Radhe Maa
-
బిగ్‌బాస్ హౌస్‌లో సన్యాసిని.. దుమారం
బిగ్‌బాస్ షో అంటేనే వివాదాలకు పుట్టిల్లు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తే.. షోకు అంత టీఆర్పీ పెరుగుతుంది. ఇందుకోసం షో నిర్వహాకులు రకరకాల ప్రయోగాలు చేస్తారు. మన దగ్గర కంటే బాలీవుడ్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గత వారం బాలీవుడ్ బిగ్‌బాస్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాధే మాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్ కౌర్ బిగ్‌బాస్ 14లో సందడి చేసింది. దాంతో ఈ సారి ఆమె కూడా షోలో కనిపించబోతుంది అనుకున్నారు ప్రేక్షకులు. అయితే అదంతా ప్రచారం మాత్రమే. ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే షోలో కనిపించింది. మొదటి రోజు గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్, తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి రోజు కనిపించింది. అయితే ఆమె కేవలం పార్టిస్పెంట్స్ని ఆశీర్వదించడానికి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సాధువులు, సన్యాసులకు సంబంధించిన అత్యున్నత విభాగం అఖిల్ భారతీయ అఖాడ పరిషద్(ఏబీఏపీ) రాధే మా కనిపించడాన్ని పూర్తిగా తప్పు పట్టింది. ఆమె సాధువు, సన్యాసి కాదు అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ.. ‘రాధే మాను సాధువులు, సన్యాసులతో కలపవద్దు. గాడ్ ఉమెన్ అని భావించే ఆమెకి మతం, గ్రంథాల గురించి ఏమి తెలియదు. కేవలం కాసినోలో పాటలు పాడటం, డ్యాన్స్ చేయటంలో మాత్రమే ఆమెకి ప్రావీణ్యం ఉంది. అది ఆమెను సాధువుగా చేయలేదు’ అని తెలిపారు. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనడం ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. (చదవండి: గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు) ఎవరీ రాధే మా.. రాధే మా అసలు పేను సుఖ్వీందర్ కౌర్ 1965 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డోరంగల గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే ఆమె ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలైనట్లు ఆమె అనుచరులు పేర్కొన్నారు. ఇక ఆమె మోహన్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రారంభంలో తన కుటుంబ పోషణ కోసం రాధే మా టైలర్‌గా పనిచేసేవారు. 23 ఏళ్ళ వయసులో, ఆమె మహంత్ రామ్ దీన్ దాస్ శిష్యురాలిగా చేరింది. మహంత్ రామ్ దీన్ దాస్ ఆమెకు రాధే మా బిరుదు ఇచ్చారు. ఆమె రూపాన్ని బట్టి చూస్తే, ఆమె ఎరుపు రంగు ధరించడం చాలా ఇష్టమని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చేతిలో త్రిశూలాన్ని తీసుకువెళుతుంది. (చదవండి: బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!) వివాదాలు ఫుల్లు.. ఇక రాధే మా పేరు అనేక వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. 2015 లో ముంబై పోలీసులు కట్నం కోసం అత్తమామాలను వేధించడానికి ఒక మహిళని ప్రేరేపించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే సంవత్సరంలో, లండన్‌లోని ఒక కాసినోలో ఆమె పాశ్చాత్య దుస్తులు ధరించి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తరువాత, జాగ్వార్ కారుపై తప్పుడు చిరునామా ఇవ్వడం ద్వారా పూర్తి పన్ను చెల్లించలేదని ఆరోపిస్తూ రాధే మా కార్యదర్శిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సంవత్సరంలో మాజీ బిగ్ బాస్ పోటీదారు డాలీ బింద్రా రాధే మా తనను లైంగికంగా వేధించిందని ఆరోపించారు. 2015 లో, ఆమె 'బిగ్ బాస్ 9' లో పాల్గొంటుందని కూడా చెప్పబడింది. అయితే, ఆ తర్వాత ఆమె ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని సమాచారం. -
అది ఆమె లైఫ్.. అభ్యంతరాలు ఎందుకు?
పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్‌గా మారిన కరణ్‌జీత్ కౌర్ అలియాస్ సన్నీ లియోన్ బయోపిక్ వివాదాస్పదంగా మారింది. కరణ్‌జీత్ కౌర్:ది అన్‌టోల్డ్ స్టోరీ వెబ్‌సిరీస్‌పై మత వర్గాలు మండిపడుతున్నాయి. సన్నీ ఇంటిపేరులోని కౌర్‌ను తొలగించాల్సిందేనంటూ అకాలీ దళ్ పార్టీ పట్టుబడుతుండటం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సన్నీకి భారీ ఎత్తున్న మద్ధతు వచ్చిపడుతోంది. ‘సుఖ్వీందర్ కౌర్.. రాధే మా అయినప్పుడు, గుర్మీత్ సింగ్.. రామ్ రహీమ్ బాబా అయినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదేం?. సన్నీ ఇప్పుడు ఆమె అసలు పేరు వాడుకుంటుంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?. అది ఆమె లైఫ్.. నేరం కాదు’ అని ఒకరు, ‘సన్నీని నిందించే ముందు.. హనీ సింగ్(యోయో హనీ సింగ్) సెక్సీ సాంగ్‌ల సంగతి గురించి మాట్లాడండి’ అంటూ ఒకరు... హనీప్రీత్ ఇన్సాన్ లైఫ్, గుర్మీత్‌తో ఆమె లింకులపై అకాళీ దల్ మౌనంగా ఎందుకుంది? అని మరోకరు... రాధేమా-హనీప్రీత్ సింగ్ కంటే సన్నీ ఎంతో బెటర్... ఇలా పలువురు అకాలీ దళ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ, రచ్చ.. రచ్చగా సాగుతోంది. అభ్యంతరం అదొక్కటే... ‘ఆమె వ్యక్తిగత జీవితం.. ఆమె ఇష్టం. ఆమె పోర్న్‌స్టారే కానీ, ఇంకేదైనా కానీ. కానీ, ఒక్కసారి పేరు చివర కౌర్ ను వదిలేసుకున్నాక.. తిరిగి మళ్లీ చేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసమే ఇదంతా. అందుకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పేరు చివర కౌర్ తొలగించాల్సిందే. ఈ వ్యవహారంపై ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు లేఖ కూడా రాశాం. స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అకాలీ దళ్ నేత మాంజీదర్ సిస్రా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాగా.. మంచి స్పందనే లభించింది. -
వెండితెరపై రాధే మా లీలలు
ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. చారిత్రక ఘట్టాలతో పాటు వివాదాస్పద వ్యక్తుల జీవితాలను కూడా తెర మీద ఆవిష్కరించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వివాదాస్పద మాతాజీ జీవిత కథ వెండితెర మీదకు రానుందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన రాధే మా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో రాధే మాగా పాయల్ ఘోష్ నటించనుంది. జై మాతా దీపేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ లీడ్ యాక్టర్‌గా నటిస్తోంది. పటేల్ కి పంజాబీ షాదీ సినిమాలో పాయల్ పర్ఫామెన్స్ నచ్చటంతో దర్శకుడు సౌరభ్ వర్మ.. జై మాతాదీలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా రాధే మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ఇంత వరకు ప్రకటించలేదు. -
నోర్మూయండీ.. ఆవేశంగా లేచిన రాధేమా!
సంభాల్: వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త రాధేమా(52) (అలియాస్ సుఖ్విందర్ కౌర్) సహనం కోల్పోయింది. విలేకరులు అడిగిన ప్రశ్నలతో ఆమె ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయింది. కల్కిమహోత్సవ్‌లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. దీంతో ఆమె సహనం కోల్పోయిన తన సీట్లోంచి లేచారు. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నారు? అంటూ విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న శిష్యగణం ఆమెను శాంతపరిచి తిరిగి సీట్లో కూర్చోబెట్టాల్సి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల వచ్చిన రాధేమా స్టేషన్ అధికారి సీట్లో కూర్చోవటం పెను వివాదానికి దారి తీసిన విషయం విదితమే. అలాగే, తన శిష్యగణంలో ఒకరి కోడలిపై వరకట్నం వేధింపుల కేసులోనూ రాధేమా ప్రమేయం ఉందంటూ బాధితురాలి కుటుంబీకులు కేసు పెట్టారు. ఈ అంశాలపైనే విలేకరులు ఆమెను ప్రశ్నించగా మీరేమైనా పూలు కడిగిన ముత్యాలా? అలాంటి ప్రశ్నలను నన్నెందుకు అడుగుతున్నారు? నోళ్లు ముయ్యండంటూ వారికి రాధేమా ఎదురు తిరిగింది. కూర్చోలోంచి లేచి వెళ్లే ప్రయత్నం చేయగా ఆమె అనుచరులు శాంతపరిచారు. దీంతో కార్యక్రమం సజావుగా సాగిపోయింది. -
ఆ టైంలో చచ్చిపోవాలనుకున్నా: రాధేమా
సాక్షి, ముంబై : దైవాంశ సంభూతురాలు.. శివుడికి-భక్తులకి మధ్య సంధానకర్త... పైగా దుర్గా మాత అవతారం. ఎలాంటి సమస్యలైనా భగవంతుడికి నేరుగా నివేదించగలిగే స్థాయి ఆమెది. ఇలాంటి ప్రకటనలతో వార్తల్లో నిలిచే రాధే మా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈసారి వివాదంతో కాదు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించారు. సుఖ్విందర్ కౌర్.. రాధే మా గా ఎలా మారింది? ఆరోపణలపై ఆమె స్పందన ఏంటి? సూసైడ్ చేసుకోవాలని ఎందుకనుకుంది? తదితర విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చారు. వ్యక్తిగత జీవితం... పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్ కౌర్ తల్లిదండ్రులు 17 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం చేశారు. మూడేళ్లలో ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటంతో కుటుంబం గడవటం కష్టంగా మారింది. ఆ సమయంలోనే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకన్నాడంట. కాళ్ల మీద పడి బ్రతిమాలిన కనుకరించలేదని ఆమె చెప్పారు. ఆ సమయంలో తనకు తెలిసిన దర్జీ పనితో కొంతకాలం జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆమె తర్వాత ఆధ్యాత్మికం వైపు మళ్లినట్లు చెప్పారు. ముంబైకి మకాం మార్చాక ఆమె పూర్తిగా దైవ ధ్యానంలోనే నిండిపోయిందంట. అప్పుడే ఆమె చుట్టూ భక్తులు చేరిపోవటం.. అతి తక్కువ సమయంలోనే ఆమె పేరు మారుమోగిపోవటం జరిగిపోయాయంట. వేషాధారణ గురించి... మోడ్రన్ అవతారంలో వేషాధారణ. గంతులు... అసలు ఆమె జీవనశైలిపైనే పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, అవేం తనను ఆపలేవని ఆమె అంటున్నారు. ‘‘ఇవన్నీ నా బిడ్డలు ఇచ్చిన బహుమతులు. భక్తి పేరుతో ఆశ్రయించేవారిని కొల్లగొట్టడం నాకు తెలీదు. జీవితంలో దుర్భర జీవితాన్ని గడిపిన నేను ఎంచుకున్న మార్గం సక్రమమైందనే నాకు తెలుసు. ఇదే నా జీవితం. నేను ఇలాగే ఉంటాను. ఈ లోకం కోసం నేను అస్సలు మారను. మిగతా సాధువల్లా నేను కొన్ని భోగాలను పరిత్యజించాను. అవేంటో లోకానికి వివరించాల్సిన అవసరం నాకు లేదు అని ఆమె తెలిపింది. వివాదాలు-ఆరోపణలు... తనపై వినిపిస్తున్న ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. ముఖ్యంగా ముంబైకి చెందిన ఓ మహిళ గృహ హింస కేసులో రాధే మా పేరును కూడా ప్రస్తావించటం తెలిసిందే. ఆ కుటుంబం తన వీరభక్తులని.. వారి కుటుంబ కలతను పరిష్కరించేందుకే అక్కడికి వెళ్లానని ఆమె చెప్పారు. కానీ, ఆ ఇంటి కోడలు డబ్బు కోసమే తన పేరును కేసులోకి లాగిందని రాధే మా తెలిపారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ, నా బిడ్డల కోసం ఆలోచించా. నేను పోతే వారిని ఎవరు చూసుకుంటారు. అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని.. మానసిక వైద్యుడి పర్యవేక్షణలో కౌన్సిలింగ్ తీసుకున్నా అని ఆమె వివరించింది. డాన్సింగ్ వీడియోలపై స్పందిస్తూ... అవి తన వ్యక్తిగతమని, వాటిని బయటపెట్టి కొందరు పెద్ద తప్పు చేశారని ఆమె చెప్పారు. ఫేక్ స్వామిజీల జాబితాలో తన పేరు ఉండటం, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్రశ్నలకు.. ఆమె మౌనంగా ఉండటం విశేషం. తన జీవితం ఓ తెరచిన పుస్తకం అంటూనే.. మధ్యమధ్యలో కంటతడి పెట్టడం.. భక్తుల కోసమే తన జీవితమని చెప్పటం.. ఇలా ఆ 20 నిమిషాల ఇంటర్వ్యూలో రాధే మా అపరిచితురాలిని తలపించిందన్న కామెంట్లు వచ్చిపడుతున్నాయి. -
కూర్చీ ఖాళీగా ఉందని కూర్చున్నా..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్ఓ) కుర్చీలో సాధ్వా రాధేమా కూర్చున్న సంఘటన వివాదస్పదమైన సంగతి తెలిసిందే. రాధేమా ఆయన కుర్చీలో కూర్చోవడంతో నిజంగా ఆయన పదవి నుంచే సస్పెండ్ అయిపోయారు. ఈ సంఘటనపై రాధేమా స్పందించారు. బాత్రూం వాడుకోవడానికి తాను పోలీస్ స్టేషన్లోకి వెళ్లానని, అక్కడ ఓ కూర్చీ ఖాళీగా ఉంటే దానిలో కూర్చున్నానని, అది ఎస్హెచ్ఓ సీటని తనకి తెలియదని రాధేమా చెప్పారు. తన కూర్చీలో నుంచి లేవాల్సిందిగా ఎస్హెచ్ఓ తనను అభ్యర్థించినట్టు పేర్కొన్నారు. తాను వెంటనే ఆ కూర్చీలో నుంచి లేచానని చెప్పారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇలా చర్చనీయాంశమైందని తెలిపారు. ఎస్హెచ్ఓకు తానెవరో కూడా తెలియనది, ఢిల్లీ పోలీసును అగౌరవపరిచే ఉద్దేశ్యం తనకు లేదని సమర్థించుకున్నారు. రిపోర్టుల ప్రకారం స్థానిక వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాధేమా, స్టేషన్ హౌస్ అధికారి కూర్చీలో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్హెచ్ఓ సంజయ్ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ఫోటో వెలుగులోకి వచ్చింది. -
రాధేమాకు వీఐపీ ట్రీట్మెంట్.. విమర్శలు
-
రాధేమాను తన కుర్చీలో కూర్చోబెట్టాడు
సాక్షి, న్యూఢిల్లీ : దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోకండంటూ మొత్తుకుంటున్నా.. వీర భక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. వివాదాస్పద మాత రాధేమా విషయంలోనూ అంతే.. తాజాగా ఆమె ఓ పోలీస్ స్టేసన్ వెళ్లితే ఎలాంటి మర్యాద దక్కిందో ఓసారి చూడండి. దక్షిణ ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు రాధే మా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేషన్ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు. పైగా తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాధేమా వీఐపీ ట్రీట్మెంట్ అంశం తమ దృష్టికి చేరిందని.. అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు తర్వాత తేలుస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, మోడ్రన్ డ్రెస్సులతో వార్తల్లోకెక్కటం దగ్గరి మొదలైన రాధే మా ప్రస్థానం.. నికీ గుప్తా అనే ఓ మహిళను వేధించటంతో రాధే మాపై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. గత నెలలో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని రాధే మా చేసిన విజ్ఞప్తిని ముంబై కోర్టు తోసిపుచ్చింది కూడా. -
రాధేమాకు మరో ఎదురుదెబ్బ!
సాక్షి, ముంబయి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల పంజాబ్-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తాజాగా తనపై నమోదైన గృహహింస కేసునుంచి తన పేరు తొలగించి, విముక్తి కల్పించాలని రాధేమా చేసుకున్న విజ్ఞప్తిని స్థానిక బోరివలి కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గత మంగళవారమే రాధేమా ఉదంతాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చంఢీగఢ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఫగ్వాడా(పంజాబ్)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్ మిట్టల్‌ను రాధేమా గడిచిన కొన్నేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాధేమా.. మొదట ప్రేమ మాటలు, తర్వాత మోహపువల, ఎంతకు తాను లొంగకపోవడంతో చివరికి చంపేస్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు సురీందర్ పేర్కొన్నారు. పంజాబ్ లో తన ఆటలు సాగకపోవడంతో ఆమె ముంబయికి మాకాం మార్చారు. అయితే ముంబయిలోనూ ఆమె అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫోన్ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని, అన్ని పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. సత్సంగ్ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని, భక్తులతోపాటు తాను కూడా నగ్నంగా డ్యాన్స్ చేసేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు అత్యాచారాల కేసులో గత ఆగస్టులో పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన తర్వాత ఇదే తీరుగా నిత్యానంద స్వామి, రాధేమాల దురాఘతాలు వెలుగు చూస్తుండటం గమనార్హం. (చదవండి: మొన్న గుర్మీత్; నేడు రాధేమాకు భారీ షాక్) -
మొన్న గుర్మీత్; నేడు రాధేమాకు భారీ షాక్
- స్వయంప్రకటిత దైవస్వరూపిణిపై పంజాబ్ హైకోర్టు ఆగ్రహం - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం - సురీందర్ అనే వ్యక్తికి రాధేమా మోహపు వల, బెదిరింపులు - ఆడియో టేపుల సంచలనం.. నేడో రేపో అరెస్ట్? సాక్షి, చండీగఢ్: వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు, స్వయంప్రకటిత దైవస్వరూపిణి రాధేమా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా పంజాబ్-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యామూర్తులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫగ్వాడా(పంజాబ్)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్ మిట్టల్‌ను రాధేమా గడిచిన కొన్నేళ్లుగా టార్చర్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాధేమా.. మొదట ప్రేమ మాటలు, తర్వాత మోహపువల, చివరికి చంపేస్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని, అన్ని పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు చర్యలకు ఆదేశాలిచ్చారని బాధితుడు సురీందర్ చెప్పుకొచ్చారు. సత్సంగ్ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని, భక్తులతోపాటు తాను కూడా నగ్నంగా డ్యాన్స్ చేసేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలా మొదలైంది?: ఇప్పుడు ముంబైలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కళ్లుమిరుమిట్లు గొలిపే దుస్తులు, విలాసవంతమైన కార్లు, భవనాలు, విదేశీయాత్రల్లో మునిగితేలుతున్న రాధేమా.. ఒకప్పుడు సాధారణ భక్తురాలు. ఆమె అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. స్వస్థలం పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా డోరంగాల. నేటికి 15 ఏళ్ల కిందట.. అంటే, ఆమె గురువు అవతారం ఎత్తిన ప్రారంభదినాల్లో ఫడ్వాడా(పంజాబ్)పట్టణంలో ఒక జాగరణ నిర్వహించారు. తనను తాను దుర్గామాత అవతారంగా చెప్పుకుంటున్న ఆమెను.. స్థానిక విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సురీందర్ మిట్టల్ ఆధ్వర్యంలోని కార్యకర్తలు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మూగిన వీహెచ్‌పీ కార్యకర్తలు రాధేమా జాగరణ నిర్వహించిన భవంతిపై రాళ్లదాడి చేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన రాధేమా అందరికీ క్షమాపణలు చెప్పుకుని అక్కడి నుంచి బయటపడ్డారు. - సాక్షి వెబ్- వదల బొమ్మాళి..: ఆ సంఘటన తర్వాత ముంబై వచ్చేసిన రాధేమా క్రమంగా పాపులారిటీ సంపాదించారు. పదుల సంఖ్యతో ప్రారంభమైన ఆమె భక్తజనం నేడు లక్ష వరకూ చేరింది. మోడ్రన్ లుక్‌తో, ప్రేమపూర్వక వచనాలు వల్లించే రాధేమా.. తన భక్తుల కుటుంబ తగాదాలు పరిష్కరించడం మొదలు పెద్దపెద్ద సమస్యలను కూడా పరిష్కరించేయత్నం చేసేవారు. తన దారికి అడ్డొచ్చినవాళ్లను నయానో, భయానో లొంగదీసుకునేందుకూ ఆమె వెనుకడుగు వేయలేదు. నాటి నుంచే రాధేమా తీరును వ్యతిరేకిస్తోన్న సురీందర్ మిట్టల్.. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీంతో సురీందర్పై దృష్టిసారించిన ఆమె.. ప్రేమపేరుతో అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రులు ఫోన్ చేసి..‘నీ ప్రేమలో పిచ్చిదాన్నైపోయా.. దూరంగా ఉండలేకపోతున్నా..’ అంటూ మాట్లాడేవారు. తాను అప్పటి మనిషిని కాదని, తలుచుకుంటే ఏదైనా చేయగలని బెదిరించేవారు. -సాక్షి వెబ్ నేడో, రేపో అరెస్ట్!: రాధేమాతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు మొత్తం రికార్డు చేసిన సురీందర్.. వాటిని ఆధారాలుగా చూపుతూ ఆగస్టు 23న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు రావాలని పోలీసులు కోరగా.. రాధేమా వినిపించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సురీందర్ పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. రాధేమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మంగళవారం పంజాబ్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదు చేయనున్న పోలీసులు.. నేడో, రేపో రాధేమాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. -
గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
ముంబై: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎపిసోడ్‌పై మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్పందించారు. గుర్మీత్ దోషిగా తేలటం, హరియాణాలో హింస చెలరేగటం అంతా దైవ నిర్ణయమే అని ఆమె పేర్కొన్నారు. వరుసగా బాబాలు, స్వామీజీలు జైలుకు వెళ్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన(గుర్మీత్) వ్యవహారం గురించి నాకేం తెలీదు. నేనే ఈశ్వర్య ధ్యానంలో మునిగిపోయి ఉన్నా. జరిగే పరిణామాలన్నీ ఆ భగవంతుడి లీలలే. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. అది వారి కర్మ’ అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న విమర్శల గురించి రాధే మా స్పందిస్తూ గాజుతో ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఎదుటి వాళ్ల మీద రాళ్లు వేయాలని ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు. ‘నేనొక రొమాంటిక్ దేవిని. నా ఇంటిని.. నా బిడ్డలను(భక్తులను) కాపాడుకోవటమే నా ముందున్న విధి.. విమర్శలను పట్టించుకోనూ’ అంటూ మరో వ్యాఖ్య కూడా రాధే మా చేశారు. ఇక దేశ ప్రధాని మోదీ ఓ సాధువని, ఆయన నిర్ణయాలన్నీ దేశానికి మేలునే చేస్తాయని ఆమె చెప్పారు. మరోవైపు తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వారని, ఎలాంటి పాపం చేయలేదని, భగవంతుడే ఆయనకు సమాధానం చెప్తాడని రాధే మా అన్నారు. తనకు తాను దైవంగా చెప్పుకునే రాధే మా 2015 లో ఓ మహిళను కట్నం కోసం వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. నటి డాలీ బింద్రా కూడా ఈ మాతాజీ పై బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని భక్తి ముసుగులో అశ్లీలతను ప్రదర్శిస్తోందంటూ ఫాల్గుని బ్రహ్మభట్ట్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
హైకోర్టులో రాధేమాకు ఊరట
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. వరకట్నం వేధింపుల కేసులో రాధేమాకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే డెరే.. రాధేమా పిటిషన్‌ను విచారించారు. రాధేమా తరపు న్యాయవాది, ముంబై పోలీసులు వాదనలు విన్న అనంతరం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పోలీసులు విచారణకు పిలిచినపుడు హాజరు కావాలని రాధేమాను ఆదేశించారు. రాధేమా తన అత్తమామలను ప్రేరేపించి వరకట్నం కోసం వేధించారని ఓ వివాహిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు రాధేమాను ఇటీవల విచారించారు. -
'లైవ్'లో బాబా చెంప చెళ్లుమంది..
