![Viral Video: Girl Holding The Snake In Her Hands While Trying To Control - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/16/snake.jpg.webp?itok=PLIF-CrY)
Girl Holds & Plays With Snake: పాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు చూశాం. పాములతో డ్యాన్స్‌లు చేసిన వీడియోలు, రబ్బరు బ్యాండ్‌లా పాముని తలకు చుట్టుకున్న వీడియోలు చూశాం. కొంతమంది అత్యంత విషపూరితమైన పాములను సైతం చాకచక్యంగా హ్యాండిల్ చేసే సాహసపూరితమైన ఫీట్‌లు కూడా చూశాం. కానీ వాటన్నింటిని చూసినప్పుడూ కలగని భయం ఈ వీడియో చూస్తే కచ్చితంగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఆ పాము ఆమెకు అసలు సహకరించకుండా ఏం చేసిందో తెలుసా!
వివరాల్లోకెళ్తే....ఒక అమ్మాయి ప్రమాదకరమైన పాముతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఐతే ఆ పాము ఆమెకు సహకరించడం లేదో దాని మూడ్ బాగోలేదో గానీ అది అసలు ఆమెకు సహకరించదు. ఆమెను పదే పదే కాటేసేందుకు ప్రయత్నించడమ కాకుండా చాలా సార్లు ఆమె చేతిపై కాటు వేసింది. ఆమె ఆ పాముని కంట్రోల్ చేసేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అది అసలు సహకరించదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగవైరల్ అవుతోంది.
(చదవండి: ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment