అది ఆమె లైఫ్‌.. అభ్యంతరాలు ఎందుకు? | Kaur Controversy Social Media Supports Sunny Leone | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 19 2018 11:46 AM | Last Updated on Thu, Jul 19 2018 1:33 PM

Kaur Controversy Social Media Supports Sunny Leone  - Sakshi

పోర్న్‌స్టార్‌ నుంచి బాలీవుడ్‌గా మారిన కరణ్‌జీత్‌ కౌర్‌ అలియాస్‌ సన్నీ లియోన్‌ బయోపిక్‌ వివాదాస్పదంగా మారింది. కరణ్‌జీత్‌ కౌర్‌:ది అన్‌టోల్డ్‌ స్టోరీ వెబ్‌సిరీస్‌పై మత వర్గాలు మండిపడుతున్నాయి. సన్నీ ఇంటిపేరులోని కౌర్‌ను తొలగించాల్సిందేనంటూ అకాలీ దళ్‌ పార్టీ పట్టుబడుతుండటం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సన్నీకి భారీ ఎత్తున్న మద్ధతు వచ్చిపడుతోంది. 

‘సుఖ్వీందర్‌ కౌర్‌.. రాధే మా అయినప్పుడు, గుర్మీత్‌ సింగ్‌.. రామ్‌ రహీమ్‌ బాబా అయినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదేం?. సన్నీ ఇప్పుడు ఆమె అసలు పేరు వాడుకుంటుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?. అది ఆమె లైఫ్‌.. నేరం కాదు’ అని ఒకరు,  ‘సన్నీని నిందించే ముందు.. హనీ సింగ్‌(యోయో హనీ సింగ్‌) సెక్సీ సాంగ్‌ల సంగతి గురించి మాట్లాడండి’ అంటూ ఒకరు... హనీప్రీత్‌ ఇన్‌సాన్‌ లైఫ్‌, గుర్మీత్‌తో ఆమె లింకులపై అకాళీ దల్‌ మౌనంగా ఎందుకుంది? అని మరోకరు... రాధేమా-హనీప్రీత్‌ సింగ్‌ కంటే సన్నీ ఎంతో బెటర్‌... ఇలా పలువురు అకాలీ దళ్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ, రచ్చ.. రచ్చగా సాగుతోంది. 

అభ్యంతరం అదొక్కటే... ‘ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టం. ఆమె పోర్న్‌స్టారే కానీ, ఇంకేదైనా కానీ. కానీ, ఒక్కసారి పేరు చివర కౌర్‌ ను వదిలేసుకున్నాక.. తిరిగి మళ్లీ చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసమే ఇదంతా. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పేరు చివర కౌర్‌ తొలగించాల్సిందే. ఈ వ్యవహారంపై ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రకు లేఖ కూడా రాశాం. స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అకాలీ దళ్‌ నేత మాంజీదర్‌ సిస్రా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కాగా.. మంచి స్పందనే లభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement