ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్ | Farhan akhtar made me laugh a lot on 'Shaadi Ke Side Effects', says Vidya balan | Sakshi
Sakshi News home page

ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్

Published Mon, Feb 24 2014 2:12 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్ - Sakshi

ఫర్హాన్ తెగ నవ్వించేశాడు: విద్యాబాలన్

నటుడు, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఫర్హాన్ అక్తర్ తన జోకులతో సహ నటులను తెగ నవ్విస్తుంటాడు. తనను బకరా చేసి విపరీతంగా నవ్వించేవాడని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చిత్రం విషయంలో తనకీ అనుభవం ఎదురైందని పద్మశ్రీ అవార్డు గ్రహిత విద్యాబాలన్ చెప్పింది. తనకు నవ్వడం అంటే ఇష్టమని, ఫర్హాన్కు నవ్వించడం అంటే ఇష్టమని ఆమె తెలిపింది. అతడి సెన్సాఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందని, బాగా తెలివైన వాడని ప్రశంసలు కురిపించింది. 'భాగ్ మిల్కా భాగ్'లో చాలా సీరియస్గా రన్నింగ్ మీదే దృష్టి పెట్టిన అక్తర్, విడిగా చూసినప్పుడు మాత్రం భలే సరదాగా ఉంటాడు.

ఈ సినిమాలో కూడా కామెడీ బాగుంటుందని, నిజ జీవితంలో కూడా అది అలాగే ఉందని విద్యాబాలన్ చెప్పింది. గతంలో లక్ బై ఛాన్స్, జిందగీ న మిలేగా దుబారా లాంటి చిత్రాలు చూసి తాను ఫర్హాన్ ఫ్యాన్ అయిపోయానని, సాకేత్ చౌధురి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తామిద్దరికీ బాగా సూటయ్యిందని తెలిపింది. ఈ సినిమాలో తామిద్దరిలో ఎవరు సరిగా లేకపోయినా సినిమా ఫెయిలయ్యేదని, కానీ ఇద్దరం జోకులతో బాగా ఎంజాయ్ చేయడంతో సినిమా కూడా బాగా వచ్చిందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement