
‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ 2002లో చేసిన అత్యాచారాలకు మొన్న ఇరవై ఏళ్ల జైలు శిక్ష, ముప్పై లక్షల జరిమానా ఖరారైంది. తెలిసిన వార్త ఎందుకు చెబుతున్నారు అని మీరు అనుకునే లోపే అసలు విషయంలోకి వచ్చేస్తాం. రామ్ రహీమ్ ఇష్టతనయ, దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్.. ‘నో హనీ, నో మనీ’ అని లబోదిబోమంటోంది. ‘‘కోర్టులో కేసు కొట్లాట్టానికి కూడా క్యాష్ కరువైంది. నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. దుడ్లన్నీ ఐస్ అయిపోయినయ్. చలికాలం కదా లాయర్లు ‘ఐసొద్దు, హాట్ హాట్ నోట్స్ ఇవ్వు’ అంటున్నారు.
కనుక కోర్టు నాయందు దయ ఉంచి బ్యాంకు ఫ్రిజ్జు ఓపెన్ చేయనిస్తే మంచి లాయర్‌ను పెట్టుకుని నా అమాయకత్వాన్ని నిరూపించుకుంటాను’ అని బోరుమందట. వాడెవడో అత్యాచారం చేస్తే ఈవిడ అమాయకత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? పెంపుడు తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే ఆశ్రమం చుట్టూ ఉన్న పంచకుల ఏరియాలో అల్లర్లకు 41 మంది చనిపోయారు. 260 మంది గాయాల పాలయ్యారు. ఆ అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ ఈ మేడమేనంట. అదీ కేసు. లేదు క్యాషు!
Comments
Please login to add a commentAdd a comment