ఈ యాప్లోకి వెళ్లారో.. ఇక అంతే!
మొబైల్ ఫోన్ వచ్చాక.. శీఘ్ర సమాచారం సంగతి ఎట్లున్నా మనిషి మాత్రం తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. సగం భారం, బరువు దానిపైనే వదిలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని తన దగ్గరే పెట్టుకొని ఆలోచన మొత్తం ఫోన్కే అర్పించేశాడు. అందుకే, మనిషి కనుగొన్న అత్యాధునిక పరికరాల్లో ఎవరు అంగీకరించపోయినా చెత్త పరికరం మొబైల్ ఫోనే అని పెద్దలు అంటుంటారు. ఇదే సమస్య అనుకుంటే అందులో వచ్చే వీడియో గేమ్ లాంటి యాప్ లు మాములువి కావు. మనుసు ఆలోచనను పూర్తిగా మాయం చేసేవి. అందుకే అనర్థాలు.. ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న యాప్ పోక్ మన్ గో.
ఇది లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా విదేశాల్లో అయితే దీనికి ఫుల్ క్రేజ్. ఇందులో కనిపించే ఫోక్ మాన్ ను తరిమి క్యాచ్ చేయగలగడం ఈ ఆటలోనే ప్రత్యేకత. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ ఆడేటప్పుడు తల పక్కకు తిప్పుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే తన ఫోన్లో గేమ్ అడుగుంటూ వెళ్లి ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడ్డాడు. తన ఫోన్ లోని పోక్ మన్ను తరుముతూ తాను ఎటువైపు నడుస్తున్నాడనే విషయం కూడా మర్చిపోయి నీళ్లలో పడ్డాడు.
ఇప్పటికే ఈ గేమ్ ఆడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారంట. అచ్చం సెల్ఫీల సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో అలాంటివే ఈ గేమ్ ఆడేసమయంలో జరుగుతున్నాయట. ఆ మధ్య ఒకమ్మాయి ఈ గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటి వెళుతుండగా ఆమె ఢీకొట్టడం నుంచి తప్పించి వరుసగా కార్లు ఢీకొని గాల్లో లేస్తున్న కనీసం తన చుట్టు ఏం జరుగుతుందనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిందట.