త్వరలో సన్నీలియోన్‌ బయోపిక్‌ ! | Sunny Leone biopic Karenjit Web series Come Soon | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 11 2018 10:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Sunny Leone biopic Karenjit Web series Come Soon - Sakshi

సన్నీలియోన్‌

పోర్న్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగి బిగ్‌బాస్‌ షో పాపులారిటితో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన శృంగార తార సన్నీలియోన్‌ బయోపిక్‌ త్వరలో తెరకెక్కనుంది. అయితే ఇది సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె అసలు పేరైన ‘కరణ్‌జీత్‌’ పేరుతోనే ఈ వెబ్‌సిరీస్‌ను జీ5 వెబ్‌ఫ్లాట్‌ఫాం రిలీజ్‌ చేయనుంది. ఈ విషయాన్ని సన్నీనే ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

‘నేను కెనడా నుంచి ఎందుకు తిరిగొచ్చాను? సన్నీ లియోన్‌గా  పేరు ఎందుకు మార్చుకున్నాను?   కరణ్‌జీత్‌ నుంచి సన్నీగా మారే క్రమంలో నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇలాంటి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను ఈ వెబ్‌ సిరీస్‌లో తెలుసుకోవచ్చని’ సన్నీ ట్వీట్‌ చేశారు. అయితే సన్నీ పాత్రలో తనే నటిస్తుందా లేదా అన్న విషయం వెల్లడించలేదు. తెలుగు చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో సన్నీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సన్నీ చేసిన ఈ ట్వీట్‌ తెగ వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement