Farhan Aktar
-
అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ
Javed Akhtar Confirms Actor Farhan Akhtar Second Marriage: బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016లో తన భార్య అధునా బబానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్ అప్పటి నుంచి సింగర్ శిబానీ దండేకర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఫర్హాన్ స్పందించలేదు. అంతేకాదు రెండో పెళ్లిపై కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ దీంతో ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అని అందరిలో సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో ఫర్హాన్ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ క్వారిటీఇ ఇచ్చాడు. ఇటీవలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఫర్హాన్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అవును ఫర్హాన్ పెళ్లి చేసుకోబోతున్నాడని స్పష్టం చేశాడు. ‘అందరూ అనుకుంటున్నట్లుగానే ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ముహుర్తానికి డేట్ ఫిక్సైయింది. ఈ పెళ్లికి పెద్దగా ఎవరిని ఆహ్వానించడం లేదు. కొద్దిమంది సన్నిహితులు, బంధువులను మాత్రమే పిలిచాం. కరోనా పరిస్థితులు నేపథ్యంలో వారి పెళ్లిని నిరాండబరంగా ప్లాన్ చేసుకున్నారు’ అని జావేద్ అక్తర్ తెలిపాడు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇక తన కాబోయే కోడలు శిబానీపై జావేద్ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ మేరకు ఆయన శిబాని చాలా మంచి అమ్మాయి. మా కుటుంబ సభ్యులకు కూడా తను బాగా నచ్చింది. వారిద్దరికి ఎంతో కాలంగా పరిచయం ఉంది, వారిద్దరి రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఫర్హాన్, శిబానిలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవత్సరంలో అధునా బబానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పదహారేళ్లు కలిసి మెలిసి ఉన్న ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. -
త్వరలో జగ్గుభాయ్ బాలీవుడ్ ఎంట్రీ, ఆ హీరోకు విలన్‌గా..
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీతో విలన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగు లేని నటుడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏ తరహా పాత్రలో అయినా ఇమిడిపోతు తనలోని నటుడిని తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిమాండ్ ఉన్న నటుడిగా మారారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల్లోని హీరోలకు ధీటైన విలన్ ఎవరంటే జగ్గుభాయ్ పేరు వినిపించేంతగా ఆయన తెచ్చుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా అందరి ఆదరణ పొందుతూ దక్షిణాన బిజీగా మారిన ఆయనకు కొంతకాలంగా బాలీవుడ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే హిందీ సినిమాల్లో నటించే ఆసక్తి లేకపోవడంతో ఇప్పటి వరకు నో చెబుతూ వచ్చారట జగపతి బాబు. అయితే ఈ తాజా బజ్ ప్రకారం ఆయన త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా రూపొందనుంది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సినిమాలో మెయిన్ విలన్ కోసం జగ్గుభాయ్‌కి పిలుపు వచ్చిందట. ఇక వస్తున్న అవకాశాలను వదులేక ఆయన ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ మూవీలో డిసెంబర్ నుంచి సెట్‌పై రానుందని టాక్. ఇందులో ఫర్హాన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హరోయిన్‌గా నటించనుంది. కాగ ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సలార్’ చిత్రంలో రాజమన్నార్ అనే విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
హృతిక్ రోషన్ చేసిన పనికి చస్తా అనుకున్న
ముంబై: షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ చేసిన పనికి తన పై ప్రాణాలు పైనే పోయాయంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అభయ్ డియోల్. కొన్ని క్షణాల పాటు మృత్యుదేవత నా కళ్ల ముందే కనిపించిందని, అయితే అదృష్టం బాగుండటంతో ప్రాణాలు దక్కాయంటూ జిందగి నామిలేంగే దొబారా సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. లోయలోకి కారు జోయా అక్తర్ దర్శకత్వంలో హృతిక రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్‌లు కలిసి నటించిన జిందగి నామిలేంగే దొబారా చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సంరద్భంగా అభయ్ ఆ నాటి విషయాలు చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగేప్పుడు హృతిక్ కారు డ్రైవ్ చేస్తుంటే తాను, ఫర్హాన్ అక్తర్ కారు వెనుకు సీట్లో కూర్చున్నామని.. అయితే ఏటవాలుగా ఉన్న ప్రాంతం ప్రయాణించేప్పుడు, సడన్‌గా కారును ఆపి హృతిక్‌రోషన్ బయటకు వెళ్లాడని చెప్పారు. అయితే ఆ సమయంలో కారు హ్యాండ్‌బ్రేక్ వేయడం హృతిక్ మరచిపోయాడని.. దాంతో కారు నెమ్మదిగా లోయలోకి వెళ్లడం ప్రారంభించిందన్నారు. వెంటనే అలెర్టయిన ఫర్హాన్ కారు దిగేందుకు రెడీగా అయ్యాడని, తనకేమో మెదడు మొద్దుబారిపోయి సీటులో అలానే కదలకుండా కూర్చున్నట్టు అభయ్ చెప్పాడు. బ్రేక్ వేసిన హృతిక్ కారులోయలో పడుతుందని.. ఇక తనకు చావు తప్పదని ఫిక్స్ అయిన టైంలో పొరపాటు గ్రహించిన హృతిక్, వెంటనే వెనక్కి వచ్చిబ్రేక్ వేయడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఆనాటి ఘటనను వివరించారు అభయ్. ప్రేక్షకులను రంజిప చేసే ప్రయత్నంలో కొన్ని సార్లు తమకు తెలియకుండానే రిస్క్‌లో పడుతుంటామని చెప్పాడు అభయ్ -
నాతో పెట్టుకోకు: హీరోను ఓడించిన హీరోయిన్
హీరో సిద్ధాంత్ చతుర్వేది, హీరోయిన్ కత్రినా కైఫ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.. చిత్రబృందంలోని సభ్యులు ఆటను కన్నార్పకుండా చూశారు. నువ్వానేనా అన్న తరహాలో ఆడిన వీరి ఆటలో చివరకు కత్రినా గెలిచింది. దీనికి సంబంధించిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో కత్రినా, సిద్ధాంత్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలుగా ‘ఫోన్ బూత్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉదయ్‌పూర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో కత్రినా, సిద్ధాంత్ సరదాగా బ్యాట్లు పట్టారు. కాగా ఈ గేమ్ మధ్యలలోనే ఇశాంత్ సరదాగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఈ విధంగా ఫోన్ బూత్ సినిమా షూటింగ్ విరామ సమయంలో నటీనటులు తమకు ఇష్టమైన క్రీడలు ఆడుతూ సేద తీరుతున్నారు. హర్రర్ కామెడీ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఫర్హాన్ అక్తార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
నెపోటిజం: ఆ ఆవార్డును బైకాట్ చేశాను
ముంబై: ‘జిందగీ నా మీలేగే దోబారా’ సినిమా విడుదలయ్యాక అన్ని ఆవార్డు వేడుకల్లో తనని, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్‌రోల్ నుంచి తగ్గించి హృతిక్ రోషన్‌ను ప్రతిపాదించారని నటుడు అభయ్ డియోల్ పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ పరిశ్రమలో బంధుప్రీతి(నెపోటిజం) ఎక్కువగా ఉందంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్బంగా సినీయర్ నటుడు అభయ్ డియోల్ కూడా పరిశ్రమలో నెపోటిమ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు) "జిందగి నా మిలేగి దోబారా, 2011లో విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎదుర్కొన్న చేదు అనుభవాలు ప్రస్తుతం పరిస్థితిలో జ్ఞాప్తికి తెస్తున్నాయి. ఎందుకంటే నేను, ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశాం. కానీ విడుదలైన అనంతరం దాదాపు అన్ని అవార్డు ఫంక్షన్లో నన్ను, ఫర్హాన్‌ను ప్రధాన పాత్రల నుంచి తగ్గించి, సపోర్ట్ యాక్టర్స్ నామినేట్ చేశారు. ఈ సినిమాలో హృతిక్, కత్రినా ప్రధాన పాత్రల్లో ఉత్తమ నటులుగా ఆవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఒక పురుషుడు, స్త్రీ ప్రేమలో పడే చిత్రం. అతను తీసుకునే ఏ నిర్ణయాలకైనా అతడి స్నేహితులు మద్దతు ఇస్తారు. దీని ప్రకారం వారిని ప్రధాన పాత్రలుగా ఎంపిక చేశారు. అంటే పరిశ్రమలో మిమ్మల్ని తగ్గించడానికి ఎన్నో రహస్య లేదా బహిరంగ మార్గాలు ఉంటాయి. మోసపూరితమైన ఈ ఆవార్డును నేను తిరస్కరించాను. కానీ ఫర్హాన్ మాత్రం సరే అన్నాడు. #familyfareawards’ అంటూ అభయ్ రాసుకొచ్చాడు. (సంగీత పరిశ్రమలో పెద్ద మాఫియా ఉంది) View this post on Instagram “Zindagi Na Milegi Dobara”, released in 2011. Need to chant this title to myself everyday nowadays! Also a great watch when anxious or stressed. I would like to mention that almost all the award functions demoted me and Farhan from main leads, and nominated us as “supporting actors”. Hrithik and Katrina were nominated as “actors in a leading role”. So by the industry’s own logic, this was a film about a man and a woman falling in love, with the man supported by his friends for whatever decisions he takes. There are many covert and overt ways in which people in the industry lobby against you. In this case it was shamelessly overt. I of course boycotted the awards but Farhan was ok with it. #familyfareawards Very creative artwork @kalakkii A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 19, 2020 at 3:15am PDT అంతేగాక ఇటీవల దర్శకుడు అభినవ్ కశ్యప్ హీరో సల్మాన్ ఖాన్ అతని సోదరుడు ఇప్పటికే బాలీవుడ్లో అర్భాజ్ ఖాన్లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇక పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయో చెబుతు హీరోయిన్ రవీణ టాండన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హీరో సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం(జూన్ 14)న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడిని 7 సినిమాలను నుంచి తొలగించడం.. అతడి సినిమాల విడుదలను నిలిపివేయడంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులపై బీహార్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) -
తుఫాన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు, ‘బాగ్‌మిల్కాబాగ్’ ఫేమ్ ఫర్హాన్ అక్తర్ తన కొత్త సినిమా తుఫాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బాక్సింగ్ రింగ్‌లో సాధన చేస్తున్న ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న తుఫాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నామని అక్తర్ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాతో కూడిన ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఓమ్ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన బాగ్‌మిల్కాబాగ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తుఫాన్ సినిమా షూటింగ్‌కు ముందు నుంచే ఫర్హాన్ తన పాత్ర కోసం సాధన చేయడం విశేషం. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ‘అద్భుత నటుడు ఫర్హాన్‌తో నటించడం థ్రిల్‌కు గురిచేస్తుంద’ని పరేష్ రావల్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. -
ఆ నటితో సినిమా చేయాలని ఉంది : విల్ స్మిత్
న్యూఢిల్లీ : హాలీవుడ్ ‘మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్’ ఎవరూ అంటే ఠక్కున విల్ స్మిత్ అని చెప్పేస్తాం. నటుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్ హాలీవుడ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ నటుడికి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్ ఫర్హాన్ అక్తర్‌తో మాట్లాడుతూ.. తన ఇష్టాన్ని విల్ స్మిత్ బయటికి చెప్పారు. దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్ స్మిత్, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నమని, కానీ అది ఇప్పటి వరకు జరుగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఇలా ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందనే ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సమయంలోనే విల్ స్మిత్‌తో ఫర్హాన్ అక్తర్, భాంగ్రా స్టెపులను వేయించారు. విల్ స్మిత్‌తో సంభాషించడం చాలా సంతోషభరితంగా ఉందని, విత్ స్మిత్ వేసిన భాంగ్రా స్టెపుల వీడియోను ఫర్హాన్ అక్తర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మహమ్మద్ అలీ బయోపిక్‌లో విల్ స్మిత్, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ ఆన్‌స్క్రీన్‌లో బాక్సింగ్ ఛాంపియన్ క్యారెక్టర్లో నటించడం, నా కెరీర్లోనే ఎంతో నిర్మాణాత్మక సమయం. ఇది నన్ను పూర్తిగా మార్చేస్తుంది’ అని తెలిపారు. ఐయామ్ లెజెండ్, ఐ, రోబోట్, ఇండిపెండెన్స్ డే, మెన్ ఇన్ బ్లాక్ వంటి సినిమాల్లో విల్ స్మిత్ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. -
‘ఆరేళ్ల వయసులో నాపై అత్యాచారం’
సాక్షి, సినిమా : తమ పిల్లల భవితవ్యం బాగుండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే ఆ ప్రయత్నంలో జరిగే పొరపాట్లు.. తర్వాత పిల్లల్ని జీవితాంతం నీడలా వెంటాడుతాయి. అందుకే తల్లిదండ్రులు వారిని కెరీర్‌ను చాలా జాగ్రత్తగా గమనించి కాపాడాలంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటి డైసీ ఇరానీ. చిన్న వయసులో తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఓ ప్రముఖ పత్రికు ఆమె వివరించారు. ఆరేళ్ల వయసులో సంరక్షుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపారు. 1950-60 మధ్య కాలంలో బాల నటిగా రాణించిన డైసీ.. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించారు. ‘అప్పుడు నా వయసు ఆరేళ్లు. మా అమ్మ ...నాజర్ అనే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని నాకు గార్డియన్‌గా నియమించింది. మద్రాస్‌లో ‘హమ్ పంచీ ఏక్ దల్ కే’ చిత్ర షూటింగ్ కోసం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్లో నన్ను ఉంచిన నా సంరక్షకుడు ఓ రోజు నాపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత బెల్ట్‌తో నన్ను చితకబాది విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఏనాడూ నా తల్లితో చెప్పలేదు. పదేళ్ల క్రితం వాడు చనిపోయాడు కూడా’ అని 60 ఏళ్ల ఇరానీ తెలిపారు. ఇక మరో ఘటనను వివరిస్తూ... ‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్న సమయంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఓ చిత్రం కోసం నన్ను కలవాలని మా అమ్మను కోరాడు. నాకు చీర కట్టి అందంగా అలంకరించిన మా అమ్మ నన్ను అతని ఆఫీస్‌కు తీసుకెళ్లింది. అయితే అప్పటికి నా శరీరం సౌష్టవంగా లేదు. దీంతో మా అమ్మ నా దుస్తుల్లోపల స్పాంజ్‌ను కుక్కింది. అతని కార్యాలయంలో ఓ సోఫాలో కూర్చుని ఉన్నాను. ఇంతలో అతను వచ్చాడు. మా అమ్మను బయటికి వెళ్లమన్నాడు. భయపడుతూనే అమ్మ బయటకు వెళ్లింది. మాటల మధ్యలో అతను నన్ను తాకాలని యత్నించాడు. అతని ఉద్దేశం అర్థమైన నేను నా లోపల ఉన్న స్పాంజిని తీసి అతని చేతిలో పెట్టాను. అంతే కంగుతిన్న అతను బయటకు పరుగులు తీశాడు’ అని ఆమె వివరించారు. తల్లిదండ్రుల పిల్లలను స్టార్లను చేయాలన్న యత్నంలో దారుణమైన తప్పిదాలు చేస్తున్నారని.. కానీ, ఆ పొరపాట్లను, అనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుంటూ తర్వాత జీవితాంతం ఆ పిల్లలు బాధపడుతున్నారని ఆమె వాపోయారు. అయితే తర్వాతి కాలంలో ఆ తరహా ఘటనలు పునరావృతం కాలేదని.. తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా తన సోదరీమణుల(హనీ ఇరానీ, మేనకా ఇరానీ) విషయంలో మాత్రం ఆ తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో తాను రక్షణగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న డైసీ.. కాస్టింగ్ కౌచ్ పేరిట నటీనటులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న అంశాలను ప్రస్తావించారు. చివరకు చిన్న పిల్లలను కూడా వదలటం లేదని.. అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వారిలో టాలెంట్ ఉంటే వెతుక్కుంటూ వస్తారని.. అంతేగాకీ దొడ్డిదారిని ఆశ్రయించకండని ఆమె చెబుతున్నారు. బూట్ పాలిష్, జగ్తే రమో, నయా దౌర్ లాంటి చిత్రాల్లో నటించిన డైసీ ఇరానీ తర్వాత బుల్లితెరపై కూడా రాణించారు. చివరిసారిగా షారూఖ్ ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో కనిపించారు. తల్లిదండ్రులూ... జాగ్రత్త! : ఫర్హాన్ అక్తర్ డైసీ ఇరానీ ఇంటర్వ్యూ పై ఆమె సోదరి తనయుడు, దర్శక,నటుడు ఫర్హాన్ అక్తర్ ట్విటర్లో స్పందించాడు. పిల్లల్ని స్టార్‌గా చూడాలని బలవంతంగా చేసే ప్రయత్నాలు మంచివి కావని.. అందుకు డైసీ ఇరానీ ఉదంతమే ఓ ఉదాహరణ, ఆమెకు ఎదురైన పరిస్థితులు మరెవరికీ కలగకూడదు అని ఫర్హాన్ అంటున్నారు. తల్లిదండ్రుల ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. Heartbroken upon reading this article but proud that my aunt #DaisyIrani spoke up. It’s tragic to see parents push their kids to breaking point in order to achieve success vicariously through them. This should serve as wake up call for the film & TV industry. Be aware. Be warned. https://t.co/8ONbHJ21lG — Farhan Akhtar (@FarOutAkhtar) 23 March 2018 -
అలా అనడానికి మీకెంత ధైర్యం?
సాక్షి, ముంబై : 'భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదు. వారిని జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువే' అంటూ బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై నటుడు ఫర్హాన్ అక్తర్ నిప్పులు చెరిగారు. 'అలా అనడానికి మీకు ఎంత ధైర్యం?' అంటూ జీవీఎల్ నరసింహారావును ట్వీట్లో ట్యాగ్ చేశారు. 'చిత్ర పరిశ్రమలో ఉంటున్న వ్యక్తుల గురించి జీవీఎల్‌కు ఉన్న అభిప్రాయం ఇది.. దీన్ని అందరూ తెలుసుకోవాలి' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. మెర్సల్ సినిమాపై చెలరేగిన వివాదం(జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై డైలాగ్‌లు)లో ఓ జాతీయ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన జీవీఎల్.. సినిమా వాళ్లకు బుర్ర లేదని, జనరల్ నాలెడ్జ్ లేకుండా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. -
ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది
