
హీరో సిద్ధాంత్ చతుర్వేది, హీరోయిన్ కత్రినా కైఫ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.. చిత్రబృందంలోని సభ్యులు ఆటను కన్నార్పకుండా చూశారు. నువ్వానేనా అన్న తరహాలో ఆడిన వీరి ఆటలో చివరకు కత్రినా గెలిచింది. దీనికి సంబంధించిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో కత్రినా, సిద్ధాంత్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలుగా ‘ఫోన్ బూత్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉదయ్‌పూర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో కత్రినా, సిద్ధాంత్ సరదాగా బ్యాట్‌లు పట్టారు. కాగా ఈ గేమ్ మధ్యలలోనే ఇశాంత్ సరదాగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఈ విధంగా ఫోన్ బూత్ సినిమా షూటింగ్ విరామ సమయంలో నటీనటులు తమకు ఇష్టమైన క్రీడలు ఆడుతూ సేద తీరుతున్నారు. హర్రర్ కామెడీ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఫర్హాన్ అక్తార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.