Honey Preet Insan
-
అమ్మకానికి హనీప్రీత్, గుర్మీత్ సింగ్
ఉజ్జయిని: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్‌లకు అవమానాలు ఆగేలా లేవు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన గాడిదల సంతలో రాజస్తాన్‌కు చెందిన హరిఓం ప్రజాపత్ తన రెండు గాడిదలకు గుర్మీత్ సింగ్, హనీప్రీత్లుగా పేరుపెట్టి రూ.11,000కు అమ్మివేశాడు. గుర్మీత్ సింగ్, హనీప్రీత్‌ల పేర్లను తన గాడిదలకు పెట్టడంపై స్పందిస్తూ చేసిన తప్పుకు శిక్ష తప్పదన్న సందేశం పంపేందుకే ఈ పనిచేసినట్లు వెల్లడించారు. వీటిని రూ.20,000 అమ్మాల నుకున్నప్పటికీ సరైన ధర రాకపోవడంతో చివరికి రూ.11 వేలకే అమ్మాల్సి వచ్చిందని పేర్కొన్నారు. -
హనీప్రీత్ అరెస్ట్
చండీగఢ్: దాదాపు నెల రోజులుగా పోలీసులకు దొరకకుండా వస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ దత్త పుత్రిక ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ ఇన్సాన్‌ను ఎట్టకేలకు హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం కేసులో గుర్మీత్ జైలు పాలయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమెను మంగళవారం పంజాబ్‌లోని జిరాక్పూర్–పాటియాలా మార్గంలో అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హనీప్రీత్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పంచకుల పోలీసు కమిషనర్ ఏఎస్ చావ్లా వెల్లడించారు. పంచకులలో చెలరేగిన హింసలో ఆమె ప్రమేయంపై విచారిస్తామన్నారు. అదృశ్యం తర్వాత ఎవరెవరు హనీప్రీత్‌కు సహకరించారు అనే విషయాన్నీ విచారిస్తామని చెప్పారు. బుధవారం ఆమెను పంచకులలోని కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు రిమాండ్‌కు కోరతామని తెలిపారు. హనీప్రీత్‌తోపాటు ఉన్న మరో మహిళను కూడా కస్టడీలోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నేను, మా నాన్న అమాయకులం.. అరెస్టుకు కొద్ది గంటల ముందే హనీప్రీత్ రెండు ప్రముఖ వార్తా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పంచకుల అల్లర్లకు తనను బాధ్యురాలిని చేస్తూ కేసు నమోదు చేయడం ఆవేదన కలిగించిందని హనీప్రీత్ చెప్పారు. హరియాణా పోలీసులు తనపై అన్యాయంగా లుక్ఔట్ నోటీసులు, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. ‘‘నేను అల్లర్లు ప్రోత్సహించేలా కనిపిస్తున్నానా? అలా ఎలా ఆరోపణలు చేస్తారు?. నా తండ్రికి శిక్ష పడిన రోజు ఒక కూతురుగా ఆయన పక్కన ఉన్నాను. నేను ప్రజలను రెచ్చగొడుతూ ఒక్క మాట అయినా పలికానా.. అలాంటప్పుడు నన్ను నిందితురాలిగా ఎలా పేర్కొంటారు. నేను చట్టం కళ్లుగప్పి ఎక్కడికి పారిపోలేదు. పంచకులలో చెలరేగిన హింసకు నన్ను బాధ్యురాలిని చేయడంతో పూర్తిగా కుంగిపోయాను. నా తండ్రి నిర్దోషిగా బయటకు వస్తారనే ఆశతోనే ఆ రోజు కోర్టుకు వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు శిక్ష పడింది. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాను. పూర్తిగా షాక్‌లో ఉండిపోయాను. అలాంటి విపత్కర సమయంలో మిగతావాటి గురించి ఎలా ఆలోచించగలను. ఒక్కసారి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. నా తండ్రితో కలసి దేశ భక్తి సినిమాలు తీశాను. అలాంటి నాపై దేశ ద్రోహం ఆరోపణలు చేశారు. అంతపెద్ద ఆరోపణలు జీర్ణించుకోలేకపోయాను. నేను కనీసం చీమను కూడా చంపను. నాకు న్యాయ ప్రక్రియ అంటే అర్థం కూడా తెలీదు. నా వరకు నా తండ్రి గుర్మీత్ జైలు వెళ్లడం ఎంతో బాధించింది. నా ప్రపంచం మొత్తం కుప్పుకూలినట్లైంది. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. కొంతమంది ఇచ్చిన సూచనల ప్రకారం ఢిల్లీకి వెళ్లాను. ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయిస్తాను. నాకు న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది. తప్పక న్యాయం జరుగుతుంది. గుర్మీత్‌తో అక్రమ సంబంధం గురించి నా మాజీ భర్త విశ్వాస్ గుప్తా చేసిన ఆరోపణల గురించి నేను మాట్లాడను. గుర్మీత్‌కు, నాకు మధ్య పవిత్ర బంధం ఉంది. మా మధ్య బంధాన్ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఒక తండ్రి తన కూతురి తలపై ప్రేమగా చేయి పెట్టడం కూడా తప్పేనా? భావోద్వేగాలు చనిపోయాయా? తండ్రీకూతుళ్ల అనుబంధం పవిత్రమైనది కాదా? ఎందుకు వారు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా తండ్రి అమాయకుడు. రానున్న రోజుల్లో ఆ విషయం అందరూ తెలుసుకుంటారు. డేరా కార్యాలయంలో కొందరు శిష్యురాళ్ల మృతదేహాలను పూడ్చిపెట్టారంటున్నారు. ఇంతవరకు ఒక్క అస్థిపంజరాన్ని అయినా గుర్తించారా? లేదు కదా’’ అని హనీప్రీత్ చెప్పారు. -
గుర్మీత్ కూతురిపై లుక్ఔట్ నోటీసు
-
గుర్మీత్ కూతురిపై లుక్ఔట్ నోటీసు
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు పాలైన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, ఆయన కీలక అనుచరులపై హరియాణా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచిపోయే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, బస్సులు, రైల్వే స్టేషన్లను అలర్ట్ చేశారు. గుర్మీత్ జైలు నుంచి తప్పించుకొని పోయేందుకు కుట్ర పన్ని అరెస్టయిన డేరా సచ్చాకు చెందిన ఓ ముఖ్యమైన వ్యక్తిని విచారించిన అనంతరం ఈ నోటీసు లిచ్చారు. గుర్మీత్‌కు సంబంధించి కొన్ని అంశాల విషయంలో హనీప్రీత్‌ను, డేరా అధికార ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్ చావ్లా పేర్కొన్నారు. ‘అరెస్టయిన సురీందర్ ధిహమ్ ఇన్సాన్‌ను ప్రశ్నించగా.. హనీప్రీత్, ఆదిత్య దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని చెప్పాడు. అందుకే వారిపై నోటీసులు జారీ చేశాం’అని చావ్లా తెలిపారు. గుర్మీత్ తప్పించుకొని పోయేందుకు చేసిన కుట్రలో పోలీసుల హస్తంపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కాగా, గుర్మీత్‌కు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల కారణంగా మృతుల సంఖ్య 41కి చేరింది. గుర్మీత్‌కు సెక్యూరిటీగా ఉన్న ఐదుగురు హరియాణా పోలీసులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి వారిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఆన్లైన్ గురుకుల్!
యమ్.యస్.జి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, ఆయన కూతురు హానీ ప్రీత్ ఇన్సాన్ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘యమ్.యస్.జి. ఆన్లైన్ గురుకుల్’. గుర్మీత్ 50వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో జరుగుతున్న చెడును నిర్మూలించే ఒక సైబర్ పోలీసాఫీసర్ పాత్రను ఇందులో పోషిస్తున్నాను. సినిమాల ద్వారా మంచి సందేశం ఇవ్వడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయడం నాకిష్టం. ఇటీవల ఉత్తర భారతదేశంలో రక్తదానం, అవయవదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను చేశాం. ఇప్పుడు హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి దక్షిణ భారతదేశంలో కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఆదర్శ వివాహాలు చేసుకున్న భార్యాభర్త లకు ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందజేశారు.