ముంబై: ‘జిందగీ నా మీలేగే దోబారా’ సినిమా విడుదలయ్యాక అన్ని ఆవార్డు వేడుకల్లో తనని, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్‌రోల్ నుంచి తగ్గించి హృతిక్ రోషన్‌ను ప్రతిపాదించారని నటుడు అభయ్ డియోల్ పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ పరిశ్రమలో బంధుప్రీతి(నెపోటిజం) ఎక్కువగా ఉందంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్బంగా సినీయర్ నటుడు అభయ్ డియోల్ కూడా పరిశ్రమలో నెపోటిమ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు)
"జిందగి నా మిలేగి దోబారా, 2011లో విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎదుర్కొన్న చేదు అనుభవాలు ప్రస్తుతం పరిస్థితిలో జ్ఞాప్తికి తెస్తున్నాయి. ఎందుకంటే నేను, ఫర్హాన్ అక్తర్, హృతిక్ రోషన్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేశాం. కానీ విడుదలైన అనంతరం దాదాపు అన్ని అవార్డు ఫంక్షన్‌లో నన్ను, ఫర్హాన్‌ను ప్రధాన పాత్రల నుంచి తగ్గించి, సపోర్ట్ యాక్టర్స్ నామినేట్ చేశారు. ఈ సినిమాలో హృతిక్, కత్రినా ప్రధాన పాత్రల్లో ఉత్తమ నటులుగా ఆవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఒక పురుషుడు, స్త్రీ ప్రేమలో పడే చిత్రం. అతను తీసుకునే ఏ నిర్ణయాలకైనా అతడి స్నేహితులు మద్దతు ఇస్తారు. దీని ప్రకారం వారిని ప్రధాన పాత్రలుగా ఎంపిక చేశారు. అంటే పరిశ్రమలో మిమ్మల్ని తగ్గించడానికి ఎన్నో రహస్య లేదా బహిరంగ మార్గాలు ఉంటాయి. మోసపూరితమైన ఈ ఆవార్డును నేను తిరస్కరించాను. కానీ ఫర్హాన్ మాత్రం సరే అన్నాడు. #familyfareawards’ అంటూ అభయ్ రాసుకొచ్చాడు. (సంగీత పరిశ్రమలో పెద్ద మాఫియా ఉంది)
అంతేగాక ఇటీవల దర్శకుడు అభినవ్ కశ్యప్ హీరో సల్మాన్ ఖాన్ అతని సోదరుడు ఇప్పటికే బాలీవుడ్‌లో అర్భాజ్ ఖాన్‌లు తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇక పరిశ్రమలో రాజకీయాలు ఎలా ఉంటాయో చెబుతు హీరోయిన్ రవీణ టాండన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హీరో సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆదివారం(జూన్ 14)న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడిని 7 సినిమాలను నుంచి తొలగించడం.. అతడి సినిమాల విడుదలను నిలిపివేయడంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది బాలీవుడ్ ప్రముఖులపై బీహార్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు)
Comments
Please login to add a commentAdd a comment