ముంబై : అదో న్యూస్ చానల్ కార్యాలయం... సీరియస్‌గా లైవ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ... తాము ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోయి...చెంపలు వాయించుకున్న వీడియో... ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఆదివారం ఐబీఎన్ 7 చానెల్ ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చావేదికపై హిందూ మహాసభ ఆధ్యాత్మిక వేత్త ఓమ్జీ చెంపను ప్రముఖ జ్యోతిష్కురాలు దీపా శర్మ చెళ్లుమనిపించారు. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆధ్యాత్మిక విషయాలపై నిర్వహించిన చర్చకు అతిథులుగా విచ్చేసిన వీరిరువురు ఇలా గొడవపడ్డారు. ఇంతకీ వీళ్లిద్దరూ గొడవపడటానికి కారణం వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా గురించి. ఆమె వ్యవహార శైలి సందర్భంగా చర్చ పక్కదారి పట్టింది. అది కాస్త కార్యక్రమంలో పాల్గొన్న వక్తల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లటంతో రచ్చ మొదలైంది. ఈ సందర్భంగా ఓమ్జీ...దీపా శర్మ పర్సనల్ లైఫ్ గురించి విమర్శలు చేయటంతో ...ఆగ్రహానికి గురైన ఆమె..ఓమ్జీ చెంప మీద ఒక్కటిచ్చుకున్నారు. దీంతో ఆయన కూడా దీపా శర్మపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కొట్లాటకు దిగటంతో యాంకర్ వారిని శాంతింపచేయాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనను బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్కే సింగ్ ఖండించారు. -
రాధేమాపై మరో కేసు..
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా పై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులుతో తనను వేధిస్తోందంటూ రాధేమా మాజీ భక్తురాలు డాలీ బింద్రా ముంబై పోలీసులను ఆశ్రయించారు. రాధేమా, ఆమె అనుచరులతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. గతనెల్లో ట్విట్టర్ లో పలువురు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డ రాధేమా... నటి, తన మాజీ భక్తురాలు డాలీ బింద్రాపై కూడా ఆరోపణలు కురిపించడం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమా సహా 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. -
సోషల్ మీడియాలో రాధేమా ఫొటో హల్ చల్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కార్యకలాపాలు రోజుకో విధంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ పక్క అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే... మరో పక్క ఆమె వివాదాస్పద ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను పరిశీలిస్తే.. ఓ కిట్టీ పార్టీలో రాధే మా పొట్టి స్కర్ట్‌లో కనిపించారు. వార్త ఏజెన్సీ పీటీఐ జర్నలిస్ట్ ఈ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఫొటోలో రాధేమాతో పాటు ఉన్న మహిళలంతా ఎర్రని వస్త్రధారణతో నుదుటిపై తిలకం, చేతులకు గాజులు కలిగి ఉండటంతో పాటు కొందరు త్రిశూలాన్ని కూడ ధరించి కనిపించారు. ఎప్పుడూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించే ఆమె ఇలా దర్శనమివ్వడం ప్రధాన వార్తగా నిలిచింది. ఇటీవల రాధే మాపై పలు వివాదాలు రావడం, కేసులు నమోదు కావడం తెలిసిందే. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు ఆమెను విచారించారు. ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అశ్లీలతను ప్రదర్శిస్తున్న దృశ్యాలతో కూడిన ఓ వీడయో సీడిని కూడ పోలీసులకు సమర్పించాడు. తాజాగా ఆమె ఓ ఫొటోలో మిని స్కర్ట్ తో దర్శనమివ్వడం మరోసారి చర్చనీయాంశమైంది. -
మరో వివాదంలో రాధే మా
చండీగఢ్: ఆధ్యాత్మిక గురువు రాధే మా మరో వివాదంలో ఇరుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు రాధే మాకు నోటీసు జారీ చేశారు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారని పంజాబ్‌లోని పగ్వారా నివాసి సురీందర్ మిట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధే మా డబ్బులు ఇవ్వాల్సిందిగా తనను డిమాండ్ చేసి, ఇవ్వనందుకు బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఓ పోలీస్ అధికారి ముంబైకి వెళ్లి రాధే మాకు నోటీసు జారీ చేశారు. రాధే మాతో పాటు ఆమె సోదరి రజ్జో, కోడలు మేఘ, సహాయకురాలు రీతూ సరీన్, అనుచరుడు సంజీవ్ గుప్తాలపై కూడా కేసు నమోదు చేయాలని సురీందర్ ఫిర్యాదు చేశారు. రాధే మాతో మాట్లాడినప్పడు రికార్డు చేసిన ఫోన్ సంభాషణలను పోలీసులకు అందజేశారు. ఆమె అసభ్యత, అశ్లీలతను ప్రచారం చేస్తూ మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని సురీందర్ ఆరోపించారు. వరకట్నం కేసులో ఇటీవల రాధే మాను ముంబై పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. -
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్
ముంబై: తనది అపర కాళీకాదేవి అవతారమంటూ వివాదాస్పద ఆహార్యం, ప్రవర్తనతో సంచలనం సృష్టిస్తోన్న రాధే మాకు మద్దతుగా బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్సైట్లో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని సృష్టిస్తున్నాయి. 'కురచ దుస్తులు ధరించారంటూ రాధేమాపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారుగానీ మరి అదే కాళికాదేవి అంతకన్న తక్కువ దుస్తుల్లో కనిపిస్తారు గదా! మరి ఆ సంగేతేమిటి ? అసలు బట్టలంటూ ధరించకుండా నగ్నంగా సంచరించే, అసభ్యంగా నృత్యం చేసే సాధు పుంగవుల సంగతేమిటీ?' అంటూ సోను నిగమ్ ఆదివారం ట్విట్టర్లో ట్వీట్ చేయడం ద్వారా కొత్త వివాదాన్ని రాజేశారు. 'ఆడవాళ్లకో న్యాయం, మగవాళ్లకో న్యాయమా?' అంటూ సోనూ నిగమ్ మరో ట్వీట్లో ప్రశ్నించారు. కుంభమేళా లాంటి కార్యక్రమాల్లో కొన్ని తెగల సాధువులు నగ్నంగా సంచరించినా, జుగుస్పాకరంగా నృత్యం చేసినా పట్టించుకోరని, వారిపై అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు స్పందిస్తారని, మరి ఇది ద్వంద్వ ప్రమాణాల కిందకు రాదా? అంటూ కూడా ఆయన విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. భగవత్ స్వరూపిణీగా, అపర కాళీమాతాగా ప్రచారం పొందుతున్న రాధే మాపై కేసులు వేయడం న్యాయం కాదని, ఆమెను అలా చిత్రీకరిస్తున్నవారిపై, ఆమెను అలా కొలుస్తున్న భక్తజనంపై ఈ సమాజం, ఈ వ్యవస్థ కేసులు వేయాలని సోనూ నిగమ్ మరో ట్వీట్లో సూచించారు. కురచ దుస్తులు ధరిస్తూ, భక్తులను కౌగిలింతలు, ముద్దులతో ముంచెత్తుతూ దేవతలను అవమానపరుస్తున్నారంటూ హిందూ సంస్థలు గొడవ చేస్తున్న విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ముంబైకి చెందిన న్యాయవాది ఫాల్గుని బ్రహ్మభట్ కేసు కూడా వేశారు. మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్, కురచ దుస్తుల్లో వున్న రాధే మా ప్రైవేట్ ఫొటోలను ఆగస్టు ఐదవ తేదీన మీడియాకు విడుదల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అవి పూర్తిగా తన ప్రైవేట్ ఫొటోలని, ఇంట్లో ఎవరైనా అలాంటి దుస్తులు ధరించవచ్చని, దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆమె మీడియా ముందు సమర్థించుకోవడం విశేషం. Just my 2 pence. Kaali Maa is depicted in lesser clothes than Radhey Maa. Interesting that this country wants to sue a woman for her clothes — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Men Saadhus can walk naked. Dance embarrassingly, but it takes a rape charge to put them behind bars. So much for Gender equality? :) — Sonu Nigam (@sonunigam) August 16, 2015 Wanna sue, sue the followers... Sue YOURSELVES.. For making them God men and women. Setting different rules for men and women, not fair. — Sonu Nigam (@sonunigam) August 16, 2015 -
సన్యాసిని రాధే మాకు ఊరట
ముంబై: వివాదస్పద సన్యాసిని రాధేమాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆమెకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వరకట్నం కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఆమె అరెస్ట్ పై రెండు వారాల పాటు స్టే విధించింది. ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి కింది కోర్టు నిరాకరించడంతో ఆమె బాంబే కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె ఖండేవాలి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఆమెపై గతంలోనూ పలు కేసులు దాఖలయ్యాయి. -
రాధే మాను విచారిస్తున్న పోలీసులు
ముంబై: వరకట్నం వేధింపుల కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాధే మా ముంబై ఖండేవాలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.ఇదిలావుండగా రాధే మా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు కొట్టివేసింది. వరకట్నం వేధింపుల కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబై పోలీసులు రాధే మాకు సమన్లు పంపిన సంగతి తెలిసిదే. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చారంటూ 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. దీంతో పాటు రాధే మాపై అశ్లీల కేసు, ఆమె వల్ల ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని మరో కేసు నమోదయ్యాయి. -
రాధేమా పై గృహ హింస ఆరోపణలు
-
'ఆమె రాకుంటే అరెస్ట్ చేసి తీసుకొస్తారు'
