సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ | Shaadi Ke side effects Movie Review | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్

Published Sun, Mar 2 2014 12:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్

సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్

పాజిటివ్ పాయింట్స్:

చిత్ర తొలి భాగం

కామెడీ, ఎమోషన్స్

క్లైమాక్స్

నెగిటివ్ పాయింట్స్:

రెండవ భాగంలో కథనం మందగించడం

రొటీన్ సీన్లు

నటీనటులు: ఫరాన్ అక్తర్, విద్యాబాలన్, ఇలా అరుణ్ తదితరులు

సంగీతం: ప్రీతమ్

నిర్మాతలు: ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్

దర్శకత్వం: సాకేత్ చౌదరీ

ఆనందంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ప్రేమికుల్లాంటి దంపతులు. కెరీర్ లో ఇంకా పూర్తిగా స్థిర పడని పరిస్థితులు.  జీవితంలో ఏదో సాధించాలనే వర్కింగ్ కపుల్స్ తాపత్రయం. ప్రతి రోజు దంపతుల మధ్య ఏదో విషయంపై వాగ్యుద్దం జరగడం.. అభిప్రాయబేధాలు చోటు చేసుకోవడం..మాట్లాడుకోవడం ఆపివేయడం ఇవన్ని మన జీవితంలో చోటుచేసుకోవడం వారి జీవితంలో కనిపించే సర్వసాధారణమైన అంశాలు. జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా సాగాలంటే ఆమె తప్పైనా అతను సారీ చెప్పడం, తనది తప్పైనా అతనే సారీ చెప్పడం తప్పనిసరవుతాయి.   సారీతో మళ్లీ మామూలు పరిస్థితి ఏర్పడటం. ఆతర్వాత మళ్లీ ఏదో గొడవ ప్రారంభం కావడం ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చోటు చేసుకునే అంశాలు కొనసాగుతునే  కనిపిస్తాయి, మనకు కూడా ఎదురవుతాయి. నిత్య జీవితంలో ఒక విషయాన్ని దాచి పెట్టడానికి ఓ అబద్ధం. ఆ అబద్దాన్ని దాచడానికి మరో అబద్ధం ఆడటం దంపతుల మధ్య కామన్. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుకొని సంఘటన వారి మధ్య ఎడబాటుకు గురి చేస్తే ఎమిటనేది.. ఒకరికొకరు దగ్గరకు కావడానికి దంపతులు ఎలాంటి మార్గాలను అన్వేషించారనే ఇతివృత్తానికి, హాస్యం, ఎమోషన్స్ జోడించి 'షాదీ కే సైడ్ ఎఫ్టెక్ట్స్' చిత్రానికి దర్శకుడు సాకేత్ చౌదరీ తెరరూపం కలిగించాడు.

కథ:

సిద్ (ఫరాన్ అక్తర్), త్రిష(విద్యబాలన్) దంపతులు. సిద్ కెరీర్ లో పూర్తిగా స్థిరపడని సంగీత కళాకారుడు. త్రిష ఓ కంపెనీలో ఉద్యోగిని. జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడటానికి, తమ కలలకు వాస్తవ రూపం ఇవ్వడానికి సగటు కుటుంబంలానే పోరాటం చేస్తుంటారు.  అయితే సరైన జాగ్రత్త పాటించకపోవడంతో త్రిష ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సిద్ కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో  త్రిష ఇష్టం లేకున్నాఅబార్షన్ కు ప్లాన్ చేస్తాడు. కాని ఓ సంఘటన సిద్ అబార్షన్ ఆలోచనకు బ్రేక్ వేస్తుంది. అయితే వారి జీవితంలో మిలీ అనే బుల్లి పాప ప్రవేశిస్తుంది. ఆతర్వాత వారి వ్యక్తిగత, వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? చివరికి ఎలా పరిష్కరించుకున్నారనే ప్రశ్నలకు తెర రూపం 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం.

ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలో సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న ఫరాన్ ఈ చిత్రంలో సిద్ పాత్రతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని మిల్కా పాత్రతో జాతీయ అంతర్జాతీయ సినీ విమర్శకులను మెప్పించిన ఫరాన్ సిద్ పాత్రతో మరోసారి విజృంభించాడు. ఈ చిత్రంలో ఓ మధ్య వయస్కుడైన వివాహితుడుగా కనిపించి తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే 'బెస్ట్ ఫాదర్'గా ప్రూవ్ చేసుకోవడానికి, ఓ మంచి భర్త అనే నమ్మకం కలిగించే, ఓ మ్యూజిక్ కంపోజర్ గా స్థిర పడటమే లక్ష్యంగా శ్రమించే సిద్ పాత్రను పోషించి నూరు మార్కులు కొట్టేశాడు.  త్రిష పాత్రలో నటించిన విద్యబాలన్ తో నువ్వా నేనా అనే రీతిలో ఫెర్మార్మెన్స్ తో అదరగొట్టేశాడు.

ఇక త్రిష పాత్రలో ఓ గృహిణి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఎలా ఆలోచిస్తారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ తల్లి ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఓ బిడ్డకు తల్లిగా, భార్యగా రెండు కోణాలున్న పాత్ర మధ్య జరిగే మానసిక సంఘర్షణను విద్యాబాలన్ చక్కగా పలికించారు. కహానీ, డర్టీ పిక్చర్ తర్వాత మరోసారి త్రిష పాత్రలో విద్యబాలన్ తన ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను ఆలరించారు.

ఈ చిత్రంలో ఫరాన్, విద్యబాలన్ లు సగం బలంగా మారితే.. సాకేత్ చౌదరీ స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో క్రెడిట్ కొట్టేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి చిత్రం 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ద్వారా ప్రేక్షకులు, విమర్శకుల దృష్టిని తనపైకి తిప్పుకున్న సాకేత్ .. రెండవ చిత్రంతో తనపై నెలకొన్నఅంచనాలను పూర్తిగా అధిగమించాడు. ఫరాన్, విద్యబాలన్ ల మధ్య చక్కటి కెమిస్ట్రీని డిజైన్ చేయడంలో, ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా రూపొందించడంలో దర్శకుడిగా సాకేత్ సఫలమయ్యాడు. భార్య, భర్తల మధ్య రిలేషన్స్ చాలా సహజంగా చిత్రీకరించి తన సత్తాను చాటుకున్నాడు. 'ఎలక్ట్రిఫైయింగ్' ఆరంభాన్ని అందించిన సాకేత్...అదే జోష్ తో హై ఓల్టేజ్ కథనంతో తొలిభాగాన్ని పరుగులెత్తించాడు. అయితే కథలో ఉండే పరిమితుల వల్ల అదే వూపును సాకేత్ రెండవ భాగాన్ని కొనసాగించలేకపోవడం ప్రేక్షకుడ్ని కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. కాని ఓ చక్కటి క్లైమాక్స్ తో ముగించడంతో ప్రేక్షకుడిలో కలిగిన అసంతృప్తి దూరం చేయగలిగాడు. దర్శకుడి కథ, కథనాలకు తోడు ప్రీతం సంగీతం, ఫోటోగ్రఫీ అదనపు ఎస్సెట్ గా నిలిచాయి. 'హ్యారీస్ నాట్ ఏ బ్రహ్మచారి', 'యాహా వహా', దేశీ రొమాన్స్, 'తౌబా మే' పాటలు బాగున్నాయి. ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. 

-రాజబాబు అనుముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement