
ఉజ్జయిని: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్‌లకు అవమానాలు ఆగేలా లేవు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన గాడిదల సంతలో రాజస్తాన్‌కు చెందిన హరిఓం ప్రజాపత్ తన రెండు గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌లుగా పేరుపెట్టి రూ.11,000కు అమ్మివేశాడు. గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌ల పేర్లను తన గాడిదలకు పెట్టడంపై స్పందిస్తూ చేసిన తప్పుకు శిక్ష తప్పదన్న సందేశం పంపేందుకే ఈ పనిచేసినట్లు వెల్లడించారు. వీటిని రూ.20,000 అమ్మాల నుకున్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో చివరికి రూ.11 వేలకే అమ్మాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment