'పొకిమాన్ గొ'తో జంట లీనమై.. | Couple leaving their two year old son at home while they played Pokemon Go | Sakshi
Sakshi News home page

'పొకిమాన్ గొ'తో జంట లీనమై..

Published Tue, Aug 2 2016 6:39 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

'పొకిమాన్ గొ'తో జంట లీనమై.. - Sakshi

'పొకిమాన్ గొ'తో జంట లీనమై..

పొకిమాన్ గొ గేమ్ ఆడుతూ ప్రమాదాల బారినపడుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాలకు గురైతే, ఓ వ్యక్తి ఏకంగా దేశ సరిహద్దును దాటేశాడు. తాజాగా ఓ జంట రెండేళ్ల కొడుకును ఇంట్లో వదిలిపెట్టి మొబైల్ ఫోన్లో ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని మరిచిపోయారు. పోలీసులు వచ్చి బాలుడ్ని రక్షించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఆరిజోనాలో ఈ ఘటన జరిగింది.

గత గురువారం రాత్రి బ్రెంట్ (27), బ్రియన్నె డాలీ (25) అనే దంపతులు కొడుకును ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పొకిమాన్ గొ గేమ్ ఆడుతూ, వీధుల వెంటతిరుగుతూ 90 నిమిషాలు వెళ్లిపోయారు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేరు. పాపం ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి నీళ్లు కూడా అందుబాటులో లేవు. ఇంటి బయట ఏడుస్తున్న చిన్నారిని చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారించారు. తొలుత ఇంధనం కోసం కారులో వెళ్లామన్న బ్రెంట్ జోడీ.. తర్వాత అసలు విషయం ఒప్పుకున్నారు. ఇలాంటి గేమ్లు ఆడేముందు వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించాలని పోలీసులు వారిని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement