రాధే మాను విచారిస్తున్న పోలీసులు
ముంబై: వరకట్నం వేధింపుల కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాను ముంబై పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాధే మా ముంబై ఖండేవాలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.ఇదిలావుండగా రాధే మా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ముంబై కోర్టు కొట్టివేసింది.
వరకట్నం వేధింపుల కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబై పోలీసులు రాధే మాకు సమన్లు పంపిన సంగతి తెలిసిదే. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చారంటూ 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. దీంతో పాటు రాధే మాపై అశ్లీల కేసు, ఆమె వల్ల ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని మరో కేసు నమోదయ్యాయి.