బాద్షా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. షారూక్ ఖాన్ కెరీర్లో బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్‌లుగా నిలిచిన డాన్ సీరీస్‌లో మరో సీక్వల్ రూపొందనుంది.ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. ఇప్పటికే ఈ సీరీస్‌లో విడుదలైన రెండు భాగాలు, టాక్‌తో సంబందం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే చాలా రోజులుగా ఈ సీరీస్‌లో మూడో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబ్ హీరోగా తెరకెక్కిన 'డాన్' సినిమాను, షారూక్ ఖాన్ అదే పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత అదే క్యారెక్టర్‌తో తెరకెక్కిన 'డాన్' కూడా షారూక్‌ను కమర్షియల్ స్టార్‌గా నిలబెట్టింది. దీంతో మరోసారి డాన్ క్యారెక్టర్లో తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు బాద్షా. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు వినిపిస్తుండటంతో అన్నింటికి చెక్ పెట్టాడు దర్శకుడు పర్హాన్ అక్తర్.. 'ఇప్పటి వరకు డాన్ 3 కథ రెడీ కాలేదు.. కానీ తప్పకుండా డాన్ 3 సినిమా ఉంటుంది. అందులో షారూక్ డాన్‌గా నటిస్తాడు' అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం షారూక్ హీరోగా నటించిన దిల్వాలే రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఫ్యాన్, రాయిస్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల తరువాత డాన్ 3 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
సినిమా రివ్యూ: షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్
పాజిటివ్ పాయింట్స్: చిత్ర తొలి భాగం కామెడీ, ఎమోషన్స్ క్లైమాక్స్ నెగిటివ్ పాయింట్స్: రెండవ భాగంలో కథనం మందగించడం రొటీన్ సీన్లు నటీనటులు: ఫరాన్ అక్తర్, విద్యాబాలన్, ఇలా అరుణ్ తదితరులు సంగీతం: ప్రీతమ్ నిర్మాతలు: ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ దర్శకత్వం: సాకేత్ చౌదరీ ఆనందంగా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ప్రేమికుల్లాంటి దంపతులు. కెరీర్ లో ఇంకా పూర్తిగా స్థిర పడని పరిస్థితులు. జీవితంలో ఏదో సాధించాలనే వర్కింగ్ కపుల్స్ తాపత్రయం. ప్రతి రోజు దంపతుల మధ్య ఏదో విషయంపై వాగ్యుద్దం జరగడం.. అభిప్రాయబేధాలు చోటు చేసుకోవడం..మాట్లాడుకోవడం ఆపివేయడం ఇవన్ని మన జీవితంలో చోటుచేసుకోవడం వారి జీవితంలో కనిపించే సర్వసాధారణమైన అంశాలు. జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆనందంగా సాగాలంటే ఆమె తప్పైనా అతను సారీ చెప్పడం, తనది తప్పైనా అతనే సారీ చెప్పడం తప్పనిసరవుతాయి. సారీతో మళ్లీ మామూలు పరిస్థితి ఏర్పడటం. ఆతర్వాత మళ్లీ ఏదో గొడవ ప్రారంభం కావడం ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో చోటు చేసుకునే అంశాలు కొనసాగుతునే కనిపిస్తాయి, మనకు కూడా ఎదురవుతాయి. నిత్య జీవితంలో ఒక విషయాన్ని దాచి పెట్టడానికి ఓ అబద్ధం. ఆ అబద్దాన్ని దాచడానికి మరో అబద్ధం ఆడటం దంపతుల మధ్య కామన్. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుకొని సంఘటన వారి మధ్య ఎడబాటుకు గురి చేస్తే ఎమిటనేది.. ఒకరికొకరు దగ్గరకు కావడానికి దంపతులు ఎలాంటి మార్గాలను అన్వేషించారనే ఇతివృత్తానికి, హాస్యం, ఎమోషన్స్ జోడించి 'షాదీ కే సైడ్ ఎఫ్టెక్ట్స్' చిత్రానికి దర్శకుడు సాకేత్ చౌదరీ తెరరూపం కలిగించాడు. కథ: సిద్ (ఫరాన్ అక్తర్), త్రిష(విద్యబాలన్) దంపతులు. సిద్ కెరీర్ లో పూర్తిగా స్థిరపడని సంగీత కళాకారుడు. త్రిష ఓ కంపెనీలో ఉద్యోగిని. జీవితంలో పూర్తి స్థాయిలో స్థిరపడటానికి, తమ కలలకు వాస్తవ రూపం ఇవ్వడానికి సగటు కుటుంబంలానే పోరాటం చేస్తుంటారు. అయితే సరైన