play
-
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్‌పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్ కళాకారిణి..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్ కళాకారిణి మన రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే.. కోల్‌కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్ కళాకారుడు పియానిస్ట్ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది. తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్‌కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..) -
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా
ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు. 2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్‌నాథ్‌ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్‌నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. 2018లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్‌నాథ్‌ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లా ఆడగలను.. భవిష్యత్పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్‌లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్‌లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
పాతటైర్లకు కొత్త రూపం.. ఐఐటీ విద్యార్థిని ఘనత
రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు. పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి. -
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
ప్లాన్ మార్చిన మాస్ మహారాజ్ రవితేజ
-
బుమ్రా ఇక ఐపీఎల్ కే పరిమితమా..!
-
కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?
గురజాడ వారి ‘కన్యాశుల్కం’ ఒక అపూర్వ నాటక శిల్పం. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతూనే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని ‘మానవవికాస వేదిక’ కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వనున్నారు. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, వారి సతీమణి ఇందిరాదేవిలకు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ జరగనున్న సమావేశంలో ‘కన్యాశుల్కం’ ప్రతులను అందివ్వనున్నారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలిచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలి పెట్టారు. లండన్‌లో మురికివాడల గురించి ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్ బెర్నార్డ్ షా ‘విడోవర్స్ హౌసెస్’ అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12వ తేదీన విజయనగరంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గుర జాడ ప్రదర్శించారు. (క్లిక్: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..) సమకాలీన సమస్యలపైన వచ్చిన తొలి నాటకంగా ‘కన్యాశుల్కం’ ప్రపంచ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. గిడుగు రామమూర్తికి బి.ఏ. లో సహ విద్యార్థి అయిన గురజాడ వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకోక ముందే, తన పాతికేళ్ల వయసులో వ్యవహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రాసి వ్యవహారిక భాషా ఉద్యమానికి బీజం వేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కన్యాశుల్కాన్ని నిషేధించకపోయినా, 1929లో బాల్య వివా హాల నిషేధ చట్టం రావడానికి ‘కన్యాశుల్కం’ నాటకం దోహదం చేసింది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు వారి సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) – రాఘవ శర్మ -
ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది
Girl Holds & Plays With Snake: పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు చూశాం. పాములతో డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, రబ్బరు బ్యాండ్‌లా పాముని తలకు చుట్టుకున్న వీడియోలు చూశాం. కొంతమంది అత్యంత విషపూరితమైన పాములను సైతం చాకచక్యంగా హ్యాండిల్ చేసే సాహసపూరితమైన ఫీట్లు కూడా చూశాం. కానీ వాటన్నింటిని చూసినప్పుడూ కలగని భయం ఈ వీడియో చూస్తే కచ్చితంగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఆ పాము ఆమెకు అసలు సహకరించకుండా ఏం చేసిందో తెలుసా! వివరాల్లోకెళ్తే....ఒక అమ్మాయి ప్రమాదకరమైన పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఐతే ఆ పాము ఆమెకు సహకరించడం లేదో దాని మూడ్ బాగోలేదో గానీ అది అసలు ఆమెకు సహకరించదు. ఆమెను పదే పదే కాటేసేందుకు ప్రయత్నించడమ కాకుండా చాలా సార్లు ఆమె చేతిపై కాటు వేసింది. ఆమె ఆ పాముని కంట్రోల్ చేసేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అది అసలు సహకరించదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగవైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) (చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్) -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా?
Dog Playing With Ghost Dog in Australia: నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఎవరు కచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైన తమ అనుభవాలు గురించి ప్రస్తావిస్తే అదంతా ఒట్టి బూటకం అని, అది కేవలం భయం కారణంగా వారికి అలా జరిగిందంటూ చాలామంది కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. నిజానికి ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా మెల్బోర్న్కు చెందిన డిమార్కో, తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు. అంతేకాదు ఆ సీసీపుటేజ్‌లో పారదర్శకంగా కనిపిస్తున ఒక దెయ్యం కుక్కతో తన పెంపుడు కుక్క ఆడుతున్నట్లు కనిపించదని తను చాలా భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు. పైగా తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు అదొక్కటే ఉందని అన్నాడు. ఆ సమయంలో తన కుక్క ఒక్కత్తే పెరట్లో ఉన్నట్లు తాను చూశానని అంతేకాక ఆ వీడియోలో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ దెయ్యం కుక్క అదృశ్యంగా వచ్చి తన పెంపుడు కుక్కతో ఆడుతోందని చెబుతున్నాడు. (చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!) -
రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మాజీ వ్యవసాయ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన రైతుగా కనిపించి ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన డా.రఘువీరా తాజాగా మరోసారి ఆకట్టు కుంటున్నారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరా ట్విటర్, ఫేస్బుక్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. (HBD Nivetha Thomas: ఈ విషయాలు తెలుసా మీకు?) తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతరం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. -
World Theatre Day: నాటకం సర్వజనీయం
ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశలు జరుపుకునే రోజు మార్చి 27. ఈ రోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. దాదాపు ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు అరవికివియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ అంగీకరించాక తదుపరి ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్య పూర్తి స్థాయిలో మొదలైంది. రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. ఐక్యరాజ్యసమితి, యునెస్కోలచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాల ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షలు జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగతసారాన్ని ఆ సంవత్సరం సందేశంగా ప్రపంచ రంగస్థలానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్తుడు అందించాడు. అప్పటినుంచి ప్రతీ ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. (నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం) – గాదిరాజు రంగరాజు, రంగస్థల నటుడు, చెరుకువాడ మొబైల్ : 87901 22275 -
తర్వాత ఏం జరుగుతుంది?
అభినవ్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరోహీరోయిన్లుగా మో„Š రూపొందించిన చిత్రం ‘ప్లే’. రాజ సులోచన నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం రూపొందింది. స్క్రీన్‌ప్లే బలం. తర్వాత సీన్లో ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతి పనికి ఓ ఉద్దేశం ఉంటుందనేది మా సినిమా పాయింట్. నటీనటులు కొత్తవారైనా పాత్రలకు పూర్తిన్యాయం చేశారు’’ అని చిత్రబృందం తెలి పింది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ మోక్షే చేశారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత: టి.ఎం.శేఖర్. -
బాలభానులు
పిల్లలను ఎండలోకి వెళ్లద్దంటే కోపంతో ముఖం ఎర్రటి పుచ్చకాయలా మారిపోదూ. మరి పిల్లలతో వేగటం ఎలా! అసలు వేగటం అనే మాట అనొచ్చా! ఆ పిల్లలే ఆడకపోతే వేసవిలో సందడి నిండుకోదూ?! మండుతున్న ఎండలు, వేడి వడగాడ్పులు, ఎర్రటి పిప్పర్మెంటులా తళతళలాడిపోతున్న సూర్యుడు, ఒళ్లంతా నిరంతర స్నానం, చంటిపిల్లల పాల సీసాలాగ.. పెద్దవాళ్ల నోటికి బాటిళ్లు, మరచెంబులు, మట్టి కుండలు... అన్నీ వేసవి అందానికి పరిమళాలు అద్దుతున్నట్లుగా గోచరిస్తాయి. పరిమళం అనడం ఎంతవరకు సమంజసం. సమంజసం, అసమంజసం అని ఆలోచిస్తూ, తర్కించే లోపుగా ఎండలు వెళ్లిపోతాయి గానీ, పరిమళం అనడమే సరైన పదం. ఇది ఎలాగంటారా.. మనసును పరిమళింపచేసి, తనువును పులకరింపచేసే మల్లెలు, విరజాజులు, సన్నజాజులు, సంపెంగలు.. అబ్బో ఆ పేర్లు అనుకుంటుంటేనే సుగంధాలు మన శరీరాలను తాకుతున్నట్లుగా అనిపించట్లేదా! ఒక్క రవ్వ ఎండ వేడిమి తగ్గితే, వేసవిని మించిన అందమైన కాలం ఉండదు అంటారు కవులు. అలా అంటూనే వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి గంధలేపనాన్ని ఉపయోగించమని, మల్లెలతో తడిసిన నీటితో స్నానం చేయమని కవితాత్మకంగా సందేశాలిస్తున్నారు. ఇదంతా ఒక విషయం. అసలు ఈ విషయం గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనమే ఆవంత కూడా కలగదు కదా! మరి ఇంకేం మాట్లాడుకోవాలనుకుంటున్నారా! మన ఆటలు... మన బాల్యం... మనం అమ్మమ్మ ఇంట్లో ఎలా గడిపాం.. ఇలాంటివి మాట్లాడుకుంటే మనసుకి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండదా మరి. పిల్లలను ఎండలోకి వెళ్లద్దంటే కోపంతో ముఖం ఎర్రటి పుచ్చకాయలా మారిపోదూ. మరి పిల్లలతో వేగటం ఎలా! అసలు వేగటం అనే మాట అనొచ్చా! ఆ పిల్లలే ఆడకపోతే ఇంటికి నిండుదనమేదీ! పిల్లలు పెద్దవారైపోతే కాలక్షేపం మాట అటుంచితే, ఇంట్లో సందడి నిండుకోదూ! ఇంట్లో పిల్లల్ని ముళ్లపూడి వారి బుడుగుల్ని చేసేయాలి, బాపుగారి బొమ్మల రామాయణంలో ముంచేయాలి. ఇవీ నచ్చలేదా. ఇంకేం అందరూ మంచి ఊహకర్తలు, వ్యూహకర్తలు అయితే సరి. చదరంగం, పచ్చీస్లు ఆడించేయడమే. చిన్నతనంలో ఆటల్లో సరదాగా ఎంత తొండి చేసేవాళ్లమో పిల్లలు తెలుసుకుంటే పరవశించిపోరూ! అందరి బాల్యమూ ఒకటే అనుకోరూ! ‘ఇరుకు అపార్ట్మెంట్లు... పిల్లలు ఆడుకోవడానికి చోటు లేదు... మా చిన్నప్పుడు చక్కగా మైదానంలో ఆడుకునేవాళ్లం...’ అంటూ అందరాని గతాన్ని తలచుకుంటూ వగచే కంటే, ఇంటిని ఆటస్థలంగా మార్చేయడమే. చాక్‌పీస్‌తో నేలమీద పచ్చీస్ గీయమంటే, పిల్లలు ఉత్సాహం పరుగులు తీసి, తమలోని కళాకారుడిని మేల్కొలిపి, అందరూ రవివర్మలు అయిపోతారు. వీరీ వీరీ గుమ్మడి పండు అంటూ పిల్లల్ని అందరినీ తలుపుల వెనకాల, దుప్పట్ల ముసుగులో దాచేస్తే, వాళ్లని కనిపెట్టవలసిన వాడు పెద్ద షెర్లాక్ హోమ్స్గానో, జేమ్స్బాండ్గానో, డిటెక్టివ్గానో మారిపోడూ. చింత గింజలను కుప్పలా పోసి, నోటితో ఉఫ్ అంటూ ఊదించి, ఒక గింజకు ఒక గింజ తగలకుండా ఏరుకుని కుప్పలు చేసుకోమంటే, పిల్లలు సెల్‌ఫోన్‌ను పక్కన పడేయకపోతారా! వామన గుంటలలో చింత గింజలు వేస్తూ లెక్కించడం నేర్పిస్తే, కాలిక్యులేటర్‌ను కర్చీఫ్‌తో కప్పెట్టేయరూ! వైకుంఠపాళి ఎవర్ గ్రీన్. నిచ్చెన ఎక్కగానే ‘ఆహా’ అని, పాము నోట్లో పడగానే ‘అయ్యో’ అనకుండా ఉండగలరా. రాక్షసుల పేర్లు నేర్చుకోరా. అరుకాసురుడంటే భయపడుతూ, వాడిని దాటగానే సంబరపడుతూ, పండిపోగానే బుజ్జి బుజ్జి చేతులతో చప్పట్లు చరుస్తూ, కలువ రేకుల ముఖాలను మరింత విప్పార్చరూ! – డా. పురాణపండ వైజయంతి -
శంఖంపై ప్రణవనాదం
సింహాచలం(పెందుర్తి): శంఖంపై నిర్విరామ ప్రణవనాదాలాపనతో పులకించింది సింహగిరి.శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చిన వరల్డ్ రికార్డ్ హోల్డర్, అమరావతి ఏఎస్పీ కె.నారాయణరావు దంపతులు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద 20 నిమిషాల పాటు ఆపకుండా శంఖంపై ఓంకారాన్ని ఆలపించారు. ఆ అమృతనాదం దేవస్థానంలో ప్రతిధ్వనించింది. అనంతరం వారు గోదాదేవికి కుంకుమార్చన చేశారు. వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. 30ఏళ్లుగా అఖండ శంఖారావం శంఖంతో వాతావరణంలో అననుకూల శక్తిని కూడా సానుకూల శక్తిగా మార్చుకోవచ్చని చెప్పా రు నారాయణరావు. మూడు దశాబ్దాలుగా దంపతులిద్దరం శంఖంపై ఓంకారాలాపన చేస్తున్నమని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని సరిహద్దు భద్రతాదళంలో పని చేసినప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉన్న డాక్టర్ చక్రవర్తి శంఖారావాన్ని పూరించేవారని, దాని ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న తాము 1989 నుంచి రోజూ పూజలో శంఖం పూరించడం ప్రారంభించామని తెలిపారు. ఉత్తర భారతదేశంలో శంఖాన్ని పూరించాకే ఆలయ సింహద్వారాలను తెరుస్తారన్నారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే యోగాలో శంఖాన్ని పూరించడం ద్వారా చాలా వ్యాధులు దూరం అవుతాయని చె ప్పారు. ఓంకార నాదాన్ని 20 నిమిషాల పాటు ఏకధాటిగా ఆలపించడం తమకు లభించిన అరుదైన రికార్డని, అది ఇప్పటికీ తమ పేరుమీదే ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. -
వామ్మో.. చిన్నమ్మ
♦ జైలు జీవితం నాటకం ♦ ఖరీదైన ఫ్లాట్‌లోనే కాపురం ♦ శిక్ష పెరిగే అవకాశం ఉందన్న డీఐజీ రూప ♦ రూ.2 కోట్ల హవాలా సొమ్ముపై ఆధారాలు ‘పేరుకే జైలు జీవితం.. ఖరీదైన అపార్టుమెంటులోనే కాపురం.. ఐదు గదుల్లో సకల సౌకర్యాలు.. లెక్కకు మించిన అందమైన చుడీదార్లు.. రంగు రంగుల చీరలు.. వామ్మో చిన్నమ్మ..’ అనిపిస్తోందని బెంగళూరు జైల్లో చిన్నమ్మ జీవితంపై డీఐజీ రూప చెప్పిన మాటలు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముప్పై రెండేళ్లపాటూ జయలలితతో ఖరీదైన జీవితాన్ని అనుభవించిన శశికళ జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. జైలు నిబంధనలను తుంగలో తొక్కి లగ్జరీగా బతికేందుకు రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా డీఐజీ రూప శశికళ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. కర్ణాటక ప్రభుత్వాన్ని గడగడలాడించే ఆరోపణలు చేసిన ఫలితంగా జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ విభాగ డీఐజీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక సాయంకాల తమిళ పత్రిక (తమిళ్ మురసు సాయంకాల దినపత్రిక)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ శనివారం ప్రచురితమైంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే. జైలులో చోటుచేసుకున్న అవకతవకలపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించాను. ఆ నివేదికలో పేర్కొన్నవన్నీ నూరుశాతం నిజాలే. జైల్లోని పరిస్థితులపై నాకు ఫిర్యాదు రాగానే నాలుగుసార్లు తనిఖీలు నిర్వహించాను. తనిఖీలకు వెళ్లినపుడల్లా ఖైదీలను కొందరు అధికారులు బెదిరింపులకు గురిచేసేవారు. దీంతో కొన్ని విషయాలు నా దృష్టికి రాకుండా పోయాయి. శశికళకు ఐదు గదులు కేటాయించింది నిజం. ఆ గదుల్లో ఎల్ఈడీ టీవీ, మంచం, కుక్కర్, కాఫీ మేకర్, సూప్ తయారీ సామన్లు ఇలా గృహోపకరణ వస్తువులన్నీ ఉన్నాయి. రెండో రూములో లెక్కలేనన్ని చుడీదార్లు, చీరలు, నైటీలు ఉన్నాయి. ఖైదీలు ధరించాల్సిన యూనిఫాంను ఆమె ఒక్కరోజు కూడా వేసుకోలేదని ఆమె గదిలో ఉన్న యూనిఫాం దుస్తుల మడతలే చెబుతున్నాయి. శశికళకు అవసరమైన మందులు బయట నుంచే వస్తున్నాయి. శశికళకు జైల్లో ఆపిల్ ఐ ఫోన్, రెండు సిమ్కార్డులున్నట్లు సమాచారం అందింది. అయితే ఆమెను తనిఖీ చేసినపుడు అవి దొరకలేదు. సెల్ఫోన్లు పనిచేయకుండా జైలులో అమర్చిన జామర్లు గురించి సిబ్బందిని ప్రశ్నించగా మరమ్మతులకు గురైనట్లు బదులిచ్చారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక పనిచేయాలి. అయితే శశికళ తదితరులు ఇంతవరకు ఏ పనీ చేయడం లేదు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్‌తోపాటూ పట్టుబడిన బెంగళూరు ప్రకాష్ జైల్లో అనేకసార్లు శశికళను కలుసుకున్న వైనాన్ని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అపార్టుమెంటులోనే చిన్నమ్మ మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శశికళ అసలు జైల్లోనే ఉండరు. జైలుకు సమీపంలోని ఒక అపార్టుమెంటులో నివసిస్తున్నట్లు నాకు సమాచారం అందింది. స్వయంగా పట్టుకోవాలని అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జైలు నుంచి బయటకు వెళుతూ నాకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఉంటే తీసుకునే చర్యలు చాలా భయంకరంగా ఉండేవి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. నేను చేసిన ఆరోపణలు రుజువైన పక్షంలో ఆమెకు మరికొన్ని ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది. అని రూప చెప్పారు. మరలా ఖైదీ జీవితం శశికళకు రహస్యంగా సాగుతున్న లగ్జరీ సౌకర్యాల గుట్టు రట్టు కావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలును కట్టుదిట్టం చేశారు. శశికళ తనకు కేటాయించిన సెల్లోనే కాలం గడుపుతున్నారు. ఆమె సెల్ చుట్టూ అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం ప్రారంభించాయి. జైలులో ఏం జరుగుతోంది అనే వివరాలు సీసీ కెమరాల ద్వారా బెంగళూరు శేషాద్రి రోడ్డులోని జైళ్లశాఖ అదనపు డీజీపీ, డీఐజీ గదుల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. దీంతో గత సోమవారం నుంచి జైలులో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోలేదు. బయటనుంచి వచ్చే భోజనం బంద్ కావడంతో ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే శశికళ ఆరగిస్తున్నారు. రేపే తొలి విచారణ పత్రం సమర్పణ డీఐజీ రూప ఏకంగా తనపై అధికారి డీజీపీపైనే ఆరోపణలు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. చెన్నైకి చెందిన ఒక ప్రముఖుడు శశికళకు ఏసీ, స్టవ్, ఫ్రిడ్జ్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. రూ.2 కోట్ల హవాలా సొమ్ము అధికారులకు ముట్టినట్లుగా విచారణాధికారులకు ఆధారాలు దొరికినట్లు సమాచారం. దీంతో తమ తొలిదశ విచారణ నివేదికను ఈనెల 24వ తేదీన కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే బెంగళూరు జైలు అధికారులు పలువురు సస్పెండ్ అవుతారని అంచనా. -
ఆడుకుంటూ అనంత లోకాలకు..
