలను తప్పుపట్టారు. 'సారీ, ఈసారి మీరు తప్పుగా మాట్లాడారనిపిస్తోంది', 'గొప్ప లాజిక్‌లే! మిమ్మల్ని ఇంతవరకు ఇలా ఎవరూ అడగకపోవడంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు', 'అరేయ్ శక్తిమాన్, నువ్వు నెక్ట్స్ సభ్యసమాజంలోని పురుషుల గురించి ఓ వీడియో తీయ్' అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్! -
ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో
నిర్మాత ఎక్తా కపూర్ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. ఒకవేళ ఈ సీరియల్ పేరు ‘క్యుంకీ గ్రీక్ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభారతం తిరిగి వచ్చేసింది) -
శక్తిమాన్ మళ్ళీ ప్రసారం కాబోతుంది
-
కరోనా: ప్రజల ముందుకు మరో సీరియల్!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో.. ప్రజలంతా ఇంటే పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల కాలక్షేపం కోసం భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణంను కేంద్రం దూరదర్శన్‌లో ప్రసారం చేస్తోంది. అయితే ప్రజలకు డిమాండ్ మేరకు ప్రజల ఆదరాభిమానాలు పొందిన మరిన్ని సీరియల్స్‌ను బుల్లి తెరపైకి తీసుకురావాలని కేంద్ర ప్రసారమంత్రిత్వ శాఖ సంకల్పించింది. దీనిలో భాగంగానే చిన్నపిల్లలకి ఇష్టమైన శక్తిమాన్ సీరియల్‌ను ప్రజల ముందుకు తీసుకురానుంది. (ప్రజల ముందుకు రామాయణం) ఈ మేరకు శక్తిమాన్ హీరో ముఖేష్‌కన్నా మాట్లాడుతూ ‘కరోనా వచ్చిన ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మీ అందరికీ భారత ఇతిహాస గ్రంథమైన రామాయణం ఒకేసారి చూసే అవకాశం మరోసారి లభించింది. దీంతోపాటు మీ అందరికి ఎంతో నచ్చిన శక్తిమాన్ కూడా దూరదర్శన్‌లో ప్రసారం కాబోతుంది. అయితే ఎప్పటి నుంచి ఏ సమయంలో ప్రసారం కాబోతుందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తూ ఉండండి’ అని తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. కాగా శక్తిమాన్ తొలిసారి 1997లో ప్రారంభమై 2005 వరకు ప్రసారమైన విషయం తెలిసిందే. -
'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడోచ్!
పిల్లలు ఒకప్పుడు బాగా ఇష్టపడిన ఫేమస్ షో 'శక్తిమాన్' త్వరలో మళ్లీ బుల్లితెర మీద సందడి చేయనుంది. కొత్త సిరీస్ రిటర్న్ ఆఫ్ శక్తిమాన్‌ను ప్రసారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు శక్తిమాన్ పాత్రను పోషించిన ముఖేష్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం కొన్ని ఛానెళ్లను మాత్రమే సంప్రదించినట్లు ఆయన తెలిపారు. విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. శక్తిమాన్ రిటర్న్స్‌లో నటించడానికి మళ్లీ రెడీ అయిన ఖన్నా.. ఇప్పటికే లుక్ మార్చుకోవడంతో పాటు 8 కేజీల బరువు కూడా తగ్గారు. ప్రస్తుతం తాను సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఏం ప్రయత్నం చేయడం లేదని.. కానీ, 15 ఏళ్ల కిందట ఎలా కనిపించానో అలాగే ఉండటానికి మాత్రం ప్రయత్నిస్తున్నానని ఖన్నా వివరించారు. ప్రజలు ఖన్నానే శక్తిమాన్ గా భావిస్తారని... అందుకే స్వయంగా రీమేక్ కు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. తాను మహాభారతంలో భీష్ముడిగా నటించినప్పుడు చాలా చిన్నవాడినని, ఒక నటుడు నటించడానికి వయసుతో సంబంధం ఉండదని తాను నమ్ముతానని ఆయన అన్నారు. మొత్తానికి పిల్లలకు ఇష్టమైన శక్తిమాన్ తిరిగి వచ్చేస్తున్నాడు.. మరి అప్పటి విలన్ కిల్విష్ కూడా తిరిగి వస్తాడా? వేచిచూద్దాం..! -
'శక్తిమాన్'తో పోలీసుల హోలీ
ఉత్తరాఖండ్ పోలీసులు హోలీని విభిన్నంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు, నీళ్లు చల్లుకొని ఆనందాన్ని పంచుకునే సందర్భంలో ఆ పోలీసులు తమ ఆనందాన్ని తమతో పాటు విధులు నిర్వహించే మూగజీవంతో పంచుకున్నారు. అభిమానులు, మిత్రులు, బంధువులపై రంగులు చల్లడానికి బదులు ఇటీవల గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్'కు రంగులద్ది తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. డెహ్రాడూన్‌లో ఇటీవల జరిగిన ప్రదర్శనలో గొడవ జరిగి.. పోలీసు గుర్రం కాలు విరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కాలు విరిగిపోయిన శక్తిమాన్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి, కృత్రిమ కాలు అమర్చారు. దాంతో అది లేచి నిలబడింది కూడా. అలా కోలుకున్న గుర్రంతో డెహ్రాడూన్ పోలీసులు హోలీ ఆడుకున్నారు.