జాగ్రత్త పాటించకపోవడంతో త్రిష ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే సిద్ కెరీర్ అంతంత మాత్రంగా ఉండటంతో త్రిష ఇష్టం లేకున్నాఅబార్షన్ కు ప్లాన్ చేస్తాడు. కాని ఓ సంఘటన సిద్ అబార్షన్ ఆలోచనకు బ్రేక్ వేస్తుంది. అయితే వారి జీవితంలో మిలీ అనే బుల్లి పాప ప్రవేశిస్తుంది. ఆతర్వాత వారి వ్యక్తిగత, వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? చివరికి ఎలా పరిష్కరించుకున్నారనే ప్రశ్నలకు తెర రూపం 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం. ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రలో సినీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న ఫరాన్ ఈ చిత్రంలో సిద్ పాత్రతో మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని మిల్కా పాత్రతో జాతీయ అంతర్జాతీయ సినీ విమర్శకులను మెప్పించిన ఫరాన్ సిద్ పాత్రతో మరోసారి విజృంభించాడు. ఈ చిత్రంలో ఓ మధ్య వయస్కుడైన వివాహితుడుగా కనిపించి తన నటనతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రపంచంలోనే 'బెస్ట్ ఫాదర్'గా ప్రూవ్ చేసుకోవడానికి, ఓ మంచి భర్త అనే నమ్మకం కలిగించే, ఓ మ్యూజిక్ కంపోజర్ గా స్థిర పడటమే లక్ష్యంగా శ్రమించే సిద్ పాత్రను పోషించి నూరు మార్కులు కొట్టేశాడు. త్రిష పాత్రలో నటించిన విద్యబాలన్ తో నువ్వా నేనా అనే రీతిలో ఫెర్మార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక త్రిష పాత్రలో ఓ గృహిణి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఎలా ఆలోచిస్తారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ తల్లి ఎమోషన్స్ ఎలా ఉంటాయి. ఓ బిడ్డకు తల్లిగా, భార్యగా రెండు కోణాలున్న పాత్ర మధ్య జరిగే మానసిక సంఘర్షణను విద్యాబాలన్ చక్కగా పలికించారు. కహానీ, డర్టీ పిక్చర్ తర్వాత మరోసారి త్రిష పాత్రలో విద్యబాలన్ తన ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను ఆలరించారు. ఈ చిత్రంలో ఫరాన్, విద్యబాలన్ లు సగం బలంగా మారితే.. సాకేత్ చౌదరీ స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభతో క్రెడిట్ కొట్టేసి తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి చిత్రం 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్' చిత్రం ద్వారా ప్రేక్షకులు, విమర్శకుల దృష్టిని తనపైకి తిప్పుకున్న సాకేత్ .. రెండవ చిత్రంతో తనపై నెలకొన్నఅంచనాలను పూర్తిగా అధిగమించాడు. ఫరాన్, విద్యబాలన్ ల మధ్య చక్కటి కెమిస్ట్రీని డిజైన్ చేయడంలో, ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీగా రూపొందించడంలో దర్శకుడిగా సాకేత్ సఫలమయ్యాడు. భార్య, భర్తల మధ్య రిలేషన్స్ చాలా సహజంగా చిత్రీకరించి తన సత్తాను చాటుకున్నాడు. 'ఎలక్ట్రిఫైయింగ్' ఆరంభాన్ని అందించిన సాకేత్...అదే జోష్ తో హై ఓల్టేజ్ కథనంతో తొలిభాగాన్ని పరుగులెత్తించాడు. అయితే కథలో ఉండే పరిమితుల వల్ల అదే వూపును సాకేత్ రెండవ భాగాన్ని కొనసాగించలేకపోవడం ప్రేక్షకుడ్ని కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. కాని ఓ చక్కటి క్లైమాక్స్ తో ముగించడంతో ప్రేక్షకుడిలో కలిగిన అసంతృప్తి దూరం చేయగలిగాడు. దర్శకుడి కథ, కథనాలకు తోడు ప్రీతం సంగీతం, ఫోటోగ్రఫీ అదనపు ఎస్సెట్ గా నిలిచాయి. 'హ్యారీస్ నాట్ ఏ బ్రహ్మచారి', 'యాహా వహా', దేశీ రొమాన్స్, 'తౌబా మే' పాటలు బాగున్నాయి. ప్రీతిష్ నందీ, ఏక్తా, శోభా కపూర్ నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. -రాజబాబు అనుముల -
'ఫిల్మ్ ఫేర్' కార్యక్రమంలో దీపికా, పర్హాన్
-
మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఫ్యాషన్ వాక్