నీళ్లున్న పాత్రలో పడి చిన్నారి మృతి మొలగవల్లి (ఆలూరు రూరల్): ఆడుకుంటూ నీళ్లున్న చిన్న పాత్రలో పడి ఏడాది చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన మండలంలోని మొలగవల్లి గ్రామంలో శనివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆనంద్, ఈరమ్మలకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె రాజేశ్వరికి ఏడాది వయస్సు. తండ్రి ఆనంద్ 5ఏళ్ల పెద్ద కుమార్తెతో కలిసి బజారుకెళ్లాడు. ఈరమ్మ చిన్న కూతురు రాజేశ్వరిని కట్టపైన బొమ్మలు వేసి ఆడించుకుంటూ దుస్తులు ఉతుకుతోంది. ఉతికిన దుస్తులను మిద్దెపైన ఆరబెట్టేందుకు వెళ్లగా.. చిన్నారి రాజేశ్వరి ఆడుకుంటూ చిన్న కట్టపైన నుంచి కింద భాగంలో నీళ్లున్న చిన్న పాత్రలోనికి దొర్లిపడింది. తల పూర్తిగా నీటిలోకి ఉండిపోయింది. తల్లి మిద్దెపైన నుంచి కిందికి వచ్చి చిన్నారి రాజేశ్వరి నీళ్లున్న పాత్రలోకి పడి ఉండటంతో వెంటనే ఆ చిన్నారిని బయటకు తీసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆ చిన్నారి మృతి చెందింది. -
క్యారమ్స్‌లో సరికొత్త గిన్నిస్ రికార్డు
-
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
విశాఖ,కల్చరల్ పౌరాణిక జాన పద రంగస్థలానికి వన్నెతెచ్చి ప్రేక్షకుల్ని çమధురానుభూతి కల్గించాయి. మూడు రోజుల నుంచి రంగస్థాయి నాటక ఉత్సవాల్లో భాగంగా సురభి నాటకం ప్రదర్శనలు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ముగిశాయి. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు, నగర ప్రేక్షకుల కోరిక మేరకు మాయాబజారు నాటకాన్ని శుక్రవారం ఒకే రోజు రెండు ప్రదర్శనలు చేశారు. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ నాటకం నగరంలో మొత్తం మూడు ప్రదర్శనలు ఇచ్చారు. తొలిరోజు ప్రారంభంలోను, మళ్లీ ముగింపు రోజైన శుక్రవారం రెండు ప్రదర్శినలిచ్చి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ముగింపు కార్యక్రమంలో మాయాబజారు తొలు ప్రదర్శనను సినీరచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు జ్యోతిప్రజ్వలన చేశారు. మలి ప్రదర్శనను వాణిజ్య పన్నుల విభాగం అధికారిణి కవితారావు, విజయనిర్మాణ్కంపెనీ అధినేత డాక్టర్ సూరపునేని విజయకుమార్,ఆర్.వి.ఆర్.ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్. సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు ఆర్. నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యహరించారు. -
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
-
సురభి .. మాయాజాలం
కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్ గ్రాఫిక్స్లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్పెషల్ ఎఫెక్ట్స్‌తో రంగ స్థలంపై మంటలు పుట్టించడం, వర్షం కురిపించడం, వస్తువులను అదశ్యం చేయడం.. ఔరా అనిపించాయి. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్ ప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖ–కల్చరల్: కళాభారతి ఆడిటోరియంలో బుధవారం సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. రంగసాయి నాటక సంఘం నేతత్వంలో మూడు రోజులపాటు జరిగే సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా తొలిరోజు మాయాబజార్ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వర నాట్యమండలి(సురభి–హైదరాబాద్) కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అబ్బురపరిచిన సెట్టింగ్‌లు ఈ నాటకంలో ఘటోత్కచుడు గుహ సెట్టింగ్ ఆకట్టుకుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మాయా యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్ర ప్రభావంతో మంటలు, నీరు స్టేజ్‌పై ఆకస్మాత్తుగా రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒకే వేదికపై శశిరేఖ–అభిమన్యుడు వేర్వేరు దశ్యాలలో విరహ గీతాలాపన మైమరిపించింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, శశిరేఖ, అభిమన్యుడు, నారదుడు తదితర పాత్రల్లో ఆయా కళాకారులు చక్కటి ఆహార్యంతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ పద్యాలు పాడుతూ రక్తికట్టించారు. ప్రతి కళాకారుడు మనస్సుకు హత్తుకుపోయే విధంగా ప్రదర్శించి ఆయా పాత్రల్లో లీనమైపోయారు. మల్లాది వేంకటకృష్ణ శర్మ దర్శకత్వంలో ఎ.మనోహార్, ఆర్.నాగేశ్వరరావు(బాబ్జీ)ల నిర్వహణలో అద్భుత దృశ్యాలు సష్టించారు. వెంకటేశ్వరరావు సారథ్యంలో 65 మంది కళాకారులు ఈ నాటకానికి జీవం పోశారు. తొలుత ఈ నాటక ప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, టి.సరస్వతీదేవి, ఆదాయ పన్నుల శాఖ అధికారి హర్షవర్థన్, సురభి రథసారథి బాబ్జీ, రంగసాయి నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్ సాయి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
మైమరపించిన ‘మదర్‌థెరిసా’
-
పంచాయతీల అభివృద్ధిలో కీలకం కావాలి
డీపీఆర్సీ సభ్యులకు అదనపు కమిషనర్ సుధాకర్ సూచన సామర్లకోట : పంచాయతీల అభివృద్దిలో జిల్లా పంచాయతీ రీసోర్సు సెంటర్(డీపీఆర్సీ) సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు కమిషనర్ కె.సుధాకర్ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలడీపీఆర్‌సీ సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పంచాయతీల సిబ్బంది పనిలో లోపాల్ని గమనించి, సవరించాల్సిన బాధ్యత డీపీఆర్సీ సభ్యులపై ఉందన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ పంచాయతీ, పన్నుల సవరణ, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ పరిధిలోని సమస్యలను పూర్తిగా పరిష్కరించిన తరువాత మండల స్థాయిలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఆయా పంచాయతీలల్లో 21 రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పించామని, ఆ వ్యవధి చాలక పోతే మరో వారం పొడిగిస్తామని తెలిపారు. ఈ సెంటర్లలో సిబ్బంది సక్రమంగా పని చేసేలా చూడవలసిన బాధ్యత విస్తరణ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌లపై ఉందన్నారు. డీపీఆర్సీ సెంటర్లలో ండే డీఎల్పీఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేసి, ఆయా జిల్లాలకు మంచిపేరు తీసుకు రావాలని సూచించారు. ప్రిన్సిపాల్ తోట కైలాస్‌గిరీశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ఫ్యాకల్టీలు కె.ప్రభాకర్, రామోహనరావు, ఇ.నాగలక్ష్మి, సిల్వియా, జె.రాంబాబు, గోపాలరావు, సత్యవాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.