
సాక్షి, హైదరాబాద్: మాజీ వ్యవసాయ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన రైతుగా కనిపించి ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన డా.రఘువీరా తాజాగా మరోసారి ఆకట్టు కుంటున్నారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరా ట్విటర్, ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. (HBD Nivetha Thomas: ఈ విషయాలు తెలుసా మీకు?)
తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతరం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment