Falls Into Lake
-
అయ్యో..! మరీ అంత కొనకు పోతావా భయ్యా..! క్షణాల్లోనే..
ఇందోర్: ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో సిమ్రోల్ ప్రాంతంలో జరిగింది. కారును లోయ అంచుకు నిలిపి ఉంచడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే.. కారును లోయకు ఆనుకుని నిలిపి ఉంచారు. లోయ కిందనే చిన్న సరస్సు లాంటి నిర్మాణం ఉంది. ఈ క్రమంలో కారు అనుకోకుండా కిందికి ఒరిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో కారులో ఓ అమ్మాయితో పాటు ఆమె తండ్రి ఉన్నారు. అయితే.. కారు డోర్ ఓపెన్ ఉన్న కారణంగా బాధితుడు కిందకు దూకేశాడు. పక్కనే సరస్సు ఉన్న కారణంగా అమ్మాయి నీటిలో పడిపోయింది. సరస్సు దగ్గరే ఉన్న మరికొంత మంది యువకులు నీటిలో దూకి బాధితురాలిని రక్షించారు. #मध्यप्रदेश: इंदौर मे रौंगटे खड़े कर देने वाला हादसा लोधिया कुंड में गिरी कार, पिकनिक मनाने गया था परिवार लोगों ने बचाई पिता और बेटी की जान, देखें वीडियो #Indore #MadhyaPradesh #Accident #Car #ViralVideos pic.twitter.com/34mlHZKCKu — Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) August 7, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. జలపాతం వద్ద జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచనలు చేశారు. ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్.. -
అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు..
జలుమూరు(శ్రీకాకుళం జిల్లా): ఆకలంటే అమ్మ తినిపించాలి.. భయం వేస్తే అమ్మను పట్టుకోవాలి.. ఏడిస్తే ఆ తల్లే ఓదార్చాలి. పొద్దస్తమానం అమ్మ కొంగు పట్టుకునే తిరగాలి. ఆరు, ఐదేళ్ల పిల్లల దినచర్య ఇది. కానీ ఇప్పుడా పిల్లలకు ఆకలంటే అమ్మ రాలేదు. భయం వేస్తే తల్లి ఓదార్చలేదు. ఎంత ఏడిచినా అమ్మ పలకడం లేదు. రెండేళ్ల కిందట తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు చిన్నారులకు ఇప్పుడు అమ్మ కూడా దూరమైపోయింది. మండలంలోని అల్లాడపేటకు చెందిన కోట రోహిణి(32) మంగళవారం చెరువులో పడి మృతి చెందారు. చదవండి: ‘అదృశ్యం’లో చిక్కుముడులు.. ‘బూచోడు కొట్టాడు’.. సమాధానం లేని ప్రశ్నలెన్నో? పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడపేటకు చెందిన రోహిణికి ప్రకాశం జిల్లాకు చెందిన మదన్‌మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి వెంకటేశ్(6), లాస్య(5)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట రోహి ణి భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రోహిణి కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తున్నారు. పది రోజుల కిందటే కన్నవారింటికి వచ్చా రు. నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న రోహిణి మంగళవారం గ్రామ శివారున ఉన్న చెరువు వద్దకు స్నానం కోసం వెళ్లారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? బట్టలు ఉతికి చెరువులో దిగగా.. అదే చోట లోతుగా ఉండడంతో లోపలకు వెళ్లిపోయారు. అవతలి గట్టున ఉన్న రజకులు ఆమెను చూసి రక్షించేందుకు హుటాహుటిన ఈ ఒడ్డుకు వచ్చారు. అప్పటికే రోహిణి అధికంగా నీరు తాగేయడంతో ప్రాణాలు పోయాయి. మృతురాలి తల్లి రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి తరలించారు. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు ‘అమ్మ లేవడం లేదేంటి’ అని అమ్మమ్మను అడుగుతుంటే చూసిన వారంతా కంటనీరు పెట్టుకున్నారు. రెండేళ్ల లోపే అమ్మానాన్నలను దూరం చేసుకున్న పిల్లలను చూసి అయ్యో అంటూ నిట్టూర్చారు. -
ఈ యాప్‌లోకి వెళ్లారో.. ఇక అంతే!
మొబైల్ ఫోన్ వచ్చాక.. శీఘ్ర సమాచారం సంగతి ఎట్లున్నా మనిషి మాత్రం తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. సగం భారం, బరువు దానిపైనే వదిలేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని తన దగ్గరే పెట్టుకొని ఆలోచన మొత్తం ఫోన్‌కే అర్పించేశాడు. అందుకే, మనిషి కనుగొన్న అత్యాధునిక పరికరాల్లో ఎవరు అంగీకరించపోయినా చెత్త పరికరం మొబైల్ ఫోనే అని పెద్దలు అంటుంటారు. ఇదే సమస్య అనుకుంటే అందులో వచ్చే వీడియో గేమ్ లాంటి యాప్ లు మాములువి కావు. మనుసు ఆలోచనను పూర్తిగా మాయం చేసేవి. అందుకే అనర్థాలు.. ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న యాప్ పోక్ మన్ గో. ఇది లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా యువతను ఆకట్టుకుంది. ముఖ్యంగా విదేశాల్లో అయితే దీనికి ఫుల్ క్రేజ్. ఇందులో కనిపించే ఫోక్ మాన్ ను తరిమి క్యాచ్ చేయగలగడం ఈ ఆటలోనే ప్రత్యేకత. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ ఆడేటప్పుడు తల పక్కకు తిప్పుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే తన ఫోన్లో గేమ్ అడుగుంటూ వెళ్లి ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడ్డాడు. తన ఫోన్ లోని పోక్ మన్ను తరుముతూ తాను ఎటువైపు నడుస్తున్నాడనే విషయం కూడా మర్చిపోయి నీళ్లలో పడ్డాడు. ఇప్పటికే ఈ గేమ్ ఆడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారంట. అచ్చం సెల్ఫీల సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో అలాంటివే ఈ గేమ్ ఆడేసమయంలో జరుగుతున్నాయట. ఆ మధ్య ఒకమ్మాయి ఈ గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటి వెళుతుండగా ఆమె ఢీకొట్టడం నుంచి తప్పించి వరుసగా కార్లు ఢీకొని గాల్లో లేస్తున్న కనీసం తన చుట్టు ఏం జరుగుతుందనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిందట.