
సాక్షి, న్యూఢిల్లీ : దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోకండంటూ మొత్తుకుంటున్నా.. వీర భక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. వివాదాస్పద మాత రాధేమా విషయంలోనూ అంతే.. తాజాగా ఆమె ఓ పోలీస్ స్టేసన్ వెళ్లితే ఎలాంటి మర్యాద దక్కిందో ఓసారి చూడండి.
దక్షిణ ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు రాధే మా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేషన్ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు. పైగా తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాధేమా వీఐపీ ట్రీట్‌మెంట్ అంశం తమ దృష్టికి చేరిందని.. అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు తర్వాత తేలుస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కాగా, మోడ్రన్ డ్రెస్సులతో వార్తల్లోకెక్కటం దగ్గరి మొదలైన రాధే మా ప్రస్థానం.. నికీ గుప్తా అనే ఓ మహిళను వేధించటంతో రాధే మాపై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. గత నెలలో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని రాధే మా చేసిన విజ్ఞప్తిని ముంబై కోర్టు తోసిపుచ్చింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment