ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. వరకట్నం వేధింపుల కేసులో రాధేమాకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే డెరే.. రాధేమా పిటిషన్ను విచారించారు. రాధేమా తరపు న్యాయవాది, ముంబై పోలీసులు వాదనలు విన్న అనంతరం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పోలీసులు విచారణకు పిలిచినపుడు హాజరు కావాలని రాధేమాను ఆదేశించారు. రాధేమా తన అత్తమామలను ప్రేరేపించి వరకట్నం కోసం వేధించారని ఓ వివాహిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు రాధేమాను ఇటీవల విచారించారు.
హైకోర్టులో రాధేమాకు ఊరట
Published Thu, Oct 8 2015 12:47 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM
Advertisement
Advertisement