ముంబై: వివాదస్పద మహిళా ఆధ్మాత్మిక గురువు రాధే మాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఈనెల 14న కండ్లివి పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని అంతకుముందు న్యాయస్థానం ఆదేశించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె తప్పనిసరిగా పోలీసు స్టేషన్ లో హాజరుకావాల్సి ఉంటుందని ఫిర్యాది తరపు న్యాయవాది కేఆర్ మెహతా తెలిపారు. ఒకవేళ ఆమె రాకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశముందన్నారు. రాధే మా పరారీలో ఉన్నారన్నదే తమ అభ్యంతరమని, పోలీసు స్టేషన్ కు రాకుండా ఉండేందుకు ఆమె ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
'రాధేమా వల్ల ఏడుగురి ఆత్మహత్య'
కచ్: ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక సన్యాసిని రాధేమాపై మరో ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే ఒక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధేమా.. గుజరాత్ లోని ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమని రమేష్ జోషి అనే వ్యక్త్తి ఫిర్యాదు చేశాడు. రాధేమా మాయమాటల వల్ల గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారన్నాడు. రాధే మా నుంచి ఏవో అద్భుతాలు ఆశించి ఆ కుటుంబం మొత్తం ఆస్తిని ఆమెకు ఇచ్చేశారని.. అనంతరం పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతకుముందు రాధేమాపై ఒక కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా తన అత్తమామలపై రాధే మా ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈ నెల 14న కండివ్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే ఆదివారం నగరానికి తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి సమన్లు జారీ చేసిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. -
త్వరలో రాధే మాకు సమన్లు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో త్వరలో ముంబై పోలీసులు సమన్లు పంపనున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఈ విషయం చెప్పారు. ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే మా ఈ రోజు నగరానికి తిరిగి వచ్చారు. ఆమెకు తొలుత సమన్లు జారీ చేసి, ఆ తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలకు సూచించినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. ఎవరీ ఆధ్యాత్మిక దేవత! -
ఎవరీ ఆధ్యాత్మిక దేవత!
న్యూఢిల్లీ: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఫోటోలో కనిపిస్తున్న గాడ్ వుమెన్(ఆధ్యాత్మిక దేవత) ఎవరు?, గాడ్ వుమన్ గా తనకు తాను ప్రకటించుకున్న రాధే మా అసలు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె అసలు పేరు సుఖేందర్ కౌర్. వయసు 50 పైమాటే. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఆమె ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతోనే ఇలా ఆధ్యాత్మిక దేవత అవతారం ఎత్తిందట. రాధే మా మాత్రం పూర్తిస్థాయిలో మేకప్ వేసుకుని, నృత్యాలు చేస్తూ భక్తులను అలరిస్తారు. ఆమె ఏవేవో మాట్లాడుతూ.. అశ్లీల నృత్యాలు చేస్తున్నారని ముంబైకి చెందిన ఒక లాయర్ కేసు పెట్టారు. దీంతో పాటు ఆమెపై తాజాగా వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైంది. అదేంటి ఈమెపై వరకట్న కేసు నమోదు కావడం ఏమిటని అనుకుంటున్నారా?, నిక్కీ గుప్తా అనే మహిళకు పెళ్లి కుదిరింది. అయితే నిక్కీ అత్త మామలు రాధే మాకు భక్తులు. తమ కుమారుడి పెళ్లికి రాధే మాను ఆహ్వానించారు. అందుకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేస్తే పెళ్లికి వస్తానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిక్కీ గుప్తాకు చేరవేసిన ఆ అత్తమామలు అదనపు కట్నం కోసం కావాలన్నారు. దీనికి రాధే మా ఒత్తిడే కారణమని నిక్కీ గుప్తా ఫిర్యాదులో తెలిపింది. ఇదిలా ఉంచితే ..ఆమెకు ఆధ్యాత్మిక దేవతగా చాలానే పేరు వచ్చింది. రాధే మా కు ఏవో అద్భుత శక్తులు ఉన్నాయని భావించిన భక్తులు ఆపై ఆమెను నమ్మడం కొలవడం మొదలు పెట్టారు. ఆ భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న రాధే మా.. దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెనకేసుకుందని వినికిడి. ప్రస్తుతం ఈ ఫోటోలో ఎర్రటి కురచ దుస్తుల్లో కనిపిస్తున్న రాధే మా అంశం వివాదంగా మారింది. ఈ ఫోటోను షేర్ చేసుకున్న కొంతమంది ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అసలు 'రాధా మరియు మా' పేరును అపహాస్యం చేస్తున్నారని ఫోటోను షేర్ చేసుకున్న టీవీ స్టార్ రాహుల్ మహాజన్ మండిపడ్డాడు.