రాధేమాపై మరో కేసు..
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా పై మరో కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, బెదిరింపులుతో తనను వేధిస్తోందంటూ రాధేమా మాజీ భక్తురాలు డాలీ బింద్రా ముంబై పోలీసులను ఆశ్రయించారు. రాధేమా, ఆమె అనుచరులతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. గతనెల్లో ట్విట్టర్ లో పలువురు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డ రాధేమా... నటి, తన మాజీ భక్తురాలు డాలీ బింద్రాపై కూడా ఆరోపణలు కురిపించడం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాధేమా సహా 19 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు.