
సన్యాసిని రాధే మాకు ఊరట
ముంబై: వివాదస్పద సన్యాసిని రాధేమాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆమెకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వరకట్నం కేసులో ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఆమె అరెస్ట్ పై రెండు వారాల పాటు స్టే విధించింది.
ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి కింది కోర్టు నిరాకరించడంతో ఆమె బాంబే కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె ఖండేవాలి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, ఆమెపై గతంలోనూ పలు కేసులు దాఖలయ్యాయి.