godwoman
-
నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..
ముంబై : రోగాలు నయం చేస్తా, కుటుంబ సభ్యుల చిక్కులన్ని తొలగిస్తానంటూ ఓ మహిళను నమ్మించి రూ. 12.75లక్షలు దోచుకెళ్లిందో దొంగ సన్యాసిని. అంతేకాకుండా షిరిడి బాబాతో మాట్లాడి సమస్యలన్ని తీరుస్తానంటూ పూజ పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా మోసాన్ని గమనించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ స్వయం ప్రకటిత సన్యాసిని జైలుపాలయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్ గురుమ తనకు తాను దైవాంశ సంభుతురాలికిగా ప్రకటించుకొని అమాయక ప్రజలకు మోసం చేస్తుండేది. నగరంలోని ఖార్ పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ ఇటీవల ఆ సన్యాసిని సంప్రదించింది. తన అత్తగారి ఆరోగ్యం బాగాలేదని, అలాగే ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని తొలగించాలని ఆ సన్యాసికి కోరింది. బాదిత మహిళ బలహీనతల్ని ఆసరా చేసుకున్న దొంగ సన్యాసిని.. తన దైవ శక్తులతో అన్ని సమస్యలను తొలగిస్తానని నమ్మపలికింది. షిరిడి బాబాతో నేరుగా మాట్లాడి సమస్యలను తొలగిస్తానని నమ్మించిది. గత జన్మలో సదరు మహిళ, ఆమె భర్త పాపాలు చేశారని, దాని ఫలితంగానే ఇప్పుడు సమస్యలు వచ్చాయని మాయమాటలుతో నమ్మపలికింది. అవన్నీ తొలగిపోవాలంటే పూజలు చేయాలని, దానికి ఖర్చు అవుతుందని మొత్తంగా రూ. 12.75లక్షలు రాబట్టింది. మరోవైపు పూజ పేరుతో మహిళపై సన్యాసిని లైంగికదాడికి పాల్పడింది. చివరకు ఆమె మోసాన్ని గమనించిన మహిళ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ దారువాలను అరెస్ట్ చేశారు. -
సాధ్వీ దీవెనలు.. పోలీసు అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : సాధ్వీతో హీలింగ్ చేయించుకుంటూ, దీవెనలు పొందుతున్న ఫొటో వైరల్ కావడంతో పోలీసు అధికారిని బదిలీ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనక్‌పురి పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇందర్ పాల్... సాధ్వీగా పేరొందిన నమితా ఆచార్యను స్టేషన్‌కు పిలిపించారు. ఇందర్‌పాల్ తలపై నమిత ఆచార్య చేయి ఉంచగా.. అతడు సేద తీరుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులే ఇలా ఏకంగా పోలీస్ స్టేషన్లోనే యూనిఫాంలో ఇలా చేయడమేమిటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇందర్ పాల్‌ను ఆదేశిచండంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఏర్పాటు చేశారు. అతడిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తనకు తాను దేవీమాతగా చెప్పుకునే నమితా ఆచార్య ఇదివరకు కూడా పలువురు ప్రభుత్వాధికారుల కార్యాలయాలకు వెళ్లి మరీ హీలింగ్ చేసేవారు. వారిలో ఎక్కువగా ఐపీఎస్ అధికారులే ఉండటం గమనార్హం. -
ఆధ్యాత్మిక గురువు రాధే మాకు సమన్లు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈ నెల 14న కండివ్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే ఆదివారం నగరానికి తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి సమన్లు జారీ చేసిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. -
త్వరలో రాధే మాకు సమన్లు
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో త్వరలో ముంబై పోలీసులు సమన్లు పంపనున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఈ విషయం చెప్పారు. ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే మా ఈ రోజు నగరానికి తిరిగి వచ్చారు. ఆమెకు తొలుత సమన్లు జారీ చేసి, ఆ తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలకు సూచించినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. ఎవరీ ఆధ్యాత్మిక దేవత!