ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
Published Fri, Aug 5 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
విశాఖ,కల్చరల్
పౌరాణిక జాన పద రంగస్థలానికి వన్నెతెచ్చి ప్రేక్షకుల్ని çమధురానుభూతి కల్గించాయి. మూడు రోజుల నుంచి రంగస్థాయి నాటక ఉత్సవాల్లో భాగంగా సురభి నాటకం ప్రదర్శనలు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ముగిశాయి. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు, నగర ప్రేక్షకుల కోరిక మేరకు మాయాబజారు నాటకాన్ని శుక్రవారం ఒకే రోజు రెండు ప్రదర్శనలు చేశారు. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ నాటకం నగరంలో మొత్తం మూడు ప్రదర్శనలు ఇచ్చారు. తొలిరోజు ప్రారంభంలోను, మళ్లీ ముగింపు రోజైన శుక్రవారం రెండు ప్రదర్శినలిచ్చి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ముగింపు కార్యక్రమంలో మాయాబజారు తొలు ప్రదర్శనను సినీరచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు జ్యోతిప్రజ్వలన చేశారు. మలి ప్రదర్శనను వాణిజ్య పన్నుల విభాగం అధికారిణి కవితారావు, విజయనిర్మాణ్‌కంపెనీ అధినేత డాక్టర్ సూరపునేని విజయకుమార్,ఆర్.వి.ఆర్.ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్. సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు ఆర్. నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యహరించారు.
Advertisement
Advertisement