AAP Leader Satyendra Jain gets VIP treatment inside Tihar Jail - Sakshi
Sakshi News home page

వీడియో: ఆప్‌ మంత్రికి తీహార్‌ జైల్లో మసాజ్‌.. వీఐపీ ట్రీట్‌మెంట్‌, స్పెషల్‌ సదుపాయాలు

Published Sat, Nov 19 2022 10:29 AM | Last Updated on Sat, Nov 19 2022 10:47 AM

AAP neta Satyendra Jain gets VIP treatment inside Tihar Jail - Sakshi

వైరల్‌/ఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఆయన మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోలు శనివారం జాతీయ మీడియా ఛానెల్స్‌లో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్నాయి. 

జైల్లో జైన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందని ఈడీ, కోర్టుకు తెలిపిన కొన్నిరోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. తల, కాళ్లకు ఓ మనిషితో ఆయన మసాజ్‌ చేయించుకుంటున్న ఫుటేజీ అది. సెప్టెంబర్‌లోనే ఇది జరిగినట్లు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకమైన సదుపాయాలు.. పక్కనే మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ ప్యాక్‌ కూడా గమనించవచ్చు.

జైళ్ల నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సదుపాయాలు అందాయన్నది ప్రధాన విమర్శ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సదరు వీడియోను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. దీనిపై తీహార్‌ జైల్‌ అధికారులు స్పందించాల్సి ఉంది.

మే 30వ తేదీన మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్ర జైన్‌ ఈడీ సమక్షంలో అరెస్ట్‌ అయ్యారు. మరోవైపు అవినీతి స్కామ్‌లో జైన్‌తో పాటు ఆయన భార్యాబిడ్డలకు ప్రమేయం ఉందని అభియోగాలు నమోదు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement