VIP treatment
-
కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
-
ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్
వైరల్/ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఆయన మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు శనివారం జాతీయ మీడియా ఛానెల్స్‌లో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్నాయి. జైల్లో జైన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందని ఈడీ, కోర్టుకు తెలిపిన కొన్నిరోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. తల, కాళ్లకు ఓ మనిషితో ఆయన మసాజ్ చేయించుకుంటున్న ఫుటేజీ అది. సెప్టెంబర్‌లోనే ఇది జరిగినట్లు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకమైన సదుపాయాలు.. పక్కనే మినరల్ వాటర్ బాటిల్స్ ప్యాక్ కూడా గమనించవచ్చు. జైళ్ల నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సదుపాయాలు అందాయన్నది ప్రధాన విమర్శ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సదరు వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీనిపై తీహార్ జైల్ అధికారులు స్పందించాల్సి ఉంది. మే 30వ తేదీన మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ఈడీ సమక్షంలో అరెస్ట్ అయ్యారు. మరోవైపు అవినీతి స్కామ్‌లో జైన్‌తో పాటు ఆయన భార్యాబిడ్డలకు ప్రమేయం ఉందని అభియోగాలు నమోదు చేసింది. So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022 -
ఢిల్లీలోని తిహార్ జైల్లో ఆప్ మంత్రికి వీఐపీ ట్రీట్మెంట్
-
షాక్ : దావూద్ అనుచరుడికి వీవీఐపీ ట్రీట్మెంట్!
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్‌కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు. -
రాధేమాకు వీఐపీ ట్రీట్మెంట్.. విమర్శలు
-
రాధేమాను తన కుర్చీలో కూర్చోబెట్టాడు
సాక్షి, న్యూఢిల్లీ : దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోకండంటూ మొత్తుకుంటున్నా.. వీర భక్తులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. వివాదాస్పద మాత రాధేమా విషయంలోనూ అంతే.. తాజాగా ఆమె ఓ పోలీస్ స్టేసన్ వెళ్లితే ఎలాంటి మర్యాద దక్కిందో ఓసారి చూడండి. దక్షిణ ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు రాధే మా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేషన్ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు. పైగా తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాధేమా వీఐపీ ట్రీట్మెంట్ అంశం తమ దృష్టికి చేరిందని.. అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు తర్వాత తేలుస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, మోడ్రన్ డ్రెస్సులతో వార్తల్లోకెక్కటం దగ్గరి మొదలైన రాధే మా ప్రస్థానం.. నికీ గుప్తా అనే ఓ మహిళను వేధించటంతో రాధే మాపై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. గత నెలలో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని రాధే మా చేసిన విజ్ఞప్తిని ముంబై కోర్టు తోసిపుచ్చింది కూడా. -
శశికళకు మరో ఏడేళ్ల అదనపు శిక్ష!
- ‘జైలులో వీఐపీ ట్రీట్మెంట్’పై ఐపీఎస్ రూప వ్యాఖ్య - ఏకసభ్య విచారణలోనూ ఆధారాలు లభ్యం.. నేడో,రేపో ప్రభుత్వానికి నివేదిక సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు అధికారులకు లంచం ఇచ్చి, లగ్జరీ జీవితం అనుభవించినట్లు రుజువైన పక్షంలో అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళకు మరికొన్నేళ్లు అదనపు శిక్ష పడే అవకాశం ఉందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప చెప్పారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శశికళ, నకిలీ స్టాంపుల కేసులో అరెస్టయిన అబ్దుల్ కరీం తెల్గి తదితరులు ఖరీదైన సౌకర్యాలను కల్పించుకుని దర్జా జీవితాన్ని గడుపుతున్నట్లు రూప బయటపెట్టారు. ముఖ్యంగా శశికళ రూ.2 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరదీశారు రూప. కాగా, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ సత్యనారాయణరావును కర్ణాటక ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. అదే సమయంలో రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. ఐపీఎస్ అధికారిణి రూప ఇటీవలే ఓ తమిళ పత్రిక (తమిళ్ మురసు) కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శశికళకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ‘జైలులో ఆమె అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు ఆధారాలు సేకరించాను... అసలు ఆమె జైలులోనే గడపకుండా సమీపంలోని ఒక క్వార్టరులో ఉండేవారని కూడా తెలుసుకున్నాను. ఈ విషయంలో ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఉంటే చాలా తీవ్రమైన చర్య తీసుకుని ఉండేదాన్ని. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో రాజభోనాలు అనుభవిచినట్లు రుజువైన పక్షంలో ఆమెకు మరో ఏళ్లు శిక్షపడే అవకాశం ఉంది’అని రూప చెప్పారు. ఇదిలా ఉండగా, రూప చేసిన ఆరోపణలపై విచారణకుగానూ కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు అధికారి వినయ్‌కుమార్‌ను నియమించింది. హవాలా రూపంలో జైలు అధికారులకు రూ.2 కోట్లు అందాయనడానికి వినయ్‌కుమార్‌కు ఆధారాలు లభించినట్లు, ఈనెల 24వ తేదీన ఆయన తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. -
శశి'కళ'కు కత్తెర
► బెంగళూరు జైల్లో లగ్జరీ సౌకర్యాలకు లంగరు ► శశికళ జైలు జీవిత వీడియో, ఫొటోల హల్చల్ జైలు జీవితాన్ని సైతం కళకళగా మార్చుకున్న శశికళ లగ్జరీ జీవితానికి లంగరుపడింది. లోపాయికారితనంతో జైలు అధికారులు కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు ఉన్నతాధికారులు కత్తెరవేశారు. పరమపద సోపానపటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టుగా అసాధారణ స్థితినుంచి జారిపోయి సాధారణ ఖైదీగా మారిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: జైల్లో రాజమర్యాదలు అనుభవించిన శశికళ చివరకు సాధారణ ఖైదీగా మారారని తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో వెలువడిన కథనాల మేరకు.. తమిళనాడు రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా వెలుగొందిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలును సైతం తన అగ్రహారంగా మార్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా జయలలిత వెన్నంటి ఉంటూ ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రాణం కావడంతో జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. కోటి రూపాయలు చూపిస్తే కొండమీద కోతైనా దిగివస్తుందనే సామెతను శశికళ ఆచరణలో పెట్టగా జైలు అధికారులు అక్షరాల అమలుచేశారు. జైలు నాలుగు గోడల మధ్య శశికళకు రహస్యంగా జరుగుతున్న రాచమర్యాదలను కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప బట్టబయలుచేసి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల్లో కలకలం రేపారు. జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన వంటగది, ములాఖత్ కింద వచ్చిన వారితో మాట్లాడేందుకు మరో గది, యోగా గది, టీవీ వీక్షణకు మరో రూం, బాత్రూం.. మొత్తం ఐదు గదులు, ఖరీదైన మంచం, సోఫా, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఇలా అనేక గృహోపకరణాలు, హాయిగా నడయాడేందుకు పొడవాటి వరండా కేటాయించారు. ఈ సదుపాయల కల్పన కోసం మాజీ డీజీపీ సత్యనారాయణరావుకు రూ.2 కోట్లు లంచం ముట్టినట్లు రూప బహిరంగంగా చాటగా, అబ్బే అదేం లేదని డీజీపీ ఖండించారు. అయితే రూప ఆరోపణలు నిజమని నిరూపిస్తూ జైల్లోని చిన్నమ్మ లగ్జరీ జీవితం ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా బయటకు పొక్కింది. అంతేగాక, జైలు దుస్తుల్లో కాక ఖరీదైన నైటీలో చేతిలో బ్యాగ్‌తో శశికళ నడుస్తున్న వీడియో దృశ్యాలు తమిళనాడు, కర్ణాటక ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేశాయి. శశికళ వంట తదితర సేవల కోసం తుముకూరు జైలు నుంచి ఐదుగురు మహిళా ఖైదీలను సైతం రప్పించారు. వీరిలో మేరీ, రేఖ అనే ఇద్దరు కన్నడంతోపాటూ తమిళం కూడా మాట్లాడగలరు. అలాగే శశికళ కోసం ప్రత్యేక వైద్యుడిని నియమించారు. ఇలాంటి లగ్జరీ జీవితం కోసం వారానికి రూ.2.50 లక్షల చొప్పున శశికళ నుంచి రూ.2కోట్లు పుచ్చుకున్నట్లు రూప ఆరోపించారు. భారీ మొత్తంలో ముడుపులు ముట్టిన కారణంగా దినకరన్ తదితరులు జైలుకు వస్తే ప్రశ్నించకుండా లోనికి పంపేవార ని తెలుస్తోంది. తనకోసం వచ్చేవారికి టీ, కాఫీ తదితర మర్యాదలు చేసే విధంగా శశికళకు గార్డుగా ఉన్న మహిళా పోలీసు అధికారిణులే ఆదేశించేవారని సమాచారం. బెంగళూరు జైల్లో శశికళ కోసం ఏర్పాటు చేసిన లగ్జరీ వసతులు రూపతో శశికళ వాగ్వాదం జైలు తనిఖీ సమయంలో శశికళకు కల్పించిన సదుపాయాలను చూసి బిత్తరపోయిన రూప వాటిని సెల్ఫోన్లో చి త్రీకరించారు.ఆ సమయంలో రూపతో శశికళ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం నుంచి అందరూ తెలుసు, వారికి లేని అభ్యంతరం నీకెందుకు, వారం రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తా అని రూపను బెదిరించినట్లు సమాచారం. అయితే, ముందు జాగ్రత్త చర్యగా జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను సీసీ టీవీ కెమెరా నుం చి డౌన్లోడ్ చేసుకుని సీడీలో రికార్డు చేసుకున్న తరువాతనే మీడియా ముందుకు రూప వచ్చినట్లు సమాచారం. లోపాయి రాయితీలకు కోత ఇదిలా ఉండగా, డీఐజీ రూప ప్రకటన వల్ల జైల్లోని లోగు ట్టు రట్టుకావడంతో ప్రభుత్వం సోమవారం నుంచి సంస్కరణల బాట పట్టింది. రూప సహా నలుగురు అధికారులను బదిలీచేసింది. ముఖ్యంగా లోపాయికారిగా శశికళకు కల్పించిన సదుపాయాలను కోతవిధించింది. అధికారులు టీవీ కనెక్షన్‌ను తొలగించారు. వీఐపీగా చెలామణి అయిన శశికళ మంగళవారానికి సాధారణ ఖైదీగా మారిపోయారు. ఐదు గదుల నుంచి సాధారణ ఖైదీ గదికి ఆమెను మార్చారు. తన ప్రత్యేక వంట గదిలో ఇడ్లీ, దోసెలు, మాంసాహారం చేయించుకుని తినే శశికళ సోమవారం ఉదయం ఇతర ఖైదీలతోపాటూ నిమ్మకాయల అన్నం, మధ్యాహ్నం రాగిరొట్టె, పెరుగన్నం తిని టీ తాగారని తెలిసింది. ప్రతిరోజు రాత్రివేళ చపాతీ తినే శశికళకు సాంబారన్నం పెట్టారని సమాచారం. శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి తుమ్కూరు జైలుకు మార్చాలని రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఖరీదైన దుస్తుల్లో శశికళ (సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం) సీఎం, మంత్రులపై హైకోర్టులో పిటిషన్ పదవీ ప్రమాణం నియమ నిబంధలను పాటించకుండా జైలులో శశికళను కలుసుకున్న సీఎం ఎడపాడి, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజు, కామరాజ్‌లను ఆ పదవుల నుంచి డిస్మిస్ చేయాలని శ్రీవిల్లిపుత్తూరు మాజీ ఎమ్మెల్యే తామరకన్ని కుమారుడు ఆనళగన్ మధురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు అర్హమా అనే అంశపై ఆగస్టు 1వ తేదీన నిర్ణయిస్తారు. డీఐజీ రూప నిజాయితీతో కూడిన దూకుడును కొనసాగించాలని పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపారు. బెంగళూరు జైల్లో శశికళకు ప్రత్యేక రాయితీలపై కర్ణాటక హైకోర్టు తానుగా ముందుకు వచ్చి విచారణ జరపాలని కొంగునాడు మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి ఈఆర్ ఈశ్వరన్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
శశికళకు ఎన్ని వసతులో!
బెంగళూరు : తమిళనాడు అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి ఒక్కొక్క విషయమే బయటికి వస్తోంది. తాజాగా సోమవారం ఆమెకు ఒక బ్యారెక్‌లోని మూడు– నాలుగు సెల్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక సెల్ కిచెన్‌గా, రెండో సెల్లో దుస్తులు, కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్‌బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో సెల్లో విజిటర్స్‌ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. మరోసెల్లో శశికళ నిద్రించడానికి వినియోగించేవారని సమాచారం. ఫ్యాన్, మస్కిటో కాయిల్స్ కూడా ఆమెకు కేటాయించినట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సెల్స్ ఉన్న బ్యారెక్‌లోకి ఎవరినీ పంపించేవారు కాదని ఇక సెల్స్‌కు తెర కూడా ఉండేదని దీని వల్ల లోపల ఉన్నవారు ఏమి చేస్తున్నారో బయటికి తెలిసేది కాదని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సమాచారం లీకేజీ చేస్తున్నారనే అనుమానంతో జైలులో ఉన్న దాదాపు 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు పంపిచేశారు. కాగా తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం, ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. -
హంతక ఆసుపత్రులు
ఆరున్నర నెలలకే ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఒక పేదింటి చిట్టితల్లిని కాపాడేందుకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పడిన తపన గురించి గత నెల 29న ‘సాక్షి’ ప్రత్యేక కథనం వెలువరించింది. అతి తక్కువ బరువుతో పుట్టడంవల్ల ఆ చిన్నారికి ఏర్పడిన సమస్యలను తీర్చడం కోసం తమకు అందుబాటులో ఉన్న సమస్త అవకాశాలనూ వారు వినియోగించుకున్నారు. ఒక వీఐపీకి చికిత్స చేసినంత శ్రద్ధతో, అంకితభావంతో వారు పనిచేశారు. అందరిచేతా శభాష్ అనిపించుకున్నారు. మరోపక్క సోమ, మంగళవారాల్లో విజయవాడలోనూ, హైదరాబాద్‌లోనూ చోటు చేసుకున్న రెండు ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. అచ్చం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన చిన్నారి తరహాలోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తక్కువ బరువుతో ఉన్న ఒక నవజాత శిశువును చేర్చారు. ఐసీయూలో క్షేమంగా ఉండాల్సిన ఆ పాప చీమలు కుట్టడంతో, సెలైన్ బాటిల్ మీద పడటంతో కన్నుమూసింది. హైదరాబాద్ ప్రసూతి ఆసుపత్రిలో అయితే సకా లంలో వైద్య సాయం కొరవడి తల్లీ, బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. పౌరులకు మంచి ఆరోగ్యం అందించ గలిగితే ఉత్పాదకత, సృజనాత్మకత పెరుగుతాయని...అంతిమంగా అవి దేశ ఆర్ధికా భివృద్ధికి దోహదపడతాయని చెబుతారు. ఆరోగ్య సేవ బహిరంగ మార్కెట్లో దొరికే సరుకుగా మారకూడదు. అది వ్యక్తుల ఆర్ధిక స్తోమతను బట్టి మాత్రమే అందుబాటులోకొచ్చే పరిస్థితి ఏర్పడకూడదు. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో జరుగుతున్నది అదే. అయిదు నక్షత్రాల హోటళ్లను మించి ధగధగలాడే ప్రైవేటు ఆసుపత్రుల్లో అడుగుపెట్టాలంటే...రోగికి ఉన్న జబ్బు కాదు, ఆ రోగి వద్ద ఉన్న డబ్బు ప్రధాన అర్హత. కనుక నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు అటు వైపు వెళ్లలేరు. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులను పాలకులు ఒక క్రమ పద్ధతిలో పీక నొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యావసరాలను తీర్చడం తమ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అందువల్లనే అవి చికిత్సాలయాలుగా కాక రోగిష్టి కేంద్రాలుగా, మిగిలిపోతున్నాయి. నల్లగొండ ఆసుపత్రి వంటివి అందుకు అరుదైన మినహా యింపు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలుండవు. అవసరమైన సంఖ్యలో వైద్యులు, ఇతర సిబ్బంది ఉండరు. చాలినన్ని పడకలుండవు. కనుకనే తగిన సదుపాయాలు కొరవడటం మూలంగా ప్రాణాలు పోవడమనే స్థాయి దాటి మూషికాలు, చీమలు కూడా దాడి చేసి చంపేసే దుస్థితి ఏర్పడుతోంది. నిరుడు ఆగస్టులో గుంటూరు ఆసుపత్రిలో మూషికాల వల్ల ఒక నవజాత శిశువు కన్నుమూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు? ‘ప్రభుత్వం ఎంత చేస్తున్నా...ఒక్క తప్పిదంతో జనంలో నమ్మకం కోల్పోయే స్థితి ఏర్పడుతుంద’ని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గత ఏడెనిమిది నెలల్లో ఇంకా ఎంత చేసిందోగానీ ఈసారి చీమలు కుట్టి శిశువు చనిపోయే పరిస్థితి దాపురించింది. అంతేకాదు.. స్టాండ్‌కు వేలాడుతూ ఉండాల్సిన సెలైన్ బాటిల్ ఆ శిశువు పొట్టపై పడింది. అందువల్ల కూడా గాయమైంది. శిశువు ఛాతిపై చీమలు కొరికిన ఆనవాళ్లు న్నాయేమని అడిగితే ‘ఇక్కడున్న 40మందినీ నేనే చూడాలి. ఎంతకని చూడ గలమ’ని సిబ్బందిలో ఒకరిచ్చిన జవాబే బాబు పాలన తీరుతెన్నులను పట్టిచూ పుతోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఉదంతం తర్వాత ఎన్నో చర్యలు తీసు కున్నట్టు ప్రభుత్వం హడావుడి చేసింది. పలువురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్త ర్వులు జారీచేశారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించారు. ఆ సంద ర్భంలోనూ, ఆ తర్వాత ప్రభుత్వాసుపత్రులు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో వివ రిస్తూ ‘సాక్షి’ ధారావాహిక కథనాలు అందించింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకూ ఆసుపత్రుల్లో ఉన్న లోటుపాట్లేమిటో వివరించింది. చంద్రబాబు గానీ, ఆయన కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న కామినేని శ్రీనివాస్‌గానీ చిత్తశుద్ధితో పనిచేసి దీన్నంతటినీ సరిదిద్ది ఉంటే పరిస్థితి ఎంతో కొంత మెరుగు పడేది. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయనకు వేరే పనులు చక్కదిద్దే సమయం ఎక్కడిది? కనీసం కామినేని అయినా కదిలిన దాఖలాలు లేవు. తన పార్టీ సిద్ధాంతాలు సైతం మరిచి ఫిరాయిం పులకు ఉడతాభక్తి సేవలందిస్తున్న కామినేనికి ప్రభుత్వాసుపత్రుల అవసరాలేమిటో తెలుసుకోవడం సాధ్యపడటం లేదు. పరిస్థితి ఇంతగా అఘోరించింది కనుకే విజయవాడ ఉదంతం జరిగి 24 గంటలు గడుస్తున్నా ప్రాథమిక దర్యాప్తు అయినా ప్రారంభం కాలేదు. అందులో వెల్లడయ్యేది తమ నిర్వాకమే గనుక...చర్యలు తీసు కోవడానికి ప్రయత్నిస్తే తమ పరంగా ఉన్న లోటుపాట్లే బయటపడతాయి గనుక నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఆమధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ మన దేశంలో వైద్య సర్వీసులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వివరించాయి. ప్రసూతి మరణాలు భారత్‌లోనే ఎక్కువని, అయిదేళ్లలోపు శిశు మరణాల్లోనూ దానిదే ప్రధమ స్థానమని చెప్పాయి. వేయిమందికి కనీసం 3.5 బెడ్లు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తుండగా మన దేశంలో అది 0.7 దగ్గరే ఆగిపోయింది. ఇలాంటి సమస్యలకు తోడు వైద్యులనూ, ఇతర సిబ్బందినీ తాత్కాలిక ప్రాతిపది కన నియమించడం, ఉన్నవారితోనే ఎక్కువగా పనిచేయించడం... ఆసుపత్రి ఆవర ణలో ప్రాణప్రదమైన పారిశుద్ధ్యాన్ని కాంట్రాక్టుకు అప్పగించడం లాంటి పద్ధతు లను అమలు చేస్తూ ప్రభుత్వాలు పరిస్థితిని మరింత విషమంగా మారుస్తున్నాయి. నిరుడు గుంటూరు ఆసుపత్రిలో పసికందు మృతి సందర్భంలో సూపరిం టెండెంట్‌గా ఉన్న వ్యక్తికి పదోన్నతి లభించిందంటే...ఇప్పటికీ ఆ ఆసుపత్రిలో రోగుల మంచాలపై పాములు, పందికొక్కులు దర్శనమిస్తున్నాయంటే అవన్నీ బాబు ప్రభుత్వ అసమర్ధతకు ఆనవాళ్లు. వ్యవస్థ సక్రమంగా ఉంటే, వైద్య వృత్తికే వన్నె తెస్తున్న నల్లగొండ ఆస్పత్రి సిబ్బందిలాంటివారికి ప్రోత్సాహకాలందించి వారిని ఆదర్శంగా చూపగలిగితే ఇప్పుడున్న అస్తవ్యస్థ పరిస్థితులు కాస్తయినా చక్కబడతాయి. అది జరగాలంటే ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తెరగాలి. జవాబుదారీతనాన్ని అలవర్చుకోవాలి. లేనట్టయితే విజయవాడ, హైదరాబాద్ ఉదంతాలే పునరావృతమవుతాయి. ప్రభుత్వాసుపత్రులు మృత్యుగీతాల్ని ఆల పిస్తూనే ఉంటాయి.