నన్ను బకరాను చేశాడు
నన్ను బకరాను చేశాడు
Published Tue, Feb 25 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
ఫర్హాన్ అఖ్తర్ మంచి సినిమాలు తీయడమే కాదు ఎన్నో జోకులతో సహనటులను నవ్విస్తుంటాడు. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ షూటింగ్ సందర్భంగా తెలివిగా జోకులు వేస్తూ తనను బకరాను చేశాడ ని ఇందులో హీరోయిన్ విద్యాబాలన్ చెబుతోంది. ‘నవ్వడం నాకిష్టం. ఫర్హాన్ అందరినీ నవ్వించడానికి ఇష్టపడుతాడు. ఇంకేం.. నాలో అతనికి బకరా కనిపించింది. ఫర్హాన్ హాస్యచతురత అద్భుతం. ఎంతో తెలివైనవాడు కూడా. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చూశాను. మా ఇద్దరి కామెడీ నిజజీవితంలోని సంఘటనలకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది’ అని చెప్పింది. ఫర్హాన్ గతంలో తీసిన లక్ బై చాన్స్, జిందగీ నా మిలే దొబారా వంటి సినిమాలు చాలా ఇష్టమని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్‌లోనూ చాలా మంచి హాస్యం ఉంటుందని చెప్పింది.
సులువుగా హాస్యాన్ని పండించే హీరోల్లో ఫర్హాన్ ఒకడని, పెద్ద కష్టపడకుండానే నటించినా ప్రేక్షకులు విపరీతంగా నవ్వుతారంటూ ప్రశంసలు కురిపించింది. అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోవడం అతని ప్రత్యేకతని విద్య చెప్పింది. ‘మా అందరిలో ఏ ఒక్కరి నటన బాగా లేకున్నా సినిమా ఫలితం దారుణంగా ఉండేది. అయితే ఫర్హాన్, నా జోడీ అద్భుతంగా కుదిరింది’ అని చెప్పిన విద్య యూటీవీ సీఈఓ సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌ను 2012లో పెళ్లాడడం తెలిసిందే. వివాహం జరిగిన మూడు నెలలకు షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ప్రాజెక్టుపై సంతకం చేసింది. వివాహిత అనుభవం కూడా ఈ సినిమాలో పాత్రపై ప్రభావం చూపి ఉండొచ్చని విద్య చెప్పింది. విద్య తొలి కామెడీ సినిమా ఘన్‌చక్కర్ కాగా షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ రెండోది. అయితే ఘన్‌చక్కర్‌లో ఎప్పుడూ గడగడా మాట్లాడే గృహిణిగా కనిపిస్తానని, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ పాత్ర మాత్రం విభిన్నంగా ఉంటుందని విద్యాబాలన్ వివరించింది.
Advertisement
Advertisement