'రాధేమా వల్ల ఏడుగురి ఆత్మహత్య' | Radhe Maa accused of instigating family of seven to commit suicide in Gujarat | Sakshi
Sakshi News home page

'రాధేమా వల్ల ఏడుగురి ఆత్మహత్య'

Published Tue, Aug 11 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

'రాధేమా వల్ల ఏడుగురి ఆత్మహత్య'

'రాధేమా వల్ల ఏడుగురి ఆత్మహత్య'

కచ్: ఇటీవల తరచు వార్తల్లో నిలుస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక సన్యాసిని రాధేమాపై మరో ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే ఒక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధేమా.. గుజరాత్ లోని ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమని రమేష్ జోషి అనే వ్యక్త్తి ఫిర్యాదు చేశాడు.

రాధేమా మాయమాటల వల్ల గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారన్నాడు. రాధే మా నుంచి ఏవో అద్భుతాలు ఆశించి ఆ కుటుంబం మొత్తం ఆస్తిని ఆమెకు ఇచ్చేశారని.. అనంతరం పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


అంతకుముందు రాధేమాపై ఒక కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా తన అత్తమామలపై  రాధే మా  ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement