ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు | Summons issued to Radhe Maa | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు

Published Mon, Aug 10 2015 9:08 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు - Sakshi

ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు

ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈ నెల 14న కండివ్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే ఆదివారం నగరానికి తిరిగి వచ్చారు.  ఆదివారం రాత్రి సమన్లు జారీ చేసిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement