బిగ్‌బాస్‌ షోకు గౌరవం దక్కట్లేదు.. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై | Kiccha Sudeep Reveals Reason for Quitting Bigg Boss Kannada | Sakshi
Sakshi News home page

Kichcha Sudeep: ఆ కారణాల వల్లే బిగ్‌బాస్‌ షో నుంచి తప్పుకుంటున్నా..

Published Mon, Dec 16 2024 3:33 PM | Last Updated on Mon, Dec 16 2024 4:34 PM

Kiccha Sudeep Reveals Reason for Quitting Bigg Boss Kannada

కన్నడలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్లు విజయవంతంగా హోస్టింగ్‌ చేస్తున్న ఆయన పదకొండో సీజన్‌ను కూడా తనే నడిపిస్తున్నాడు. అయితే ఇకమీదట రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని, ఇదే తన చివరి బిగ్‌బాస్‌ సీజన్‌ అని అక్టోబర్‌లో ప్రకటించాడు.

మనసుకు అనిపించింది చెప్పా
అందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో సుదీప్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్తున్నానంటూ ట్వీట్‌ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్‌ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో!

ఆలోచన వచ్చిన వెంటనే..
అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్‌ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. 

కన్నడ బిగ్‌బాస్‌కు..
మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్‌కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్‌ ప్రస్తుతం మ్యాక్స్‌ సినిమాలో నటించాడు. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

 

 

చదవండి: Bigg Boss Telugu 8: ఆ రెండూ జరగకపోయుంటే ఫినాలే వేరేలా ఉండేది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement