బిగ్‌బాస్‌ హౌస్‌లో సన్యాసిని.. దుమారం | Row Erupts Over Radhe Maa Bigg Boss 14 Stint | Sakshi
Sakshi News home page

రాధే మా సాధువు కాదు.. సన్యాసి కాదు: ఏబీఏపీ

Published Thu, Oct 15 2020 8:52 AM | Last Updated on Fri, Oct 16 2020 3:04 PM

Row Erupts Over Radhe Maa Bigg Boss 14 Stint - Sakshi

బిగ్‌బాస్‌ షో అంటేనే వివాదాలకు పుట్టిల్లు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తే.. షోకు అంత టీఆర్పీ పెరుగుతుంది. ఇందుకోసం షో నిర్వహాకులు రకరకాల ప్రయోగాలు చేస్తారు. మన దగ్గర కంటే బాలీవుడ్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గత వారం బాలీవుడ్‌ బిగ్‌బాస్‌ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాధే మాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్‌ కౌర్‌‌ బిగ్‌బాస్‌ 14లో సందడి చేసింది. దాంతో ఈ సారి ఆమె కూడా షోలో కనిపించబోతుంది అనుకున్నారు ప్రేక్షకులు. అయితే అదంతా ప్రచారం మాత్రమే. ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే షోలో కనిపించింది. మొదటి రోజు గ్రాండ్‌ ప్రీమియర్‌ ఎపిసోడ్‌, తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదటి రోజు కనిపించింది. అయితే ఆమె కేవలం పార్టిస్‌పెంట్స్‌ని ఆశీర్వదించడానికి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. 

సాధువులు, సన్యాసులకు సంబంధించిన అత్యున్నత విభాగం అఖిల్‌ భారతీయ అఖాడ పరిషద్‌(ఏబీఏపీ) రాధే మా కనిపించడాన్ని పూర్తిగా తప్పు పట్టింది. ఆమె సాధువు, సన్యాసి కాదు అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి మాట్లాడుతూ.. ‘రాధే మాను సాధువులు, సన్యాసులతో కలపవద్దు. గాడ్‌ ఉమెన్‌ అని భావించే ఆమెకి మతం, గ్రంథాల గురించి ఏమి తెలియదు. కేవలం కాసినోలో పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయటంలో మాత్రమే ఆమెకి ప్రావీణ్యం ఉంది. అది ఆమెను సాధువుగా చేయలేదు’ అని తెలిపారు. ఇక బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. (చదవండి: గోళ్ల‌తో ర‌క్కిన కంటెస్టెంటు, క‌ళ్ల‌కు గాయాలు)

ఎవరీ రాధే మా..
రాధే మా అసలు పేను సుఖ్వీందర్ కౌర్ 1965 ఏప్రిల్‌లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డోరంగల గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సు నుంచే ఆమె ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలైనట్లు ఆమె అనుచరులు పేర్కొన్నారు. ఇక ఆమె మోహన్ సింగ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రారంభంలో తన కుటుంబ పోషణ కోసం రాధే మా టైలర్‌గా పనిచేసేవారు. 23 ఏళ్ళ వయసులో, ఆమె మహంత్ రామ్ దీన్ దాస్ శిష్యురాలిగా చేరింది. మహంత్ రామ్ దీన్ దాస్ ఆమెకు రాధే మా బిరుదు ఇచ్చారు. ఆమె రూపాన్ని బట్టి చూస్తే, ఆమె ఎరుపు రంగు ధరించడం చాలా ఇష్టమని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె చేతిలో త్రిశూలాన్ని తీసుకువెళుతుంది. (చదవండి: బిగ్‌బాస్‌ జంట ఫోటోలు మళ్లీ వైరల్‌!)

వివాదాలు ఫుల్లు..
ఇక రాధే మా పేరు అనేక వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. 2015 లో ముంబై పోలీసులు కట్నం కోసం అత్తమామాలను వేధించడానికి ఒక మహిళని ప్రేరేపించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే సంవత్సరంలో, లండన్‌లోని ఒక కాసినోలో ఆమె పాశ్చాత్య దుస్తులు ధరించి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యింది. కొద్ది రోజుల తరువాత, జాగ్వార్ కారుపై తప్పుడు చిరునామా ఇవ్వడం ద్వారా పూర్తి పన్ను చెల్లించలేదని ఆరోపిస్తూ రాధే మా కార్యదర్శిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సంవత్సరంలో మాజీ బిగ్ బాస్ పోటీదారు డాలీ బింద్రా రాధే మా తనను లైంగికంగా వేధించిందని ఆరోపించారు. 2015 లో, ఆమె 'బిగ్ బాస్ 9' లో పాల్గొంటుందని కూడా చెప్పబడింది. అయితే, ఆ తర్వాత ఆమె ఈ ప్రతిపాదనను తిరస్కరించిందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement