
ఇందోర్: ప్రమాదవశాత్తు ఓ కారు లోయలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో సిమ్రోల్ ప్రాంతంలో జరిగింది. కారును లోయ అంచుకు నిలిపి ఉంచడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
అయితే.. కారును లోయకు ఆనుకుని నిలిపి ఉంచారు. లోయ కిందనే చిన్న సరస్సు లాంటి నిర్మాణం ఉంది. ఈ క్రమంలో కారు అనుకోకుండా కిందికి ఒరిగిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో కారులో ఓ అమ్మాయితో పాటు ఆమె తండ్రి ఉన్నారు. అయితే.. కారు డోర్ ఓపెన్ ఉన్న కారణంగా బాధితుడు కిందకు దూకేశాడు. పక్కనే సరస్సు ఉన్న కారణంగా అమ్మాయి నీటిలో పడిపోయింది. సరస్సు దగ్గరే ఉన్న మరికొంత మంది యువకులు నీటిలో దూకి బాధితురాలిని రక్షించారు.
#मध्यप्रदेश: इंदौर मे रौंगटे खड़े कर देने वाला हादसा
— Sanjay ᗪєsai 🇮🇳 (@sanjay_desai_26) August 7, 2023
लोधिया कुंड में गिरी कार, पिकनिक मनाने गया था परिवार
लोगों ने बचाई पिता और बेटी की जान, देखें वीडियो #Indore #MadhyaPradesh #Accident #Car #ViralVideos pic.twitter.com/34mlHZKCKu
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. జలపాతం వద్ద జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: Nuh violence: హర్యానా అల్లర్లు.. బుల్‌డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్..