
శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా ఇటీవలే కపిల్ శర్మ కామెడీ షోను అసభ్యకరమైన షో అని విమర్శించి వార్తల్లోకెక్కాడు. ఇది మరువకముందే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. శారీరక సంబంధాన్ని కోరుకునే అమ్మాయిలు అసలు ఆడవాళ్లే కాదు, సెక్స్ వర్కర్లు అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.
'ఏ అమ్మాయైనా ఒక మగవాడి దగ్గరికి వెళ్లి నీతో బెడ్ షేర్ చేసుకోవాలని ఉంది అని అందంటే ఆమె అసలు ఆడదే కాదు. ఈ సమాజంలో బతికేందుకు అర్హత లేని ఓ వ్యభిచారి. తను పెద్ద బిజినెస్ నడుపుతోందని అర్థం. ఎందుకంటే పద్ధతి గల అమ్మాయిలు మాటవరసకు కూడా అలా మాట్లాడరు. కాబట్టి మీరు అలాంటి అమ్మాయిల వలలో చిక్కుకోకండి, వారికి దూరంగా ఉండండి' అంటూ ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ స్కామ్‌లో ఇరుక్కోవద్దని సూచించాడు ముకేశ్. అయితే చాలామంది శక్తిమాన్ మాటలను తప్పుపట్టారు. 'సారీ, ఈసారి మీరు తప్పుగా మాట్లాడారనిపిస్తోంది', 'గొప్ప లాజిక్‌లే! మిమ్మల్ని ఇంతవరకు ఇలా ఎవరూ అడగకపోవడంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు', 'అరేయ్ శక్తిమాన్, నువ్వు నెక్ట్స్ సభ్యసమాజంలోని పురుషుల గురించి ఓ వీడియో తీయ్' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది
నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్!
Comments
Please login to add a commentAdd a comment