
'శక్తిమాన్'తో పోలీసుల హోలీ
ఉత్తరాఖండ్ పోలీసులు హోలీని విభిన్నంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు, నీళ్లు చల్లుకొని ఆనందాన్ని పంచుకునే సందర్భంలో ఆ పోలీసులు తమ ఆనందాన్ని తమతో పాటు విధులు నిర్వహించే మూగజీవంతో పంచుకున్నారు. అభిమానులు, మిత్రులు, బంధువులపై రంగులు చల్లడానికి బదులు ఇటీవల గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్'కు రంగులద్ది తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
డెహ్రాడూన్‌లో ఇటీవల జరిగిన ప్రదర్శనలో గొడవ జరిగి.. పోలీసు గుర్రం కాలు విరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కాలు విరిగిపోయిన శక్తిమాన్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి, కృత్రిమ కాలు అమర్చారు. దాంతో అది లేచి నిలబడింది కూడా. అలా కోలుకున్న గుర్రంతో డెహ్రాడూన్ పోలీసులు హోలీ ఆడుకున్నారు.