Gurmith Singh
-
నాతో పెట్టుకోకు: హీరోను ఓడించిన హీరోయిన్
హీరో సిద్ధాంత్ చతుర్వేది, హీరోయిన్ కత్రినా కైఫ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.. చిత్రబృందంలోని సభ్యులు ఆటను కన్నార్పకుండా చూశారు. నువ్వానేనా అన్న తరహాలో ఆడిన వీరి ఆటలో చివరకు కత్రినా గెలిచింది. దీనికి సంబంధించిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో కత్రినా, సిద్ధాంత్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలుగా ‘ఫోన్ బూత్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉదయ్‌పూర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో కత్రినా, సిద్ధాంత్ సరదాగా బ్యాట్లు పట్టారు. కాగా ఈ గేమ్ మధ్యలలోనే ఇశాంత్ సరదాగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఈ విధంగా ఫోన్ బూత్ సినిమా షూటింగ్ విరామ సమయంలో నటీనటులు తమకు ఇష్టమైన క్రీడలు ఆడుతూ సేద తీరుతున్నారు. హర్రర్ కామెడీ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఫర్హాన్ అక్తార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
హనీ దగ్గర మనీ లేదు!
‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ 2002లో చేసిన అత్యాచారాలకు మొన్న ఇరవై ఏళ్ల జైలు శిక్ష, ముప్పై లక్షల జరిమానా ఖరారైంది. తెలిసిన వార్త ఎందుకు చెబుతున్నారు అని మీరు అనుకునే లోపే అసలు విషయంలోకి వచ్చేస్తాం. రామ్ రహీమ్ ఇష్టతనయ, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. ‘నో హనీ, నో మనీ’ అని లబోదిబోమంటోంది. ‘‘కోర్టులో కేసు కొట్లాట్టానికి కూడా క్యాష్ కరువైంది. నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. దుడ్లన్నీ ఐస్ అయిపోయినయ్. చలికాలం కదా లాయర్లు ‘ఐసొద్దు, హాట్ హాట్ నోట్స్ ఇవ్వు’ అంటున్నారు. కనుక కోర్టు నాయందు దయ ఉంచి బ్యాంకు ఫ్రిజ్జు ఓపెన్ చేయనిస్తే మంచి లాయర్‌ను పెట్టుకుని నా అమాయకత్వాన్ని నిరూపించుకుంటాను’ అని బోరుమందట. వాడెవడో అత్యాచారం చేస్తే ఈవిడ అమాయకత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? పెంపుడు తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే ఆశ్రమం చుట్టూ ఉన్న పంచకుల ఏరియాలో అల్లర్లకు 41 మంది చనిపోయారు. 260 మంది గాయాల పాలయ్యారు. ఆ అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ ఈ మేడమేనంట. అదీ కేసు. లేదు క్యాషు! -
అమ్మకానికి హనీప్రీత్, గుర్మీత్ సింగ్
ఉజ్జయిని: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్‌లకు అవమానాలు ఆగేలా లేవు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన గాడిదల సంతలో రాజస్తాన్‌కు చెందిన హరిఓం ప్రజాపత్ తన రెండు గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్లుగా పేరుపెట్టి రూ.11,000కు అమ్మివేశాడు. గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌ల పేర్లను తన గాడిదలకు పెట్టడంపై స్పందిస్తూ చేసిన తప్పుకు శిక్ష తప్పదన్న సందేశం పంపేందుకే ఈ పనిచేసినట్లు వెల్లడించారు. వీటిని రూ.20,000 అమ్మాల నుకున్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో చివరికి రూ.11 వేలకే అమ్మాల్సి వచ్చిందని పేర్కొన్నారు. -
గుర్మీత్ డేరాలో ‘బిగ్‌బాస్’!
చండీగఢ్: సెలబ్రిటీలు పాల్గొనే ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం బిగ్‌బాస్ తరహా షోను డేరా సచ్చా సౌదాలో చీఫ్ గుర్మీత్ సింగ్ నిర్వహించేవారట. గుర్మీత్ దత్తత తీసుకున్నట్లుగా చెప్తున్న హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తుండటం తెలిసిందే. ‘డేరాలో బిగ్‌బాస్ తరహా కార్యక్రమాన్ని గుర్మీత్ 6 జంటలతో నిర్వహించేవారు. 28 రోజులపాటు 6 జంటలు అక్కడ నివసించేవి’ అని ఆయన తెలిపారు. గుర్మీత్‌కు హనీప్రీత్ దత్తపుత్రిక అని చెప్పడం కేవలం ఒక ముసుగు అనీ, వారిద్దరూ భార్యాభర్తల్లానే ఉండేవారని విశ్వాస్ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకపోయినా 2009 నుంచి హనీప్రీత్ గుర్మీత్‌కు భార్యగా అతని వద్దే ఉంటోందన్నారు. హనీప్రీత్ గుర్మీత్ ప్రియురాలు విశ్వాస్ మాట్లాడుతూ ‘హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా. గుర్మీత్ చట్టబద్ధంగా ఆమెను దత్తత తీసుకోలేదు. పైకి అలా చెప్పుకున్నారంతే. ఆమె గుర్మీత్ ప్రియురాలు. 1999లో గుర్మీత్ ఆదేశాల మేరకే నేను హనీప్రీత్‌ను పెళ్లి చేసుకున్నా. వారిద్దరికీ లైంగిక సంబంధం ఉంది. అది నేనే ప్రత్యక్షంగా చూశాను. ఎవరికైనా చెబితే చంపేస్తానని అప్పట్లో గుర్మీత్ నన్ను బెదిరించారు. ఆమె ఎప్పుడూ గుర్మీత్తోనే ఉండేది. డేరాలోని గుర్మీత్ నివాసం గుఫాలో వారిద్దరూ గడిపేవారు. ఇద్దరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని చాలాసార్లు బెదిరించారు. మాపై కేసులు పెట్టారు. నన్ను చంపేయమని గుర్మీత్ తన అనుచరులను ఆదేశించాడు. జైలులో ఉన్నా అతను చాలా బలవంతుడు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేను బతికుంటానో లేదో కూడా తెలీదు’ అని చెబుతూ విశ్వాస్ మీడియా సమావేశం నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. -
డేరా బాబా ఆశ్రమంలో 600 అస్థిపంజరాలు
-
డేరా’లో 600 శవాల ఖననం
► విచారణలో వెల్లడించిన మాజీ ఉపాధ్యక్షుడు చంఢీగడ్: డేరా ఆశ్రమంలోని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో సుమారు 600 మంది శవాలను పాతిపెట్టినట్లు తాజాగా తెలిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో గుర్మీత్ నమ్మిన బంటు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు డా. పీఆర్ నైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన తగిన ఆధారాలను కూడా అధికారులకు సమర్పించారు. శవాలను పాతిపెట్టిన చోటల్లా ఓ జర్మన్ శాస్త్రవేత్త సలహా మేరకు మొక్కలను నాటినట్లు నైన్ తెలిపారు. -
హరియాణాలో హై అలర్ట్
నేడు డేరా చీఫ్ గుర్మీత్ సింగ్‌కు శిక్ష ఖరారు ► రోహ్తక్ జైలుకు హెలికాప్టర్లో వెళ్లనున్న న్యాయమూర్తి ► హింసపై హెచ్చరించిన ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం ► 144 సెక్షన్ అమలు.. పటిష్టమైన భద్రత ఏర్పాటు ► హరియాణాలో నేడు విద్యాసంస్థలకు సెలవు.. రేపటి వరకు ఇంటర్నెట్పై నిషేధం చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ (50)కు అత్యాచారం కేసులో నేడు శిక్ష ఖరారు కానుంది. రోహ్తక్ జిల్లా సునరియా జైల్లో ఉన్న గుర్మీత్‌కు జైలు గోడల మధ్యే సీబీఐ కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించనున్నారు. 2002 నాటి ఓ అత్యాచార కేసులో డేరా చీఫ్‌ను సీబీఐ కోర్టు శుక్రవారం దోషిగా ప్రకటించటం.. అనంతరం హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో అతని అభిమానులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు హాల్లో కాకుండా జైల్లోనే గుర్మీత్‌కు శిక్ష ఖరారుచేయాలని సీబీఐ కోర్టు న్యాయమూర్తి నిర్ణయించారు. ఇందుకోసం జైల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచకుల నుంచి న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌ను ప్రత్యేక హెలికాప్టర్లో సునరియా జైలుకు తీసుకెళ్లనున్నారు. శుక్రవారం నాటి తీర్పు అనంతరం డేరా అభిమానుల ఉన్మాదకాండలో మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరింది. హింసపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక గుర్మీత్‌సింగ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో హింస చెలరేగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ గొడవలు కొన్నిరోజులపాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిక్ష ప్రకటించాక మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పంచకుల, సిర్సాలతోపాటుగా రోహ్తక్ చుట్టుపక్కన ప్రాంతాల్లోనూ 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. గుర్మీత్ సింగ్‌ను విడిపించేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జైలుకు వెళ్లే మార్గాల్లోనూ అంచెలంచెలుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రోహ్తక్ రేంజ్ ఐజీ నవ్‌దీప్ విర్క్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శని, ఆదివారాల్లో హరియాణా, పంజాబ్‌లలో ఎక్కడా గొడవలు జరగలేదని ఆయన తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఢిల్లీలోనూ హై అలర్ట్ ప్రకటించారు. గుర్మీత్‌ను తప్పించే యత్నం పంచకుల కోర్టులో శుక్రవారం తీర్పు వెలువడిన తర్వాత గుర్మీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఏడుగురు గుర్మీత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని దేశద్రోహం, హత్యాయత్నం కేసుల కింద పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు హరియాణా పోలీసులు కూడా ఉన్నారు. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంతో (మహిళలు, చిన్నారులు సహా లక్షమంది ఉంటారని అంచనా) పాటుగా వివిధ ఇతర కేంద్రాల్లో ఉన్న మద్దతుదారులు, అభిమానులను వారి ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. డేరా కేంద్రాలన్నింటినీ ఖాళీ చేయాలని ఆర్మీ, పారామిలటరీ బలగాలు ఆదేశించాయి. శిక్ష ప్రకటించాకే సోదాలు శిక్ష ఖరారు నేపథ్యంలో హరియాణాలో సోమ వారం విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. హరియాణా, పంజాబ్‌ల్లోని పలు ప్రాంతాల్లో నిలిపేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.30 వరకు నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సిర్సా మినహా పలు ప్రాంతాల్లో కొంతసేపు కర్ఫ్యూను సడలించారు. డేరా సచ్చా సౌదా అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గుర్మీత్‌కు శిక్ష పడిన తర్వాతే డేరా ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.