
Dog Playing With Ghost Dog in Australia: నిజంగా దెయ్యాలు ఉన్నాయంటే ఎవరు కచ్చితంగా చెప్పలేరు. ఒకవేళ ఎవరైన తమ అనుభవాలు గురించి ప్రస్తావిస్తే అదంతా ఒట్టి బూటకం అని, అది కేవలం భయం కారణంగా వారికి అలా జరిగిందంటూ చాలామంది కొట్టిపారేస్తారే తప్ప ఎవరు నమ్మరు. పైగా వారిని పిచ్చివాళ్లగా చూస్తారు. నిజానికి ఈ ఆధునిక టెక్నాలజీ కారణంగా కొన్ని వీడియోల్లో రికార్డు అయ్యి ఉన్న ఆధారాలను చూస్తే గానీ ఎవ్వరూ అంత తేలికగా నమ్మరు. అచ్చం అలాంటి దెయ్యం వీడియోని చూసి ఇక్కడొక యజమాని షాక్‌కి గురవుతాడు.
(చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..)
అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియాలోని డిమార్కో అనే వ్యక్తి పెరటి తోటలో తన పెంపుడు కుక్కపిల్ల మరో కుక్కతో ఆడుతున్నట్లు సీసీపుటేజ్‌లో చూశానని చెబుతున్నాడు. పైగా మెల్‌బోర్న్‌కు చెందిన డిమార్కో, తన పెరటి తోట పూర్తిగా కంచెతో లాక్ చేసి ఉంటుందని. ఏ జంతువు లోపలకి వచ్చే ఆస్కారమే ఉండదని గట్టిగా చెబుతున్నాడు. అంతేకాదు ఆ సీసీపుటేజ్‌లో పారదర్శకంగా కనిపిస్తున ఒక దెయ్యం కుక్కతో తన పెంపుడు కుక్క ఆడుతున్నట్లు కనిపించదని తను చాలా భయభ్రాంతులకు గురయ్యానని చెప్పాడు.
పైగా తన కుక్క వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చూసినప్పుడు అదొక్కటే ఉందని అన్నాడు. ఆ సమయంలో తన కుక్క ఒక్కత్తే పెరట్లో ఉన్నట్లు తాను చూశానని అంతేకాక ఆ వీడియోలో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ దెయ్యం కుక్క అదృశ్యంగా వచ్చి తన పెంపుడు కుక్కతో ఆడుతోందని చెబుతున్నాడు.
(చదవండి: వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!)
Comments
Please login to add a commentAdd a comment